న్యూయార్క్,: మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ తన త్రైమాసిక ఆదాయ ఫలితాలును ఇక పెరిస్కోప్ ద్వారా ప్రకటించదట. సంస్థ క్యూ 2 ఫలితాలను వచ్చే మంగళవారం ప్రకటించనుంది. ట్విట్టర్ కు చెందిన ప్రముఖ లైవ్ స్ట్రీమింగ్ యాప్ పెరిస్కోప్ ద్వారా వెల్లడించబోదని మీడయా రిపోర్ట్స్ ప్రకటించాయి. 2015 లో ఈ పెరిస్కోప్ ద్వారానే ట్టిట్టర్ తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మిగిలిన ఏ కంపెనీ ఇలా లైవ్ వీడియో ద్వారా ఆర్థిక ఫలితాలను ప్రకటించపోయినప్పటికీ, ట్విట్టర్ పెట్టుబడిదారులకు, వారి కొత్త ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఇది సులభమైన మార్గంగా ట్విట్టర్ ఎంచుందని రీకోడ్.నెట్ శుక్రవారం నివేదించింది. వాటాదారులు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా వీడియో స్ట్రీమింగ్ ముఖ్యం కాదని భావించిన సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది.
కాగా కోట్ల సంఖ్యలో యూజర్లు ఉన్న ఈ యాప్‌ను ట్విట్టర్ మార్చి 26, 2015న ప్రారంభించింది. ట్విట్టర్ ఆధారిత సర్వీసుల్లో పెరిస్కోప్‌కు మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే.
ఈసారి ట్విట్టర్ ఫలితాలు అలా కాదట!
Published Sat, Jul 23 2016 12:56 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
Advertisement
Advertisement