నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో తన ఉనికిని కోల్పోతుందా? అనాలోచితమైన నిర్ణయాల కారణంగా లక్షల సంఖ్యలో సబ్ స్క్రైబర్లు ప్రత్యామ్నాయ ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారా? నెట్ ఫ్లిక్స్ చరిత్రలోనే తొలిసారి భారీ ఎత్తున యూజర్లు తగ్గిపోయారా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా ఆ సంస్థ విడుదల చేసిన క్యూ2 ఫలితాలు.
నెట్‌ఫ్లిక్స్ వరుసగా రెండు త్రైమాసికాల ఫలితాలు నిరాశ పరుస్తున్నాయి. కంపెనీ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా క్యూ2లో సుమారు 10లక్షల మంది (970,000) మంది కోల్పోయారు. క్యూ1లో 20లక్షల మంది సబ్ స్క్రైబర్లను చేజార్చుకోవగా..క్యూ2 లో 9,70,000మంది సబ్ స్క్రైబర్లు ప్రత్యామ్నాయ ఓటీటీలను వీక్షించేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
పలు నివేదికల ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ కు సుమారు 220.67మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 వ్యాల్యూమ్ 1,2, బెటర్ కాల్ సియో, పీకీ బ్లైండర్స్ వంటి పాపులర్ షోస్‌తో క్యూ3 ఫలితాల సమయానికి ఆ సంఖ్య మరో మిలియన్‌కు పెరుగుతుందని నెట్‌ఫ్లిక్స్ భావిస్తుంది.
కారణం అదేనా
నెట్‌ఫ్లిక్స్ తన త్రైమాసిక నివేదికలో, "ఏప్రిల్ ఫలితాల్లో అమెరికన్ డాలర్లతో పోటీ పడుతూ ఇతర దేశాలకు చెందిన కరెన్సీ విలువలు పెరగడం కారణంగా మాకొచ్చే ఆదాయాల్లో వ్యత్యాసం కనిపిస్తుందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. అయితే సబ్‌స్క్రైబర్ల సంఖ్యను కోల్పోవడంపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించలేదు. కానీ నెట్‌ఫ్లిక్స్ 'యాడ్ ఎక్స్‌ట్రా మెంబర్',ఫ్రీ పాస్‌వర్డ్ షేరింగ్ పేరుతో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులో తీసుకొస్తుంది. ఆ ఫీచర్ల సాయంతో యూజర్ల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాలపై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస‍్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లను వినియోగిస్తున్నారంటూ వెలుగులోకి వచ్చిన పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment