నష్టాల మార్కెట్లో టైటన్‌ మెరుపులు | Titan growing faster than industry each quarter, says CFO Subramaniam | Sakshi
Sakshi News home page

నష్టాల మార్కెట్లో టైటన్‌ మెరుపులు

Published Mon, Nov 12 2018 5:40 PM | Last Updated on Mon, Jul 29 2019 7:32 PM

Titan growing faster than industry each quarter, says CFO Subramaniam   - Sakshi

సాక్షి, ముంబై:  నష్టాల మార్కెట్లో టైటన్‌ కంపెనీ మెరుపులు మెరిపించింది. 250 పాయింట్లకు పైగా సోమవారం నాటి మార్కెట్‌లో టైటన్‌ 6 శాతం పుంజుకుని టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ముఖ‍్యంగా  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలను అందుకోవడంతో వాచీలు, జ్యువెలరీ దిగ్గజం టైటన్‌ కంపెనీ కౌంటర్‌ జోరందుకుంది.

టైటన్‌  క్యూ2 ఫలితాలు
ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో టాటా గ్రూప్‌ సంస్థ టైటన్‌ కంపెనీ నికర లాభం 3 శాతం  పుంజుకుని  రూ. 314 కోట్లను  ప్రకటించింది. నికర అమ్మకాలు మరింత అధికంగా 26 శాతం ఎగసి రూ. 4406 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం(ఇబిటా) 5 శాతం పుంజుకుని రూ. 466 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 12.7 శాతం నుంచి 10.6 శాతానికి బలహీనపడ్డాయి.  టైటన్‌ వాచెస్‌ మార్కెట్‌ బాగా  ఉన్నట్టు చెప్పారు. వాచ్‌ల అమ్మకాల విషయంలో  అత్యుత్తమ క్వార్టర్లలో ఒకటిగా ఈ క్యూ2 క్వార్టర్‌ నిలిచిందని తెలిపారు. నిర్వహణ లాభం 5 శాతం పెరిగి రూ.467 కోట్లకు పెరిగిందని తెలిపారు. గత క్యూ2లో 12.7 శాతంగా ఉన్న ఎబిటా మార్జిన్‌ ఈ క్యూ2లో 10.6 శాతానికి తగ్గిందని  ఆయన పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement