
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల సంస్థ, టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.943 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం రూ.856 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలియజేసింది.
ఆదాయం రూ.7,558 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.7,776 కోట్లకు పెరిగింది. సీక్వెన్షియల్‌గా చూస్తే నికర లాభం 13 శాతం, ఆదాయం 2 శాతం చొప్పున పెరిగాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టెక్ మహీంద్రా షేర్ 1.1 శాతం లాభంతో రూ.605 వద్ద ముగిసింది.