jewellers buying
-
ఇప్పుడు దుబాయ్‌లో గోల్డ్ కొంటే లాభమా?
కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ 2024-25లో బంగారం మీద కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తూ ప్రకటించింది. దీంతో దేశంలో పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గాయి. చాలా రోజుల తరువాత భారీ మొత్తంలో బంగారం తగ్గడం ఇదే మొదటిసారి. బడ్జెట్ ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు తులం బంగారం ధర ఏకంగా రూ. 4000 తగ్గింది.సాధారణంగా దుబాయ్ వెళ్లే భారతీయులు చాలా వరకు బంగారం కొనుగోలు చేసి ఇండియాకు తీసుకు వస్తారు. అయితే బడ్జెట్ ప్రకటించిన తరువాత ఇండియాలో గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. ఈ తరుణంలో బంగారం దుబాయ్ నుంచి కొనుగోలు చేయడం లాభదాయకమేనా అనేది ఒక ప్రశ్న. దీనికి పోప్లీ గ్రూప్ ఆఫ్ జువెలర్స్ డైరెక్టర్ రాజీవ్ పాప్లీ సమాధానమిచ్చారు.కస్టమ్స్ డ్యూటీని భారతదేశంలో 6 శాతానికి తగ్గించారు. నిజానికి భారతదేశంలో కంటే దుబాయ్‌లో బంగారం తక్కువ అనేది కేవలం అపోహ మాత్రం. ఎందుకంటే మన దేశంలోనే కార్మిక వ్యయం తక్కువగా ఉంది. దీని వల్ల ఇండియాలో ధరలు గణనీయంగా తగ్గుతాయని రాజీవ్ పాప్లీ అన్నారు.దుబాయ్‌లో నివాసముంటున్న ఎన్నారైలకు వ్యాట్ రీఫండ్లు లభించవు. అయితే విదేశాలకు వెళ్లి బంగారం కొనుగోళ్లు చేసే భారతీయులు వ్యాట్‌లో 60 శాతం మాత్రమే తిరిగి పొందుతారు.ఇక్కడ మరో విషయం ఏమిటంటే మాకు భారతదేశం, యుఎఇ రెండింటిలోనూ స్టోర్లు ఉన్నాయి. ఇక్కడున్న వారు తమ జీవిత భాగస్వాములకు బంగారు గాజులు, నెక్లెస్ వంటివి కొనుగోలు చేసి తీసుకువస్తారు. అయితే గాజులు వారి చేతులకు సరిపోకపోవడం, నెక్లెస్ డిజైన్ నచ్చకపోవడం వల్ల మళ్ళీ వాటిని భారతదేశంలో మార్చాల్సి ఉంటుంది. ఇది సమయం వృధా మాత్రమే కాకుండా.. ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది అని రాజీవ్ పాప్లీ వెల్లడించారు. -
వామ్మో.. ఒక్కరోజే రూ. 3,000 కోట్ల బంగారం కొన్నారు, ఎందుకో తెలుసా!
కోవిడ్ పరిస్థితి కారణంగా వరుసగా రెండేళ్లుగా నగల వ్యాపారంలో అమ్మకాల్లో పెద్దగా లేవనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కర్వా చౌత్ వేడుక అరుదైన రికార్డు నమోదు చేసింది. గురువారం ఒక్కరోజే రూ. 3,000 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు జరిగాయి. ట్రేడర్స్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) డేటా ప్రకారం, సుమారు రూ. 3,000 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాల అమ్మకాలు జరిగాయని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించింది. ఏడాది క్రితం సుమారు రూ.2,200 కోట్ల బంగారం ఆభరణాలు అమ్ముడయ్యాయని పేర్కొంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,000 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.48,000గా ఉండగా, వెండి కిలో రూ.59,000కు చేరుకుందని కెయిట్, ఏఐజేజీఎఫ్ తెలిపాయి. “వ్యాపార పరంగా బంగారం వెండి వ్యాపారులు అక్టోబర్, నవంబర్ నెలలను ప్రత్యేకంగా భావిస్తారు. కర్వా చౌత్ తర్వాత, పుష్య నక్షత్రం, ధంతేరాస్, లక్ష్మీ పూజ, దీపావళి, భయ్యా దూజ్, ఛత్ పూజ, తులసి వివాహ వంటి పండుగలతో ఈ నెల నిండి ఉంటుంది, వీటన్నింటిని అట్టహాసంగా జరుపుతారు’ అని కెయిట్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్, ఏఐజేజీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు. ప్రజలు ఈ ఏడాది భారీ మొత్తంలో లైట్ వెయిట్ జ్యువెలరీ కొనుగోలు చేశారని, సిల్వర్ ఆభరణాలు, ఫ్యాషన్ జ్యువెలరీ, ట్రెడిషనల్ జ్యువెలరీ భారీగా స్థాయిలోనే కొన్నారన్నారు. చదవండి: యాపిల్‌కు భారీ షాక్.. అవి లేకపోతే ఐఫోన్లు అమ్మకండి! -
నష్టాల మార్కెట్లో టైటన్ మెరుపులు
సాక్షి, ముంబై: నష్టాల మార్కెట్లో టైటన్ కంపెనీ మెరుపులు మెరిపించింది. 250 పాయింట్లకు పైగా సోమవారం నాటి మార్కెట్లో టైటన్ 6 శాతం పుంజుకుని టాప్ గెయినర్‌గా నిలిచింది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలను అందుకోవడంతో వాచీలు, జ్యువెలరీ దిగ్గజం టైటన్ కంపెనీ కౌంటర్ జోరందుకుంది. టైటన్ క్యూ2 ఫలితాలు ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో టాటా గ్రూప్ సంస్థ టైటన్ కంపెనీ నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 314 కోట్లను ప్రకటించింది. నికర అమ్మకాలు మరింత అధికంగా 26 శాతం ఎగసి రూ. 4406 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం(ఇబిటా) 5 శాతం పుంజుకుని రూ. 466 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 12.7 శాతం నుంచి 10.6 శాతానికి బలహీనపడ్డాయి. టైటన్ వాచెస్ మార్కెట్ బాగా ఉన్నట్టు చెప్పారు. వాచ్‌ల అమ్మకాల విషయంలో అత్యుత్తమ క్వార్టర్లలో ఒకటిగా ఈ క్యూ2 క్వార్టర్ నిలిచిందని తెలిపారు. నిర్వహణ లాభం 5 శాతం పెరిగి రూ.467 కోట్లకు పెరిగిందని తెలిపారు. గత క్యూ2లో 12.7 శాతంగా ఉన్న ఎబిటా మార్జిన్ ఈ క్యూ2లో 10.6 శాతానికి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. -
వరుసగా నాలుగో రోజు బంగారం జంప్
న్యూఢిల్లీ : వరుసగా నాలుగో రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. స్థానిక జువెల్లర్ల కొనుగోళ్ల మద్దతుతో మంగళవారం రోజు బంగారం ధర 10 గ్రాములకు రూ.190 పెరిగి రూ.31,850గా నమోదైంది. ఇదే సమయంలో వెండి ధరలు రూ.150 మేర పడిపోయాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు కేజీకి రూ.150 తగ్గి, రూ.39,550గా ఉన్నాయి. డాలర్ బలహీనపడటంతో, అంతర్జాతీయంగా బంగారానికి పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుందని ట్రేడర్లు చెప్పారు. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నట్టు పేర్కొన్నారు. గ్లోబల్‌గా బంగారం ధరలు 0.03 శాతం పెరిగి 1,333.30 డాలర్లుగా నమోదయ్యాయి. అంతేకాక స్థానికంగా కూడా జువెల్లర్లు తమ కొనుగోళ్లను పెంచారు. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో జువెల్లర్ల నుంచి బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో దేశీయ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.190 చొప్పున పెరిగి రూ.31,850గా, రూ.31,700గా రికార్డయ్యాయి. గత మూడు సెషన్లలో బంగారం ధర రూ.310 మేర పెరిగింది. -
మళ్లీ పసిడి పరుగులు
న్యూఢిల్లీ : దేశీయ బులియన్ మార్కెట్లో పెరిగిన పసిడి కొనుగోలు, అంతర్జాతీయ సంకేతాలతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు ఎగిసి, రూ.31,150ల వద్ద నమోదైంది. గతవారంలో కొంత తగ్గుముఖం పట్టిన ఈ ధరలు మళ్లీ పెరగడం గమనార్హం. వెండి సైతం రూ.45వేల మార్కును అధిగమించింది. 525 రూపాయలు ఎగిసి, కేజీ సిల్వర్ ధర రూ.45,500గా రికార్డైంది. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి మళ్లీ సిల్వర్‌కు డిమాండ్ పెరగడంతో, ఈ మేరకు సిల్వర్ ధరలు ఎగిశాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గ్లోబల్‌గా పెరిగిన ధరలతోనూ బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయని వెల్లడిస్తున్నాయి. గ్లోబల్‌గా ఔన్స్‌కు బంగారం ధర 0.4 శాతం పెరిగి 1,315.30 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ కూడా 2.1 సైతం పెరిగింది. దేశీయ మార్కెట్లో జ్యువెలర్స్ కొనుగోలు, పారిశ్రామిక వర్గాలు, కాయిన్ తయారీదారుల కొనుగోళ్ల మద్దతుతో ఈ విలువైన మెటల్స్ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.