
టెక్ మహీంద్రా లాభం రూ.786 కోట్లు
ఆదాయం 21 శాతం అప్
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలానికి రూ.786 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.720 కోట్లు)తో పోలిస్తే 9 శాతం వృద్ఢి సాధించామని టెక్ మహీంద్రా తెలిపింది. గత క్యూ2లో రూ.5,488 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 21 శాతం వృద్ధితో రూ.6,616 కోట్లకు పెరిగిందని తెలిపింది. డాలర్ టెర్మ్‌ల్లో నికర లాభం 12 కోట్ల డాలర్లుగా, ఆదాయం 101 కోట్ల డాలర్లుగా నమోదైందని పేర్కొంది.
గత క్యూ2లో 770గా ఉన్న తమ యాక్టివ్ క్లయింట్ల సంఖ్య ఈ క్యూ2లో 788కు పెరిగిందని వివరించింది. ఈ క్యూ2లో కొత్తగా 1,562 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నామని, దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,05,235కు పెరిగిందని, వీరిలో 71,657 మంది సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన వారని, 26,513 మంది బీపీఓ రంగం ఉద్యోగులని తెలిపింది.
c