Tech Mahindra
-
టెక్ మహీంద్రా ప్రాజెక్ట్ ఇండస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా తాజాగా ప్రాజెక్ట్ ఇండస్‌ను ప్రారంభించింది. బహుళ భారతీయ భాషలు, మాండలికాలలో సంభాíÙంచడానికి దేశీయంగా రూపొందించిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఇది. ఇండస్ ఎల్ఎల్ఎం మొదటి దశ హిందీ భాషతోపాటు దాని 37కుపైగా మాండలికాల కోసం అభివృద్ధి చేశారు. ఇండస్ మోడల్ ప్రారంభంలో మౌలిక సదుపాయాలు, కంప్యూటింగ్‌ను ఒక సేవగా, సంస్థలకు ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలను అందించడం వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెడుతుందని కంపెనీ తెలిపింది. ఎల్ఎల్ఎంకు అవసరమైన అధిక–పనితీరు గల కంప్యూటింగ్ సొల్యూషన్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి డెల్ టెక్నాలజీస్‌తో టెక్ మహీంద్రా చేతులు కలిపింది. కస్టమర్లు జెన్ఏఐ అప్లికేషన్లలో ఇండస్ మోడల్‌ను ఏకీకృతం చేసేందుకు వీలుగా ఇంటెల్ జియాన్ ప్రాసెసర్లు, వన్ఏపీఐ సాఫ్ట్వేర్, ఇంటెల్ అడ్వాన్స్డ్ మ్యాట్రిక్స్ ఎక్స్టెన్షన్స్ సహా ఇంటెల్–ఆధారిత మౌలిక సదుపాయాల పరిష్కారాలను ప్రాజెక్ట్ ఇండస్ స్వీకరిస్తుంది. -
టెక్ మహీంద్రా కంపెనీ ‘కామ్వివా’కి కొత్త సీఈవో
టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ అయిన డిజిటల్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కామ్‌వివాకి కొత్త సీఈవో నియమితులయ్యారు. రాజేష్ చంద్రమణిని సీఈవో, హోల్ టైమ్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.2024 మేలో పదవీ విరమణ చేసిన మనోరంజన్ 'మావో' మహాపాత్ర నుంచి రాజేష్ చంద్రమణి పగ్గాలు చేపట్టారు. కాగా కామ్వివా బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మహాపాత్ర కొనసాగుతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.రాజేష్ చంద్రమణి గతంలో టెక్ మహీంద్రాలో సీనియర్ నాయకత్వ బాధ్యతలను నిర్వహించారు. ఆయన అక్కడ కమ్యూనికేషన్స్, మీడియా & ఎంటర్టైన్మెంట్ విభాగంలో యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, జపాన్, భారత్‌లో వ్యూహాత్మక మార్కెట్లకు బిజినెస్ యూనిట్ హెడ్‌గా పనిచేశారు. -
టెక్ మహీంద్రా మాజీ చీఫ్ వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా లిమిటెడ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. వినీత్ నయ్యర్ మృతిపై పలువురు ప్రముఖలు తమ సంతాపాన్ని తెలియజేశారు."భారత్ ఈరోజు అత్యుత్తమ నాయకుడిని కోల్పోయింది" అని టెక్ మహీంద్రా మాజీ సీఈవో సీపీ గుర్నానీ నయ్యర్ మరణానికి సంతాపాన్ని తెలియజ్తేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా నయ్యర్ మృతికి ‘ఎక్స్’ పోస్ట్‌లో సంతాపం తెలిపారు. "భారతీయ వ్యాపార రంగంలో వినీత్ అతి పెద్ద వ్యక్తి" అని పేర్కొన్నారు. టెక్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ‘ఎక్స్’లో వినీత్ మృతికి సంతాపం వ్యక్తం చేసింది.1939లో జన్మించిన నయ్యర్ మసాచుసెట్స్‌లోని విలియమ్స్ కళాశాల నుంచి డెవలప్మెంట్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఐఏఎస్ అధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన 40 ఏళ్ల కెరీర్లో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ రంగాల్లో పనిచేశారు. పదేళ్లకుపైగా ప్రపంచ బ్యాంకులో పనిచేసిన ఆయన పలు కీలక పదవులను నిర్వహించారు. 2009లో కుప్పకూలిన కంప్యూటర్ సేవల సంస్థ సత్యం పునరుద్ధరణలో నయ్యర్ కీలక పాత్ర పోషించారు.It saddens me to share the news of the passing of Vineet Nayyar this morning.Vineet was a larger than life figure in the Indian Business landscape. A distinguished IAS officer, who then served with the World Bank, he became the first Chairman of GAILHe then made a hugely… pic.twitter.com/ZLlfzNXJ2K— anand mahindra (@anandmahindra) May 16, 2024 -
మైక్రోసాఫ్ట్‌తో టెక్ మహీంద్రా జట్టు
న్యూఢిల్లీ: బిజినెస్, డేటా నిపుణులకు సులభతరంగా ఉండే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఆధారిత వర్క్‌బెంచ్‌ను రూపొందించేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపినట్లు టెక్ మహీంద్రా వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వినియోగాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వర్క్‌బెంచ్ సిస్టమ్ ఉపయోగపడగలదని, సంక్లిష్టమైన డేటా వర్క్‌ఫ్లోను సరళతరమైన ఇంటర్ఫేస్తో సులభంగా రూపొందించవచ్చని టెక్ మహీంద్రా వివరించింది. వ్యాపారాల వృద్ధిలో తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం తోడ్పడగలదని పేర్కొంది. -
గుర్నానీకి హైసియా పురస్కారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్ మహీంద్రా మాజీ సీఈవో, ఎండీ సి.పి.గుర్నానీ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైసెస్ అసోసియేషన్ (హైసియా) నుంచి జీవిత కాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. హైసియా 31వ జాతీయ సదస్సు, అవార్డుల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. 2022–23 సంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో మొత్తం 36 కంపెనీలు, వ్యక్తులు హైసియా అవార్డులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
గిగ్ వర్కర్ల కోసం.. టెక్ మహీంద్రా ‘పాప్యులై’ ప్లాట్‌ఫామ్
న్యూఢిల్లీ: తాత్కాలిక ఉద్యోగార్థులు (గిగ్ వర్కర్లు) ప్రముఖ కంపెనీల్లో చిరుద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా సహాయపడేందుకు ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్తగా ‘పాప్యులై’ పేరిట క్రౌడ్‌సోర్సింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఇందులో ఉద్యోగార్థుల కోసం కంటెంట్ రేటింగ్, డేటా కలెక్షన్, డేటా ట్రాన్స్క్రిప్షన్, డేటా అనోటేషన్ వంటి తాత్కాలిక ఉద్యోగావకాశాలు ఉంటాయి. అటు కంపెనీలపరంగా చూస్తే అర్హత కలిగిన నిపుణుల డేటాబేస్ అందుబాటులో ఉంటుంది. తద్వారా ఇటు ఉద్యోగార్థులకు, అటు కంపెనీలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని టెక్ మహీంద్రా బిజినెస్ హెడ్ (బిజినెస్ ప్రాసెస్ సరీ్వసెస్) బీరేంద్ర సేన్ తెలిపారు. తదుపరి తరం కృత్రిమ మేథ (ఏఐ) సొల్యూషన్స్‌ను రూపొందించాలంటే గణనీయంగా సమయంతో పాటు సాధారణంగా కంపెనీల్లో ఉండే ఉద్యోగులే కాకుండా బైటి నిపుణుల అవసరం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పాప్యులై ప్లాట్‌ఫాం అంతర్జాతీయ స్థాయిలో గిగ్ నిపుణులను, కంపెనీలను అనుసంధానిస్తుందని తెలిపారు. దీనితో కంపెనీలు వ్యయాలు తగ్గించుకుంటూ, ఉత్పాదకత పెంచుకుంటూ .. ఏఐ సొల్యూషన్స్ రూపకల్పనను వేగవంతం చేసుకోవచ్చని సేన్ చెప్పారు. అలాగే గిగ్ నిపుణులు టాప్ ఏఐ ప్రాజెక్టులను దక్కించుకోవచ్చని, మరిన్ని వనరుల ద్వారా ఆదాయం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. -
టెక్ మహీంద్రా లాభం డౌన్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్ (క్యూ2)లో నికర లాభం 61 శాతం క్షీణించి రూ. 505 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,299 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 2 శాతం నీరసించి రూ. 12,864 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 13,130 కోట్ల టర్నోవర్ సాధించింది. ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన తన కెరీర్‌లోకెల్లా గత కొన్ని త్రైమాసికాలు అత్యంత క్లిష్టమైనవంటూ టెక్ మహీంద్రా సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. ► త్రైమాసికవారీగా 78% వృద్ధితో రూ. 5,300 కోట్లు(64 కోట్ల డాలర్లు) విలువైన డీల్స్ కుదుర్చుకుంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 2,980 కోట్ల విలువైన ఆర్డర్లు పొందింది. ► మొత్తం సిబ్బంది సంఖ్య 8 శాతంపైగా క్షీణించి 1,50,604కు పరిమితమైంది. గతేడాది క్యూ2 లో ఈ సంఖ్య 1,63,912గా నమోదైంది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు వార్షిక ప్రాతిపదికన 20% నుంచి 11%కి దిగివచి్చంది. ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు 1.4% నష్టంతో రూ. 1,140 వద్ద ముగిసింది. -
రాష్ట్రంలో టెక్ మహీంద్రా స్టార్ హోటల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మించేందుకు మహీంద్రా హాలిడేస్ చైర్మన్, టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీసీ గుర్నాని సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన గురువారం సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. స్టార్ హోటల్స్ ఏర్పాటు గురించి సీఎం జగన్‌కు ఆయన వివరించారు. ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి సీఎం జగన్ వివరించారు. విశాఖ సహా 3 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్నామని.. వచ్చే 2 నెలల్లో శంకుస్థాపన చేపడతామని మహీంద్రా ప్రతినిధులు వెల్లడించారు. మహీంద్రా గ్రూప్ గ్లోబల్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సీవీఎన్ వర్మ, క్లబ్ మహీంద్రా సీవోవో సంతోష్ రామన్, టెక్ మహీంద్రా విజయవాడ అడ్మిన్ మేనేజర్ బిరుదుగడ్డ జయపాల్ పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ సీపీ గుర్నాని
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని గురువారం కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్ నుంచి 7 స్టార్ హోటల్స్ నిర్మాణానికి మహీంద్ర గ్రూప్ సంసిద్దత వ్యక్తం చేసింది. ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎంకి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులు వివరించారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. విశాఖ సహా మరో 2 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్న మహీంద్ర గ్రూప్, వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు సమాయత్తమవుతున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో మహీంద్ర గ్రూప్ గ్లోబల్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సీవీఎన్ వర్మ, క్లబ్ మహీంద్ర సీవోవో సంతోష్ రామన్, టెక్ మహీంద్ర విజయవాడ అడ్మిన్ మేనేజర్ బిరుదుగడ్డ జయపాల్ పాల్గొన్నారు. చదవండి: సొంత పార్టీ, వర్గాన్ని అమ్ముకునే వ్యక్తి పవన్: సీఎం జగన్ కౌంటర్ -
టెక్ మహీంద్రా కీలక నిర్ణయం .. ఆనందంలో ఉద్యోగులు
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జాబ్ మార్కెట్లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ సంస్థ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది విడుదలై జాబ్ మార్కెట్లో అలజడి సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై 8 వేల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. వ్యూహాత్మక అడుగుతో జనరేటివ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ డిమాండ్‌ను తీర్చేందుకు కంపెనీ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, మార్కెటింగ్ హెడ్ హర్షేంద్ర సోయిన్ సంస్థ వృద్ధి సాధించడంలో ఏఐ ప్రాముఖ్యతను వివరించారు.బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, మ్యానఫాక్చరింగ్, రిటైల్‌పై సంస్థ దృష్టి సారించినట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా సంస్థ నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు. సవాళ్లు - అవకాశాలు ఏఐ,ఎమర్జింగ్ టెక్నాలజీలపై టెక్ మహీంద్రా దృష్టి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, జూన్ త్రైమాసికంలో కంపెనీ సవాళ్లను ఎదుర్కొంది, గత సంవత్సరంతో పోలిస్తే నికర లాభంలో 38% క్షీణతను చవిచూసింది. కమ్యూనికేషన్స్, మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ (సీఎంఈ) విభాగంలో ఈ సవాళ్లకు దోహదం చేసింది. అయితే భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేసిన ప్రస్తుత సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ జనరేటివ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలను వృద్ధికి కీలక టెక్నాలజీ రంగాలుగా గుర్తించారు. ఇందులో భాగంగా, ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ఏఐపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి ➤ ఐటీఆర్ ఫైల్ చేశారా? లేదంటే ఇప్పుడే చేయండి.. ఎందుకంటే? -
అత్యధిక వేతనాలు అందుకుంటున్న టాప్ టెక్ కంపెనీ సీఈవోలు వీరే.. (ఫొటోలు)
-
AP: ఐటీ ఎగుమతుల్లో బూమ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు గత నాలుగేళ్లుగా వేగంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో పలు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభిస్తుండటంతో ఐటీ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. స్టాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ), వీసెజ్ల్లో నమోదైన ఐటీ కంపెనీల ద్వారా 2022–23లో రాష్ట్రంలో రూ.1,649.25 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగినట్లు ఐటీ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఎస్టీపీఐలో నమోదైన ఐటీ కంపెనీల ద్వారా రూ.972.43 కోట్ల ఎగుమతులు జరగగా వీసెజ్ కంపెనీల ద్వారా రూ.676.82 కోట్ల ఎగుమతులు జరిగాయి. రూ.5,000 కోట్లపైనే! 2019–20లో ఏపీ నుంచి రూ.1,087.4 కోట్ల ఐటీ ఎగుమతులు నమోదు కాగా నాలుగేళ్లలో 34 శాతం పెరిగాయి. నాలుగేళ్లలో ఎస్టీపీఐ కంపెనీల ద్వారా ఎగుమతులు రూ.846.77 కోట్ల నుంచి రూ.972.43 కోట్లకు పెరిగితే వీసెజ్ ద్వారా ఎగుమతులు రూ.240.63 కోట్ల నుంచి రూ.676.82 కోట్లకు చేరుకున్నాయి. ఇంకా పలు ఐటీ కంపెనీల ఆడిటింగ్ పూర్తికాలేదని, ప్రాథమిక సమాచారం మేరకు 2022–23 ఐటీ ఎగుమతుల అంచనాలను రూపొందించినట్లు రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రం నుంచి భారీగా ఎగుమతులు జరుగుతున్నా వాటి ప్రధాన కార్యాలయాలు ఇక్కడ లేకపోవడంతో మన రాష్ట్ర పరిధిలోకి రావడం లేదని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు పేర్కొన్నారు. నిజానికి రాష్ట్రం నుంచి కనీసం రూ.5,000 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరుగుతున్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్నెళ్లలో వరుసగా.. ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ కంపెనీలు విశాఖతోపాటు పలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. 2019కి ముందు రాష్ట్రంలో ఐటీ కంపెనీల సంఖ్య 178 కాగా ఇప్పుడు 372కి చేరుకోవడం గమనార్హం. గత ఆర్నెళ్ల వ్యవధిలో అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, బీఈఎల్, ఇన్ఫోసిస్, రాండ్ శాండ్, టెక్నోటాస్క్, ఐజెన్ అమెరికా సాఫ్ట్వేర్, టెక్‌బుల్, కాంప్లెక్స్ సిస్టమ్స్ లాంటి డజనుకుపైగా ఐటీ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటైనట్లు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (అపిటా) గ్రూపు సీఈవో ఎస్.కిరణ్ కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇవికాకుండా మరికొన్ని కీలక ఐటీ కంపెనీలతో చర్చలు తుది దశలో ఉన్నట్లు వివరించారు. కొత్తగా ఏర్పాటైన కంపెనీల ద్వారా అదనంగా 20,000కి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు. విస్తరిస్తున్న కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుండటంతో ఇప్పటికే ఏర్పాటైన పలు ఐటీ కంపెనీలు భారీ విస్తరణ కార్యక్రమాలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటిదాకా విశాఖకు పరిమితమైన టెక్ మహీంద్రా తాజాగా విజయవాడలో కార్యకలాపాలను ప్రారంభించింది. గన్నవరం మేథా టవర్స్‌లో 120 మంది సీటింగ్ సామర్థ్యం ఉన్న కార్యాలయాన్ని టెక్ మహీంద్రా ప్రారంభించింది. హెచ్‌సీఎల్ విజయవాడ నుంచి విశాఖకు విస్తరించగా, విశాఖలో ఉన్న డబ్ల్యూఎన్ఎస్, పల్ససెస్ ఐడీఏ లాంటి 30కిపైగా ఐటీ, ఐటీ ఆథారిత సేవల కంపెనీలు విస్తరణ కార్యక్రమాలను చేపట్టింది. 2012లో కేవలం 50 మందితో ప్రారంభమైన డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 3,300 దాటింది. వీరిలో 2,000 మంది ఉద్యోగులు గత రెండేళ్లలోనే చేరినట్లు డబ్ల్యూఎన్ఎస్ సీఈవో కేశవ్.ఆర్.మురుగేష్ ప్రకటించారు. 2019లో 40 మందితో ప్రారంభించిన తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 4,200 దాటినట్లు పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కంపెనీలతోపాటు విస్తరణ ద్వారా గత మూడేన్నరేళ్లలో రాష్ట్రంలో 23,000 మందికి ఐటీ రంగంలో ఉపాధి లభించింది. 2019 నాటికి రాష్ట్రంలో 35,000గా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 58,000కి చేరినట్లు (అపిటా) గ్రూపు సీఈవో కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఐటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాఖలో మిలియన్ టవర్ రెండో దశ నిర్మాణ పనులు పూర్తి కాగా తాజాగా రూ.300 కోట్లతో ఐస్పేస్ బిజినెస్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి అదనంగా అదానీ డేటా సెంటర్లో ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేస్తోంది. -
మేం రెడీ: ఆల్ట్‌మాన్‌కు సీపీ గుర్నానీ చాలెంజ్, ఏం జరిగిందంటే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్త సామ్ ఆల్ట్‌మన్ సిలికాన్ వ్యాలీతో భారతీయ నిపుణులు పోటీ పడలేరన్న వ్యాఖ్యలపై టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ స్పందించారు. భారతీయ కంపెనీలు తమ సిలికాన్ వ్యాలీ కౌంటర్ పార్ట్లతో పోటీ పడలేరన్న ఆల్ట్మాన్ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. భారతదేశంతో సహా ఆరు దేశాల పర్యటనలో ఉన్న ఆల్ట్‌మాన్‌ను ఇండియాలో చాలా పవర్ ఫుల్ ఎకోసిస్టం ఉంది. ప్రత్యేకంగా ఏఐపై దృష్టి పెడుతున్నాం, కానీ చాట్‌జీపీటీ లాంటి కృత్రిమ మేధస్సు సాధనాన్ని ఇండియా, ఆగ్నేయాసియాలో తయారు చేయగలదా అని మాజీ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. (వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్: ఇక డబ్బులే డబ్బులు!) "ఇది ఎలా పని చేస్తుందో మీకు చెప్పబోతున్నాం, ట్రైనింగ్ ఫౌండేషన్ మోడల్స్‌పై పోటీ పడటం పూర్తిగా ప్రయోజనం లేనిది, ఆఫ్కోర్స్.. ఎలాగైనా ప్రయత్నించడం మీ జాబ్ అయినా కానీ వీటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉందడని సమాధానమిచ్చాడు. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) ఆల్ట్మాన్ వ్యాఖ్యలను పూర్తి తిప్పికొడుతూ గుర్నానీ ట్వీట్ చేశారు. ఒక సీఈవోకి మరో సీఈవోకి ఇచ్చిన సవాలును స్వీకరిస్తున్నానంటూ ప్రతి సవాల్ విసిరారు. మరోవైపు చాట్‌జిపిటి వంటి టూల్‌ను రూపొందించే సామర్థ్యం భారత్‌కు లేదని ఆల్ట్మాన్ పేర్కొన్నప్పటికీ, భారతీయ పారిశ్రామికవేత్తలు తమ సొంత సాధనాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తారని ఆనందన్ కూడా ట్వీట్ చేశారు. అంతేకాదు 5000 సంవత్సరాల భారతీయ వ్యవస్థాపకత, భారతీయ పారిశ్రామిక వేత్తలను మనం ఎప్పటికీ తక్కువ అంచనా వేయొద్దు, తామూ ప్రయత్నించాలనుకుంటున్నామన్నారు. OpenAI founder Sam Altman said it’s pretty hopeless for Indian companies to try and compete with them. Dear @sama, From one CEO to another.. CHALLENGE ACCEPTED. pic.twitter.com/67FDUtLNq0 — CP Gurnani (@C_P_Gurnani) June 9, 2023 -
టెక్ మహీంద్రా ఎండీగా మోహిత్ జోషి
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తాజాగా మరో ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా కొత్త ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ హోదాల్లో ఉన్న సీపీ గుర్నాణీ డిసెంబర్ 19న పదవీ విరమణ చేశాక .. జోషి బాధ్యతలు చేపడతారు. బాధ్యతల మార్పిడి, కార్యకలాపాలపై అవగాహన కోసం అంతకన్నా ముందుగానే కంపెనీలో చేరతారని టెక్ మహీంద్రా తెలిపింది. మరోవైపు, జోషి తన పదవికి రాజీనామా సమర్పించారని, మార్చి 11 నుంచి ఆయన సెలవులో ఉంటారని ఇన్ఫీ పేర్కొంది. కంపెనీలో ఆయన ఆఖరు పని దినం జూన్ 9గా ఉంటుందని వివరించింది. జోషి 2000లో ఇన్ఫీలో చేరారు. అంతకు ముందు ఆయన ఏబీఎన్ ఆమ్రో, ఏఎన్జెడ్ గ్రిండ్లేస్ తదితర సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, కొత్త టెక్నాలజీలు, భారీ డీల్స్ విషయంలో జోషికి ఉన్న అపార అనుభవం టెక్ మహీంద్రాకు సహాయకరంగా ఉండగలదని గుర్నాణీ తెలిపారు. టెక్ మహీంద్రా కొత్త మైలురాళ్లను అధిగమించడంలో అందరితో కలిసి పనిచేస్తానని, సానుకూల ఫలితాలు సాధించడానికి కృషి చేస్తానని జోషి పేర్కొన్నారు. -
ఇన్ఫోసిస్‌కి షాకిచ్చిన టెక్ఎం కొత్త సీఎండీ, రోజు సంపాదన ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ , టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా సీఎండీగా మోహిత్ జోషి ఎంపికైన సంగతి తెలిసిందే. భారతీయ ఐటీ పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన పదివిని వరించిన ఈ నేపథ్యంలో ఆయన విద్యార్హతలు, టెక్ ప్రపంచంలో అనుభవం, వార్షికవేతన తదితర అంశాలు చర్చకు దారి తీసాయి. మోహిత్ జోషి ఎవరు? టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో 22 సంవత్సరాల అనుభవజ్ఞుడైన మోహిత్ జోషి ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ఇప్పటివరకు ఆయన ఒక్క రోజు వేతనం రూ. 9.5 లక్షలు. రెండు దశాబ్దాల అనుభవంతో ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్,కన్సల్టింగ్ రంగంలో నిపుణుడు. ఇన్ఫోసిస్ కంటే ముందు అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో పనిచేశారు. (ఇదీ చదవండి: జాక్‌పాట్ అంటే ఇదే! నిమి...రతన్ టాటాను మించిపోయాడు!) 1974 ఏపప్రిల్13న జన్మించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం నుండి పాఠశాల విద్య పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో తన గ్రాడ్యుయేషన్, తరువాత ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (FMS) నుండి MBA చేసాడు. అమెరికా హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుండి ప్రపంచ నాయకత్వం , పబ్లిక్ పాలసీని కూడా అధ్యయనం చేశాడు. 2000లో ఇన్ఫోసిస్‌లో చేరి, వివిధ హోదాల్లో పనిచేశారు. మోహిత్ తన కెరీర్లో ఆసియా, అమెరికా,యూరప్, మెక్సికోలో పనిచేశారు. జోషికి భార్య ఇద్దరు కుమార్తెలతో లండన్‌లో నివసిస్తున్నారు. 2021 సంవత్సరంలో, మోహిత్ జీతం రూ. 15 కోట్ల నుండి రూ. 34. 82 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ ఫైలింగ్ ప్రకారం, అతను 2021-2022లో రూ. 34,89,95,497 (రూ. 34.89 కోట్లు) జీతం పొందారు. ఇన్ఫోసిస్‌కి పెద్ద దెబ్బే ఇటీవలి కాలంలో ఇన్ఫోసిస్‌కి ఇది రెండో అతిపెద్ద నిష్క్రమణ. ఇటీవలే రవికుమార్ ఎస్ ఇన్ఫోసిస్‌కి గుడ్‌బై చెప్పి కాగ్నిజెంట్‌కు సీఈఓగా చేరారు. జోషిని బోర్డులో ఉంచడానికి ఇన్ఫోసిస్ చివరి నిమిషం దాకా ప్రయత్నించింది విఫలమైందట. జోషి నిష్క్రమణ ఇన్ఫోసిస్‌కి పెద్ద లోటేనని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్ఫీ సీఎండీ సలీల్ పరేఖ్ తరువాత అత్యధిక పే అందుకున్నవారు జోషి మాత్రమే. (మైక్రోసాఫ్ట్‌లో మూడో రౌండ్ తీసివేతలు, ఈసారి ఎవరంటే?) గుర్నానీకి సరైన ప్రత్యామ్నాయం టెక్ మహీంద్రా సీఎండీ గుర్నానీ పదవీ విరమణ చేస్తున్న తరుణంలో ఆయనకు సరైన ప్రత్యామ్నాయంగా టెక్ఎం భావించడం విశేషం. డిసెంబర్ 20నుంచి మోహిత్ జోషి బాధ్యతలను స్వీకరించనున్నారని టెక్ మహీంద్ర స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ సమాచారంలోశనివారం ప్రకటించింది. అయితే టెక్ఎం సీఎండీగా జోషి వేతనం, ఇతర ప్రయోజనాలపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం ఏదీ అందుబాటులో లేదు. మోహిత్ జోషి గురించి మరిన్ని విషయాలు మోహిత్ జోషి ఇన్ఫోసిస్ మాజీ సీఈవొ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా సేవలు అవివా Plcలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా రిస్క్ & గవర్నెన్స్ నామినేషన్ కమిటీలలో సభ్యుడు CBI (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్ 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, దావోస్ యంగ్ గ్లోబల్ లీడర్ (YGL)గా ఎంపిక -
ఇన్ఫోసిస్‌కు బై..బై చెప్పి ప్రత్యర్థి కంపెనీకి సీఎండీగా బాధ్యతలు
సాక్షి, ముంబై: దేశీయ ఆరో అతిపెద్ద టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్త సీఈవోగా మోహిత్ జోషి ఎంపికయ్యారు. ప్రస్తుత సీఎండీ సీపీ గుర్నానీ స్థానంలో ఆయన సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరనున్నారు. డిసెంబర్ 20నుంచి మోహిత్ జోషి బాధ్యతలను స్వీకరించనున్నారని టెక్ మహీంద్ర ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో శనివారం ప్రకటించింది. గుర్నానీ పదవీ కాలం డిసెంబర్ 19న ముగియనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి ప్రత్యర్థి టెక్ మహీంద్రాలో చేరడానికి కంపెనీకి రాజీనామా చేసినట్లు రెండు సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలిపాయి. 2000 నుండి ఇన్ఫోసిస్‌లో భాగమైన మోహిత్ జోషి 2023,మార్చి 11రాజీనామా చేశారు.జోషి మార్చి 11 నుండి సెలవులో ఉంటారని, జూన్ 9 చివరి తేదీ అని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కి ఒక ప్రకటనలో ఇన్ఫోసిస్ తెలిపింది. అలాగే మోహిత్ జోషి డిసెంబర్ 2023 నుండి 5 (ఐదు) సంవత్సరాలపాటు 2028 వరకు పదవిలో ఉంటారని టెక్ ఎం వెల్లడించింది. ఇన్పీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ హెల్త్‌కేర్/లైఫ్ సైన్సెస్ వ్యాపార హెడ్‌గా పనిచేసిన జోషికి ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ మరియు కన్సల్టింగ్ స్పేస్‌లో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఇన్ఫోసిస్‌లో, జోషి గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ & హెల్త్‌కేర్, సాఫ్ట్వేర్ బిజినెస్‌కు నాయకత్వం వహించారు. అలాగే ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్‌కు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్‌తో పాటు, ABN AMRO, ANZ Grindlays వంటి ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కూడా పనిచేశారు. సీబీఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్‌గా సేవలందించారు. Aviva Plcలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గాను, రిస్క్ అండ్ గవర్నెన్స్ నామినేషన్ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గ్లోబల్ యంగ్ లీడర్ ప్రోగ్రామ్‌కు ఆహ్వానితుడు కూడా. మోహిత్ జోషి ఢిల్లీ యూనివర్శిటీ నుండి ఎంబీఏ, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. -
ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్‌పై పెట్టుబడులు
ముంబై: ఐటీ సర్వీసుల దిగ్గజం టెక్ మహీంద్రా కొత్తగా ఏర్పాటు చేసిన ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్ విభాగంపై రూ. 700 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనుంది. రానున్న రెండేళ్లలో ఈ పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. టెలికం రంగానికి సేవలందిస్తున్న కామ్వివా కొనుగోలు ద్వారా కంపెనీ ఇప్పటికే ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్ బిజినెస్‌లో కార్యకలాపాలు కలిగి ఉంది. వీటితోపాటు ఇతర సర్వీసులు సైతం అందిస్తున్న కామ్వివా వార్షికంగా 45 కోట్ల డాలర్ల ఆదాయ రన్‌రేట్‌ను సాధించినట్లు గుర్నానీ వెల్లడించారు. కాగా.. ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్ బిజినెస్ ద్వారా రెండేళ్లలో బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. ఇన్వెస్టర్ డే సందర్భంగా పుణే నుంచి వర్చువల్‌గా గుర్నానీ ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటు చేసిన విభాగంపై పెట్టుబడులను కామ్వివా బృందం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న కామ్వివా భువనేవ్వర్, బెంగళూరులలోనూ కార్యకలాపాలు విస్తరించినట్లు తెలియజేశారు. టెలికంతోపాటు తాజా విభాగం బీఎఫ్ఎస్ఐ తదితర రంగాలకూ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా మరో 20 కోట్ల డాలర్ల ఆదాయానికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ వార్తల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు బీఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 1,085 దిగువన ముగిసింది. -
ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా
గత కొంత కాలంగా ఐటీ రంగంలో గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. దిగ్గజ కంపెనీలు సైతం ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. జాయినింగ్ లెటర్స్ జారీలో జాప్యం, సంస్థలో తొలగింపులు వంటివి చేపడుతున్నాయి. ఇవి ఆ రంగంలోని ఉద్యోగులను, ఐటీ కొలువు కోసం వేచి చూస్తున్న విద్యార్ధులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాకుండా మరికొన్ని సంస్థలు.. ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికి.. సదరు ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లుగా సమాచారం కూడా ఇస్తున్నాయి. ఇలా ఆఫర్ తిరస్కరణ సందర్భంలో.. ‘మా సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా మీ అర్హతలు లేవు’ అనో.. లేదా ‘మీరు మీ ్ర΄÷ఫైల్‌కు సరిపడే సర్టిఫికేషన్స్ పూర్తి చేయలేదు’ అనో పేర్కొంటున్నాయి. దీంతో క్యాంపస్ డ్రైవ్‌లో తమ అకడమిక్ ప్రతిభను, మార్కులను, స్కిల్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసి, ఆఫర్ లెటర్లు ఇచ్చిన సంస్థలు.. ఇప్పుడు వెనక్కి తీసుకోవడం ఏంటి? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు ► ప్రస్తుత పరిస్థితుల్లో పలు ఎంఎన్సీ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు ఉంటాయనే సంకేతాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ► ఇప్పటికే ఫేస్బుక్ ఆధ్వర్యంలోని మేటా సంస్థలో 12 వేల మందిని పనితీరు ప్రతిపాదికగా తొలగించనున్నట్లు ప్రకటించారు. ► దాదాపు 1.15 లక్షల ఉద్యోగులు ఉన్న ఇంటెల్ సంస్థ.. అంతర్జాతీయంగా 20 శాతం మేరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ► దేశీయంగానూ ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ రెండున్నర వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. n గూగుల్ సంస్థ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో నికర రాబడిలో తగ్గుదలతో నూతన నియామకాల విషయంలో కొంతకాలం స్వీయ నిషేధం విధించింది. మాంద్యం సంకేతాలే కారణమా! ► ఐటీలో ఆన్‌బోర్డింగ్ ఆలస్యానికి అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందనే సంకేతాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలోని సంస్థల్లో అధిక శాతం అమెరికాలోని కంపెనీలకు ఔట్ సోర్సింగ్ విధానంలో సేవలందిస్తున్నాయి. అమెరికా మాంద్యం ముంగిట నిలిచిందనే అంచనాల కారణంగా.. అక్కడి కంపెనీల్లో కార్యకలా΄ాలు మందగిస్తున్నాయి. ఫలితంగా ఆయా సంస్థలు కొత్త ప్రాజెక్ట్‌ల విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. దీంతో.. సదరు సంస్థలకు సేవలపై ఆధారపడిన మన ఐటీ కంపెనీలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇది అంతిమంగా ఆన్ బోర్డింగ్‌లో జాప్యానికి కారణమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ఒడిదుడుకుల కారణంగా కొత్త ప్రాజెక్ట్‌లు రావడం కొంత కష్టంగా ఉంది. ఇది కూడా ఆన్ బోర్డింగ్‌లో జాప్యానికి మరో కారణమని చెబుతున్నారు. చదవండి: ‘కోహినూర్ వజ్రం కోసం ఇలా ట్రై చేస్తే’.. హర్ష గోయెంకా ట్వీట్‌కి నవ్వకుండా ఉండలేరు! -
ఫ్రెషర్స్‌కి భారీ షాక్.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్!
ఆఫర్ లెటర్లు అందుకుని ఎప్పుడెప్పుడు ఉద్యోగాలలో చేరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనిపించుకోవాలన్న ఫ్రెషర్లకు భారీ షాక్‌నే ఇచ్చాయి ఐటీ దిగ్గజాలు. అన్ని రౌండ్లు పూర్తి చేసి ఆఫర్ లెటర్ కూడా అందుకున్న విద్యార్ధుల ఉద్యోగాలలో జాప్యం చేసిన విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర వంటి దిగ్గజ కంపెనీలు తాజాగా యూటర్న్ తీసుకున్నాయి. ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. బిజినెస్‌లైన్ కథనం ప్రకారం.. విద్యార్థులు 3-4 నెలల క్రితమే టాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పలు రౌండ్ల ఇంటర్వ్యూల తర్వాత కంపెనీల నుంచి వారు ఆఫర్ లెటర్లు కూడా అందుకున్నారు. అయితే, ఆ తర్వాత జరిగే ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఐటీ సంస్థలు నెలల తరబడి ఆలస్యం చేశాయి. ప్రస్తుతం విద్యార్థులు కంపెనీల్లో చేరేందుకు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో వారి ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్లు ఆయా కంపెనీల నుంచి లెటర్స్ అందుకోవడంతో ఎంపికైన విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో కంపెనీలు వారి అర్హతా నిబంధనలు, కంపెనీ మార్గదర్శకాల అనుసరించి ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్టు తెలిపినట్లు చెబుతున్నారు. మార్కెట్లో మనీ ఫ్లో కఠినతరంగా మారడం, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుండడం వంటివి నెలల తరబడి ఉన్న స్టార్టప్‌ల నుంచి దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న టెక్ దిగ్గజాల వరకు అన్ని ఐటీ కంపెనీలపై ఈ పరిణామాలు ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. ప్రతికూల వ్యాపార పరిస్థితుల కారణంగా చాలా కంపెనీలు నియామకాలను నిలిపివేసాయి. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కూడా ఇటీవల నియామకాల ప్రక్రియను నిలిపివేయడంతో పాటు అందుబాటులో ఉన్న వనరులతో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. చదవండి: అక్టోబర్‌లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే! -
ఏపీ వైపు ‘ఐటీ’ చూపు
సాక్షి, అమరావతి: ఇన్ఫోసిస్, అసెంచర్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుండటంతో చిన్న, మధ్య స్థాయి కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఐటీ పెట్టుబడులకు అనువైనవిగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలను ప్రమోట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పెద్ద ఐటీ కంపెనీలు విశాఖ, విజయవాడలను ఎంచుకుంటుండగా, చిన్న స్థాయి కంపెనీలు తిరుపతి వైపు మొగ్గు చూపుతున్నాయి. ఐటీ ఆధారిత సేవలు అందించే ఏడు కంపెనీలు తాజాగా తిరుపతిలో తమ కార్యాలయాలను ప్రారంభించడానికి ముందుకు వచ్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. ఐజెన్ అమెరికన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, కాన్‌ఫ్లక్స్ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్, లోమా ఐటీ సొల్యూషన్స్, మాగంటి సాఫ్ట్వేర్, సాగర్ సాఫ్ట్వేర్, నెట్ ల్యాబ్ వంటి సంస్థలు కార్యాలయాలను ప్రారంభించనున్నాయి. ఫ్రెంచ్కు చెందిన రాన్‌స్టాండ్ అనే కన్సల్టెన్సీ సంస్థ విశాఖ, తిరుపతిలో కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. మొత్తం ఈ ఎనిమిది కార్యాలయాల ద్వారా 4,720 మందికి ఉపాధి లభించనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కంపెనీలు కార్యాలయాలు ప్రారంభించడానికి అవసరమైన వాణిజ్య సముదాయాలను ఏపీ టక్నాలజీస్ సర్వీసెస్ (ఏపీటీఎస్) సమకూరుస్తోంది. ఈ పరిణామాల పట్ల నిరుద్యోగులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఐటీ పార్కులు రాష్ట్రానికి చెందిన ఐటీ రంగ నిపుణులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ చర్యలపై కంపెనీలకు నమ్మకం పెరగడంతో ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాయి. యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానంగా విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలు అనువుగా ఉంటాయి. ఈ మూడు చోట్ల అన్ని మౌలిక వసతులతో కూడిన ఐటీ పార్కులను అభివృద్ధి చేయనున్నాం. త్వరలోనే ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా విశాఖలో ఒక సదస్సు నిర్వహించనున్నాం. – ఎం.నంద కిషోర్, ఎండీ, ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ (ఏపీటీఎస్) -
సీఎం జగన్‌ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ
అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టెక్ మహేంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని కలిశారు. ఈ మేరకు ముందుగా సీఎం జగన్‌ను సత్కరించిన గుర్నానీ.. ఆపై జ్ఞాపికను బహుకరించారు. అనంతరం గుర్నానీని సీఎం జగన్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. , , -
గూగుల్ స్ట్రీట్ వ్యూ 360
-
కేంద్రం గ్రీన్ సిగ్నల్.. అందుబాటులోకి గూగుల్ అదిరిపోయే ఫీచర్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ చేస్తున్న ప్రయత్నానికి భారత ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మన దేశంలో గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ సాయంతో గూగుల్ మ్యాప్స్‌లో మనకు కావాల్సిన ప్రాంతాన్ని 360డిగ్రీల్లో వీక్షించొచ్చు. గూగుల్ సంస్థ..టెక్ మహీంద్రా, జెన్సె సంస్థలతో కలిసి సంయుక్తంగా అహ్మద్ నగర్, అమృత్ సర్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, నాసిక్, పూణే, వడదోరా నగరాల్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మిలియన్ల కొద్దీ 360 డిగ్రీల పనోరమిక్ ఇమేజెస్ సాయంతో మొత్తం పది నగరాల్లో లక్షా 50వేల కిలోమీటర్ల వరకు ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి మరో 50 నగరాలకు ఈ ఫీచర్‌ను విస్తరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫీచర్ వల్ల లాభం ఏంటంటే నేషనల్ జియోస్పేషియల్ పాలసీ నిబంధనలకు అనుగుణంగా..గూగుల్ ఇవ్వాళ విడుదల చేసిన గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ సాయంతో గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేసి మీకు కావాల్సిన స్ట్రీట్‌లో టార్గెటెడ్ షాప్స్, స్కూల్స్, టెంపుల్స్ విడివిడిగా చూడొచ్చని తెలిపింది. అంతేకాదు గూగుల్ ఎర్త్ ఇంజన్ సహాయంతో టెంపరేచర్ డేటాను పొందవచ్చు. 2016 నుంచి విశ్వ ప్రయత్నాలు గూగుల్ సంస్థ మనదేశంలో పనోరామిక్ స్ట్రీట్ లెవల్ ఇమేజ్ ఆప్షన్‌ను స్ట్రీట్ వ్యూ ఫీచర్ 2011లో విడుదల చేసింది. కానీ ఈ ఫీచర్‌తో దేశ భద్రతకు నష్టం వాటిల్లో ప్రమాదం ఉందనే కారణంతో 2016లో దీనిపై నిషేదం విధించింది. ఈ తరుణంలో గూగుల్ స్థానిక టెక్ కంపెనీల సాయంతో వీటిని తీసుకొచ్చింది. -
టెక్ మహీంద్రా.. మార్జిన్లు తగ్గాయ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నికర లాభం 16.4 శాతం క్షీణించి రూ. 1,132 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 1,353 కోట్లు. పలు అంశాల మూలంగా మార్జిన్లు తగ్గిపోవడమే తాజాగా లాభాల క్షీణతకు కారణం. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం 24.6 శాతం వృద్ధి చెంది రూ. 10,198 కోట్ల నుంచి రూ. 12,708 కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15.2 శాతం నుంచి 11 శాతానికి తగ్గగా, నిర్వహణ లాభం 9.2 శాతం క్షీణించి రూ. 1,403.4 కోట్లకు చేరింది. లాభదాయకతను పెంచుకునేందుకు అన్ని అవకాశాలూ వినియోగించుకుంటామని, రాబోయే రోజుల్లో అధిక స్థాయిలో నమోదు చేయగలమని సోమవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నాణీ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ కోణంలో కొన్ని పెట్టుబడులు పెట్టడంతో పాటు సరఫరా తరఫు సమస్యలు (అధిక వేతనాలతో ఉద్యోగులను తీసుకోవడం లేదా సబ్–కాంట్రాక్టుకు ఇవ్వడం వంటివి) కూడా మార్జిన్ల తగ్గుదలకు కారణమని తెలిపారు. ఆర్థిక ఫలితాల్లో మరిన్ని విశేషాలు.. ► క్యూ1లో 6,862 మంది ఉద్యోగుల నియామకాలతో సిబ్బంది సంఖ్య 1.58 లక్షలకు పెరిగింది. ► అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) మార్చి త్రైమాసికంలో 24 శాతంగా ఉండగా, జూన్ క్వార్టర్లో 22 శాతానికి తగ్గింది. అయితే, గతేడాది క్యూ1లో నమోదైన 17 శాతంతో పోలిస్తే ఇంకా అధికంగానే ఉంది. ► బీఎస్ఈలో టెక్ మహీంద్రా షేరు 1.15 శాతం క్షీణించి రూ. 1,016.55 వద్ద క్లోజయ్యింది. చదవండి: 5జీ వేలం.. పోటీపడుతున్న బడా కంపెనీలు -
దావోస్‌లో ఏపీ ధగధగ
సాక్షి, అమరావతి: దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా రెండో రోజైన సోమవారం పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. విద్యారంగంలో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ దస్సాల్ట్ సిస్టమ్స్ ప్రకటించింది. విశాఖను హైఎండ్ టెక్నాలజీ హబ్‌గా మార్చేలా సహకారం అందించేందుకు టెక్ మహీంద్రా ముందుకొచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి కాకినాడలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సంసిద్ధత తెలిపింది. స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హై ఎండ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖ విశాఖను హైఎండ్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలో భాగస్వామి కానున్నట్లు టెక్ మహీంద్రా ప్రకటించింది. దావోస్‌లోని ఏపీ పెవిలియన్‌లో టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమై నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు లాంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీతోపాటు 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, 175 స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరిస్తూ వీటిని ఐటీ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించాలని కోరారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా ఇంటర్న్‌షిప్, అప్రెంటిషిప్ కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గుర్నానీ స్పందిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ లాంటి అత్యాధునిక పరిజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. యువత నైపుణ్యాలకు పదును పెట్టేందుకు హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్సిటీతో కలసి ప్రత్యేకంగా పాఠ్యప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి రూ.250 కోట్లతో అసాగో ఇథనాల్ ప్లాంట్ మహీంద్రా గ్రూపు అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్ రాష్ట్రంలో రూ.250 కోట్లతో ఇథనాల్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను సీఎం దృష్టికి తెచ్చింది. ఇథనాల్ యూనిట్ ఏర్పాటుకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. విద్యారంగంలో ‘దస్సాల్’ పెట్టుబడులు విద్య, నైపుణ్యాభివృద్ధి లాంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ దస్సాల్ట్ సిస్టమ్స్ ప్రకటించింది. దావోస్‌లో దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు పోర్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సహకారం అందించాలని సీఎం కోరారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ ఏపీలో నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రధానంగా చర్చించినట్లు అనంతరం ఫ్లోరెన్స్ వెర్జలెన్ తెలిపారు. ఏపీతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని, విద్యారంగంలో పెట్టుబడులు పెట్టడానికి దస్సాల్ సిస్టమ్స్ ఆసక్తిగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త తరహా ఇంధనాలపై కూడా చర్చించామని, త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఫ్లోరెన్స్ తెలిపారు. కాకినాడకు జపాన్ లాజిస్టిక్ దిగ్గజం సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉండటంతో పాటు ఏపీలో కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా లభించే లాజిస్టిక్ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై జపాన్‌కు చెందిన లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి ఓ ఎస్కే లైన్స్ ఆసక్తి వ్యక్తం చేసింది. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులతో సరుకు రవాణాను ఏటా 507 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీనికి సంబంధించి కంటైనర్ హబ్, లాజిస్టిక్ రంగాలపై దృష్టి సారించాలని సీఎం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హషిమొటో కాకినాడలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ ఈవీ వాహనాలపై ‘హీరో’తో చర్చలు రాష్ట్రంలో వ్యాపార విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అంశాలపై హీరో గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్‌తో సీఎం జగన్ చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన హీరో గ్రూపు అథెర్ ఎనర్జీలో ఇప్పటికే 36 శాతం వాటాను కొనుగోలు చేయడమే కాకుండా తైవాన్‌కు చెందిన బ్యాటరీ టెక్నాలజీ గగొరోలో భాగస్వామిగా చేరింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, హీరో గ్రూప్ విస్తరణ అవకాశాలపై చర్చలు జరిగాయి. సీఎం జగన్‌తో స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య తదితరులు విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్లో భాగంగా పరిశ్రమలకు నీటి వనరులను సమకూర్చడంలో భాగంగా తిరుపతి సమీపంలో ఉన్న హీరో కంపెనీకి కండలేరు నుంచి నీటిని ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. అంతకుముందు భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్‌తో కూడిన స్విస్ పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో సీఎం జగన్ సమావేశమై ఏపీలో వ్యాపార అవకాశాలపై చర్చించారు. భారత రాయబారి సంజయ్ భట్టాచార్య కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు.