టెక్‌ మహీంద్రా లాభం 1,124 కోట్లు | Tech Mahindra Q2 Net Profit Up 17% At Rs 1124cr | Sakshi

టెక్‌ మహీంద్రా లాభం 1,124 కోట్లు

Nov 6 2019 4:59 AM | Updated on Nov 6 2019 4:59 AM

Tech Mahindra Q2 Net Profit Up 17% At Rs 1124cr - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) సెపె్టంబర్‌ క్వార్టర్లో రూ.1,124 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం(రూ.1,064 కోట్లు)తో పోలి్చతే 6 శాతం వృద్ధి సాధించామని టెక్‌ మహీంద్రా  ఎమ్‌డీ, సీఈఓ సీపీ గుర్నాని తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.8,630 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.9,070 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

ఆదాయం 128 కోట్ల డాలర్లకు....
డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 14 శాతం వృద్ధితో 16 కోట్ల డాలర్లకు, ఆదాయం 3 శాతం వృద్ధితో 128 కోట్ల డాలర్లకు పెరిగాయి. స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 4 శాతం పెరిగింది.  డిజిటల్‌ విభాగం ఆదాయం సీక్వెన్షియల్‌గా 12 శాతం ఎగసింది.  నిర్వహణ లాభం 7 శాతం తగ్గి రూ.1,501 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్‌ 2.3 శాతం తగ్గి 16.50 శాతానికి చేరింది.

అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నిర్వహణ లాభం 14 శాతం, నిర్వహణ లాభ మార్జిన్‌ 1.3 శాతం చొప్పున పెరిగాయి.  ఏటీఅండ్‌టీ కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందాన్ని ఈ క్యూ2లో కుదుర్చుకుంది.  ఈ క్యూ2లో కంపెనీ నికరంగా 5,749 ఉద్యోగాలిచి్చంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,31,522కు పెరిగింది. ఉద్యోగుల వలస(ఆట్రీషన్‌ రేటు) ఎలాంటి మార్పు లేకుండా 21 శాతంగా ఉంది.  

టెక్‌ మహీంద్రా చేతికి బార్న్‌ గ్రూప్‌...
అమెరికాకు చెందిన బార్న్‌ గ్రూప్‌ కంపెనీని రూ.671 కోట్లకు టెక్‌ మహీంద్రా పూర్తి అనుబంధ సంస్థ, టెక్‌ మహీంద్రా (సింగపూర్‌) పీటీఈ లిమిటెడ్‌ కొనుగోలు చేయనున్నది. ఈ డీల్‌ ఈ నెల 15 కల్లా పూర్తవ్వనున్నది. న్యూయార్క్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి లండన్, సింగపూర్, హాంకాంగ్, భారత్‌ల్లో కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,100గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement