మళ్లీ పసిడి పరుగులు
మళ్లీ పసిడి పరుగులు
Published Mon, Sep 19 2016 6:13 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
న్యూఢిల్లీ : దేశీయ బులియన్ మార్కెట్లో పెరిగిన పసిడి కొనుగోలు, అంతర్జాతీయ సంకేతాలతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు ఎగిసి, రూ.31,150ల వద్ద నమోదైంది. గతవారంలో కొంత తగ్గుముఖం పట్టిన ఈ ధరలు మళ్లీ పెరగడం గమనార్హం. వెండి సైతం రూ.45వేల మార్కును అధిగమించింది. 525 రూపాయలు ఎగిసి, కేజీ సిల్వర్ ధర రూ.45,500గా రికార్డైంది.
ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి మళ్లీ సిల్వర్కు డిమాండ్ పెరగడంతో, ఈ మేరకు సిల్వర్ ధరలు ఎగిశాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గ్లోబల్గా పెరిగిన ధరలతోనూ బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయని వెల్లడిస్తున్నాయి. గ్లోబల్గా ఔన్స్కు బంగారం ధర 0.4 శాతం పెరిగి 1,315.30 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ కూడా 2.1 సైతం పెరిగింది. దేశీయ మార్కెట్లో జ్యువెలర్స్ కొనుగోలు, పారిశ్రామిక వర్గాలు, కాయిన్ తయారీదారుల కొనుగోళ్ల మద్దతుతో ఈ విలువైన మెటల్స్ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Advertisement