Smartwatch Sales
-
వారేవా! అదిరిపోయే స్మార్ట్‌వాచ్.. సింగిల్ ఛార్జ్‌తో 14 రోజుల వినియోగం!
ప్రముఖ స్మార్ట్‌వాచ్ తయారీ సంస్థ అమేజ్ ఫిట్ కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఫిట్నెస్ నుంచి ఫ్యాషన్ వరకు యాక్సెస్ చేసేలా అమేజ్‌ఫిట్ జీటీఆర్ మినీ వాచ్‌ను అందుబాటులోకి తెచ్చింది. హ్యూమంగస్ బ్యాటరీ, సింగిల్ ఛార్జ్‌తో 14 రోజుల వినియోగం, బ్యాటరీ సేవర్ మోడ్‌లో ఉంటే 20 రోజుల వరకు పనిచేసేలా అద్భుతమైన ఫీచర్లు ఉన్న వాచ్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అమేజ్‌ఫిట్ జీటీఆర్ మినీ ధర ఎంతంటే? అమేజ్‌ఫిట్ జీటీఆర్ మినీ ప్రారంభ ధర రూ. 10,999గా ఉంది. అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌వాచ్ మిడ్నైట్ బ్లాక్, మిస్టీ పింక్, ఓషన్ బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయొచ్చు. అమేజ్‌ఫిట్ జీటీఆర్ మినీ స్పెసిఫికేషన్లు అమేజ్‌ఫిట్ జీటీఆర్లో మినీ వాచ్.. 1.28 అంగుళాల హెచ్డీ అమోలెడ్ డిస్ప్లేతో ఎలాంటి కండీషన్లో ఉన్నా వాచ్‌ను ఆపరేట్ చేసేందుకు వీలుగా ఉంటుంది. వీటితో పాటు స్మార్ట్‌వాచ్ బయోట్రాకర్ పీపీజీ, ఆప్టికల్ సెన్సార్, హార్ట్ రేటు, బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్, ఒత్తిడి స్థాయిని మానిటర్ చేస్తుంది. అధిక ఒత్తిడిలో ఉన్నప్పుడు యూజర్లకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలను సిఫార్సు చేస్తుంది. అంతేనా బ్యాటరీ సేవర్ మోడ్‌లో ఉంటే 20 రోజుల వరకు పనిచేయడం దీని ప్రత్యేకత అని అమేజ్ ఫిట్ ప్రతినిధులు చెబుతున్నారు. -
భారత్‌లో గాడ్జెట్స్ మార్కెట్ జోరు,ఎక్కువగా ఏం కొంటున్నారంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ వేరబుల్స్ మార్కెట్ దేశంలో జోరుగా సాగుతోంది. ఐడీసీ గణాంకాల ప్రకారం.. 2022 జూలై–సెప్టెంబర్‌లో మొత్తం 3.72 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంఖ్య 56 శాతం అధికం కావడం విశేషం. సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో దేశవ్యాప్తంగా 7.5 కోట్ల యూనిట్ల స్మార్ట్‌వాచెస్, రిస్ట్ బ్యాండ్స్, ఇయర్‌వేర్ కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. సగటు విక్రయ ధర ఏడాదిలో 13.6 శాతం తగ్గింది. స్మార్ట్‌వాచెస్ 179 శాతం వృద్ధితో 1.2 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇయర్‌వేర్ 33.6 శాతం అధికమై 2.5 కోట్ల యూనిట్లుగా ఉంది. 32.1 శాతం వాటాతో బోట్ బ్రాండ్ అగ్రస్థానంలో నిలిచింది. 13.8 శాతం వాటాతో నాయిస్ రెండవ స్థానంలో ఉంది. ఫైర్ బోల్ట్ 8.9 శాతం వాటాతో మూడు, వన్‌ప్లస్ 8.2 శాతం వాటాతో నాల్గవ స్థానాన్ని అందుకున్నాయి. -
ఆపిల్‌కు బ్యాడ్ న్యూస్
కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌లతో మార్కెట్లను ఏలాలనుకుంటున్న ఆపిల్‌కు షాకింగ్ న్యూస్ వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా మూడో త్రైమాసికంలో స్మార్ట్‌వాచ్‌ల సరుకు రవాణా 51.6 శాతం పడిపోయాయి. వీటిలో ఎక్కువగా ఆపిల్, లెనోవా స్మార్ట్‌వాచ్‌ల షిప్‌మెంట్లే క్షీణించినట్టు తాజా రిపోర్టులు వెల్లడించాయి. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల మూడో త్రైమాసికంలో మొత్తం స్మార్ట్‌వాచ్‌ల షిప్మెంట్లు 2.7 మిలియన్ యూనిట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 5.6 మిలియన్ యూనిట్లగా స్మార్ట్‌వాచ్ షిప్మెంట్లు రికార్డైన సంగతి తెలిసిందే. సోమవారం ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) ఈ రిపోర్టు విడుదల చేసింది. స్మార్ట్‌వాచ్ వర్తకంలో మార్కెట్ షేర్లో అతిపెద్ద కంపెనీగా ఉన్న ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ల షిప్మెంట్ దాదాపు 71.6 శాతం కిందకు దిగజారినట్టు ఈ రిపోర్టు పేర్కొంది. అయితే ఆపిల్ వాచ్‌ల్లో కొత్త వెర్షన్ , అప్‌కమింగ్ ఆండ్రాయిడ్ డివైజ్‌ల కోసం వినియోగదారులు వేచిచూస్తున్నారని, అందుకే కంపెనీ షిప్మెంట్లు పడిపోయినట్టు ఐడీసీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆపిల్ వాచ్‌ల కొత్త లుక్‌ను ఆ కంపెనీ విడుదల చేసినప్పటికీ, సెప్టెంబర్ చివరిలో విడుదలైన రెండో తరం వాచ్‌ల ఆవిష్కరణకూ ఈ న్యూ లుక్ మార్కెట్లోకి అందుబాటులోకి రాకపోవడాన్ని విశ్లేషకులు ఈ క్షీణతకు కారణంగా పేర్కొంటున్నారు. ఆండ్రాయిడ్ వేర్ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్ విడుదలను గూగుల్ ఆపివేయడం కూడా ఈ తగ్గుదలకు ఓ కారణమే అంటున్నారు. స్మార్ట్‌వాచ్‌ల సరుకు రవాణాలో ఆపిల్ క్షీణించినప్పటికీ, మార్కెట్ షేర్లో ఇప్పటికే ఈ కంపెనీ ముందంజలోనే ఉంది. 1.1 మిలియన్ యూనిట్లు విక్రయంతో 41 శాతం మార్కెట్ షేరును సొంతంచేసుకుంది. అయితే స్మార్ట్‌వాచ్ విక్రయాల గణాంకాలను ఆపిల్ విడుదలచేయలేదు. 6లక్షల విక్రయాలతో గ్రామిన్ రెండో బ్రాండుగా, 14.4 శాతం మార్కెట్ షేరుతో శాంసంగ్ మూడో స్థానంలో నిలిచింది.