ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే 2025 సోమవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,150 (22 క్యారెట్స్), రూ.78,710 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఆదివారం ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధర స్థిరంగానే కొనసాగుతుంది. చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.72,150 రూ.78,710గా ఉంది.
దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి(Gold) ధర రూ.72,300గా ఉండగా, 24 క్యారెట్ బంగారం ధర రూ.78,860గా ఉంది. సోమవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేనట్లే వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు వెండి ధర(Silver Price) కేజీకి రూ.99,000గా ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
Comments
Please login to add a commentAdd a comment