Q2 result
-
ఎల్ఐసీ లాభం తగ్గింది.. వాటి ప్రభావమే!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు వెలువరించింది. జులై–సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం 4% క్షీణించి రూ. 7,621 కోట్లకు పరిమితమైంది. ఇతర ఆదాయం తగ్గడం, కుటుంబ పెన్షన్‌లో రూ. 464 కోట్ల పెరుగుదల ప్రభావం చూపాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 7,925 కోట్లు ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం రూ. 1,07,397 కోట్ల నుంచి రూ. 1,19,901 కోట్లకు ఎగసింది. అయితే ఇతర ఆదాయం రూ. 248 కోట్ల నుంచి దాదాపు సగానికి తగ్గి రూ. 145 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,01,587 కోట్ల నుంచి రూ. 2,29,620 కోట్లకు జంప్ చేసింది. కాగా.. మొత్తం వ్యయాలు రూ. 1,94,335 కోట్ల నుంచి రూ. 2,22,366 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.43 శాతం నుంచి 1.72 శాతానికి దిగివచ్చాయి.హెల్త్ ఇన్సూరెన్స్‌పై కన్ను ఈ ఆర్థిక సంవత్సరంలోగా స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నట్లు ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. ఇప్పటికే పనులు మొదలుకాగా.. సరైన సంస్థ కోసం చూస్తున్నట్లు తెలియజేశారు. మార్చిలోగా వాటా కొనుగోలుకు తుది రూపునివ్వనున్నట్లు వెల్లడించారు. టార్గెట్ సంస్థ విలువనుబట్టి ఎంత వాటా కొనుగోలు చేసేదీ ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు బీఎస్ఈలో 1.6% నష్టంతో రూ. 915 వద్ద ముగిసింది. -
బీఎస్ఈ లాభం హైజంప్
న్యూఢిల్లీ: మార్కెట్ దిగ్గజం బొంబాయి స్టాక్ ఎక్ఛేంజ్ (బీఎస్ఈ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం నాలుగు రెట్లు దూసుకెళ్లి రూ. 118 కోట్లను అధిగమించింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 29 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 53 శాతం జంప్‌చేసి రూ. 367 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 240 కోట్ల ఆదాయం సాధించింది. ఈక్విటీ విభాగంలో రోజువారీ సగటు టర్నోవర్ రూ. 4,740 కోట్ల నుంచి రూ. 5,922 కోట్లకు ఎగసింది. రైట్స్ ఇష్యూ ద్వారా ఇండియా ఇంటర్నేషనల్ ఎక్సే్ఛంజ్(ఐఎఫ్ఎస్సీ) లిమిటెడ్(ఇండియా ఐఎన్ఎక్స్)లో రూ. 22.36 కోట్లు, ఇండియా ఇంటర్నేషనల్ ఎక్సే్ఛంజ్(ఐఎఫ్ఎస్సీ) లిమిటెడ్(ఇండియా ఐసీసీ)లో రూ. 33.88 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు బీఎస్ఈ వెల్లడించింది. -
LIC Q2 Results: ఎల్ఐసీ లాభం 7,925 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ ఇండియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 50 శాతం క్షీణించి రూ. 7,925 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 15,952 కోట్లు ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం సైతం రూ. 1,32,632 కోట్ల నుంచి రూ. 1,07,397 కోట్లకు వెనకడుగు వేసింది. అయితే తొలి ఏడాది ప్రీమియం రూ. 9,125 కోట్ల నుంచి రూ. 9,988 కోట్లకు మెరుగుపడింది. ఇక మొత్తం ఆదాయం రూ. 2,22,215 కోట్ల నుంచి రూ. 2,01,587 కోట్లకు నీరసించింది. పెట్టుబడుల నుంచి మాత్రం ఆదాయం రూ. 93,942 కోట్లకు ఎగసింది. గత క్యూ2లో రూ. 84,104 కోట్లు లభించింది. స్థూల మొండిబకాయిలు 5.6 శాతం నుంచి 2.43 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ. 610 వద్ద ముగిసింది. -
అదానీ పవర్ లాభాలు అదిరెన్
న్యూఢిల్లీ: అదానీ పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.231 కోట్లతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగి రూ.696 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 52 శాతం వృద్ధితో రూ.8,446 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఆదాయం రూ.5,572 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆలస్యపు రుసం సర్‌చార్జీ రూపంలో రూ.912 కోట్ల మొత్తం ఆదాయానికి వచ్చి కలసినట్టు అదానీ పవర్ తెలిపింది. అలాగే, దిగుమతి చేసుకున్న బొగ్గు ధరలు అధికంగా ఉండడం, డిమాండ్ పెరగడం వల్ల దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏలు) టారిఫ్‌లు మెరుగుపడడం సానుకూలించినట్టు పేర్కొంది. సంప్రదాయ ఇంధన ఆధారిత విద్యుత్ ఇప్పటికీ దేశ స్థిరమైన విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు అదానీ పవర్ పేర్కొంది. తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న దేశ ప్రతిష్టాత్మక లక్ష్యాలకు అనుగుణంగా సంప్రదాయేతర ఇంధన వనరులపై మరిన్ని పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 39.2 శాతంగా, విద్యుత్ విక్రయాలు 11 బిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. -
నష్టాల్లోనే జెట్ ఎయిర్వేస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విమానయాన కంపెనీ జెట్ ఎయిర్వేస్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 308 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 306 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. స్టాండెలోన్ ఫలితాలివి. మొత్తం ఆదాయం రూ. 45 కోట్ల నుంచి 13.5 కోట్లకు పడిపోయింది. మొత్తం వ్యయాలు రూ. 322 కోట్లకు చేరాయి. మూడున్నరేళ్లుగా కార్యకలాపాలు నిలిచిపోయిన కంపెనీ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో జలాన్ కల్రాక్ కన్సార్షియం బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్వేస్ను గెలుపొందింది. అయితే కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభంకావలసి ఉంది. -
భారత్‌లో గాడ్జెట్స్ మార్కెట్ జోరు,ఎక్కువగా ఏం కొంటున్నారంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ వేరబుల్స్ మార్కెట్ దేశంలో జోరుగా సాగుతోంది. ఐడీసీ గణాంకాల ప్రకారం.. 2022 జూలై–సెప్టెంబర్‌లో మొత్తం 3.72 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంఖ్య 56 శాతం అధికం కావడం విశేషం. సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో దేశవ్యాప్తంగా 7.5 కోట్ల యూనిట్ల స్మార్ట్‌వాచెస్, రిస్ట్ బ్యాండ్స్, ఇయర్‌వేర్ కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. సగటు విక్రయ ధర ఏడాదిలో 13.6 శాతం తగ్గింది. స్మార్ట్‌వాచెస్ 179 శాతం వృద్ధితో 1.2 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇయర్‌వేర్ 33.6 శాతం అధికమై 2.5 కోట్ల యూనిట్లుగా ఉంది. 32.1 శాతం వాటాతో బోట్ బ్రాండ్ అగ్రస్థానంలో నిలిచింది. 13.8 శాతం వాటాతో నాయిస్ రెండవ స్థానంలో ఉంది. ఫైర్ బోల్ట్ 8.9 శాతం వాటాతో మూడు, వన్‌ప్లస్ 8.2 శాతం వాటాతో నాల్గవ స్థానాన్ని అందుకున్నాయి. -
‘జొమాటో చెప్పినట్లే చేస్తోంది’
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో వాటాదారులకు చెప్పినట్టుగానే అడుగులు వేస్తోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నష్టాలను మరింత తగ్గించుకుని.. రూ.251 కోట్లకు పరిమితం చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.435 కోట్లతో పోలిస్తే సగం తగ్గినట్టు తెలుస్తోంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,024 కోట్లతో పోలిస్తే 60 శాతం పెరిగి రూ.1,661 కోట్లకు ఎగసింది. ఆగస్ట్ 10 నుంచి జొమాటో విలీనం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి జొమాటో గణాంకాలను కూడా కలిపి చూస్తే ఆదాయం త్రైమాసికం వారీగా 16 శాతం పెరిగి, (వార్షికంగా 48 శాతం వృద్ధి) రూ.2,107 కోట్లుగా ఉంది. వార్షికంగా చూస్తే బిలియన్ డాలర్ల (రూ.8,000 కోట్లు) ఆదాయ మార్క్‌ను మొదటిసారి ఓ త్రైమాసికంలో చేరుకున్నట్టు జొమాటో ప్రకటించింది. ‘‘దీర్ఘకాలం కోసం వ్యాపార నిర్మాణ క్రమంలో ఉన్నాం. దీర్ఘకాలం కోసం స్వల్పకాల అంచనాల విషయంలో రాజీపడడం, అవకాశాలను అంచనా వేయడం అన్నది ఎప్పటి మాదిరే కొనసాగుతుంది’’అని జొమాటో సీఈవో, వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. మెరుగైన పనితీరు అంశంపైనా మాట్లాడారు. ‘‘చాలా విభాగాల్లో మేము మెరుగుపడాల్సి ఉంది. నాణ్యమైన ఉత్పత్తులను పెద్ద మొత్తంలో, వేగంగా డెలివరీ చేయాలి. కస్టమర్ల అభిప్రాయాలను సరైన విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే, రెస్టారెంట్ భాగస్వాములు, డెలివరీ భాగస్వాముల అభిప్రాయాలను కూడా తరచూ వినాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న నమూనాలను సవాలు చేస్తూ, మరిన్ని రిస్క్‌లు తీసుకోవాల్సి ఉంది’’అని వివరించారు. బ్లింకిట్‌పై అభిప్రాయం మారుతుంది బ్లింకిట్ గురించి మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఇన్వెస్టర్లు ప్రస్తుతం బ్లింకింట్ వ్యాపారానికి సున్నా విలువ కడుతున్నారు. అది అర్థం చేసుకోతగినది. కొంత కాలానికి ఇది మారుతుందని నాకు నమ్మకం ఉంది’’అని గోయల్ వివరించారు. అన్ని ఇబ్బందులను అధిగమించామని, ప్రస్తుతం బ్లింకిట్‌కు నిలకడైన టీమ్ ఏర్పడిందని చెప్పారు. ఈ బృందం మంచి ఫలితాలను తీసుకొస్తున్నట్టు చెప్పారు. -
హిందాల్కో మిశ్రమ ఫలితాలు
న్యూఢిల్లీ: హిందాల్కో ఇండస్ట్రీస్ సెప్టెంబర్ త్రైమాసికానికి మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ లాభం 35 శాతం తగ్గిపోయి రూ.2,205 కోట్లకు పరిమితం కాగా, ఆదాయం మాత్రం 18 శాతం పెరిగి రూ.56,176 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.3,417 కోట్లు, ఆదాయం రూ.47,665 కోట్ల చొప్పున ఉండడం గమనించాలి. మెరుగైన అమ్మకాలు ఆదాయంలో వృద్ధికి తోడ్పడినట్టు కంపెనీ తెలిపింది. రూ.5,743 కోట్ల ఎబిట్డా (పన్నులు, వడ్డీకి ముందస్తు) నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం తక్కువ. ‘‘తయారీ వ్యయాలు పెరగడం, అననుకూల ఆర్థిక పరిస్థితులు ప్రభావం చూపించాయి. కాపర్ వ్యాపారంలో మెరుగైన నిర్వహణ పనితీరు, విక్రయాలు బలంగా ఉండడంతో ఈ ప్రభావాన్ని కొంత వరకు అధిగమించగలిగాం’’అని హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ తెలిపారు. గత కొన్నేళ్లుగా కంపెనీ వ్యాపారం మరింత బలోపేతంగా, సమగ్రంగా మార్పు చెందడం సవాళ్ల వాతావరణంలోనూ బలమైన ఫలితాలు సాధించేందుకు అనుకూలించినట్టు వివరించారు. -
ఎల్ఐసీ.. ఆదాయం అదరహో
ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 11 రెట్లు దూసుకెళ్లి రూ. 15,952 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 1,434 కోట్లు ఆర్జించింది. ఇందుకు భారీగా పెరిగిన పెట్టుబడుల విక్రయ లాభాలు దోహదం చేశాయి. ఈ కాలంలో మొత్తం ప్రీమియం ఆదాయం 27 శాతం పురోగమించి రూ. 1,32,632 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 1,04,914 కోట్లు మాత్రమే నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 18,72,044 కోట్ల నుంచి రూ. 22,29,489 కోట్లకు జంప్‌చేసింది. వ్యాపార వృద్ధిని ప్రతిఫలించే తొలి ఏడాది ప్రీమియం రూ. 8,198 కోట్ల నుంచి రూ. 9,125 కోట్లకు బలపడింది. రెన్యువల్ ప్రీమియం స్వల్ప వృద్ధితో రూ. 56,156 కోట్లకు చేరగా.. సింగిల్ ప్రీమియం 62 శాతం అధికమై రూ. 66,901 కోట్లను తాకింది.ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 627 వద్ద ముగిసింది. -
భారీగా తగ్గిన జీవీకే పవర్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.2,395 కోట్ల నుంచి రూ.154 కోట్లకు పడిపోయింది. వ్యయాలు రూ.182 కోట్ల నుంచి రూ.840 కోట్లకు పెరిగాయి. టర్నోవర్ రూ.94 కోట్ల నుంచి రూ.1,012 కోట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో జీవీకే పవర్ షేరు ధర శుక్రవారం 1.43% పెరిగి రూ.2.84 వద్ద స్థిరపడింది. -
దేశంలో పలు కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో కల్యాణ్ జ్యువెలర్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 106 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 69 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ. 3,476 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 2,889 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ కాలంలో దక్షిణాది మినహా ఇతర మార్కెట్లలో కొత్తగా ఐదు షోరూములను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. వెరసి సెప్టెంబర్‌కల్లా మధ్యప్రాచ్యంతో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 163కు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కల్యాణ్ జ్యువెలర్స్ షేరు ఎన్ఎస్ఈలో 4 శాతం పతనమై రూ. 103 వద్ద ముగిసింది. ఎన్‌హెచ్‌పీసీ లాభం ప్లస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగ పీఎస్‌యూ ఎన్‌హెచ్‌పీసీ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు 22 శాతం వృద్ధితో రూ. 1,686 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,387 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,166 కోట్ల నుంచి రూ. 3,529 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌హెచ్‌పీసీ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం క్షీణించి రూ. 43 వద్ద ముగిసింది. ఆయిల్ ఇండియాకు రికార్డు లాభాలు ప్రభుత్వరంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్ ఇండియా సెప్టెంబర్ క్వార్టర్‌కు రికార్డు స్థాయి లాభాలను ప్రకటించింది. రూ1,720 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆదాయం రూ.6,671 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.504 కోట్లు, ఆదాయం రూ.3,679 కోట్లుగా ఉండడం గమనార్హం ఓఎన్జీసీ తర్వాత ఆయిల్ ఇండియా దేశీయంగా రెండో అతిపెద్ద చమురు కంపెనీ కావడం గమనార్హం. ఒక్కో బ్యారెల్‌కు సెప్టెంబర్ క్వార్టర్లో రూ.100.59 డాలర్లు ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది బ్యారెల్‌కు 71 డాలర్లుగా ఉండడం గమనార్హం. ఆయిల్ ఉత్పత్తిలోనూ పెద్దగా మార్పులేదు. 0.79 మిలియన్ టన్నులుగా, గ్యాస్ ఉత్పత్తి 0.82 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. ఐషర్ మోటార్స్ లాభం హైజంప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 657 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 373 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,250 కోట్ల నుంచి రూ. 3,519 కోట్లకు ఎగసింది. ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 65 శాతం వృద్ధితో 2,03,451 యూనిట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు బీఎస్ఈలో 0.8 శాతం క్షీణించి రూ. 3,702 వద్ద ముగిసింది. లాభాల్లోకి సుజ్లాన్ ఎనర్జీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో పవన విద్యుత్ రంగ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ 2)లో రూ. 56.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 12.4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,362 కోట్ల నుంచి రూ. 1,443 కోట్లకు బలపడింది. సెప్టెంబర్‌కల్లా 759 మెగావాట్ల ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్ గిరీష్ తంతి పేర్కొన్నారు. 193 మెగావాట్ల కొత్త ఆర్డర్లను జత చేసుకున్నట్లు తెలియజేశారు. రైట్స్ నిధులతో రూ. 583 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ సీఎఫ్‌వో హిమాన్షు మోడీ తెలియజేశారు. వెరసి నికర రుణ భారం రూ. 2,722 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 8.30 వద్ద ముగిసింది. పెట్రోనెట్ డివిడెండ్ రూ. 7 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఇంధన రంగ కంపెనీ పెట్రో నెట్ ఎల్ఎన్జీ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం క్షీణించి రూ. 786 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 818 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 15,986 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 10,813 కోట్ల టర్నోవర్ మాత్రమే నమోదైంది. కంపెనీ బోర్డు వాటాదారు లకు షేరుకి రూ. 7 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండు ప్రకటించింది. ఈ కాలంలో కంపెనీ ప్రధాన టెర్మినల్ దహేజ్ 182 టీబీటీ యూనిట్ల ఎల్ఎన్జీని ప్రాసెస్ చేసింది. గత క్యూ2లో 225 టీబీటీయూ నమోదైంది. ఒడిషాలోని గోపాల్పూర్ పోర్టులో 4 మిలియన్ టన్నుల సామర్థ్యంతో తేలియాడే ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 2,306 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో పెట్రోనెట్ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం పుంజుకుని రూ. 212 వద్ద ముగిసింది. బాటా లాభంలో 47% వృద్ధి న్యూఢిల్లీ: బాటా ఇండియా కన్సాలిడేటెడ్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 47% పెరిగి రూ. 55 కోట్లుగా నమోదైంది. ఆదాయం 35% వృద్ధితో రూ.830 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.37 కోట్లు, ఆదాయం రూ.614 కోట్లుగా ఉన్నాయి. క్లిష్టమైన నిర్వహణ వాతావరణం, అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ అన్ని వ్యాపార చానల్స్‌లోనూ మెరుగైన పనితీరు చూపించినట్టు బాటా తెలిపింది. తగ్గిన అపోలో లాభం వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం తగ్గి రూ.213 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రూ.3,723 కోట్ల నుంచి రూ.4,274 కోట్లకు ఎగసింది. క్రితం ముగింపుతో పోలిస్తే అపోలో షేరు ధర బీఎస్ఈలో గురువారం 1.80 శాతం తగ్గి రూ.4,282.25 వద్ద స్థిరపడింది. తగ్గిన నాట్కో లాభం ఔషధ రంగ కంపెనీ నాట్కో ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.75 శాతం తగ్గి రూ.56.8 కోట్లు సాధించింది. టర్నోవర్ 9 శాతం ఎగసి రూ.452 కోట్లు నమోదు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రెండవ మధ్యంతర డివిడెండ్ కింద 75 పైసలు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఎన్ఎస్ఈలో నాట్కో షేరు ధర గురువారం 4.19 శాతం తగ్గి రూ.588.25 వద్ద స్థిరపడింది. ఐఆర్ఎఫ్సీ ఫర్వాలేదు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 14 శాతం పెరిగి రూ.1,714 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.24 శాతం పెరిగి రూ.5,810 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది కాలానికి లాభం రూ.1,501 కోట్లు, ఆదాయం రూ.4,690 కోట్ల చొప్పున ఉన్నాయి. నిర్వహణ ఆస్తులు రూ.4,39,070 కోట్లకు చేరాయి. ఒక్కో షేరుకు రూ.0.80 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. ముత్తూట్ ఫైనాన్స్ లాభం రూ.902 కోట్లు బంగారం, ఇతర రుణాలు అందించే ముత్తూట్ ఫైనాన్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.902 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.1,003 కోట్లతో పోలిస్తే 10 శాతం తగ్గింది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో లాభం రూ.825 కోట్లతో పోలిస్తే (సీక్వెన్షియల్‌గా ) 9 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఇక కంపెనీ ఆదాయం సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.2,842 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,065 కోట్లతో పోలిస్తే తగ్గింది. ముఖ్యంగా వడ్డీ ఆదాయం 8.2 శాతం తగ్గి రూ.2,758 కోట్లకు పరిమితం కావడం లాభాల క్షీణతకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 4,641 శాఖలు ఉన్నాయి. తన దగ్గర రుణగ్రహీతలు తనఖాగా ఉంచిన 177 టన్నుల బంగారం ఆభరణాల్లో 65 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే ఉన్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ తెలిపింది. వ్యక్తిగత రుణాలు, నగదు బదిలీ సేవలను కూడా ముత్తూట్ ఆఫర్ చేస్తుంటుంది. -
10 ఏళ్ల తర్వాత లాభాల్ని అర్జించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో దాదాపు దశాబ్దం తర్వాత డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ) లాభాలు ఆర్జించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 28.61 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. రూ.3.98 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 151.4 కోట్ల నుంచి రూ. 239.6 కోట్లకు ఎగసింది. స్టాండెలోన్ ఫలితాలివి. 2012లో తొలిసారి రూ.కోటి వరకూ లాభాల్ని సాధించాక.. మళ్లీ 2022లో ఏకంగా రూ.28.61 కోట్లు లాభాల్ని ఆర్జించినట్లు ఎండీ, సీఈవో ఎస్.దివాకర్ వెల్లడించారు. ఇటీవల ఇంధన ధరలు అధికమైనప్పటికీ.. మెరుగైన పనితీరుని ప్రదర్శించినట్లు దివాకర్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ.1000 కోట్ల టర్నోవర్ సాధించే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో డ్రెడ్జింగ్ కార్ప్ షేరు 0.6 శాతం నీరసించి రూ. 357 వద్ద ముగిసింది. -
గోద్రెజ్ కన్జూమర్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రెజ్ కన్జూమర్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 359 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 479 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,144 కోట్ల నుంచి 7 శాతం పుంజుకుని రూ. 3,364 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 14 శాతంపైగా పెరిగి రూ. 2,951 కోట్లను దాటాయి. దేశీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 1,985 కోట్లను తాకింది. ఇండోనేసియా నుంచి 8 శాతం అధికంగా రూ. 409 కోట్ల టర్నోవర్ సాధించింది. -
చరిత్రలో తొలిసారి ప్రభుత్వ చమురు కంపెనీలకు వేల కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఉమ్మడిగా రూ. 2,749 కోట్ల నికర నష్టాలు ప్రకటించాయి. అయితే తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఇవి మరింత అధికమై రూ. 21,201 కోట్లకు చేరాయి. ఇందుకు పెట్రోల్, డీజిల్ తదితర ప్రొడక్టులను తయారీ వ్యయాలకంటే తక్కువ ధరలో విక్రయించడం ప్రభావం చూపింది. అయితే క్యూ2లో ప్రభుత్వం ఎల్పీజీ విక్రయాలపై వీటికి ఉమ్మడిగా రూ. 22,000 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించింది. దీంతో క్యూ1(ఏప్రిల్–జూన్)తో పోలిస్తే క్యూ2లో చమురు పీఎస్‌యూల నష్టాలు పరిమితమయ్యాయి. వెరసి చమురు పీఎస్‌యూల చరిత్రలో తొలిసారి వరుసగా రెండు త్రైమాసికాలలో నికర నష్టాలు ప్రకటించిన రికార్డు నమోదైంది. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) మెరుగుపడినప్పటికీ 7 నెలలుగా ధరలను సవరించకపోవడంతో నష్టాలు వాటిల్లినట్లు ప్రభుత్వ దిగ్గజాలు పేర్కొన్నాయి. కాగా.. క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 10,197 కోట్ల నికర నష్టాన్ని హెచ్‌పీసీఎల్ ప్రకటించింది. ఈ బాటలో బీపీసీఎల్ రూ. 6,263 కోట్లు, ఐవోసీ రూ. 1,995 కోట్లు చొప్పున నష్టాలు నమోదు చేయడం గమనార్హం! ఎల్పీజీ సబ్సిడీ ఇలా ప్రభుత్వం ప్రకటించిన ఎల్పీజీ విక్రయాల సబ్సిడీని చమురు పీఎస్‌యూలు క్యూ2 ఫలితాలలో పరిగణనలోకి తీసుకున్నాయి. ఐవోసీ అత్యధికంగా రూ. 10,800 కోట్లు అందుకోగా.. హెచ్‌పీసీఎల్‌కు రూ. 5,617 కోట్లు, బీపీసీఎల్‌కు రూ. 5,582 కోట్లు చొప్పున లభించాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టేందుకు వీలుగా పెట్రోల్, డీజిల్ ధరల సవరణను చేపట్టలేదని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. దీంతో ఇంధన రంగ పీఎస్‌యూలకు సబ్సిడీ చెల్లింపుల ద్వారా ఆర్థిక శాఖ నుంచి మద్దతును కోరినట్లు తెలియజేశారు. -
పేటీఎంకు భారీ షాక్
బెంగళూరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో డిజిటల్ చెల్లింపుల దేశీ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నష్టాలు పెరిగి రూ. 594 కోట్లను తాకాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 481 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 76 శాతం జంప్‌చేసి రూ. 1,914 కోట్లను తాకింది. గత క్యూ2లో కేవలం రూ. 1,086 కోట్ల టర్నోవర్ సాధించింది. ఆదాయంలో 18% వాటాను ఆక్రమిస్తున్న ఫైనాన్షియల్ సర్వీసులు, ఇతర బిజినెస్‌ల నుంచి 293 శాతం అధికంగా రూ. 349 కోట్లు సమకూరినట్లు కంపెనీ తెలియజేసింది. రుణదాత భాగస్వాముల ద్వారా మొత్తం రూ. 7,313 కోట్ల రుణాలందించినట్లు వెల్లడించింది. ఇది 482 శాతం వృద్ధిగా తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో పేటీఎమ్ షేరు స్వల్పంగా లాభపడి రూ. 652 వద్ద ముగిసింది. -
లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం 59 శాతం జంప్‌చేసి రూ. 3,313 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం రూ. 20,271 కోట్ల నుంచి రూ. 23,080 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం మరింత అధికంగా 34 శాతం ఎగసి రూ. 10,714 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.48 శాతం మెరుగై 3.33 శాతాన్ని తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8.11 శాతం నుంచి 5.31 శాతానికి, నికర ఎన్పీఏలు 2.83 శాతం నుంచి 1.16 శాతానికి దిగివచ్చాయి. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,754 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 1,628 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 15.25 శాతంగా నమోదైంది. ఐవోబీ లాభం జూమ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 33 శాతం జంప్‌చేసి రూ. 501 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 376 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 5,028 కోట్ల నుంచి రూ. 5,852 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 10.66 శాతం నుంచి 8.53 శాతానికి, నికర ఎన్పీఏలు 2.77 శాతం నుంచి 2.56 శాతానికి దిగివచ్చాయి. వడ్డీ ఆదాయం రూ. 4,255 కోట్ల నుంచి రూ. 4,718 కోట్లకు బలపడింది. -
రికార్డులు కొల్లగొడుతున్న ఎస్బీఐ.. బ్యాంక్ చరిత్రలో అత్యధికం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో సరికొత్త రికార్డును సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 14,572 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది బ్యాంక్ చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ క్యూ2లో దేశీ కార్పొరేట్ చరిత్రలో రికార్డ్ లాభం ఆర్జించిన సంస్థగా నిలిచింది. తద్వారా ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(రూ. 13,656 కోట్లు)ను అధిగమించింది. అంతేకాకుండా మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ(ప్రస్తుత క్యూ2 లాభం రూ. 11,125 కోట్లు)ని సైతం వెనక్కి నెట్టింది. కాగా.. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 8,890 కోట్లతో పోలిస్తే ఎస్బీఐ లాభం 74 శాతం జంప్‌చేసింది. ఇందుకు రుణ విడుదల, వడ్డీ ఆదాయంలో వృద్ధితోపాటు ప్రొవిజన్లు తగ్గడం సహకరించింది. ఇక ఈ కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 1,01,143 కోట్ల నుంచి రూ. 1,14,782 కోట్లకు ఎగసింది. స్టాండెలోన్ ఇలా : ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్బీఐ స్టాండెలోన్ నికర లాభం 74 శాతం జంప్‌చేసి రూ. 13,265 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 7,627 కోట్లు ఆర్జించింది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 77,689 కోట్ల నుంచి రూ. 88,734 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 35,183 కోట్లకు చేరింది. ఈ కాలంలో దేశీ నికర వడ్డీ మార్జిన్లు స్వల్పంగా బలపడి 3.55 శాతాన్ని తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.9 శాతం నుంచి 3.52 శాతానికి, నికర ఎన్పీఏలు 1.52 శాతం నుంచి 0.80 శాతానికి దిగివచ్చాయి. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,699 కోట్ల నుంచి తగ్గి రూ. 2,011 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 13.51 శాతంగా నమోదైంది. -
పెరిగిన ఇండిగో నష్టాలు
న్యూఢిల్లీ: అధిక వ్యయాల భారం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ విమానయాన దిగ్గజం ఇండిగో (ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్) నష్టాలు మరింత పెరిగాయి. రూ. 1,583 కోట్లకు చేరాయి. గత క్యూ2లో నష్టాలు రూ. 1,436 కోట్లు. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 5,799 కోట్ల నుంచి రూ. 12,852 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంలో మొత్తం వ్యయాలు రూ. 14,436 కోట్లకు పెరిగాయి. వరుసగా రెండో త్రైమాసికంలో కోవిడ్ పూర్వ స్థాయికి మించి కార్యకలాపాలు నమోదు చేసినట్లు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ‘సీజనల్‌గా రెండో త్రైమాసికంలో కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయి కానీ, డిమాండ్ బాగుండటంతో మెరుగైన పనితీరు సాధించగలిగాం. అయితే, ఇంధన ధరలు, కరెన్సీ మారకం రేట్లు మా ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపాయి‘ అని ఆయన వివరించారు. దేశ, విదేశ మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ రికవరీ బాటలో స్థిరంగా ముందుకు వెడుతున్నామని ఎల్బర్స్ పేర్కొన్నారు. -
రేమండ్ లాభంలో రెండు రెట్ల వృద్ధి
న్యూఢిల్లీ: రేమండ్ లిమిటెడ్ అంచనాలను మించి బలమైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో రెండు రెట్లు పెరిగి రూ.162 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 40 శాతం పెరిగి రూ.2,168 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.56 కోట్లు కాగా, ఆదాయం రూ1,551 కోట్లుగా నమోదైంది. మార్కెట్లో ఆశావహ వాతావరణం, వినియోగ డిమాండ్ మెరుగుపడడంతో వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ మంచి పనితీరు చూపించినట్టు రేమండ్ తెలిపింది. టెక్స్టైల్స్, రియల్టీ, కన్జ్యూమర్ కేర్ తదితర విభాగాల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బీటూసీ వ్యాపారం మంచి వృద్ధిని చూపించగా, వస్త్రాల ఎగుమతులు సైతం బలంగా నమోదయ్యాయి. యూఎస్, యూరప్ మార్కెట్ల నుంచి ఆర్డర్ల రాక సానుకూలంగా ఉంది. రియల్టీలోనూ మంచి వృద్ధిని కొనసాగించినట్టు రేమండ్ తెలిపింది. సంస్థ నికర రుణ భారం రూ.1,286 కోట్లకు తగ్గింది. టెక్స్టైల్స్ విభాగం ఆదాయం రూ.911 కోట్లు, షర్టింగ్ విభాగం నుంచి రూ.210 కోట్లు, అప్పారెల్ నుంచి రూ.370 కోట్లు, టూల్స్ రూ.132 కోట్లు, హార్డ్‌వేర్ నుంచి రూ.132 కోట్లు, రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ డెవలప్మెంట్ నుంచి రూ.247 కోట్ల చొప్పున ఆదాయం వచ్చింది. -
ఎన్టీపీసీ లాభం క్షీణత, క్యూ2లో రూ. 3,418 కోట్లకు పరిమితం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 3,418 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 3,691 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 33,096 కోట్ల నుంచి రూ. 44,681 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 28,950 కోట్ల నుంచి రూ. 40,001 కోట్లకు పెరిగాయి. దిగుమతి చేసుకున్న బొగ్గు సరఫరా 0.42 ఎంఎంటీ నుంచి 5.58 ఎంఎంటీకి జంప్ చేసింది. దేశీయంగా బొగ్గు సరఫరా 44.83 ఎంఎంటీ నుంచి 48.72 ఎంఎంటీకి పుంజుకుంది. సొంత వినియోగ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 2.79 ఎంఎంటీ నుంచి 4.32 ఎంఎంటీకి పెరిగింది. సెప్టెంబర్ చివరికల్లా విద్యుదుత్పత్తి సామర్థ్యం భాగస్వామ్యం, అనుబంధ సంస్థలతో కలిపి 70,254 మెగావాట్లకు చేరింది. స్థూల విద్యుదుత్పత్తి 77.42 బిలియన్ యూనిట్ల నుంచి 85.48 బీయూకి మెరుగుపడింది. -
నష్టాల్లోనే ఐవోసీ క్యూ2లో రూ. 272 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నిరుత్సాహకర ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లోనూ లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 272 కోట్లకుపైగా నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 6,360 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఉత్పత్తి వ్యయాలకంటే తక్కువ ధరల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. ఏప్రిల్–జూన్(క్యూ1)లోనూ కంపెనీ దాదాపు రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. వెరసి వరుసగా రెండో క్వార్టర్లలో నష్టాలు నమోదు చేసిన రికార్డు సొంతం చేసుకుంది. కాగా.. ప్రస్తుత క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం రూ. 1.69 లక్షల కోట్ల నుంచి రూ. 2.28 లక్షల కోట్లకు ఎగసింది. కాగా.. ప్రభుత్వం ఈ నెల 12న వన్‌టైమ్ గ్రాంట్‌కింద మూడు పీఎస్‌యూ ఇంధన దిగ్గజాలకు ఉమ్మడిగా రూ. 22,000 కోట్లు కేటాయించింది. వీటిలో ఐవోసీకి రూ. 10,081 కోట్లు లభించాయి. ఈ సబ్సిడీని తాజా త్రైమాసికంలో పరిగణించినప్పటికీ నష్టాలు ప్రకటించడం గమనార్హం! మార్జిన్లు అప్ క్యూ2లో బ్యారల్‌కు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 6.57 డాలర్ల నుంచి 25.49 డాలర్లకు ఎగశాయి. ఇన్వెంటరీ ప్రభావాన్ని మినహాయిస్తే 22.19 డాలర్లుగా నమోదయ్యాయి.పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాలు 18.93 మిలియన్ టన్నుల నుంచి 21.56 ఎంటీకి పుంజుకున్నాయి. అయితే ఎగుమతులు 1.24 ఎంటీ నుంచి 0.86 ఎంటీకి తగ్గాయి. ఈ కాలంలో 16.09 ఎంటీ ముడిచమురును శుద్ధి చేసింది. గత క్యూ2లో ఇవి 15.27 ఎంటీ మాత్రమే. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం జూమ్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఏడాది(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 31 శాతం ఎగసి రూ. 8,007 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 37 శాతం జంప్‌చేసి రూ. 7,558 కోట్లకు చేరింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 5,511 కోట్లు మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 26% వృద్ధితో రూ. 14,707 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్లు 0.3% బలపడి 4.31%కి చేరాయి. ఇతర ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీయేతర ఆదాయం(ట్రెజరీమినహా) 17 శాతం పుంజుకుని రూ. 5,139 కోట్లను తాకింది. ట్రెజరీ ఆదాయం గత క్యూ2లో రూ. 397 కోట్లుకాగా.. ప్రస్తుతం రూ. 85 కోట్ల నష్టంగా నమోదైంది. ప్రొవిజన్లు రూ. 2,713 కోట్ల నుంచి రూ. 1,643 కోట్లకు వెనకడుగు వేశాయి. స్థూల మొండిబకాయిలు 4.82 శాతం నుంచి 3.19 శాతానికి తగ్గాయి. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో నమోదైన 3.41 శాతంతో పోల్చినా మెరుగుపడ్డాయి. తాజా స్లిప్పేజీలు రూ. 4,300 కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఎండీ, సీఈవో సందీప్ బక్షి పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ బోర్డు ఏకగ్రీవంగా అనుమతించినట్లు బ్యాంక్ తాజాగా పేర్కొంది. అనుబంధ సంస్థలు ఇలా బ్యాంక్ అనుబంధ సంస్థలలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాభం రూ.445 కోట్ల నుంచి రూ.199 కోట్లకు క్షీణించింది. ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ లాభం 32% ఎగసి రూ.591 కోట్లను తాకింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ లాభం 6 శాతం పుంజుకుని రూ.406 కోట్లయ్యింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం రూ. 51 కోట్లు తగ్గి రూ.300 కోట్లకు పరిమితమైంది. చదవండి: ముదురుతున్న మూన్‌లైటింగ్.. తెరపైకి మరో కంపెనీ, అసలేం జరుగుతోంది! -
ఇన్ఫోసిస్ క్యూ2 ఫలితాలు: రూ.9,300 విలువైన షేర్లు బైబ్యాక్
భారత్‌లో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ముగిసిన త్రైమాసికానికి రూ.6,021 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే రెండో త్రైమాసికంలో నికర లాభంలో 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత సెప్టంబర్లో ఇదే కాలానికి రూ.5,241 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గతేడాది పోలిస్తే ఇన్ఫోసిస్ ఆదాయం 23.4 శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ.29,602 కోట్ల ఆదాయాన్ని గడించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా రూ. 36,538 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. Q2 FY22లో ఆర్జించిన ఆదాయం ప్రకారం 23.4 శాతం వృద్ధిని సాధించింది. గత త్రైమాసికంతో పోలిస్తే నికర లాభాలు 12.3 శాతం పెరగగా, క్రమానుగతంగా ఆదాయం 6 శాతం పెరిగింది. రూ.9,300 కోట్ల విలువైన షేర్లను వాటాదారుల నుంచి కొనుగోలుచేయాలని ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయించింది. అందుకు గరిష్ట బైబ్యాక్ ధరను రూ. 1,850గా కంపెనీ నిర్ణయించింది. చదవండి: ఏముంది భయ్యా ఆ జీన్స్ ప్యాంట్లో.. 60 లక్షలు పెట్టి మరీ కొన్నావ్! -
ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ రాజీనామా
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ రాజీనామా చేశారు. అయితే, ఇందుకు గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్ఫోసిస్ గ్లోబల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ విభాగానికి ఆయన సారథ్యం వహించారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో న్యూక్లియర్ సైంటిస్టుగా కెరియర్ ప్రారంభించిన రవి కుమార్ 2002లో ఇన్ఫీలో చేరారు. 2016లో ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2017లో డిప్యుటీ సీవోవోగా నియమితులైన రవి .. ఆ తర్వాత సీవోవోగా పదోన్నతి పొందుతారనే అంచనాలు ఉండేవి. అయితే, అప్పటి సీవోవో యూబీ ప్రవీణ్ రావు రిటైర్మెంట్ తర్వాత ఇన్ఫీ ఆ పోస్టునే తీసివేసింది. -
దేశీయ టెక్ దిగ్గజ కంపెనీల క్యూ2 ఫలితాలు..ఎలా ఉండబోతున్నాయి?
న్యూఢిల్లీ: దేశీ ఐటీ సేవల కంపెనీలు త్రైమాసికవారీగా చూస్తే స్థిర వృద్ధిని నమోదు చేయవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది(2022–23) రెండో త్రైమాసిక ఫలితాలు టీసీఎస్‌తో ప్రారంభంకానున్నాయి. 10న జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాలు విడుదల చేయనుంది. తదుపరి విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ సైతం క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్య ఆందోళనల నేపథ్యంలోనూ ఆదాయ వృద్ధిలో నిలకడకు అవకాశమున్నట్లు నిపుణులు అంచనా వేశారు. అయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు తదితర రిస్కుల కారణంగా భవిష్యత్ ఆర్జనలపట్ల యాజమాన్య అంచనాల(గైడెన్స్)కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు. డీల్ పైప్‌లైన్, డిమాండ్ ఔట్లుక్ తదితరాలపై అత్యున్నత అధికారుల అభిప్రాయాలు కీలకంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. రానున్న త్రైమాసికాలలో పలు దిగ్గజాల పనితీరుపై యూఎస్, యూరప్‌లో కనిపిస్తున్న ఆర్థిక సవాళ్లు, ఆర్థిక మాంద్య భయాలు ప్రతికూల ప్రభావం చూపవచ్చునని అభిప్రాయపడ్డారు. మరోవైపు యూఎస్‌లో టెక్నాలజీసహా పలు రంగాల కంపెనీలు ఈ ఏడాది(2022) వేలాది ఉద్యోగులను తొలగించడం ప్రస్తావించదగ్గ అంశమని వివరించారు. అయితే మరికొంతమంది నిపుణులు మందగమన ప్రభావం దేశీ సాఫ్ట్వేర్ సేవలకు డిమాండును పెంచవచ్చని భావిస్తున్నారు. వ్యయ నియంత్రణల్లో భాగంగా ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులకు వీలున్నదని అంచనా వేస్తున్నారు. స్వీట్స్పాట్ : సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ దేశీ ఐటీ రంగాన్ని స్వీట్స్పాట్తో పోల్చారు. గత త్రైమాసికంతో పోలిస్తే డిమాండు స్వల్పంగా క్షీణించినప్పటికీ ప్రపంచ అనిశ్చితులు ఇందుకు కారణమని పేర్కొన్నారు. అయితే అంతర్గతంగా పరిశ్రమ అత్యంత పటిష్టంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. యూఎస్ కంపెనీలు వ్యయ నియంత్రణగా ఉద్యోగ కోతలు అమలు చేస్తున్నప్పటికీ, ఇదే మరింత ఔట్‌సోర్సింగ్‌కు వీలు కల్పిస్తుందని అంచనా వేశారు. -
'మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా'..ఉద్యోగులకు సుందర్ పిచాయ్ వార్నింగ్!
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగుల పనితీరు విషయంలో అసంతృప్తిగా ఉన్నారా? పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నా..వారిలో కొంత మంది మాత్రమే పనిచేస్తున్నారని హెచ్చరించారా? టెక్ దిగ్గజం గూగుల్ జులై 26న క్యూ2 వార్షిక ఫలితాల్ని వెల్లడించింది. ఆ ఫలితాల్లో గూగుల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదాయాలు, రాబడుల పరంగా 'అంచనాల కంటే బలహీనంగా ఉంది' గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికంలో గూగుల్ 13 శాతం తక్కువ వృద్ధిని నమోదు చేసింది.ఈ ఫలితాలపై పిచాయ్ ఇంటర్నల్ మీటింగ్ నిర్వహించారు. మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా గూగుల్ ఎక్జిక్యూటివ్లతో నిర్వహించిన మీటింగ్‌లో ఉద్యోగులు ప్రొడక్ట్‌లను మెరుగు పరుస్తూ కస్టమర్లకు సహాయ పడడం,ఉద్యోగులు వర్క్ ప్రొడక్టివిటీ పెంచేలా దృష్టి సారించాలని సుందర్ పిచాయ్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగుల సంఖ్యను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన..వారిలో ప్రొడక్టివిటీ తగ్గిందనే అసంతృప్తిలో ఉన్నారు. సంస్థలో (గూగుల్‌లో) ఎక్కువ మంది ఉద్యోగులున్నారు. కానీ వాళ్లు సమర్ధవంతంగా పనిచేయడం లేదని, పనిపై దృష్టి కేంద్రీకరించడం లేదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. సుందర్ పిచాయ్ హింట్ ఇచ్చారా ఇటీవల మరో నివేదిక ప్రకారం.. గూగుల్ ఖర్చును తగ్గించేందుకు ఉద్యోగుల అవసరంపై సమీక్షలు జరిపి..రాబోయే 3నెలల్లో స్కిల్స్ ఉన్న ఉద్యోగుల్ని నియమించడంతో పాటు, సామర్థ్యం, ఉత్పాదకత, నైపుణ్యం లేని తొలగించాలని భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ..కొత్తగా ఉద్యోగుల్ని నియమించుకోవడం లేదని గూగుల్ ఇచ్చిన స్టేట్మెంట్ను ఉదహరిస్తున్నాయి. కాగా,ఆర్ధిక మాంద్యం భయంతో అనేక పెద్ద టెక్ కంపెనీలు వందలాది మంది ఉద్యోగులను తొలగించాయి. నియామకాన్ని నిలిపి వేశాయి. ఇప్పుడు అదే బాటులో గూగుల్ పయనిస్తుందంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా! కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు! -
ఇండస్ ఇండ్ ఫలితాలు ఆకర్షణీయం!
న్యూఢిల్లీ: ఇండస్ఇండ్ బ్యాంకు జూన్ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించింది. నికర లాభం 61 శాతం పెరిగి రూ.1,631 కోట్లుగా నమోదైంది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టాయి. బ్యాంకు ఆదాయం సైతం రూ.10,113 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,016 కోట్లు, ఆదాయం రూ.9,298 కోట్లుగా ఉన్నాయి. వడ్డీ ఆదాయం 9.5 శాతం పెరిగి రూ.8,182 కోట్లకు చేరింది. స్థూల నినర్థక ఆస్తులు (ఎన్పీఏలు) మొత్తం రుణాల్లో 2.35 శాతంగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది జూన్ త్రైమాసికం చివరి నాటికి ఉన్న 2.88 శాతంతో చూస్తే కొంచెం తగ్గాయి. నికర ఎన్పీఏలు 0.84 శాతం (రూ.1,760 కోట్లు) నుంచి 0.67 శాతానికి (రూ.1,661 కోట్లు) క్షీణించాయి. మార్చి త్రైమాసికం చివరికి ఉన్న నికర ఎన్పీఏలు 0.64 శాతం (రూ.1,530 కోట్లు)తో పోల్చి చూస్తే స్వల్పంగా పెరిగాయి. ప్రొవిజన్లు, కంటెంజెన్సీలకు చేసిన కేటాయింపులు తగ్గినట్టు ఇండస్ఇండ్ బ్యాంకు ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో రూ.1,251 కోట్లను కేటాయించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,779 కోట్లను కేటాయించడం గమనించాలి. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో కేటాయింపులు రూ.1,461 కోట్లుగా బీఎస్ఈలో బ్యాంకు షేరు ఒక శాతం లాభంతో రూ.879 వద్ద క్లోజయింది. -
పాపం నెట్‌ఫ్లిక్స్..లక్షల మంది సబ్ స్క్రయిబర్స్ గుడ్‌బై
నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో తన ఉనికిని కోల్పోతుందా? అనాలోచితమైన నిర్ణయాల కారణంగా లక్షల సంఖ్యలో సబ్ స్క్రైబర్లు ప్రత్యామ్నాయ ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారా? నెట్ ఫ్లిక్స్ చరిత్రలోనే తొలిసారి భారీ ఎత్తున యూజర్లు తగ్గిపోయారా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా ఆ సంస్థ విడుదల చేసిన క్యూ2 ఫలితాలు. నెట్‌ఫ్లిక్స్ వరుసగా రెండు త్రైమాసికాల ఫలితాలు నిరాశ పరుస్తున్నాయి. కంపెనీ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా క్యూ2లో సుమారు 10లక్షల మంది (970,000) మంది కోల్పోయారు. క్యూ1లో 20లక్షల మంది సబ్ స్క్రైబర్లను చేజార్చుకోవగా..క్యూ2 లో 9,70,000మంది సబ్ స్క్రైబర్లు ప్రత్యామ్నాయ ఓటీటీలను వీక్షించేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ కు సుమారు 220.67మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 వ్యాల్యూమ్ 1,2, బెటర్ కాల్ సియో, పీకీ బ్లైండర్స్ వంటి పాపులర్ షోస్‌తో క్యూ3 ఫలితాల సమయానికి ఆ సంఖ్య మరో మిలియన్‌కు పెరుగుతుందని నెట్‌ఫ్లిక్స్ భావిస్తుంది. కారణం అదేనా నెట్‌ఫ్లిక్స్ తన త్రైమాసిక నివేదికలో, "ఏప్రిల్ ఫలితాల్లో అమెరికన్ డాలర్లతో పోటీ పడుతూ ఇతర దేశాలకు చెందిన కరెన్సీ విలువలు పెరగడం కారణంగా మాకొచ్చే ఆదాయాల్లో వ్యత్యాసం కనిపిస్తుందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. అయితే సబ్స్క్రైబర్ల సంఖ్యను కోల్పోవడంపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించలేదు. కానీ నెట్‌ఫ్లిక్స్ 'యాడ్ ఎక్స్ట్రా మెంబర్',ఫ్రీ పాస్వర్డ్ షేరింగ్ పేరుతో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులో తీసుకొస్తుంది. ఆ ఫీచర్ల సాయంతో యూజర్ల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాలపై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లను వినియోగిస్తున్నారంటూ వెలుగులోకి వచ్చిన పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
టైటాన్ డబుల్ ధమాకా..!
Titan Q2 Results: టైటాన్ కంపెనీ ఈ ఏడాది క్యూ2 ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నికర లాభాల్లో డబుల్ ధమాకా కొట్టేసింది. క్యూ2లో 270శాతం వృద్ధితో సుమారు రూ. 641 కోట్ల ఏకీకృత నికర లాభాలను సొంతం చేసుకుంది. గత ఏడాది క్యూ2లో టైటాన్ సుమారు రూ.173 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో టైటాన్ జ్వువెలరీ కంపెనీ విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో టైటాన్ జ్వువెలరీ విభాగంలో క్యూ2లో రూ. 4,127 కోట్ల నుంచి 75 శాతం పెరిగి రూ.7,243 కోట్లకు చేరుకుంది. ఆదాయం సుమారు 78 శాతం మేర పెరిగింది. టైటాన్ జ్వువెలరీ విభాగంలో గత ఏడాదిలో క్యూ2లో రూ. 3446 కోట్లను నివేదించగా, ఈ ఏడాదిగాను 77శాతం వృద్ధితో రూ. 6,106 కోట్ల ఆదాయాన్ని గడించింది. టైటాన్ గడియారాలు, వెయిరబుల్స్ మార్కెట్లో క్యూ2లో 72 శాతం వృద్ధితో 687 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మరోవైపు కళ్లజోడు వ్యాపారంలో కూడా భారీ గ్రోత్నే సాధించింది. ఈ ఏడాది క్యూ2లో 70 శాతం వృద్ధితో రూ. 160 కోట్లను ఆదాయాన్ని గడించింది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సికె వెంకటరామన్ మాట్లాడుతూ...ఈ త్రైమాసికంలో టైటాన్ బలమైన వృద్ధి నమోదుచేసింది. డిమాండ్ ఉండడటంతో అన్ని విభాగాల్లో బలంగా పుంజుకుందని పేర్కొన్నారు. చదవండి: సౌండ్‌కోర్ నుంచి సరికొత్త వాటర్‌ప్రూఫ్ స్పీకర్.! ధర ఎంతంటే..! -
సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న ఐసీఐసీఐ బ్యాంక్..!
ప్రముఖ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ 2021-2022 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సరికొత్త రికార్డును నమోదుచేసింది. క్యూ2 ఫలితాల్లో ఐసీఐసీఐ అంచనాలకు మించి ఫలితాలను రాబట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 30 శాతం పైగా నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. ఐసీఐసీఐ క్యూ2లో రూ. 5511 కోట్ల లాభాలను గడించింది. చదవండి: అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..! గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే.. నెట్ ప్రాఫిట్ భారీగా మెరుగుపడింది. గత ఏడాది క్యూ2లో రూ. 4,251 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను ఐసీఐసీఐ సాధించింది. క్యూ2 లో సుమారు రూ. 5,441 కోట్ల నెట్ ప్రాఫిట్ వస్తోందని ఐసీఐసీఐ భావించగా..గడిచిన త్రైమాసికంలో అంచనాలకు మించి లాభాలను సాధించింది. అంతేకాకుండా ఐసీఐసీఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 25 శాతం మేర పెరిగి, రూ. 11,690 కోట్ల రూపాయలకు చేరుకుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ రేట్ 4 శాతానికి చేరగా.. గత ఏడాది రెండో త్రైమాసికంలో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.89గా నమోదైంది. తగ్గిన నిరార్థక ఆస్తుల విలువ..! నిరార్థక ఆస్తుల(నాన్ పెర్మార్మింగ్ అసెట్స్-ఎన్పీఏ) విలువ 12 శాతం మేర, రూ. 8,161 కోట్లకు తగ్గింది. 2014 తరువాత ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్పీఏ ఆస్తులు తగ్గడం ఇదే తొలిసారి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎన్పీఏ ఆస్తుల విలువ రూ. 9,306 కోట్లుగా ఉండగా.. రెండో త్రైమాసికంలో ఎన్పీఏ ఆస్తులు విలువ రూ. 8,161 కోట్లకు చేరింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన టెస్లా..! -
అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మోటర్స్ (2021-22) ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొట్టింది. క్యూ2లో సుమారు రూ. 5,619 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ.4605 కోట్లను సొంతం చేసుకోగా... గత ఏడాదితో పోలిస్తే కంపెనీ రెండో త్రైమాసికంలో 22 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. క్యూ2లో రూ.277.60 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది రూ. 196.3 కోట్ల నికర లాభాలను సాధించింది. చదవండి: వ్యాక్సిన్ వేసుకోకుంటే జీతం కట్! ఆ కంపెనీ సంచలన నిర్ణయం ముడి సరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా నెలకొన్న కంటైనర్లు, సెమీకండక్టర్ల కొరత ఉన్నప్పటికీ టీవీఎస్ మోటార్స్ గణనీయంగా లాభాలను పొందింది. పన్ను ముందు లాభాలు సుమారు 41 శాతం పెరిగి రూ. 377 కోట్లకు చేరుకుంది, అదే సంవత్సరం క్రితం ఇదే త్రైమాసికంలో ₹ 267 కోట్లును టీవీఎస్ మోటార్స్ ఆర్జించింది. జూలై నుంచి సెప్టెంబర్ 2021 కాలంలో..సుమారు 8.70 లక్షల ద్విచక్ర వాహనాల అమ్మకాలను టీవీఎస్ జరిపింది. బజాజ్ ఆటో తర్వాత భారత నుంచి ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసే రెండో అతిపెద్ద కంపెనీగా టీవీఎస్ మోటార్స్ నిలుస్తోంది. చదవండి: ఫ్యూచర్ వీటిదేనా? లాభాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారేనా? -
డీమార్ట్ జోరు..! లాభాల్లో హోరు...!
దేశంలోని అతిపెద్ద రిటైల్ చైన్లలో ఒకటైన డీమార్ట్ 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొట్టింది. క్యూ2లో డీమార్ట్ రూ. 7,650 కోట్ల ఆదాయాన్ని గడించింది . గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 46 శాతం అధిక లాభాలను ఆర్జించింది. గత ఏడాది క్యూ2లో రూ. 5,218 కోట్ల డీమార్ట్ సొంతం చేసుకుంది. డీమార్ట్ క్యూ 2 నికరలాభాల్లో కూడా అదే జోరును ప్రదర్శించింది. డీమార్ట్ సుమారు 113.2 శాతం మేర స్వతంత్ర నికర లాభాలను పొందింది. క్యూ 2లో సుమారు 448.90 కోట్లను ఆర్జించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో సుమారు 210.20 కోట్ల లాభాలను గడించింది. చదవండి: ఈ కంపెనీలు 60సెకన్లకు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా? FY22 ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగంలో డీమార్ట్ మొత్తం ఆదాయం రూ. 12,681 కోట్లుగా నమోదైంది. గత ఏడాది 9,051 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కరోనావైరస్ ప్రభావం బాగా కన్పించింది. సెకండ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను విధించాయి. ఏదేమైనా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు క్రమంగా లాక్డౌన్లను ఎత్తివేయడం, టీకా వేగాన్ని పెంచడంతో, రిటైల్ మార్కెట్లు వృద్ధిలో సానుకూల వేగాన్ని చూస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 2021 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం డీమార్ట్ స్టోర్స్ సంఖ్య 246కు పెరిగాయి. చదవండి: మహీంద్రా థార్‌కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...! -
కేపీఆర్ మిల్- క్యాస్ట్రాల్ ఇండియా అదుర్స్
స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 204 పాయింట్లు క్షీణించి 40,318కు చేరగా.. నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 11,843 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో టెక్స్టైల్స్ రంగ కంపెనీ కేపీఆర్ మిల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఈ ఏడాది(2020) క్యూ3(జులై- సెప్టెంబర్)లో లూబ్రికెంట్స్ దిగ్గజం క్యాస్ట్రాల్ ఇండియా మెరుగైన పనితీరును చూపడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. కేపీఆర్ మిల్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కేపీఆర్ మిల్ రూ. 113 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 88 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 74 శాతం జంప్‌చేసి రూ. 906 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 1 శాతం బలపడి 22.21 శాతానికి చేరాయి. యూఎస్, తదితర మార్కెట్ల నుంచి టెక్స్‌టైల్స్‌కు మంచి డిమాండ్ కనిపిస్తున్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. దీంతో రూ. 250 కోట్ల పెట్టుబడితో 4.2 కోట్ల దుస్తుల వార్షిక సామర్థ్యం కలిగతిన యూనిట్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేపీఆర్ మిల్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 15 శాతం దూసుకెళ్లింది. రూ. 784ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 8 శాతం ఎగసి రూ. 730 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 75 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! క్యాస్ట్రాల్ ఇండియా ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో క్యాస్ట్రాల్ ఇండియా నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 205 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 4 శాతం పెరిగి రూ. 883 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 18 శాతం వృద్ధితో రూ. 288 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 3.9 శాతం బలపడి 28.77 శాతానికి ఎగశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) తొలి 9 నెలల్లో రూ. 624 కోట్ల నికర నగదును ఆర్జించినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో క్యాస్ట్రాల్ ఇండియా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 9.5 శాతం దూసుకెళ్లి రూ. 119 వద్ద ట్రేడవుతోంది. -
ఎల్అండ్టీ నుంచి భారీ డివిడెండ్?
ముంబై: మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించనుంది. బుధవారం(28న) సమావేశంకానున్న కంపెనీ బోర్డు ఈ అంశంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. 28న నిర్వహించనున్న సమావేశంలో బోర్డు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక(జులై- సెప్టెంబర్) ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. బుధవారం బోర్డు ప్రకటించనున్న ప్రత్యేక డివిడెండ్‌కు నవంబర్ 5 రికార్డ్ డేట్‌గా నిర్ణయించినట్లు తాజాగా తెలియజేసింది. ఇంతక్రితం 2008 మార్చిలో ఎల్అండ్టీ ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించింది. ఎలక్ట్రికల్, ఆటోమేషన్ బిజినెస్‌ను ష్నీడర్ ఎలక్ట్రిక్‌కు ఆగస్ట్‌లో విక్రయించింది. ఈ విక్రయం పూర్తికావడంతో ప్రత్యేక డివిడెండ్ యోచన చేపట్టి ఉండవచ్చని ఈ సందర్భంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
జెట్ ఎయిర్వేస్- ఇండో కౌంట్.. గెలాప్
రుణాలు, నష్టాల ఊబిలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ టేకోవర్‌కు కల్రాక్ క్యాపిటల్- మురారీ లాల్ జలన్ ప్రతిపాదించిన రిజల్యూషన్‌కు రుణదాతల కన్సార్షియం ఆమోదముద్ర వేయడంతో జెట్ ఎయిర్వేస్ కౌంటర్ కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతోంది. కాగా.. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇటీవల జోరందుకున్న టెక్స్టైల్స్ కంపెనీ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ షేరుకి డిమాండ్ కొనసాగుతోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. జెట్ ఎయిర్వేస్ కంపెనీ పునరుద్ధరణకు కల్రాక్ క్యాపిటల్- మురారీ లాల్ జలాన్ కన్సార్షియం ప్రతిపాదించిన రిజల్యూషన్‌కు రుణదాతల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రయివేట్ రంగ కంపెనీ జెట్ ఎయిర్వేస్ కౌంటర్ ఇటీవల నిరవధికంగా బలపడుతోంది. తాజాగా ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 51.20 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. వరుసగా 12వ సెషన్లోనూ ఈ షేరు అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. వెరసి వారం రోజుల్లోనే ఈ షేరు 27 శాతం ర్యాలీ చేసింది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్న జెట్ ఎయిర్వేస్ షేరు గత 20 రోజుల్లో 108 శాతం దూసుకెళ్లడం గమనార్హం! ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్స్ రంగ కంపెనీ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ వరుసగా నాలుగో రోజు అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు రూ. 7.8 ఎగసి రూ. 163.60 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత రెండు వారాల్లోనే ఈ షేరు 48 శాతం జంప్‌చేసింది. ఈ ఏడాది క్యూ2లో ఇండో కౌంట్ నికర లాభం 7 రెట్లు ఎగసి రూ. 81 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 26 శాతం పెరిగి రూ. 714 కోట్లను తాకింది. నిర్వహణ లాభ మార్జిన్లు 3.5 శాతం బలపడి 17.5 శాతాన్ని తాకాయి. కాగా.. గత నెల రోజుల్లో ఇండో కౌంట్ షేరు 70 శాతం పురోగమించింది. ఆరు నెలల కాలాన్ని తీసుకుంటే ఏకంగా 469 శాతం ర్యాలీ చేయడం విశేషం! -
బంధన్ బ్యాంక్- క్యాడిలా హెల్త్ జోరు
వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ చేయడం ద్వారా 40,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. కాగా.. ఊపరితిత్తులకు ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనాన్ని కల్పించే ఔషధాన్ని దేశీ మార్కెట్లో విడుదల చేసినట్లు వెల్లడించడంతో క్యాడిలా హల్త్‌కేర్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఈ ఏడాది(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర బిజినెస్‌ను సాధించిన వార్తలతో బంధన్ బ్యాంక్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. క్యాడిలా హెల్త్‌కేర్ ప్రెజరైజ్డ్ మీటర్డ్ డోస్ ఇన్హేలర్(పీఎండీఐ)ను దేశీయంగా తొలిసారి విడుదల చేసినట్లు ఫార్మా రంగ కంపెనీ క్యాడిలా హెల్త్‌కేర్ తాజాగా పేర్కొంది. ఊపిరి తీయడంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఈ ఔషధం ఉపశమనాన్ని కల్పిస్తుందని కంపెనీ తెలియజేసింది. ఎల్ఏఎంఏ, ఎల్ఏబీఏలతో కూడిన ఈ ఇన్హేలర్ సీవోపీడీ రోగుల చికిత్సలో వినియోగించవచ్చని వివరించింది. ఫార్గ్లిన్ పీఎండీఐగా పిలిచే ఈ ప్యాక్ విలువ రూ. 495గా తెలియజేసింది. ఈ నేపథ్యంలో క్యాడిలా హెల్త్‌కేర్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.4 శాతం జంప్‌చేసి రూ. 431 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత నెల రోజుల్లో ఈ షేరు 17 శాతం పుంజుకుంది! బంధన్ బ్యాంక్ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. క్యూ2(జులై-సెప్టెంబర్)లో బ్యాంక్ రుణ వృద్ధి 20 శాతం పుంజుకోవడం దీనికి కారణంకాగా.. వసూళ్లు నిష్పత్తి 92 శాతంగా నమోదైనట్లు బ్యాంక్ తెలియజేసింది. డిపాజిట్లలోనూ 34 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో బంధన్ బ్యాంక్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 2.3 శాతం ఎగసి రూ. 322 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 327ను అధిగమించింది. గత వారం రోజుల్లో ఈ షేరు 14 శాతం లాభపడటం గమనార్హం! -
టీసీఎస్- విప్రో.. రికార్డ్స్- సెన్సెక్స్ జూమ్
వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 501 పాయింట్లు దూసుకెళ్లి 40,380కు చేరగా.. నిఫ్టీ 137 పాయింట్లు జమ చేసుకుని 11,876 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి ప్రతిపాదించిన వార్తలతో ఐటీ సేవల బ్లూచిప్ కంపెనీ విప్రో లిమిటెడ్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టీసీఎస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో టీసీఎస్ అంచనాలను మించిన ఫలితాలు సాధించింది. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 4.8 శాతం పెరిగి రూ. 7,475 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికితోడు ఈక్విటీ షేర్ల బైబ్యాక్నకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో షేరుకీ రూ. 3,000 ధర మించకుండా 1.42 శాతం ఈక్విటీని బైబ్యాక్ చేయనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. 5.33 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఇందుకు రూ. 16,000 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 5.2 శాతం జంప్‌చేసి రూ. 2,878కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4.7 శాతం ఎగసి రూ. 2,866 వద్ద ట్రేడవుతోంది. విప్రో లిమిటెడ్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి ప్రతిపాదించినట్లు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఈ నెల 13న సమావేశంకానున్న బోర్డు ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది క్యూ2 ఫలితాలు సైతం అదేరోజు విడుదల చేసే వీలున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే ఐటీ బ్లూచిప్ కంపెనీ టీసీఎస్, మధ్యస్థాయి ఐటీ కంపెనీ మజెస్కో లిమిటెడ్ ఈక్విటీ బైబ్యాక్‌ను ప్రకటించిన విషయం విదితమే. ఈ బాటలో విప్రో మూడో కంపెనీగా నిలవనున్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 354కు చేరింది. తద్వారా రెండు దశాబ్దాల గరిష్టాన్ని తాకింది. ఇంతక్రితం 2000 ఫిబ్రవరి 22న రూ. 368 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది! -
ఆర్ఐఎల్ జూమ్- బజాజ్ ఫైనాన్స్ బోర్లా
మూడు రోజుల ర్యాలీ తదుపరి అటూఇటుగా ప్రారంభమైనప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 287 పాయింట్లు ఎగసి 39,861కు చేరగా.. నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 11,737 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించనున్న అంచనాలతో ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు.. అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతుండటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. వెరసి బజాజ్ ఫైనాన్స్ షేరు నష్టాలతో కళతప్పగా.. ఆర్ఐఎల్ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. బజాజ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కొత్త రుణాలు 6.5 మిలియన్ల నుంచి 3.6 మిలియన్లకు క్షీణించినట్లు బజాజ్ ఫైనాన్స్ తాజాగా వెల్లడించింది. అయితే నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 13 శాతం పుంజుకుని రూ. 1.37 ట్రిలియన్లను తాకినట్లు తెలియజేసింది. కొత్త కస్టమర్లు, రుణాల విడుదల గతేడాది క్యూ2తో పోలిస్తే 50-60 శాతంగా నమోదైనట్లు వివరించింది. ఈ నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 5.4 శాతం పతనమై రూ. 3,265కు చేరింది. ప్రస్తుతం 4 శాతం నష్టంతో రూ. 3,341 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ రిటైల్‌లో తాజాగా అబు ధబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రూ. 5,513 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. తద్వారా రిలయన్స్ రిటైల్‌లో 1.2 శాతం వాటాను అబు దభి ఇన్వెస్ట్మెంట్ కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ రిటైల్‌లో నాలుగు వారాలుగా విదేశీ సంస్థలు వాటాలు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. వెరసి రిలయన్స్ రిటైల్‌లో 7 కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. తద్వారా కంపెనీ రూ. 37,710 కోట్లను సమకూర్చుకుంది. ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో సిల్వర్ లేక్, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, ముబడాలా, జీఐసీ, టీపీజీ ఉన్నాయి. తాజాగా ఏడీఐఏ చేరింది. ఈ నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 1904 వద్ద ట్రేడవుతోంది. -
టాటా మోటార్స్- హెచ్డీఎఫ్సీ జూమ్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 321 పాయింట్లు ఎగసి 39,295కు చేరగా.. నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 11,587 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించనున్న అంచనాలు అటు ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం హెచ్డీఎఫ్సీ, ఇటు ఆటో రంగ బ్లూచిప్ కంపెనీ టాటా మోటార్స్ కౌంటర్లకు జోష్‌నిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టాటా మోటార్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో బ్రిటిష్ అనుబంధ విభాగం జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) ఆశావహ పనితీరు చూపినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. జేఎల్ఆర్ రిటైల్ అమ్మకాలు 53 శాతం ఎగసి 1,13,569 యూనిట్లను తాకినట్లు తెలియజేసింది. అంతకుముందు క్వార్టర్లో 74,067 యూనిట్లు మాత్రమే విక్రయించినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగా మాత్రమే రిటైల్ స్టోర్లు తెరచినట్లు తెలియజేసింది. పలు ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైనట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 144 వద్ద ట్రేడవుతోంది. హెచ్డీఎఫ్సీ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో వ్యక్తిగత బిజినెస్‌లో పటిష్ట రికవరీని సాధించినట్లు మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తాజాగా పేర్కొంది. వ్యక్తిగత రుణాల జారీ 95 శాతం రికవరీని సాధించినట్లు తెలియజేసింది. ఈ కాలంలో రుణ దరఖాస్తులు 21 శాతం వృద్ధి చెందినట్లు వెల్లడించింది. వీటిలో వ్యక్తిగత రుణ దరఖాస్తులు 31 శాతం పెరిగినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 1904 వద్ద ట్రేడవుతోంది. -
హ్యాట్సన్ ఆగ్రో- సుప్రజిత్.. దూకుడు
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 342 పాయింట్లు ఎగసి 39,039 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఓవైపు డైరీ ఉత్పత్తుల కంపెనీ హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ కౌంటర్ జోరందుకోగా.. మరోపక్క ఆటో విడిభాగాల సుప్రజిత్ ఇంజినీరింగ్ కౌంటర్‌కూ డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ వాటాదారులకు బోనస్ షేర్ల జారీ ప్రతిపాదనపై చర్చించేందుకు బోర్డు ఈ నెల 19న సమావేశంకానున్నట్లు హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ తాజాగా తెలియజేసింది. అంతేకాకుండా నిధుల సమీకరణ ప్రణాళికలపైనా నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 840 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 12 శాతం దూసుకెళ్లి రూ. 868 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సుప్రజిత్ ఇంజినీరింగ్ ఈ ఏడాది(2020-21) రెండో త్రైమాసికంలో అమ్మకాలు 15 శాతం ఎగసి రూ. 450 కోట్లను తాకినట్లు సుప్రజిత్ ఇంజినీరింగ్ తెలియజేసింది. ఇవి క్యూ2లో సరికొత్త రికార్డ్‌గా పేర్కొంది. కోవిడ్-19లోనూ ప్రొడక్టులకు డిమాండ్ పెరిగినట్లు తెలియజేసింది. పండుగల సీజన్ నేపథ్యంలో మరో రెండు నెలలపాటు డిమాండ్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సుప్రజిత్ ఇంజినీరింగ్ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 200 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 10 శాతం దూసుకెళ్లి రూ. 207 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
పీసీ మార్కెట్‌కు కలిసిరాని క్యూ2
భారతీయ పీసీ మార్కెట్‌కు క్యూ2 పెద్దగా కలిసిరాలేదు. ఈ జూన్ త్రైమాసికంలో పీసీ మార్కెట్లో భాగమైన డెస్క్‌టాప్స్, నోట్‌బుక్స్, వర్క్‌స్టేషన్స్‌లు మొత్తం కలిపి 21లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే క్యూ2లో 33లక్షల యూనిట్ల విక్రయాలతో పోలిస్తే 37.3% క్షీణతను చవిచూసినట్లు ఐడీసీ గణాంకాలు తెలిపాయి. ఈ త్రైమాసికంలో డెస్క్‌టాప్ పీసీలకు డిమాండ్ తగ్గడంతో అమ్మకాల్లో 46% పతనాన్ని చవిచూశాయి. (చదవండి : ఇంట్లోనే ఆఫీస్ సెటప్!) కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో పీసీమార్కెట్ కేవలం 45రోజులు మాత్రమే పనిచేసింది. ఫలితంగా ఈ క్వార్టర్లో వినియోగదారుల విభాగంలో తక్కువ అమ్మకాలు జరిగినట్లు ఐడీసీ తెలిపింది. కరోనా వ్యాప్తి భయాలతో కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌కు ప్రాధాన్యతను నిచ్చాయని, దీంతో నోట్‌బుక్‌లకు బలమైన డిమాండ్ ఏర్పడంతో అమ్మకాల్లో 17.6% వృద్ధి పెరిగిందని ఐడీసీ తెలిపింది. లెనోవా కంపెనీ గత 5ఏళ్లలో అత్యధిక విక్రయాలు ఈ క్వార్టర్లో నమోదుచేసింది. ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ తమిళనాడుతో కుదుర్చుకున్న భారీ డీల్‌లో భాగంగా విక్రయాలు పెరిగినట్లు ఐడీసీ తెలిపింది. సప్లై, రవాణా సవాళ్లున్నప్పటికీ క్వార్టర్ తొలిభాగంలో కంపెనీలు పెద్దమొత్తంలో ఆర్డర్లనునిచ్చాయి. వర్క్ ఫ్రమ్‌హోమ్‌లో భాగంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు తొలిసారి నోట్‌బుక్స్ టెక్నాలజీని పరిచయం చేశాయి. దీర్ఘకాలంలో నోట్‌బుక్ కంపెనీలకు ఇదే డిమాండ్ ఉండే అవకాశం ఉందని ఐడీసీ వెల్లడించింది. -
ఏసీసీ పుష్- సిమెంట్ షేర్ల దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) ద్వితీయ త్రైమాసికంలో దిగ్గజ కంపెనీ ఏసీసీ ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో సిమెంట్ రంగ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వెరసి ఏసీసీసహా అంబుజా, జేకే, రామ్‌కో, శ్రీ సిమెంట్ తదితర కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఏసీసీ జనవరి-డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీసీ క్యూ2 ఫలితాలతోపాటు.. సిమెంట్ రంగ షేర్ల జోరు వివరాలు చూద్దాం.. ఏసీసీ ఫలితాలు ఈ ఏడాది క్యూ2(ఏప్రిల్-జూన్)లో ఏసీసీ సిమెంట్ నికర లాభం 41 శాతం క్షీణించి రూ. 271 కోట్లకు పరిమితమైంది. ఇందుకు లాక్‌డవున్ ప్రభావం చూపగా.. నికర అమ్మకాలు సైతం 38 శాతం తక్కువగా రూ. 2520 కోట్లకు చేరాయి. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు 1.56 శాతం బలపడి 20.8 శాతాన్ని తాకాయి. ఏప్రిల్ నెలలో దాదాపు అమ్మకాలు నిలిచిపోయినప్పటికీ మే, జూన్ నెలల్లో సిమెంట్ విక్రయాలలో పటిష్ట రికవరీ కనిపించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమయంలో సరఫరా సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు, వ్యయాలను తగ్గించుకోవడంపై యాజమాన్యం దృష్టిసారించడంతో ఇకపై మెరుగైన ఫలితాలు సాధించే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. షేర్ల స్పీడ్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఏసీసీ 5 శాతం జంప్‌చేసి రూ. 1397 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1424కు ఎగసింది. అంబుజా సిమెంట్స్ 5.5 శాతం పెరిగి రూ. 207ను తాకగా.. జేకే సిమెంట్ 5 శాతం లాభపడి రూ. 1500కు చేరింది. తొలుత రూ. 1512 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో తొలుత రూ. 696 వరకూ ఎగసిన రామ్‌కో సిమెంట్ 2.25 శాతం పుంజుకుని రూ. 690 వద్ద ట్రేడవుతోంది. అల్ట్రాటెక్ 1.4 శాతం లాభంతో రూ. 3916 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3,955 వరకూ ఎగసింది. ఇదే విధంగా శ్రీ సిమెంట్ తొలుత రూ. 22,810 వరకూ ఎగసింది. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 22,634 వద్ద కదులుతోంది. ఇతర కౌంటర్లలో ఇండియా సిమెంట్స్ 2.3 శాతం పురోగమించి రూ. 122 వద్ద, బిర్లా కార్పొరేషన్ 2 శాతం బలపడి రూ. 575 వద్ద, హీడెల్‌బర్గ్ 1.5 శాతం పుంజుకుని రూ. 179 వద్ద ట్రేడవుతున్నాయి. -
అంచనాలు అందుకోని టీసీఎస్
బెంగళూర్ : భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ సెప్టెంబర్‌తో 30తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించింది. రెండో త్రైమాసికంలో కంపెనీ అంచనాల కంటే తక్కువగా ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. షేర్‌కు 45 రూపాయల ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే కంపెనీ రాబడి 5.8 శాతం మేర పెరిగి రూ 38,977 కోట్లు ఆర్జించింది. ఏకీకృత నికర లాభం 1.8 శాతం వృద్ధితో రూ 8042 కోట్లుగా నమోదైంది. ఈపీఎస్ 3.8 శాతం పెరుగుదలతో రూ 21.43గా నమోదైంది. ఇక ఆర్థిక సేవలు, రిటైల్ విభాగాల్లో అనిశ్చితి నెలకొన్నా మెరుగైన ఫలితాలు ప్రకటించామని క్యూ టూ ఫలితాలపై కంపెనీ సీఈవో రాజేష్ గోపీనాథన్ పేర్కొన్నారు. గత ఆరు క్వార్టర్లలో కంటే అత్యధికంగా రెండో త్రైమాసికంలో ఆర్డర్లు మెరుగ్గా ఉన్నాయని ఇదే వృద్ధి పరంపరను మున్ముందు కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. -
క్యూ2లో ఢమాలన్న జెట్ ఎయిర్వేస్
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద విమాన యాన సంస్థ జెట్ ఎయిర్వేస్ (ఇండియా) లిమిటెడ్ క్యూ 2 ఫలితాల్లో ఢమాల్ అంది. గురువారం ప్రకటించిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం 91శాతం క్షీణించింది. భారీగా పెరిగిన ఇంధన వ్యయం కంపెనీ లాభాలను దారుణంగా దెబ్బతీసింది. గురువారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో జెట్ఎయిర్ వేస్ చాలా నిరాశ పర్చింది. సెప్టెంబరు 30 తో ముగిసిన త్రైమాసికంలో నికరలాభం రూ .49.63 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .549 కోట్లగా ఉంది. మొత్తం ఆదాయం 59శాతం క్షీణిం చి రూ.131.57కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 320కోట్లను సాధించింది. మొత్తం సేల్స్ గతం క్వార్టర్లోని రూ. 5772 కోట్లతో పోలిస్తే ఈ క్వార్టర్లో రూ.5758 కోట్లకు పడిపోయింది. మొత్తం వ్యయం 9.2 శాతం పెరిగి రూ .5,709 కోట్లకు పెరిగింది. విమాన ఇంధన వ్యయం 17 శాతం పెరిగింది. -
నష్టాల్లోంచి లాభాల్లోకి అదానీ పవర్
సాక్షి, ముంబై: అదాని గ్రూపునకు చెందిన అదానీ పవర్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 ఫలితాలను శనివారం ప్రకటించింది. స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన రూ. 256 కోట్ల నికర లాభాలను వెల్లడించింది. గత ఏడాది రూ.335 కోట్ల నష్టాలతో పోల్చితే లాభాలను పోస్ట్ చేయడం విశేషం. అంతేకాదు ఏప్రిల్ 2016 తరువాత వరుస అయిదు త్రైమాసిక నష్టాలను నుంచి కోలుకొని లాభాలను సాధించింది. ఆదాయంలో (నిర్వహణ) సంవత్సరం ప్రాతిపదికన 22 శాతం పెరుగుదలను సాధించి రూ. 3460 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 2828 కోట్లను సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గత ఏడాది 313 కోట్ల నష్టంతో పోలిస్తే ప్రస్తుత క్యూ2లో రూ. 293కోట్ల ఏకీకృత నికర లాభాలను సాధించింది. ఆదాయం 14శాతంవృద్ధి చెంది రూ.6,462 కోట్లను ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.5,670 కోట్లుగా ఉంది. -
క్షీణించిన ఎయిర్టెల్ లాభాలు
సాక్షి,ముంబై: దేశీయ టెలికాం మేజర్ భారతి ఎయిర్టెల్ క్యూ2 ఫలితాల్లో నిరాశపర్చింది. 2017-18 సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం క్వార్టర్ ఆన్ క్వార్టర్ 5.4 శాతం క్షీణించి రూ.343 కోట్లుగా ప్రకటించింది. గత ఏడాది రూ.1,461కోట్ల లాభంతో పోలిస్తే ఈ ఏడాది సుమారు77శాతం క్షీణతను నమోదు చేసింది. దేశంలో నెలకొన్న పోటీవాతావరణం సంస్థ లాభాలను భారీగా దెబ్బతీసింది. మొత్తం ఆదాయం గత ఏడాది రూ. 21,958 కోట్లతో పోలిస్తే..ఈ క్వార్టర్లో 0.8శాతం క్షీణించి రూ. 21, 777కోట్లను సాధించింది. ఎబిటా మార్జిన్ రూ.7922కోట్లుగా ఉంది. ఐయూసీ చార్జీలకోత తమ ఆదాయంపై ప్రభావాన్ని చూపిందని భారతిఎయిర్టెల్ ఎండీ గోపాల్ మిట్టల్ తెలిపారు. ఇది క్యూ3లో కొనసాగనుందని ఆయన అంచనా వేశారు. -
ఎల్ఐసీ ఫలితాలు సూపర్
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గురువారం ప్రోత్సాహకర ఫలితాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఫలితాల్లో 20 శాతం నికర లాభాలను నమోదుచేసింది. క్యూ2 లో రూ. 495 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా 13 శాతం వృద్ధి చెంది రూ. 3490 కోట్లుగా రిపోర్టు చేసింది. క్యూ2(జూలై-సెప్టెంబర్)లో కంపెనీ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 21 శాతం పెరిగి రూ. 866 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు మాత్రం రూ. 30 కోట్లవద్దే నిలిచాయి. మార్కెట్ సమయంలో ఫలితాలు ప్రకటించడంతో మదుపర్ల కొనుగోళ్లతో రికార్డు గరిష్టాన్ని నమెదు చేసినా చివర్లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్వల్ప నష్టాలను మూటగట్టుకుంది.