Q2 earnings
-
ఎక్సైడ్ ఆదాయంలో వృద్ధి
కోల్‌కతా: బ్యాటరీ తయారీ సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ సెప్టెంబర్ క్వార్టర్లో పనితీరు పరంగా ఫర్వాలేదనిపించింది. రూ.3,719 కోట్ల ఆదాయంపై రూ.246 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 5 శాతం, ఆదాయం 13 శాతం చొప్పున పెరిగాయి. ఎబిట్డా పెద్దగా మార్పులేకుండా రూ.412 కోట్లుగా ఉంది. ఫలితాలపై అధిక తయారీ వ్యయాల ప్రభావం కొనసాగినట్టు కంపెనీ తెలిపింది. అయినప్పటికీ ఎబిట్డా మార్జిన్‌ను 9.9 శాతం నుంచి 11.1 శాతానికి పెంచుకుంది. ప్రస్తుత త్రైమాసికం నుంచి లాభదాయకత మెరుగుపడుతుందని, తయారీ వ్యయాలపై అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సుబీర్ చక్రవర్తి తెలిపారు. బెంగళూరులో లిథియం అయాన్ సెల్ తయారీ కేంద్రం నిర్మాణానికి తన అనుబంధ సంస్థ ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ భూమి పూజ చేసినట్టు చెప్పారు. -
పేటీఎంకు భారీ షాక్
బెంగళూరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో డిజిటల్ చెల్లింపుల దేశీ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నష్టాలు పెరిగి రూ. 594 కోట్లను తాకాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 481 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 76 శాతం జంప్‌చేసి రూ. 1,914 కోట్లను తాకింది. గత క్యూ2లో కేవలం రూ. 1,086 కోట్ల టర్నోవర్ సాధించింది. ఆదాయంలో 18% వాటాను ఆక్రమిస్తున్న ఫైనాన్షియల్ సర్వీసులు, ఇతర బిజినెస్‌ల నుంచి 293 శాతం అధికంగా రూ. 349 కోట్లు సమకూరినట్లు కంపెనీ తెలియజేసింది. రుణదాత భాగస్వాముల ద్వారా మొత్తం రూ. 7,313 కోట్ల రుణాలందించినట్లు వెల్లడించింది. ఇది 482 శాతం వృద్ధిగా తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో పేటీఎమ్ షేరు స్వల్పంగా లాభపడి రూ. 652 వద్ద ముగిసింది. -
దేశీయ టెక్ దిగ్గజ కంపెనీల క్యూ2 ఫలితాలు..ఎలా ఉండబోతున్నాయి?
న్యూఢిల్లీ: దేశీ ఐటీ సేవల కంపెనీలు త్రైమాసికవారీగా చూస్తే స్థిర వృద్ధిని నమోదు చేయవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది(2022–23) రెండో త్రైమాసిక ఫలితాలు టీసీఎస్‌తో ప్రారంభంకానున్నాయి. 10న జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాలు విడుదల చేయనుంది. తదుపరి విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ సైతం క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్య ఆందోళనల నేపథ్యంలోనూ ఆదాయ వృద్ధిలో నిలకడకు అవకాశమున్నట్లు నిపుణులు అంచనా వేశారు. అయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు తదితర రిస్కుల కారణంగా భవిష్యత్ ఆర్జనలపట్ల యాజమాన్య అంచనాల(గైడెన్స్)కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు. డీల్ పైప్‌లైన్, డిమాండ్ ఔట్లుక్ తదితరాలపై అత్యున్నత అధికారుల అభిప్రాయాలు కీలకంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. రానున్న త్రైమాసికాలలో పలు దిగ్గజాల పనితీరుపై యూఎస్, యూరప్‌లో కనిపిస్తున్న ఆర్థిక సవాళ్లు, ఆర్థిక మాంద్య భయాలు ప్రతికూల ప్రభావం చూపవచ్చునని అభిప్రాయపడ్డారు. మరోవైపు యూఎస్‌లో టెక్నాలజీసహా పలు రంగాల కంపెనీలు ఈ ఏడాది(2022) వేలాది ఉద్యోగులను తొలగించడం ప్రస్తావించదగ్గ అంశమని వివరించారు. అయితే మరికొంతమంది నిపుణులు మందగమన ప్రభావం దేశీ సాఫ్ట్వేర్ సేవలకు డిమాండును పెంచవచ్చని భావిస్తున్నారు. వ్యయ నియంత్రణల్లో భాగంగా ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులకు వీలున్నదని అంచనా వేస్తున్నారు. స్వీట్స్పాట్ : సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ దేశీ ఐటీ రంగాన్ని స్వీట్స్పాట్తో పోల్చారు. గత త్రైమాసికంతో పోలిస్తే డిమాండు స్వల్పంగా క్షీణించినప్పటికీ ప్రపంచ అనిశ్చితులు ఇందుకు కారణమని పేర్కొన్నారు. అయితే అంతర్గతంగా పరిశ్రమ అత్యంత పటిష్టంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. యూఎస్ కంపెనీలు వ్యయ నియంత్రణగా ఉద్యోగ కోతలు అమలు చేస్తున్నప్పటికీ, ఇదే మరింత ఔట్‌సోర్సింగ్‌కు వీలు కల్పిస్తుందని అంచనా వేశారు. -
హెచ్‌సీఎల్, ఇన్ఫీ పుష్- ఐటీ షేర్ల దూకుడు
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించే వీలున్నట్లు ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా అభిప్రాయపడింది. ఆదాయం, నిర్వహణ మార్జిన్లు అంచనాల(గైడెన్స్)ను అందుకోనున్నట్లు పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 3.5 శాతం పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇబిట్ మార్జిన్లు 20.5-21 శాతం స్థాయిలో నమోదుకావచ్చని తెలియజేసింది. దీంతో ఐటీ రంగంపై ఇన్వెస్టర్లలో ఆశలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక మరోవైపు యూరోపియన్ సంస్థ గైడ్‌విజన్‌ను సొంతం చేసుకోనున్నట్లు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ తాజాగా వెల్లడించింది. ఎంటర్ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సేవలందించే ఈ యూరోపియన్ కంపెనీ కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఫలితంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తోపాటు.. సాఫ్ట్వేర్ సేవల ఇతర కంపెనీలకూ డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. దీంతో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ ఏకంగా 4.5 శాతం ఎగసింది. టీసీఎస్ రికార్డ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు 9.6 శాతం దూసుకెళ్లింది. రూ. 789 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. టీసీఎస్ 3 శాతం ఎగసింది. రూ. 2,447 వద్ద ట్రేడవుతోంది. తద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. అంతేకాకుండా టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 9 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి ఆర్ఐఎల్ తదుపరి అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా రికార్డు సాధించింది. జోరుగా హుషారుగా ఐటీ సేవల ఇతర కంపెనీలలో ఎంఫసిస్ 8.4 శాతం జంప్‌చేసి రూ. 1251ను తాకింది. తొలుత రూ. 1,270 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఈ బాటలో మైండ్‌ట్రీ 3.7 శాతం ఎగసి రూ. 1227 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడాది గరిష్టంకాగా.. ఇన్ఫోసిస్ 4 శాతం దూసుకెళ్లి రూ. 983కు చేరింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇదే విధంగా కోఫోర్జ్ 3.25 శాతం లాభపడి రూ. 2158 వద్ద కదులుతోంది. ఇది ఏడాది గరిష్టంకాగా.. టెక్ మహీంద్రా 3.5 శాతం పెరిగి రూ. 792 వద్ద ట్రేడవుతోంది. ఇక ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2.6 శాతం బలపడి రూ. 2564 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2564 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఐటీ దిగ్గజం విప్రో సైతం 2.75 శాతం పుంజుకుంది. రూ. 302 సమీపంలో ఏడాది గరిష్టం వద్ద ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లలో తొలుత రూ. 1331 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకిన టాటా ఎలక్సీ 2 శాతం లాభంతో రూ. 1314 వద్ద ట్రేడవుతోంది. -
‘314 కోట్ల మంది ఎఫ్బీ యాప్స్‌ను వాడారు’
శాన్ఫ్రాన్సిస్కో : కరోనా మహమ్మారితో పాటు విద్వేష కంటెంట్‌పై విమర్శలు వెల్లువెత్తినా పలు ప్రతికూలతల మధ్య సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ రెండో త్రైమాసంలో భారీ రాబడిని ఆర్జించింది. ఈ త్రైమాసంలో ఫేస్బుక్ రాబడి ఏకంగా 11 శాతం పెరిగి దాదాపు 1.3 లక్షల కోట్లకు ఎగిసింది. రెండో క్వార్టర్లో 314 కోట్ల మంది ఇన్స్టాగ్రాం, వాట్సాప్, మెసెంజర్ వంటి ఎఫ్బీ యాప్స్‌ను ఉపయోగించుకున్నారు. డైలీ యాక్టివ్ యూజర్లు 12 శాతం పెరిగి 179 కోట్లకు చేరారు. అన్ని కంపెనీల తరహాలోనే తమ వ్యాపారం కూడా కోవిడ్-19తో ప్రభావితమైందని రాబోయే రోజుల్లో తమ వాణిజ్య పరిస్థితిపై అనిశ్చితి నెలకొందని ఫేస్బుక్ ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : ఫేస్‌బుక్‌కు కౌంటరిచ్చిన టిక్‌టాక్ అయితే రెండో క్వార్టర్లో మెరుగైన ఫలితాలు ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లలో సోషల్ మీడియా దిగ్గజం షేర్లు ఏడు శాతం పైగా పెరిగాయి. కరోనా వైరస్ వెంటాడుతున్న సంక్లిష్ట సమయంలో చిన్న వ్యాపారం సంస్థలు ఎదిగేందుకు, ఆన్లైన్ కార్యకలాపాలు చక్కదిద్దుకునేందుకు అవసరమైన టూల్స్ అందిస్తామని ఫేస్బుక్ వ్యవస్ధాపకులు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. విద్వేష కంటెంట్‌ను నిలిపివేయడంపై ఫేస్బుక్ చర్యలు చేపట్టకపోవడంపై యాడ్ బ్యాన్‌ను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తప్పుడు సమాచారం, విద్వేష కంటెంట్ల నుంచి లాభాలు దండుకోవాలని తాము భావించడంలేదని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. -
క్యూ2లో ఐడియా ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం సంస్థ ఐడియా సెల్యులర్ క్యూ2 లో భారీగా నష్టపోయింది. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో మరోసారి నష్టాలను నమోదు చేసి రూ.11వందలకోట్లకు పైగా భారీ నష్టాన్ని చవిచూసింది.ముఖ్యంగా రిలయన్స్ జియో ఎంట్రీతో గత క్వార్టర్లో భారీ నష్టాలను మూటగట్టుకున్న ఐడియా సెప్టెంబరు 30 తో ముగిసిన రెండవ క్వార్టల్లో త్రైమాసికంలోపన్ను తర్వాత 169.45 మిలియన్ డార్ల నష్టపోయినట్టు ఐడియా సెల్యులార్ సోమవారం తెలిపింది. ప్రత్యర్థులనుంచి భారీ పోటీ నెలకొన్న మార్కెట్ల పరిస్థితుల మధ్య ఎనలిస్టులు అంచనాలను మించి వరుసగా నాలుగవ క్వార్టర్లలో కూడా భారీ నష్టాల్లో కూరుకు పోయింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన మొబైల్ టెలికం సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో రూ. 1,107 కోట్ల నికర నష్టం ప్రకటించింది. తొలి క్వార్టర్లో రూ. 815 కోట్లమేర నష్టం నమోదుకాగా.. మొత్తం ఆదాయం రూ. 7465 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 1502 కోట్లుకాగా.. ఇబిటా మార్జిన్లు 23 శాతం నుంచి 20.1 శాతానికి బలహీనపడ్డాయి. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 132ను తాకింది. మరోవైపు తన టవర్ బిజినెస్‌ను ఏటీసి టెలికాంకు విక్రయిస్తున్నట్లు ఐడియా వెల్లడించింది. అలాగే బ్రిటిష్ సంస్థ వొడాఫోన్ ఇండియాతో విలీనం అంశం త్వరలోనే పూర్తికానున్నట్లు వెల్లడించింది. దీంతో తమ వాటా టవర్ బిజినెస్‌ను రూ. 4000 కోట్లకు విక్రయించనున్నామని, దీనికి బోర్డు ఆమోదం లభించినట్టు తెలిపింది. ఈ పలితాల నేపథ్యంలో ఐడియా కౌంటర్ 3 శాతానికి పైగా నష్టాల్లోకి జారుకుంది. -
ఎల్ అండ్ టీ లాభాలు 32శాతం జంప్
సాక్షి, ముంబై: ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం లార్సన్ టుర్బో (ఎల్అండ్టీ) శనివారం క్యూ2 ఫలితాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 32శాతం జంప్ చేసి రూ. 2020 రూ. కోట్లను నమోదు చేసింది. నిర్వహణ లాభం(ఇబిటా) స్వల్పంగా పుంజుకొని రూ. 2960 కోట్లుగా నిలిచింది. అలాగే రూ. 137 కోట్లమేర వన్ టైమ్ గెయిన్ నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. మొత్తం ఆదాయం 6శాతం పెరిగి రూ. 26,447 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 9.2 శాతం నుంచి 11.2 శాతానికి బలపడ్డాయి. మొత్తం వ్యయం 23,507 కోట్ల నుంచి రూ .24,310 కోట్లకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వ చర్యలు పెట్టుబడుల పునరుద్ధరణకు ఊతమిచ్చినప్పటికి ఆర్థిక సంస్కరణల ప్రభావంతో సవాళ్లను ఎదుర్కొన్నట్టు కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా డీమానిటైజేషన్, జీఎస్టీ వ్యాపారం దెబ్బతిన్నట్టు తెలిపింది. పెట్టుబడులని ఆకర్షించడం, ఆర్థిక సరళతకు కట్టుబడి వుండటమనే రెండు సవాళ్లు తమ ముందున్నాయని చెప్పింది. -
జీవీకే పవర్‌కి మళ్లీ నష్టాలే
సాక్షి,ముంబై: మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యూ2 లో నిరాశజనకఫలితాలను నమోదు చేసింది. శనివారం ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2)లో ఫలితాల్లో మరోసారి ఢమాల్ అందింది. ఈ క్వార్టర్లో కూడా రూ. 77 కోట్ల (76.94 కోట్ల రూపాయలు) నికర నష్టాలను ప్రకటించింది. గతేడాది క్యూ2లో రూ. 13.4 కోట్ల నష్టం మాత్రమే. అయితే ఆదాయంలో స్వల్ప పురోగతిని సాధించింది. మొత్తం ఆదాయం రూ. 18.55 కోట్ల నుంచి రూ. 20,16 కోట్లకు పెరిగింది. కంపెనీ ఎండీ పదవికి జీవీకే రెడ్డి చేశారని ప్రకటించింది. అయితే బోర్డులో నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జీవీకే రెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నారని చెప్పింది. ఈయన రాజీనామాను బోర్డు ఆమోదించిందనీ జీవీకే పవర్ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే పీవీ ప్రసన్నరెడ్డి హోల్‌టైమ్ డైరెక్టర్‌గా నియమించేందుకు బోర్డు అనుమతించిందని తెలిపింది. నవంబరు11నుంచి మూడేళ్లపాటు ఎలాంటి వేతనం లేకుండా ఆయన పనిచేస్తారని పేర్కొంది. -
ఇండియన్ బ్యాంక్ లాభాలు 11శాతం జంప్
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ బ్యాంక్ రెండవ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 ఫలితాలను సోమవారం ప్రకటించింది. ఎనలిస్టుల అంచనాలను అధిగమించి ఆదాయంలోనూ, నికర లాభాల్లో పురోగతిని సాధించింది. జూలై-సెప్టెంబర్ 30తో ముగిసిన క్యూ 2లో నికర లాభాలు 11శాతంపైగా ఎగసి రూ. 451 కోట్లను అధిగమించాయి. నికర వడ్డీ ఆదాయం సైతం 21 శాతం పెరిగి రూ. 1,544 కోట్లకు చేరింది. దాదాపు 14 శాతం రుణ వృద్ధిని సాధించగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.21 శాతం నుంచి 6.67 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 4.05 శాతం నుంచి 3.41శాతానికి క్షీణించాయి. రూ.5,238.6 కోట్ల నుంచి రూ .4,748.2 కోట్లకు పడిపోయింది. అయితే ప్రొవిజన్లు 56 శాతం పెరిగి రూ. 744ను కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఫలితాల నేపథ్యంలో ఇండియన్బ్యాంక్ షేరు భారీ లాభాలను సాధించింది. ట్రేడర్ల కొనుగోళ్లతో 52 వారాల గరిష్టాన్ని తాకింది. -
టైటన్ లాభాలు 67శాతం జంప్
సాక్షి,ముంబై: టైటాన్ కంపెనీ లిమిటెడ్ లాభాల్లో మరోసారి అదరగొట్టింది. శుక్రవారం ప్రకటించిన ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేసింది. ముఖ్యంగా బంగారం వ్యాపారంలో అత్యధిక లాభాలను సాధించి విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. సెప్టెంబర్ 30తో ముగిసిన ఈ త్రైమాసికంలో నికరలాభం 67.44 శాతం ఎగిసి రూ .277.93 కోట్లను సాధించింది. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ .165.98 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. టైటాన్ మొత్తం ఆదాయం 3,517.7 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .2,714.98 కోట్లు ఆర్జించింది. జ్యుయల్లరీ సెగ్మెంట్ లాభాలు మొత్తం ఆదాయంలో 79 శాతం పుంజుకుంది. 37 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 2,748.20 కోట్లను సాధించింది. క్వార్టర్ ప్రారంభంలో కొత్త పిఎంఎల్ఏ నిబంధనల ద్వారా జ్యూయలరీ వ్యాపారాన్ని ప్రభావితం చేసినా పండుగ సీజన్ వ్యాపారానికి ఊపందుకుందని టైటన్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ భట్ చెప్పారు. ద్వితీయ త్రైమాసికంలో టైటాన్ వాచ్ ల ద్వారా ఆదాయం 8.96 శాతం పెరిగి రూ .571.75 కోట్లకు చేరుకుంది. ఆభరణాల వ్యాపార ఆదాయం 36.90 శాతం పెరిగి రూ .2,748.2 కోట్లకు చేరింది. ఐ వేర్ విభాగంలో వచ్చిన ఆదాయం 3.51 శాతం పెరిగి రూ .98.54 కోట్లకు చేరింది. కాగా శుక్రవారం నాటి మార్కెట్లో టైటాన్ ఇండస్ట్రీస్ షేర్లు 0.56 శాతం పెరిగి రూ .659.40 వద్ద స్థిరపడింది. -
అంచనాలను బీట్ చేసిన టెక్ మహీంద్రా
సాక్షి,ముంబై: దేశంలో ఐదో అతిపెద్ద ఐటీ సేవల టెక్ మహీంద్రా రెండవ త్రైమాసిక ఫలితాల్లో బుధవారం విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. బుధవారం ప్రకటించిన క్యూ2లో నికర లాభాలు సీక్వెన్షియల్ ప్రాతిపదికన 4.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన 30శాతం జంప్ చేసి రూ. 836కోట్లను ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 644.73 లాభాలను నమోదు చేసింది. రూపాయి ఆదాయం 3.7 శాతం పుంజుకుని క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆన్ రూ. 7006కోట్లను, డాలర్ రెవెన్యూ 3.6 పెరిగి 1179 మిలియన్ డాలర్లను ఆర్జించింది. కాగా రూ.740 కోట్ల లాభాలను, రూ. 7,551కోట్ల ఆదాయాన్ని సాధిస్తుందని ఎనలిస్టులు అంచనావేశారు. డేవిడ్ (డిజిటైజేషన్, ఆటోమేషన్, వెర్టికలైజేషన్, ఇన్నోవేషన్, డిసరప్షన్ ) వ్యూహంతో, త్రైమాసికంలో ఆదాయం, నికర లాభం, కొత్త వ్యాపారం లాభంలో మంచి వృద్ధి సాధించామని టెక్ మహీంద్ర సీఎండీ సీపీ గనర్ని చెప్పారు. ఈ త్రైమాసికంలో రూపాయి రెవెన్యూ 3.7 శాతం పెరిగి రూ .7,606 కోట్లకు చేరింది. డాలర్ రెవెన్యూ 3.6 శాతం పెరిగి 1,179.2 మిలియన్ డాలర్లకు చేరింది. ఎబిటా మార్జిన్లు 22.2 శాతం పెరిగి రూ .840 కోట్లకు పెరిగింది. 2017 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి 160 బేసిస్ పాయింట్లు పెరిగి మార్జిన్ 11 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో అగ్రిమెంట్ రేట్ (ఎల్టిఎమ్) గత త్రైమాసికంలో 17 శాతం నుంచి 16 శాతానికి పడిపోయింది. క్యూ2లో ఐటి వినియోగం 77 శాతం నుండి 81 శాతం పెరిగింది, ఐటి వినియోగం (ట్రినెస్ మినహాయించి) 81 శాతం వద్ద ఉంది. ఫారెక్స్ రెవెన్యూ 16.7 శాతం తగ్గి 227 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంలో రూ .322.2 కోట్లతో పోల్చుకుంటే 21.5 శాతం క్షీణించిందని పేర్కొంది . ఈ క్వార్టర్లో తమ కొత్త 21 క్లయింట్లతో మొత్త 885 మంది ఖాతాదారులున్నారు. అలాగే గత క్వార్టర్లోని అట్రిషన్ రేట్ 17శాతంతో పోలిస్తే ప్రస్తుతం16 శాతానికి తగ్గిందని తెలిపింది. ఈ ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు ధర 1.6 శాతం లాభపడింది. -
ఈసారి ట్విట్టర్ ఫలితాలు అలా కాదట!
న్యూయార్క్,: మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ తన త్రైమాసిక ఆదాయ ఫలితాలును ఇక పెరిస్కోప్ ద్వారా ప్రకటించదట. సంస్థ క్యూ 2 ఫలితాలను వచ్చే మంగళవారం ప్రకటించనుంది. ట్విట్టర్ కు చెందిన ప్రముఖ లైవ్ స్ట్రీమింగ్ యాప్ పెరిస్కోప్ ద్వారా వెల్లడించబోదని మీడయా రిపోర్ట్స్ ప్రకటించాయి. 2015 లో ఈ పెరిస్కోప్ ద్వారానే ట్టిట్టర్ తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మిగిలిన ఏ కంపెనీ ఇలా లైవ్ వీడియో ద్వారా ఆర్థిక ఫలితాలను ప్రకటించపోయినప్పటికీ, ట్విట్టర్ పెట్టుబడిదారులకు, వారి కొత్త ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఇది సులభమైన మార్గంగా ట్విట్టర్ ఎంచుందని రీకోడ్.నెట్ శుక్రవారం నివేదించింది. వాటాదారులు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా వీడియో స్ట్రీమింగ్ ముఖ్యం కాదని భావించిన సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. కాగా కోట్ల సంఖ్యలో యూజర్లు ఉన్న ఈ యాప్‌ను ట్విట్టర్ మార్చి 26, 2015న ప్రారంభించింది. ట్విట్టర్ ఆధారిత సర్వీసుల్లో పెరిస్కోప్‌కు మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే.