హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ వేరబుల్స్ మార్కెట్ దేశంలో జోరుగా సాగుతోంది. ఐడీసీ గణాంకాల ప్రకారం.. 2022 జూలై–సెప్టెంబర్‌లో మొత్తం 3.72 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంఖ్య 56 శాతం అధికం కావడం విశేషం.
సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో దేశవ్యాప్తంగా 7.5 కోట్ల యూనిట్ల స్మార్ట్‌వాచెస్, రిస్ట్ బ్యాండ్స్, ఇయర్‌వేర్ కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. సగటు విక్రయ ధర ఏడాదిలో 13.6 శాతం తగ్గింది.
స్మార్ట్‌వాచెస్ 179 శాతం వృద్ధితో 1.2 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇయర్‌వేర్ 33.6 శాతం అధికమై 2.5 కోట్ల యూనిట్లుగా ఉంది. 32.1 శాతం వాటాతో బోట్ బ్రాండ్ అగ్రస్థానంలో నిలిచింది. 13.8 శాతం వాటాతో నాయిస్ రెండవ స్థానంలో ఉంది. ఫైర్ బోల్ట్ 8.9 శాతం వాటాతో మూడు, వన్‌ప్లస్ 8.2 శాతం వాటాతో నాల్గవ స్థానాన్ని అందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment