బెంగళూరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో డిజిటల్ చెల్లింపుల దేశీ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నష్టాలు పెరిగి రూ. 594 కోట్లను తాకాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 481 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 76 శాతం జంప్‌చేసి రూ. 1,914 కోట్లను తాకింది.
గత క్యూ2లో కేవలం రూ. 1,086 కోట్ల టర్నోవర్ సాధించింది. ఆదాయంలో 18% వాటాను ఆక్రమిస్తున్న ఫైనాన్షియల్ సర్వీసులు, ఇతర బిజినెస్‌ల నుంచి 293 శాతం అధికంగా రూ. 349 కోట్లు సమకూరినట్లు కంపెనీ తెలియజేసింది. రుణదాత భాగస్వాముల ద్వారా మొత్తం రూ. 7,313 కోట్ల రుణాలందించినట్లు వెల్లడించింది. ఇది 482 శాతం వృద్ధిగా తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో పేటీఎమ్ షేరు స్వల్పంగా లాభపడి రూ. 652 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment