దేశంలోని అతిపెద్ద రిటైల్ చైన్‌లలో ఒకటైన డీమార్ట్ 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొట్టింది. క్యూ2లో డీమార్ట్ రూ. 7,650 కోట్ల ఆదాయాన్ని గడించింది . గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 46 శాతం అధిక లాభాలను ఆర్జించింది. గత ఏడాది క్యూ2లో రూ. 5,218 కోట్ల డీమార్ట్ సొంతం చేసుకుంది. డీమార్ట్ క్యూ 2 నికరలాభాల్లో కూడా అదే జోరును ప్రదర్శించింది. డీమార్ట్ సుమారు 113.2 శాతం మేర స్వతంత్ర నికర లాభాలను పొందింది. క్యూ 2లో సుమారు 448.90 కోట్లను ఆర్జించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో సుమారు 210.20 కోట్ల లాభాలను గడించింది.
చదవండి: ఈ కంపెనీలు 60సెకన్లకు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా?
FY22 ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగంలో డీమార్ట్ మొత్తం ఆదాయం రూ. 12,681 కోట్లుగా నమోదైంది. గత ఏడాది 9,051 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కరోనావైరస్ ప్రభావం బాగా కన్పించింది. సెకండ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను విధించాయి. ఏదేమైనా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు క్రమంగా లాక్‌డౌన్లను ఎత్తివేయడం, టీకా వేగాన్ని పెంచడంతో, రిటైల్ మార్కెట్లు వృద్ధిలో సానుకూల వేగాన్ని చూస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 2021 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం డీమార్ట్ స్టోర్స్ సంఖ్య 246కు పెరిగాయి.
చదవండి: మహీంద్రా థార్‌కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...!
Comments
Please login to add a commentAdd a comment