Q2 net profits
-
సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 325 కోట్లను తాకింది. ట్రెజరీ, ఫారెక్స్ ఆర్జన రెట్టింపై రూ. 106 కోట్లకు చేరుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 275 కోట్ల లాభం సాధించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,485 కోట్ల నుంచి రూ. 2,804 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం రూ.2,129 కోట్ల నుంచి రూ. 2,355 కోట్లకు మెరుగుపడింది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ. 882 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.24 శాతంగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.96 శాతం నుంచి 4.4 శాతానికి, నికర ఎన్పీఏలు 1.7 శాతం నుంచి 1.31 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రెట్టింపై రూ. 116 కోట్లను తాకాయి. కనీస మూలధన నిష్పత్తి 18.04 శాతాన్ని తాకింది. ఫలితాల నేపథ్యంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 25.5 వద్ద ముగిసింది. -
బీఎస్ఈ లాభాల్లో క్షీణత
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో స్టాక్ ఎక్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు సగానికి క్షీణించి రూ. 34 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 65 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం పుంజుకుని రూ. 240 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 226 కోట్ల ఆదాయం నమోదైంది. అయితే నిర్వహణ మార్జిన్లు 28 శాతం నుంచి 7 శాతానికి భారీగా పతనమయ్యాయి. ఇందుకు కారణాలను ఎక్ఛేంజీ వెల్లడించలేదు. కాగా.. మొత్తం వ్యయాలు 36 శాతం పెరిగి రూ. 184 కోట్లను దాటాయి. ఎక్సే్ఛంజీలో రిజిస్టరైన మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాలు 11.7 కోట్లకు ఎగశాయి. రోజువారీ సగటు టర్నోవర్ ఈక్విటీ విభాగంలో 17 శాతం వృద్ధితో రూ. 4,740 కోట్లను తాకగా.. డెరివేటివ్స్ నుంచి 88 శాతం అధికంగా రూ. 2.26 లక్షల కోట్లు చొప్పున నమోదైంది. కరెన్సీ డెరివేటివ్స్‌లో సైతం సగటు టర్నోవర్ 31 శాతం ఎగసి రూ. 32,161 కోట్లకు చేరింది. -
అదరగొట్టిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..!
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 69 శాతం జంప్‌చేసి రూ. 8,890 కోట్లను తాకింది. ఇది ఒక త్రైమాసికానికి బ్యాంక్ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 5,246 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 95,374 కోట్ల నుంచి రూ. 1,01,143 కోట్లకు ఎగసింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 67 శాతం ఎగసి రూ. 7,627 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 4,574 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 31,184 కోట్లను తాకింది. ప్రొవిజన్లు తగ్గాయ్ క్యూ2లో ఎస్బీఐ స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 5.28 శాతం నుంచి 4.9 శాతానికి క్షీణించాయి. నికర ఎన్పీఏలు సైతం 1.59 శాతం నుంచి 1.52 శాతానికి మెరుగుపడ్డాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 5,619 కోట్ల నుంచి రూ. 2,699 కోట్లకు భారీగా తగ్గాయి. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 0.16 శాతం బలపడి 3.5 శాతంగా నమోదయ్యాయి. కోవిడ్–19 అనిశ్చితుల నేపథ్యంలో తాజాగా చేపట్టిన రూ. 2,884 కోట్లతో కలిసి మొత్తం ప్రొవిజన్లు రూ. 6,181 కోట్లకు చేరాయి. సెప్టెంబర్‌కల్లా కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 13.35 శాతానికి చేరింది. రైట్ బ్యాక్ఇలా.. క్యూ2లో ఎస్బీఐ తాజా స్లిప్పేజీలు రూ. 4,176 కోట్లుకాగా.. రికవరీలు రూ. 7,407 కోట్లుగా నమోదయ్యాయి. డీహెచ్ఎఫ్ఎల్కు చేపట్టిన రూ. 4,000 కోట్ల ప్రొవిజన్లను రైట్‌బ్యాక్ చేసింది. మొత్తం ప్రొవిజన్లు 74 శాతంపైగా తగ్గి రూ. 3,034 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల అడ్వాన్సులు(రుణాలు) 6.2 శాతం పెరిగి రూ. 25,30,777 కోట్లను తాకాయి. డిపాజిట్లు దాదాపు 10% వృద్ధితో రూ. 38,09,630 కోట్లకు చేరాయి. షేరు జోరు... క్యూ2 ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు బీఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ. 528 వద్ద ముగిసింది. తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 542ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! లాభదాయకత అప్ క్యూ2లో పలు లాభదాయక అంశాలలో బ్యాంక్ పటిష్ట పనితీరు చూపింది. తద్వారా ఒక క్వార్టర్లో బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభం ఆర్జించింది. వసూళ్లు పుంజుకోవడం, అండర్‌రైటింగ్ మెరుగుపడటం వంటి అంశాలు భవిష్యత్ రుణ నాణ్యతపై ఆందోళనలకు చెక్ పెట్టాయి. ఇకపై రిటైల్ రుణాల్లో భారీ వృద్ధిని అంచనా వేస్తున్నాం. – దినేష్ ఖారా, చైర్మన్, ఎస్బీఐ -
టైటాన్ డబుల్ ధమాకా..!
Titan Q2 Results: టైటాన్ కంపెనీ ఈ ఏడాది క్యూ2 ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నికర లాభాల్లో డబుల్ ధమాకా కొట్టేసింది. క్యూ2లో 270శాతం వృద్ధితో సుమారు రూ. 641 కోట్ల ఏకీకృత నికర లాభాలను సొంతం చేసుకుంది. గత ఏడాది క్యూ2లో టైటాన్ సుమారు రూ.173 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో టైటాన్ జ్వువెలరీ కంపెనీ విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో టైటాన్ జ్వువెలరీ విభాగంలో క్యూ2లో రూ. 4,127 కోట్ల నుంచి 75 శాతం పెరిగి రూ.7,243 కోట్లకు చేరుకుంది. ఆదాయం సుమారు 78 శాతం మేర పెరిగింది. టైటాన్ జ్వువెలరీ విభాగంలో గత ఏడాదిలో క్యూ2లో రూ. 3446 కోట్లను నివేదించగా, ఈ ఏడాదిగాను 77శాతం వృద్ధితో రూ. 6,106 కోట్ల ఆదాయాన్ని గడించింది. టైటాన్ గడియారాలు, వెయిరబుల్స్ మార్కెట్లో క్యూ2లో 72 శాతం వృద్ధితో 687 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మరోవైపు కళ్లజోడు వ్యాపారంలో కూడా భారీ గ్రోత్నే సాధించింది. ఈ ఏడాది క్యూ2లో 70 శాతం వృద్ధితో రూ. 160 కోట్లను ఆదాయాన్ని గడించింది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సికె వెంకటరామన్ మాట్లాడుతూ...ఈ త్రైమాసికంలో టైటాన్ బలమైన వృద్ధి నమోదుచేసింది. డిమాండ్ ఉండడటంతో అన్ని విభాగాల్లో బలంగా పుంజుకుందని పేర్కొన్నారు. చదవండి: సౌండ్‌కోర్ నుంచి సరికొత్త వాటర్‌ప్రూఫ్ స్పీకర్.! ధర ఎంతంటే..! -
సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న ఐసీఐసీఐ బ్యాంక్..!
ప్రముఖ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ 2021-2022 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సరికొత్త రికార్డును నమోదుచేసింది. క్యూ2 ఫలితాల్లో ఐసీఐసీఐ అంచనాలకు మించి ఫలితాలను రాబట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 30 శాతం పైగా నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. ఐసీఐసీఐ క్యూ2లో రూ. 5511 కోట్ల లాభాలను గడించింది. చదవండి: అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..! గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే.. నెట్ ప్రాఫిట్ భారీగా మెరుగుపడింది. గత ఏడాది క్యూ2లో రూ. 4,251 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను ఐసీఐసీఐ సాధించింది. క్యూ2 లో సుమారు రూ. 5,441 కోట్ల నెట్ ప్రాఫిట్ వస్తోందని ఐసీఐసీఐ భావించగా..గడిచిన త్రైమాసికంలో అంచనాలకు మించి లాభాలను సాధించింది. అంతేకాకుండా ఐసీఐసీఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 25 శాతం మేర పెరిగి, రూ. 11,690 కోట్ల రూపాయలకు చేరుకుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ రేట్ 4 శాతానికి చేరగా.. గత ఏడాది రెండో త్రైమాసికంలో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.89గా నమోదైంది. తగ్గిన నిరార్థక ఆస్తుల విలువ..! నిరార్థక ఆస్తుల(నాన్ పెర్మార్మింగ్ అసెట్స్-ఎన్పీఏ) విలువ 12 శాతం మేర, రూ. 8,161 కోట్లకు తగ్గింది. 2014 తరువాత ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్పీఏ ఆస్తులు తగ్గడం ఇదే తొలిసారి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎన్పీఏ ఆస్తుల విలువ రూ. 9,306 కోట్లుగా ఉండగా.. రెండో త్రైమాసికంలో ఎన్పీఏ ఆస్తులు విలువ రూ. 8,161 కోట్లకు చేరింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన టెస్లా..! -
అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మోటర్స్ (2021-22) ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొట్టింది. క్యూ2లో సుమారు రూ. 5,619 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ.4605 కోట్లను సొంతం చేసుకోగా... గత ఏడాదితో పోలిస్తే కంపెనీ రెండో త్రైమాసికంలో 22 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. క్యూ2లో రూ.277.60 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది రూ. 196.3 కోట్ల నికర లాభాలను సాధించింది. చదవండి: వ్యాక్సిన్ వేసుకోకుంటే జీతం కట్! ఆ కంపెనీ సంచలన నిర్ణయం ముడి సరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా నెలకొన్న కంటైనర్లు, సెమీకండక్టర్ల కొరత ఉన్నప్పటికీ టీవీఎస్ మోటార్స్ గణనీయంగా లాభాలను పొందింది. పన్ను ముందు లాభాలు సుమారు 41 శాతం పెరిగి రూ. 377 కోట్లకు చేరుకుంది, అదే సంవత్సరం క్రితం ఇదే త్రైమాసికంలో ₹ 267 కోట్లును టీవీఎస్ మోటార్స్ ఆర్జించింది. జూలై నుంచి సెప్టెంబర్ 2021 కాలంలో..సుమారు 8.70 లక్షల ద్విచక్ర వాహనాల అమ్మకాలను టీవీఎస్ జరిపింది. బజాజ్ ఆటో తర్వాత భారత నుంచి ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసే రెండో అతిపెద్ద కంపెనీగా టీవీఎస్ మోటార్స్ నిలుస్తోంది. చదవండి: ఫ్యూచర్ వీటిదేనా? లాభాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారేనా? -
డీమార్ట్ జోరు..! లాభాల్లో హోరు...!
దేశంలోని అతిపెద్ద రిటైల్ చైన్లలో ఒకటైన డీమార్ట్ 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొట్టింది. క్యూ2లో డీమార్ట్ రూ. 7,650 కోట్ల ఆదాయాన్ని గడించింది . గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 46 శాతం అధిక లాభాలను ఆర్జించింది. గత ఏడాది క్యూ2లో రూ. 5,218 కోట్ల డీమార్ట్ సొంతం చేసుకుంది. డీమార్ట్ క్యూ 2 నికరలాభాల్లో కూడా అదే జోరును ప్రదర్శించింది. డీమార్ట్ సుమారు 113.2 శాతం మేర స్వతంత్ర నికర లాభాలను పొందింది. క్యూ 2లో సుమారు 448.90 కోట్లను ఆర్జించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో సుమారు 210.20 కోట్ల లాభాలను గడించింది. చదవండి: ఈ కంపెనీలు 60సెకన్లకు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా? FY22 ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగంలో డీమార్ట్ మొత్తం ఆదాయం రూ. 12,681 కోట్లుగా నమోదైంది. గత ఏడాది 9,051 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కరోనావైరస్ ప్రభావం బాగా కన్పించింది. సెకండ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను విధించాయి. ఏదేమైనా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు క్రమంగా లాక్డౌన్లను ఎత్తివేయడం, టీకా వేగాన్ని పెంచడంతో, రిటైల్ మార్కెట్లు వృద్ధిలో సానుకూల వేగాన్ని చూస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 2021 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం డీమార్ట్ స్టోర్స్ సంఖ్య 246కు పెరిగాయి. చదవండి: మహీంద్రా థార్‌కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...! -
డీమార్ట్ దూకుడు..!
దేశంలోని అతిపెద్ద రిటైల్ చైన్లలో ఒకటైన డీమార్ట్ 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొడుతుంది. క్యూ2లో డీమార్ట్ రూ. 7,650 కోట్ల ఆదాయాన్ని గడించింది . గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 46 శాతం అధికంగా లాభాలను ఆర్జించింది. గత ఏడాది క్యూ2లో రూ. 5,218 కోట్ల డీమార్ట్ సొంతం చేసుకుంది. రెండో త్రైమాసికంలో కార్యకలాపాల నుంచి వచ్చే సంపూర్ణ ఆదాయం కంపెనీ చట్టబద్ధమైన ఆడిటర్ల పరిమిత సమీక్షకు లోబడి ఉంటుందని డీమార్ట్ ఒక ఫైలింగ్‌లో తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కరోనావైరస్ ప్రభావం బాగా కన్పించింది. సెకండ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను విధించాయి. ఏదేమైనా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు క్రమంగా లాక్డౌన్లను ఎత్తివేయడం, టీకా వేగాన్ని పెంచడంతో, రిటైల్ మార్కెట్లు వృద్ధిలో సానుకూల వేగాన్ని చూస్తున్నాయి. చదవండి: అతి తక్కువ ధరలోనే..భారత మార్కెట్లలోకి అమెరికన్ బ్రాండ్ టీవీలు..! దేశ వ్యాప్తంగా 2021 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం డీమార్ట్ స్టోర్స్ సంఖ్య 246కు పెరిగింది. డీమార్ట్ షేర్లు రూ. 4242 వద్ద ముగిశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు డీమార్ట్ షేర్లు 50శాతం పైగా పెరిగాయి. స్టాక్ మార్కెట్లో అద్బుతర్యాలీను డీమార్ట్ నమోదుచేస్తోంది. డీమార్ట్ యాజమాని రాధాకిషన్ ఎస్ దమాని ఇటీవలే టాప్ -100 ప్రపంచ బిలియనీర్స్ ఎలైట్ క్లబ్లో ప్రవేశించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం దమాని నికర ఆస్తుల విలువ 22.5 బిలియన్ డాలర్లతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 70 వ స్థానంలో కొనసాగుతున్నారు. చదవండి: ఇంధన ధరల పెంపుపై 9 నెలల్లో కేంద్రం చెప్పిన 9 కారణాలు..! -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.1,679 కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2) లో స్టాండెలోన్ ప్రాతిపదికన (ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలపైనే) రూ. 1,679 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 737 కోట్ల లాభాన్ని నమోదుచేయగా, ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో రూ.864 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కాగా, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) బ్యాంకు క్యూ2లో రూ.1,771 కోట్ల నికర లాభాన్ని సాధించింది. నికర వడ్డీ ఆదాయం 6.83 శాతం వృద్ధితో రూ.7,508 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ 2.96 శాతంగా నమోదైంది. మొండిబాకీలు తగ్గుముఖం...: బీఓబీ స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) ఈ ఏడాది క్యూ2లో 9.14 శాతానికి తగ్గుముఖం పట్టాయి. గతేడాది క్యూ2లో ఇవి 10.25%గా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 3.91 శాతం నుంచి 2.51%కి దిగొచ్చాయి. మొత్తం కేటాయింపులు (ప్రొవిజన్లు) జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో రూ.4,209 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు తగ్గాయి. క్యూ2లో తాజాగా మొండిబకాయిలుగా చేరిన రుణాలు రూ.899 కోట్లు. ఇక క్యూ2లో రూ.2,500 కోట్లను బ్యాంక్ రికవరీ చేసుకుంది. బీఓబీ షేరు బీఎస్ఈలో 2 శాతం ఎగబాకి రూ.43 వద్ద స్థిరపడింది. -
క్యూ2లో హెచ్డీఎఫ్సీ అదుర్స్
సాక్షి, ముంబై: హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డిఎఫ్‌సి) బ్యాంక్ మంచి ఫలితాలను కనబరిచింది. 2019 సెప్టెంబర్ 30 తో ముగిసిన రెండవ త్రైమాసికంలో తన నికర లాభంలో రూ .3,961.53 కోట్లకు 60.57 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 2,467.08 కోట్ల రూపాయల నికర లాభాన్నిగడించినట్టు బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజ్ సమాచారంలో తెలిపింది. క్యూ2లో నిర్వహణ ఆదాయం 10శాతం వృద్ధి చెంది రూ.10,478.33 కోట్లను సాధించింది. గతేడాది క్యూ2లో రూ.9,494.70 కోట్లుగా నమోదైంది. ఈ క్వార్టర్లో నికర వడ్డీ మార్జిన్ 3.3శాతంగా ఉంది. రుణ వృద్ధి 12శాతం జరిగింది. నికర వడ్డీ ఆదాయం గతేడాది క్యూ2లో సాధించిన రూ.2,594 కోట్లతో పోలిస్తే 16.5శాతం పెరిగి రూ.3,021 కోట్లను ఆర్జించింది. ఇక ఇదే కాలంలో మొండి బకాయిలకు రూ.754 కోట్ల ప్రోవిజన్లు కేటాయించింది. కాగా గతేడాది క్యూ2లో రూ.890 కోట్లను కేటాయించింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల ఎన్పీఏలు 1.29శాతం నుంచి 1.33శాతానికి పెరిగాయి. జూన్ క్వార్టర్లో రూ.5,315 కోట్లు నమోదు కాగా, ఈ క్వార్టర్ నాటికి రూ.5,655 కోట్లకు పెరిగాయి. ఇదే క్వార్టర్లో పన్ను వ్యయం రూ.568 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే క్యూ2లో రూ.1,022 కోట్లుగా నమోదైంది. సగటు రుణ పరిమాణం విలువ తగ్గినట్లు బ్యాంక్ తెలిపింది. రుణాలలో 76 శాతం వాటా వ్యక్తిగతమైనవేనంటూ కంపెనీ తెలియజేసింది. వ్యక్తిగత రుణాలలో 17 శాతం పురోగతిని సాధించినట్లు తెలియజేసింది. ఈ ఫలితాల వెల్లడితో హెచ్డీఎఫ్సీ షేరు 2 శాతానికిపైగా లాభాలతో ముగిసింది. హెచ్‌డిఎఫ్‌సి తన అనుబంధ సంస్థ గ్రుహ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గ్రుహ్) లో దాదాపు 10 శాతం వాటాను విక్రయించింది. ఆర్బిఐ ఆదేశాల మేరకు బంధన్ బ్యాంకులో విలీనం కోసం అనుబంధ సంస్థలో ఉన్న హోల్డింగ్‌ను తగ్గించాలని. ఈ త్రైమాసికంలో, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, అహ్మదాబాద్ , కోల్‌కతా బెంచ్‌లు గ్రుహ్ను బంధన్ బ్యాంక్‌తో కలిపే పథకానికి ఆమోదం తెలిపినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. -
మరింత క్షీణించిన మారుతి లాభాలు
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) మరోసారి నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది.వార్షిక ప్రాతిపదికన మారుతి లాభాలు 39శాతం పతనమయ్యాయి. గత 8 సంవత్సరాలలో త్రైమాసిక లాభంలో ఇదే అతిపెద్ద పతనం. ఏకీకృత నికర లాభం 38.99 శాతం క్షీణించిం రూ. 1,391 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ .2,280.2 కోట్లు. ఎనిమిదేళ్లలో త్రైమాసిక లాభంలో అతిపెద్ద క్షీణతను నమోదు చేసింది. ఆదాయంలో కూడా 25.19 శాతం పతనాన్ని నమోదు చేసింది. రెండో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ .16,123 కోట్లు అంతకు ముందు ఏడాది 21,553.7 కోట్ల రూపాయలు. అయితే ఆటోమందగమనం నేపథ్యంలో లాభాలు మరింత క్షీణిస్తాయన్న ఎనలిస్టుల అంచనాలను మారుతి బీట్ చేసింది. చివరిసారిగా కంపెనీ నికర లాభంలో పెద్ద క్షీణత 2011-12 రెండవ త్రైమాసికంలో 241 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .549 కోట్లతో పోలిస్తే 56 శాతం క్షీణించింది. ఈ త్రైమాసికంలో 3,38,317 వాహనాలను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 30.2 శాతం తగ్గింది. ఆర్థిక పనితీరుపై ఎంఎస్ఐ చైర్మన్ ఆర్సి భార్గవ మాట్లాడుతూ రెండవ త్రైమాసికం, ఆర్థిక మొదటి సగం ఫలితాలు గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉన్నాయి. అమ్మకాలు 22 శాతం (క్యూ 2 లో) పడిపోయాయన్నారు. బీమా, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో పాటు కొత్త సెక్యూరిటీ విధానాలు ఉద్గార నిబంధనల కారణంగా వాహనాల వ్యయం పెరగడం వల్ల ఆటో పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమైందని ఆయన అన్నారు. అయితే భవిష్యత్తుపై చాలా నమ్మకంగా ఉన్నామని భార్గవ పేర్కొన్నారు. రాబోయే రెండు నెలల్లో ఏమి జరుగుతుందన్న దానిపై రికవరీ ఆధారపడి ఉంటుందన్నారు. -
క్యూ2లో అదరగొట్టిన టాటా స్టీల్
సాక్షి, ముంబై: దేశీయ స్టీల్ దిగ్గజం టాటా స్టీల్ క్యూ2 ఫలితాల్లో అదరగొట్టింది. ఎనలిస్టుల అంచనాలను బీట్ చేస్తూ మూడురెట్ల లాభాలను సాధించింది. 269.31 శాతం ఎగిసి 3,604 కోట్ల నికర లాభాలను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 975 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. రెండవ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ .43,544 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.32,464 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఎబిటా మార్జిన్లు 84 జంప్ చేశాయి. దేశంలో అనుకూలమైన వ్యాపార పరిస్థితుల నేపథ్యంలో టాటా స్టీల్ గ్రూప్ ఈ త్రైమాసికంలో మంచి ఫలితాలను సాధించామని టాటా స్టీల్ సీఎండీ టీఎల్ నరేంద్రన్ చెప్పారు. -
నష్టాల మార్కెట్లో టైటన్ మెరుపులు
సాక్షి, ముంబై: నష్టాల మార్కెట్లో టైటన్ కంపెనీ మెరుపులు మెరిపించింది. 250 పాయింట్లకు పైగా సోమవారం నాటి మార్కెట్లో టైటన్ 6 శాతం పుంజుకుని టాప్ గెయినర్‌గా నిలిచింది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలను అందుకోవడంతో వాచీలు, జ్యువెలరీ దిగ్గజం టైటన్ కంపెనీ కౌంటర్ జోరందుకుంది. టైటన్ క్యూ2 ఫలితాలు ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో టాటా గ్రూప్ సంస్థ టైటన్ కంపెనీ నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 314 కోట్లను ప్రకటించింది. నికర అమ్మకాలు మరింత అధికంగా 26 శాతం ఎగసి రూ. 4406 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం(ఇబిటా) 5 శాతం పుంజుకుని రూ. 466 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 12.7 శాతం నుంచి 10.6 శాతానికి బలహీనపడ్డాయి. టైటన్ వాచెస్ మార్కెట్ బాగా ఉన్నట్టు చెప్పారు. వాచ్‌ల అమ్మకాల విషయంలో అత్యుత్తమ క్వార్టర్లలో ఒకటిగా ఈ క్యూ2 క్వార్టర్ నిలిచిందని తెలిపారు. నిర్వహణ లాభం 5 శాతం పెరిగి రూ.467 కోట్లకు పెరిగిందని తెలిపారు. గత క్యూ2లో 12.7 శాతంగా ఉన్న ఎబిటా మార్జిన్ ఈ క్యూ2లో 10.6 శాతానికి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. -
పెరిగిన కోటక్ బ్యాంకు లాభాలు
సాక్షి, ముంబై: ప్రయివేటు బ్యాంకు కోటక్ మహీంద్ర క్యూ2లో మెరుగైన ఫలితాలను సాధించింది. 1747 కోట్ల రూపాయలను నికర లాభాలు నమోదు చేసింది. గత ఏడాదితో రూ. 1,441 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 21 శాతం లాభాలు ఎగిశాయి. బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 10,829 కోట్లను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. ఆదాయం 9,140 కోట్లుగా ఉంది. ఎన్పీఏలు 2.14శాతంనుంచి 1.91 శాతానికి దిగి వచ్చాయని కంపెనీ ఫలితాల సందర్భంగా వెల్లడించింది. -
టాప్ లేపిన ఎం అండ్ ఎం
సాక్షి, ముంబై: దేశీయ టాప్ సెల్లింగ్ యుటిలిటీ వెహికల్ మేకర్ మహీంద్రా అండ్ మహీంద్రా సెప్టెంబర్ త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో అంచనాలను మించి ఫలితాలను నమోదు చేసింది. నికర లాభాల్లో24.79 ఎగిసి రూ. 1,332 కోట్లను సాధించింది. గత ఏడాది త్రైమాసికంలో ఎం అండ్ ఎం నికర లాభం రూ .1,067 కోట్లు. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.12,182.07 కోట్లగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో రూ .11,446.14 కోట్లు ఆర్జించింది. ఈ క్వార్టర్లో 1,29,754 యూనిట్లు విక్రయించింది. ఇందులో ట్రాక్టర్ల విభాగంలో 76,984 యూనిట్ల విక్రయించగా, 11,755 యూనిట్లను ఎగుమతి చేసింది. ఈ త్రైమాసికంలో ఈబీఐటీడీఏ 45.6 శాతం పెరిగి రూ. 1729.8 కోట్లుగా ఉండగా, ఈబీఐటీడీఏ మార్జిన్ 14.2 శాతంగా ఉంది. ఆటో బిజినెస్‌లో ఎం అండ్ ఎం మంచి పురోగతి సాధించింది. ముఖ్యంగా పాసింజర్, యుటిలిటీ వెహికల్, ట్రక్కుల విభాగంలో వరుసగా 13.4శాతం, 27శాతం 86శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతోపాటు సాధారణ రుతుపవనాల కారణంగా ట్రాక్టర్ల వ్యాపారం కూడా 37 శాతం పెరుగుదలను సాధించింది. ఈ ఏడాది జూలై నుంచి జీఎస్టీ అమలు కారణంగా ఈ గణాంకాలు పోల్చదగినవికాదని కంపెనీ బిఎస్ఇ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే 1: 1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని బోర్డు డైరెక్టర్లు సిఫార్సు చేసినట్టు తెలిపింది. రూ. 5 బోనస్ చెల్లించనున్నట్టు తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల ఆమోదాన్ని కోరనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇటీవల కాలంలో ఆర్థిక వృద్ధి మందగించిందని కంపెనీ పేర్కొంది. అయితే కొన్ని స్వల్పకాలిక కారకాల ప్రభావాలను మినహాయించి, జీఎస్టీ అమలు నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ సర్దుబాటు అనంతరం వృద్ధి ఊపందుకుంటుందని భావిస్తున్నామని తెలిపింది. -
అదరగొట్టిన ఐటీసీ
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద సిగరెట్ మేకర్, ఎఫ్ఎంసీజీ రంగ సంస్థ ఐటీసీ లిమిటెడ్ లాభాలు విశ్లేషకుల అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఐటీసీ నికర లాభం దాదాపు 6 శాతం ఎగిసి రూ .2,640 కోట్లకు పెరిగింది. . గత ఏడాది ఇదే కాలంలో రూ .2,500 కోట్లను ఆర్జించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో రెవెన్యూ కూడా7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్ ఆదాయం రూ. 9,661కోట్లతో పోలిస్తే రూ .10,314 కోట్లను నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో వ్యవయాలను భారీగా తగ్గించుకున్నట్టు ఐటీసీ తెలిపింది. 39 శాతం క్షీణించిన ఖర్చులు 6,314 కోట్లకు దిగి వచ్చాయి. అయితే ఎఫ్ఎంసీజీ ఆదాయం మాత్రం భారీగా క్షీణించింది. సిగరెట్లతో సహా ఎప్ఎంసీజీ ద్వారా ఆదాయం రూ.7,358కోట్లుగా ఉండగా గత ఏడాది రూ.11,200కోట్లుగాఉంది. హోటల్ బిజినెస్ ఆదాయం పెరిగింది. రూ. 297.ద్వారా ఉన్న ఆదాయం రూ.300 కోట్లకు పెరగింది. అలాగే అగ్రి బిజినెస్ ఆదాయం కూడా రూ.1,880కోట్ల నుంచి రూ.1,968 కోట్లకు పెరిగింది మరోవైపు ఫలితాల ప్రకటనతో లాభాల ఆర్జించిన ఐటీసీ షేరు మార్కెట్ క్లోజింగ్‌లో ఐటీసీ షేరు స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. -
అదరగొట్టిన దిగ్గజాలు..
ఆటో మోటార్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ దిగ్గజాలు నేడు ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ దిగ్గజం బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం ఆర్థికసంవత్సర సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా తన నికర లాభాలను 66 శాతం పెంచుకుని రూ.234 కోట్లగా నమోదుచేసింది. అగ్రికల్చర్, రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్‌లోని తమ సహకారమే లాభాల బాటకు తోడ్పడిందని పేర్కొంది. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, కరువు వంటివాటితో బాధపడుతున్న రైతులకు ఊరట కలిగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.159 కోట్ల నుంచి రూ.737 కోట్లకు పెంచుకోగలిగామని కంపెనీ తెలిపింది. జంప్ చేసిన ఐషర్ మోటార్స్ వాణిజ్య వాహనాల ఉత్పత్తి సంస్థ ఐషర్ మోటార్స్ లాభాల్లో జంప్ చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో కన్సాలిడేటెడ్ నికర లాభాలు 45.19శాతం ఎగిసి, రూ.413.16కోట్లగా రికార్డు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.284.56కోట్లగా ఉన్నాయి. క్వార్టర్ రివ్యూ సందర్భంగా కంపెనీ కన్సాలిడేటెడ్ ఇన్కమ్ రూ.1,981.01కోట్లకు పెరిగినట్టు బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది కంటే కంపెనీ 34.9 శాతం వృద్ధి నమోదుచేశామని ఐషర్ మోటార్స్ ఎండీ, సీఈవో సిద్ధార్థ లాల్ తెలిపారు. నిర్వహణల నుంచి ఈ త్రైమాసికంలో అత్యధిక ఆదాయాల్లో ఆర్జించామని పేర్కొన్నారు. తమ టూవీలర్ విభాగం రాయల్ ఫీల్డ్ 30.8 శాతం వృద్ధిని సాధించినట్టు చెప్పారు. నెస్లే రెండింతలు జంప్ ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం నెస్లే ఇండియా కన్సాలిడేటెడ్ నికర లాభాలూ రెండింతలు జంప్ అయ్యాయి. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు రూ.269.39 కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.124.20 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జించింది. నికర విక్రయాలు 35.13 శాతం ఎగిసి, రూ.2,346.18కోట్లగా రికార్డైనట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కంపెనీ లాంచ్ చేసిన 25 పైగా కొత్త ప్రొడక్ట్‌లతో లాభాల వృద్ధికి బాటలు వేశామని నెస్లే ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణ్ తెలిపారు. మ్యాగీ ఉత్పత్తులతో మళ్లీ ఇన్స్టాంట్ న్యూడిల్స్ కేటగిరీలో పూర్తి ఆధిపత్య స్థానానికి వచ్చేశామని పేర్కొన్నారు. నష్టాల్లోంచి లాభాలోకి వచ్చిన ఐడీఎఫ్సీ దేశీయ లీడింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐడీఎఫ్సీ నష్టాల్లోంచి లాభాల్లోకి పయనించింది. శుక్రవారం వెలువరించిన ఫలితాల్లో కంపెనీ రూ.281.79 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాలను ఆర్జించినట్టు పేర్కొంది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.1,468.83కోట్ల నికర నష్టాలను నమోదుచేసింది. గ్రూప్ మొత్తం ఆదాయం ఈ క్వార్టర్లో రూ.2,704.13 కోట్లగా ఉన్నట్టు బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. బజాజ్ ఆటో@7 శాతం ఇటు టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో సైతం రెండో క్వార్టర్లో 6.7 శాతం వృద్ధిని నమోదుచేసి రూ.1,122 కోట్ల లాభాలను ఆర్జించినట్టు తెలిపింది. ఇతరాత్ర ఆదాయాలు లాభాలకు వెన్నుదన్నుగా నిలిచినట్టు కంపెనీ పేర్కొంది. అయితే ఈ క్వార్టర్లో రెవెన్యూలు స్వల్పంగా 0.4 శాతం మాత్రమే పెరిగి రూ.6,432కోట్లగా నమోదయ్యాయి. నెమ్మదించిన సేల్స్ వాల్యుమ్ గ్రోత్తో రెవెన్యూలు స్వల్పంగా నమోదైనట్టు కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో 10.3 లక్షల యూనిట్ల విక్రయాలు జరుపగా.. గతేడాది కంపెనీ 10.56 లక్షల యూనిట్లను అమ్మింది. నైజీరియా, ఈజిప్ట్ వంటి ఎగుమతుల మార్కెట్లలో విక్రయాలు పడిపోయినట్టు బజాజ్ ఆటో తెలిపింది.