కోల్‌కతా: బ్యాటరీ తయారీ సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ సెప్టెంబర్ క్వార్టర్లో పనితీరు పరంగా ఫర్వాలేదనిపించింది. రూ.3,719 కోట్ల ఆదాయంపై రూ.246 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 5 శాతం, ఆదాయం 13 శాతం చొప్పున పెరిగాయి. ఎబిట్డా పెద్దగా మార్పులేకుండా రూ.412 కోట్లుగా ఉంది. ఫలితాలపై అధిక తయారీ వ్యయాల ప్రభావం కొనసాగినట్టు కంపెనీ తెలిపింది. అయినప్పటికీ ఎబిట్డా మార్జిన్‌ను 9.9 శాతం నుంచి 11.1 శాతానికి పెంచుకుంది.
ప్రస్తుత త్రైమాసికం నుంచి లాభదాయకత మెరుగుపడుతుందని, తయారీ వ్యయాలపై అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సుబీర్ చక్రవర్తి తెలిపారు. బెంగళూరులో లిథియం అయాన్ సెల్ తయారీ కేంద్రం నిర్మాణానికి తన అనుబంధ సంస్థ ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ భూమి పూజ చేసినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment