సాక్షి, ముంబై: దేశీయ టెలికాం సంస్థ ఐడియా సెల్యులర్ క్యూ2 లో భారీగా నష్టపోయింది. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో మరోసారి నష్టాలను నమోదు చేసి రూ.11వందలకోట్లకు పైగా భారీ నష్టాన్ని చవిచూసింది.ముఖ్యంగా రిలయన్స్ జియో ఎంట్రీతో గత క్వార్టర్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్న ఐడియా సెప్టెంబరు 30 తో ముగిసిన రెండవ క్వార్టల్‌లో త్రైమాసికంలోపన్ను తర్వాత 169.45 మిలియన్ డార్ల నష్టపోయినట్టు ఐడియా సెల్యులార్ సోమవారం తెలిపింది. ప్రత్యర్థులనుంచి భారీ పోటీ నెలకొన్న మార్కెట్ల పరిస్థితుల మధ్య ఎనలిస్టులు అంచనాలను మించి వరుసగా నాలుగవ క్వార్టర్లలో కూడా భారీ నష్టాల్లో కూరుకు పోయింది.
ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన మొబైల్ టెలికం సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో రూ. 1,107 కోట్ల నికర నష్టం ప్రకటించింది. తొలి క్వార్టర్‌లో రూ. 815 కోట్లమేర నష్టం నమోదుకాగా.. మొత్తం ఆదాయం రూ. 7465 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 1502 కోట్లుకాగా.. ఇబిటా మార్జిన్లు 23 శాతం నుంచి 20.1 శాతానికి బలహీనపడ్డాయి. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 132ను తాకింది.
మరోవైపు తన టవర్ బిజినెస్‌ను ఏటీసి టెలికాంకు విక్రయిస్తున్నట్లు ఐడియా వెల్లడించింది. అలాగే బ్రిటిష్ సంస్థ వొడాఫోన్ ఇండియాతో విలీనం అంశం త్వరలోనే పూర్తికానున్నట్లు వెల్లడించింది. దీంతో తమ వాటా టవర్ బిజినెస్‌ను రూ. 4000 కోట్లకు విక్రయించనున్నామని, దీనికి బోర్డు ఆమోదం లభించినట్టు తెలిపింది. ఈ పలితాల నేపథ్యంలో ఐడియా కౌంటర్ 3 శాతానికి పైగా నష్టాల్లోకి జారుకుంది.
Comments
Please login to add a commentAdd a comment