Gain
-
ఈ వారం టాప్ 10 కంపెనీలు.. రూ. 1.03 లక్షల కోట్లు
ఈ వారం టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలు కలిసి మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 1.03 లక్షల కోట్లను పొందాయి. ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ లిమిటెడ్ అత్యధిక లాభాన్ని పొందాయి.టీసీఎస్ మార్కెట్ విలువ ఈ వారం దాదాపు రూ.43,000 కోట్లు పుంజుకుని రూ.15.57 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం 0.51% పెరిగింది. ఇన్ఫోసిస్ రూ.33,000 కోట్లు లాభపడింది. దాని మార్కెట్ విలువ రూ.7.44 లక్షల కోట్లకు చేరుకుంది.కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టాప్ 10 సంస్థలలో అత్యధికంగా రూ.57,000 కోట్లు క్షీణించింది. దీని మార్కెట్ క్యాప్ రూ.21.04 లక్షల కోట్లకు తగ్గిపోగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.12,000 కోట్లు తగ్గి 12.23 లక్షల కోట్లకు పడిపోయింది.అయితే క్షీణించినప్పటికీ ఆర్ఐఎల్ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ, లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
‘రోబో గోడ’: బండరాళ్లను ఎత్తి, క్రమపద్ధతిలో పేరుస్తూ..
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని అంటుంటారు. పూర్వకాలంలో ఈ రెండు పనులూ ఎంతో శ్రమ, ఖర్చుతో కూడినవి కావడంతో అలా అనేవారు. అయితే ఇప్పుడు ఈ రెండు పనులు రోబోలు అత్యంత సులభంగా చేసేస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో కొందరు.. రోబోలను వివాహం చేసుకుంటున్నారనే వార్తలు వింటున్నాం. కొత్తగా ఇప్పుడు ఇళ్లను రోబోలే స్వయంగా కట్టేస్తున్నాయి. అది కూడా అత్యంత ధృఢంగా.. పురాతన పద్ధతిలో.. ఆధునికత మేళవిస్తూ.. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా ఇంటి నిర్మాణంలో బండరాళ్లను ఒక పద్ధతిలో పేర్చడం అనేది ఎంతో శ్రమతో కూడిన పని. ఇందుకోసం శారీరకంగానే కాదు..మానసికంగానూ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ రోబో ఈ పనిని చిటికెలో చేసేస్తోంది. ఇంటికి అవసరమయ్యే గోడ నిర్మాణాలను చేపట్టే ఈ రోబోట్ పేరు ‘హీప్’(హెచీఈఏపీ) ఇదొక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్. ఇది వాకింగ్ ఎక్స్కవేటర్ కూడా. దీనిని ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధనా సంస్థ బృందం తయారుచేసింది. ఈ రోబోలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్, కంట్రోల్ మాడ్యూల్, తవ్వకాల ఆర్మ్‌పై లిడార్ సెన్సార్లు ఉన్నాయి. ఈ రోబో తాను చేపడుతున్న తాజా ప్రాజెక్ట్ కోసం నిర్మాణ స్థలాన్ని స్కాన్ చేసి, దాని త్రీడీ మ్యాప్‌ను రూపొందించడం ద్వారా పనిని ప్రారంభించింది. తరువాత ఆ సైట్లో డంప్ చేసిన బండరాళ్లను గోడలో ఎక్కడ ఉంచాలనేది రికార్డ్ చేసింది. అనంతరం ‘హీప్’ ప్రతి బండరాయిని భూమి నుండి పైకి లేపింది. ఇందుకోసం దాని బరువు, గురుత్వాకర్షణ కేంద్రాన్ని అంచనా వేయడానికి, దాని ప్రత్యేక ఆకారాన్ని రికార్డ్ చేయడానికి సాంకేతికతను ఉపయోగించింది. ఒక అల్గారిథమ్ రూపకల్పన అనంతరం 20 అడుగుల ఎత్తు, 65 మీటర్ల పొడవైన రాతి గోడను నిర్మించడానికి ప్రతి బండరాయిని అది చక్కగా ఇమిడిపోయే ప్లేస్‌లో అమర్చింది. ఒక్కో బిల్డింగ్ సెషన్‌కు దాదాపు 20 నుండి 30 బండరాళ్లను వాటి స్థానాల్లో ఉంచింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ నూతన రోబో వ్యవస్థ.. నిర్మాణ రంగాన్ని మరింత సులభతరం చేస్తుంది. బండరాళ్లను తీసుకురావడం మొదలుకొని, వాటితో సరైన గోడను నిర్మించేవరకూ ‘హీప్’ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోబో అధ్యయనానికి సంబంధించిన పత్రం ఇటీవల సైన్స్ రోబోటిక్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈటీహెచ్ జ్యూరిచ్ అందించిన ఈ వీడియోలో ‘హీప్’ గోడ నిర్మాణాన్ని చూడవచ్చు. ఇది కూడా చదవండి: కోపాన్ని పెంచేస్తున్న కాలుష్యం.. -
సాక్షి మనీ మంత్రా: రికార్డు స్థాయినుంచి వెనక్కి, ఐటీ జోరు
దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందనే దేశీయ ద్రవ్యోల్బణం ఆందోళన కుదుట పడిన నేపథ్యంలో ఆరంభంలో భారీగా ఎగిసింది. ఫలితంగా ఆల్ టైం గరిష్టానికి చేరిన సూచీలు డే హై నుంచి వెనక్కి తగ్గాయి. లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 165 పాయింట్ల లాభానికి పరిమితమై 65,559 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు లాభంతో పెరిగి 19,414 వద్ద ముగిసింది. ప్రధానంగా ఐటీ, రియల్టీ షేర్లు మార్కెట్ లాభాలను నిలబెట్టాయి. ఫలితంగా నిఫ్టీ 19400 ఎగువన, సెన్సెక్స్ 65500 కి ఎగువన స్థిరపడడటం విశేషం. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టిసిఎస్, ఇన్ఫోసిస్, ఎల్‌టిఐఎండ్‌ట్రీ, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్‌గా ఉండగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, బిపిసిఎల్, యుపిఎల్, మారుతీ సుజుకీ నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజి, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్, పవర్ రంగాలలో అమ్మకాలు కనిపించగా, బ్యాంక్, మెటల్, రియాల్టీ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేర్లలో బైయింగ్ కనిపించింది. విశేషాలు - సెన్సెక్స్ తొలిసారిగా చారిత్రాత్మక 66,000 మార్క్‌ను అధిగమించింది. - సెన్సెక్స్ డే హై నుంచి 600 పాయింట్లు పతనమైంది - 19567 పాయింట్ల వద్ద నిఫ్టీ ఆల్ టైం హై - నిఫ్టీ 160 పాయింట్లు క్షీణించి, ఒక దశలో 19,400 దిగువకు జారిపోయింది. చివరికి ఈ స్థాయిని నిలబెట్టుకుంది. - నిఫ్టీ బ్యాంక్ రోజు గరిష్టం నుండి 400 పాయింట్లకు పైగా క్షీణించింది. రూపాయి రూపాయి మార్కెట్ల మద్దతుతో ఆరంభంలో 21పైసలు ఎగిసింది. చివరికి గత ముగింపు 82.24తో పోలిస్తే డాలర్ మారకంలో రూపాయి 17 పైసలు పెరిగి 82.07 వద్ద ముగిసింది. Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు -
సోషల్ మీడియా సాయంతో... ఎన్నికల్లో అనుచిత లబ్ధి
న్యూఢిల్లీ: సోషల్ మీడియా సాయంతో ఎన్నికల్లో అధికార బీజేపీ అనుచిత లబ్ధి పొందుతోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని చెరపట్టేందుకు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి గ్లోబల్ సోషల్ మీడియా కంపెనీలను అధికార పార్టీ పథకం ప్రకారం పక్కాగా దుర్వినియోగపరుస్తోందని దుయ్యబట్టారు. సోనియా బుధవారం లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడారు. ‘‘ఈ సోషల్ మీడియా దిగ్గజాలు భారత ఎన్నికల రాజకీయాలను అనుచితంగా ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా పాలక పక్షాలకు సాయపడుతూ తాము కూడా లబ్ధి పొందుతున్నాయి’’ అంటూ మండిపడ్డారు. ‘‘రాజకీయంగా జనాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా ప్రభావితం చేసేందుకు ఫేస్బుక్, ట్విట్టర్ తదితరాలను అధికార పార్టీ వాడుకునే ధోరణి భారత్‌లో నానాటికీ పెరిగిపోతోంది. దీనివల్ల ఎన్నికల్లో కొన్ని పార్టీలకే అనుచిత లబ్ధి కలుగుతోంది’’ అని అల్ జజీరా రిపోర్టును ఉదహరిస్తూ ఆమె ఆరోపించారు. ఎన్నికల ప్రకటనల కోసం ఇతర పార్టీల కంటే బీజేపీకి ఫేష్బుక్ చౌక డీల్స్ ఆఫర్ చేసిందనే రిపోర్టును ఉటంకిస్తూ చెప్పారు. ‘‘ఫేస్బుక్ వంటి గ్లోబల్ సోషల్ మీడియా కంపెనీలకు, అధికార పార్టీలకు మధ్య నెలకొన్న అనైతిక బంధానికి రిపోర్టు అద్దం పడుతోంది. ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా కంపెనీలు భావోద్వేగాలు దట్టించిన తప్పుడు సమాచారంతో పెద్దలతో పాటు యువత మనసులను పథకం ప్రకారం విద్వేషంతో నింపుతున్నాయి. అంతిమంగా ఈ ధోరణిని అటు అధికార పార్టీ ఎన్నికల్లో తనకు అనువుగా మలచుకుంటోంది. ఇటు సోషల్ మీడియా కంపెనీలూ భారీగా లాభం చేసుకుంటున్నాయి. పాలక పక్షం దన్నుతో భారత సమాజంలో మత సామరస్యాన్ని ఫేస్బుక్ దారుణంగా చెడగొడుతోంది’’ అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ‘‘ప్రజాస్వామ్యానికి ఇది చాలా ప్రమాదకరం. సోషల్ మీడియా దుర్వినియోగం రూపంలో భారత ఎన్నికల రాజకీయాలకు ఎదురవుతున్న ఈ పెను ప్రమాదాన్ని తక్షణం అడ్డుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. అధికారంలో ఎవరున్నారన్న దానితో నిమిత్తం లేకుండా ప్రజాస్వామిక, సామాజిక సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిమీదా ఉందన్నారు. సోనియా ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఐటీ చట్టంలో 66ఏ సెక్షన్ ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నించిందని ఆరోపించింది. ఫేస్బుక్ ప్రజాస్వామ్యానికే చేటు: రాహుల్ సోనియా వాదనకు రాహుల్‌గాంధీ కూడా మద్దతు పలికారు. ఫేస్‌బుక్‌ను ప్రజాస్వామ్యానికే చేటుగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు చేరువయ్యేందుకు బీజేపీకి ఫేస్బుక్ అనుచిత రీతిలో సాయపడిందని ట్విట్టర్లో తీవ్ర ఆరోపణలు చేశారు. అల్‌జజీరా, ద రిపోర్టర్స్ కలెక్టివ్ రిపోర్టులను టాగ్ చేశారు. ఎన్నికల యాడ్స్ కోసం బీజేపీకి చౌక డీల్స్‌ను ఫేస్బుక్ ఆఫర్ చేసిందన్న సోనియా ఆరోపణను పునరుద్ఘాటించారు. -
ఒక్క నెలలోనే యస్ బ్యాంకు రికార్డు లాభం
సాక్షి, ముంబై : వరుస వివాదాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయిన ప్రయివేటు బ్యాంకు యస్ బ్యాంకు రికార్డు స్తాయి లాభాలతో దూసుకుపోతోంది. రుణాల సేకరణ ప్రయత్నాలు ఒక కొలిక్కి రానుండటంతో పాటు, రాకేష్ ఝన్‌ఝన్ వాలా షేర్ల కొనుగోలు పరిణామాల నేపథ్యంలో యస్ బ్యాంక్ షేర్లు ఒక నెలలో 78 శాతానికిపైగా పుంజుకున్నాయి. దీంతో ఒక బిలియన్ డాలర్లకు పైగా ఎక్కువ విలువైన కంపెనీల వరుసలో చేరింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లాభంగా నిలవడం విశేషం. గత ఏడాదిలో 68 శాతం కోల్పోగా, ఈ సంవత్సరం ప్రారంభంనుంచి 61శాతం పడిపోయి, సెప్టెంబర్ 2019 చివరలో, వ్యవస్థాపకుడు రానా కపూర్, ఇతర ప్రమోటర్ల వాటాల విక్రయంతో 2019లో అతిచెత్త ప్రదర్శన కనబర్చిన కంపెనీగా దిగజారిపోయింది. అయితే ఇటీవల నిధుల సేకరణకు బ్యాంకు యాజమాన్యం ప్రయత్నాలుముమ్మరంలో చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికి తోడు ప్రముఖ పెట్టుబడిదారుడు నవంబరు 5వ తేదీన రాకేష్ ఝన్ ఝన్‌వాలా రూ. 87కోట్ల విలువైన 1.3 కోట్ల షేర్లను కొనుగోలు చేయడం మరింత సానుకూలంగా మారింది. దీంతో వరుస సెషన్లుగా లాభపడుతూ వచ్చిన యస్ బ్యాంకు షేరు సోమవారం నాటి ట్రేడింగ్‌లో మరో 5 శాతం ఎగిసి రూ.72.90వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 71.35 గరిష్టాన్ని తాకింది. అక్టోబర్ 1 న, యస్ బ్యాంక్ షేర్ ధర 23 శాతానికి పైగా పడిపోయి రూ. 29 వద్ద 52 వారాల కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. -
డీహెచ్ఎఫ్ఎల్ లాభం 26 శాతం అప్
న్యూఢిల్లీ: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) నాలుగో త్రైమాసిక కాలంలో రూ. 312 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.248 కోట్లు)తో పోల్చితే 26 శాతం వృద్ధి సాధించామని డీహెచ్ఎఫ్ఎల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,377 కోట్ల నుంచి 18 శాతం పెరిగి రూ.2,808 కోట్లకు వృద్ధి చెందిందని కంపెనీ సీఎమ్‌డీ కపిల్ వాధ్వాన్ తెలిపారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2.50 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. గతంలో ఇచ్చిన మధ్యంతర డివిడెండ్‌ను కూడా కలుపుకుంటే, గత ఆర్థిక సంవత్సరానికి మొత్తం డివిడెండ్ రూ.5.50గా ఉందని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 2016–17లో రూ.927 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం వృద్ధితో రూ.1,172 కోట్లకు పెరిగిందని వాధ్వాన్ వివరించారు. మొత్తం ఆదాయం రూ.8,857 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.10,465 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ షేర్ 1 శాతం లాభంతో రూ.641 వద్ద ముగిసింది. -
ఆర్బీఐ ఎఫెక్ట్: రికార్డ్ హైలో బ్యాంక్ నిఫ్టీ
ముంబై: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించిన పాలసీ రివ్యూ ప్రకనట మార్కెట్లకు జోష్ నిచ్చింది. ఆర్బీఐ అనుసరించిన మరోసారి యథాతథ పాలసీ ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. సెన్సెక్స్ 81 పాయింట్లు అధిగమించి 31271 వద్ద నిఫ్టీ 27 పాయింట్లు బలపడి 9663 వద్ద స్థిరంగా ముగిశాయి. ముఖ్యంగా ఆర్బీఐ పాలసీ ప్రకటన తో ప్రభుత్వ, ప్రయివేటుబ్యాంకులతోపాటు, హౌసింగ్ ఫైనాన్సింగ్ సెక్టార్లో లార్జ్ క్యాప్స్‌లో బైయింట్ ఇంట్రరెస్ట్ తో మార్కెట్లలో మంచి ర్యాలీ కనిపించింది. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టం 23,606ను తాకింది. తొలిసారి నిఫ్టీ 23,500పైన ముగిసింది. ఎస్బీఐ, పీఎన్బీ లాంటి ప్రభుత్వరంగ బ్యాంకులు పుంజుకున్నాయి. యాక్సిస్, ఐసీఐసీబ్యాంక్, కెనరా బ్యాంక్, లాభాలతో ముగిశాయి. అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లకు డిమాండ్ పుట్టింది. కేన్‌ఫిన్ హోమ్, పీఎన్బీ హౌసింగ్, జీఐసీ హసింగ్, గృహ్ ఫైనాన్స్, దివాన్ హౌసింగ్, ఎల్ఐసీ హౌసింగ్ తదితరాలు లాభడ్డాయి. వీటితోపాటు అరబిందో ఫార్మ, ఆర్ఐఎల్, ఐషర్ మోటార్స్, ఎంఅండ్ఎం వేదాంత లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ లాస్ట్ మినిట్‌లో లాభాల్లోకి మళ్లింది. ఐటీ ఇండెక్స్ పతనమైంది. అయితే చివరలో కొద్దిగా నష్టాలనుంచి కోలుకుంది. రిలయన్స్ లాస్ట్ మినిట్‌లో లాభాల్లోకి మళ్లి టాప్ విన్నర్‌గా నిలవడం విశేషం. అటు డాలర్ మారకంలో రుపీ 0.07 పైసల లాభంతో రూ.64.36 వద్ద ఉంది. పుత్తడి ఎంసీఎక్స్ మార్కెట్ లో రూ.70 క్షీణించి, పదిగ్రా. రూ.29,497 వద్ద ఉంది. -
మార్కెట్లకు ఆర్బీఐ పాలసీ కిక్
ముంబై: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించిన పాలసీ రివ్యూ ప్రకనట మార్కెట్లకు జోష్ నిచ్చింది. ఆర్బీఐ అనుసరించిన మరోసారి యథాతథ పాలసీ ఉదయం నుంచి వేచి చూసే దోరణితో ఉన్న ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో మిడ్ సెషన్ తరువాత ఫ్లాట్‌గా మారిన మార్కెట్లు పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 82 పాయింట్లు అధిగమించింది. నిఫ్టీ 23 పాయింట్లు బలపడింది. ముఖ్యంగా పాలసీ సమీక్ష కారణంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ బాగా లాభపడుతోంది. ముఖ్యంగా పాలసీ సమీక్ష కారణంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ బాగా లాభపడుతోంది. దీంతో బ్యాంక్ నిఫ్టీ రికార్డ్ స్థాయిని నమోదు చేయగా, పీఎన్బీ, ఐసీఐసీఐ, కెనరా బ్యాంక్ సహా ఇతర బ్యాంకు షేర్లు లాభాలనార్జిస్తున్నాయి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు భారీగా పుంజుకున్నాయి. డీహెచ్ ఎఫ్‌ల్ పుంజుకుంది. ఫార్మా కూడా 1.5 శాతం లాభాలతో ఉంది. ఇంకా నిఫ్టీ దిగ్గజాలలో అరబిందో, రిలయన్స్, వేదాంతా, ఎంఅండ్ఎం, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, హెచ్‌యూఎల్, మారుతీలా భాల్లోకొనసాగుతున్నాయి. అయితే మంగళవారం నాటి ట్రేడింగ్ లో బాగా బలపడిన ఐటీ ఇండెక్స్ నేడు కుదైలేంది. టీసీఎస్, టెక్‌మహీంద్రా, విప్రో, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్ భారీగా క్షీణించాయి. -
ఎరువుల షేర్లకు యూరియా పాలసీ బూస్ట్
ముంబై: నేషనల్ యూరియా పాలసీలో మార్పులకు శుక్రవారం క్యాబినెట్ ఆమోదించనందనే అంచనాలతో ఫెర్టిలైజర్స్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. యూరియా ఉత్పత్తిని గణనీయంగా పెంచాలనే ప్రధాన లక్ష్యంతో కేంద్రం నేషనల్ యూరియా పాలసీలో మార్పులు తేనుంది. దేశీయ యూరియా ఉత్పత్తిలో ఎనర్జీ సామర్ద్యం, ప్రోత్సాహం, ప్రభుత్వంపై సబ్సిడీ భారం హేతుబద్ధీకరించడం లాంటి చర్యలపై దృష్టిపెట్టనుంది. జాతీయ యూరియా విధాన సవరణను కేంద్ర కేబినెట్ చేపట్టనున్నట్లు వెలువడ్డ వార్తలతో ఎరువుల కంపెనీ షేర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ (ఫ్యాక్ట్ ) 17 శాతం దూసుకెళ్లగా.. మద్రాస్ ఫెర్టిలైజర్స్ 14 శాతం, ఆర్సీఎఫ్ 13 శాతం, చంబల్ 8 శాతం, దీపక్ 8 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో 3.1 శాతం కోరమాండల్ ఇంటర్నేషనల్ 3.4శాతం పెరిగింది, దీపక్ ఫెర్టిలైజర్స్ 3.2శాతం , సదరన్ పెట్రోకెమ్ 7 శాతం, జువారీ ఆగ్రో, మంగళూర్ కెమ్, ఎన్ఎఫ్సీఎల్ 5 శాతం, జీఎన్ఎఫ్సీ 4 శాతం చొప్పున దూసుకుపోయాయి. కాగా మే 2015 లో, యూనియన్ క్యాబినెట్ తరువాతి నాలుగు ఆర్థిక సంవత్సరాలకుగాను (జూన్ 2015-మార్చి 2019) ఒక సమగ్ర న్యూ యూరియా విధానాన్ని ఆమోదించింది తాజాగా ఎరువుల సబ్సిడీలను వాస్తవిక అమ్మకాల ఆధారంగా బదిలీ చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
17 నెలల గరిష్టానికి రూపాయి
37 పైసల లాభంతో 65.04 వద్ద ముగింపు ముంబై: రూపాయి జోరు పెరుగుతోంది. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం 37 పైసలు లాభపడి 65.04 వద్ద ముగిసింది. ఇది 17 నెలల గరిష్ట స్థాయి. రూపాయి ఒక్క రోజులో ఇన్ని పైసలు లాభపడడం ఈ ఏడాది ఇది రెండో సారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఆరోగ్య సంరక్షణ బిల్లుకు చుక్కెదురవ్వడంతో స్పెక్యులేటర్లు, ట్రేడర్లు డాలర్లను తెగనమ్మారని, దీంతో రూపాయి ఈ రేంజ్లో పెరిగిందని నిపుణులంటున్నారు. ఫారెక్స్ మార్కెట్లో గత శుక్రవారం నాటి ముగింపు(65.41)తో పోల్చితే డాలర్‌తో రూపాయి మారకం 65.27 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65.01 గరిష్ట స్థాయిని తాకి చివరకు 37 పైసల (0.57 శాతం)లాభంతో 65.04 వద్ద ముగిసింది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంస్కరణలు రానున్నాయనే అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరుగా ఉండడం, విదేశీ కరెన్సీలతో పోల్చితే డాలర్ బలహీనపడుతుండడం వంటి కారణాల వల్ల రూపాయి బలపడుతోందని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. -
శాంసంగ్ పెయిన్.. ఆపిల్ గెయిన్
స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు యాపిల్, శాంసంగ్ మధ్య జరుగుతున్న పోరులో అమ్మకాల పరంగా శాంసంగ్ రారాజులా వెలిగిన మాట వాస్తవం. కానీ తాజా స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 7 వైఫల్యం శాంసంగ్ ప్రతిష్టను దిగజార్చడంతోపాటూ ఆదాయానికి తీవ్ర గండి పడింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసిన 'నోట్ 7' ఫోన్లను దాదాపు 25 లక్షలకుపైగా రీకాల్ చేయనున్నట్టు ప్రకటించడం సంస్థకు తీరని నష్టాన్నిమిగిల్చింది. చివరకు రీప్లేస్ చేసిన ఫోన్లనుంచి పొగలు రావడంతో మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో శాంసంగ్ ఆదాయం 17 బిలియన్ డాలర్లు (1,13, 517,41,50,000 లక్షా పదమూడు వేల అయిదువందల కోట్లు) దాదాపు రూ. 1.14 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఎనలిస్టులు అంచనావేశారు. మరోవైపు బ్యాటరీ పేలుడు ప్రమాదాలతో శాంసంగ్ కేసులను కూడా ఎదుర్కొంటోంది. ఇది చాలదన్నట్టు ఆపిల్ కు అనుకూలంగా ఫెడరల్ కోర్టు తీర్పుతో శాంసంగ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇరు సంస్థల మధ్య దీర్ఘకాలంగా సాగుతున్న పేటెంట్ హక్కుల వివాదం లో ఆపిల్ వాదనలను కోర్టు సమర్ధించిన సంగతి తెలిసిందే. గెలాక్సీ నోట్ 7 ఉత్పత్తిని శాశ్వంగా నిలిపి వేస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించడంతో మార్కెట్లో ఈ షేర్ ధర భారీగా పడిపోయింది. శాంసంగ్ పరిస్థితి ఇలా ఉంటే ఆపిల్ క్రమంగా పుంచుకుంటోంది. శాంసంగ్ ఫస్ట్ రీకాల్ తర్వాత శాంసంగ్ 8 శాతం క్షీణించగా, ఆపిల్ షేర్లు దాదాపు 10 శాతం లాభపడ్డాయి. అలాగే ఇటీవల లాంచ్ చేసిన ఐ ఫోన్ 7 స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయనీ ఆపిల్ స్వయంగా ప్రకటించింది. ఎన్ని ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేసిందీ వెల్లడించడానికి నిరాకరించిన ఆపిల్ అన్ని యూనిట్లను విక్రయించినట్టు పేర్కొంది. గెలాక్సీ నోట్ 7 వైఫల్యంతో కేవలం 10 బిలియన్ డాలర్లు మేరకు శాంసంగ్ నష్టపోయే అవకాశం ఉందనీ, గత నెల షేర్ పతనం అంత భారీదికాదని మరికొంతమంది ఎనలిస్టుల అంచనా. సంస్థ తన తరువాతి స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 8 హిట్అయితే ఈ నష్టాలనుంచి కోలుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్వార్టర్ లో ఆపిల్ కు 45 మిలియన్ల ఐ ఫోన్లు అమ్మడు పోయాయనీ, గత ఏడాది 48 మిలియన్లతో పోలిస్తే ఇది క్షీణత అని ఎనలిస్టులంటున్నారు. శాంసంగ్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 15.6 లక్షల కోట్లు. అయితే, ఈ మధ్య కాలంలో ఈ కంపెనీ విక్రయాలు కొంతమేర పడిపోయాయి. దీనికి తోడు గతం వారం భారీ నష్టాలతో... కంపెనీ విలువ కూడా తగ్గపోయే అవకాశం ఉందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
కొత్త పంటలతో అధిక దిగుబడులు
పి.కోటకొండ(దేవనకొండ) : కొత్త పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్ రైతులకు పిలుపునిచ్చారు. దేవనకొండ మండలం పి. కోటకొండ సమీప పొలాల్లో సాగు చేసిన గర్కిన్ దోస, అల్లోమిన్ పంటలను ఆయన మంగళవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట దిగుబడులు, ఇతర వివరాలు తెలుసుకున్నారు. అల్లోమిన్ మిరప పంటను జిల్లాలో ఎక్కడా సాగు చేయడంలేదని, పి.కోటకొండ గ్రామంలో సాగుచేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. కొత్తకొత్త పంటలను సాగుచేసి పలువురు రైతులకు ఆదర్శంగా నిలవాలన్నారు. పంటలకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్ తిరుమలవాణి, వీఆర్వో సీతారామిరెడ్డి, ఉద్యానవనశాఖ సిబ్బంది ఉన్నారు. -
మళ్లీ పసిడి పరుగులు
-
మళ్లీ పసిడి పరుగులు
న్యూఢిల్లీ : దేశీయ బులియన్ మార్కెట్లో పెరిగిన పసిడి కొనుగోలు, అంతర్జాతీయ సంకేతాలతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు ఎగిసి, రూ.31,150ల వద్ద నమోదైంది. గతవారంలో కొంత తగ్గుముఖం పట్టిన ఈ ధరలు మళ్లీ పెరగడం గమనార్హం. వెండి సైతం రూ.45వేల మార్కును అధిగమించింది. 525 రూపాయలు ఎగిసి, కేజీ సిల్వర్ ధర రూ.45,500గా రికార్డైంది. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి మళ్లీ సిల్వర్‌కు డిమాండ్ పెరగడంతో, ఈ మేరకు సిల్వర్ ధరలు ఎగిశాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గ్లోబల్‌గా పెరిగిన ధరలతోనూ బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయని వెల్లడిస్తున్నాయి. గ్లోబల్‌గా ఔన్స్‌కు బంగారం ధర 0.4 శాతం పెరిగి 1,315.30 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ కూడా 2.1 సైతం పెరిగింది. దేశీయ మార్కెట్లో జ్యువెలర్స్ కొనుగోలు, పారిశ్రామిక వర్గాలు, కాయిన్ తయారీదారుల కొనుగోళ్ల మద్దతుతో ఈ విలువైన మెటల్స్ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సిమెంట్ ధరలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు పెరిగాయి. బస్తాకి రూ.30-40 మధ్య ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సిమెంట్‌కు డిమాండ్ పెరగడమే దీనికి కారణమని ఎనలిస్టులు చెబుతున్నారు. ముఖ్య్ంగా రియల్ రంగంపై ప్రభుత్వం దృష్టి, మంచి వాతారణ వార్తలతో సిమెంట్ కు డిమాండ్ పెరగనుందని ఎనలిస్టులు చెబుతున్నారు. దీంతో గురువారం నాటి మార్కెట్లో దక్షిణాది సిమెంట్ స్టాక్స్ జోరుమీదున్నాయి. సాగర్ సిమెంట్ 4.33 శాతం, ఎన్సీఎల్ 4 శాతం రైన్ ఇండస్ట్రీస్ 3.94 శాతం , కేసీపీ 3.19 శాతం లాభాలతో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సిమెంట్ ధరలు గత రెండు రోజులలో బ్యాగ్ ధర రూ 30-40 పెరిగినట్టు ఎన్ సీఎల్ ఇండస్ట్రీస్ ఈడీ ఎన్జీవీఎస్జీ ప్రసాద్ తెలిపారు. సిమెంట్ విక్రయాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో 65-70 శాతం వాటాను సొంతం చేసుకున్న ఎన్ సీఎల్ తమవ్యాపారంపై మరింత ఆశావహంగా ఉంది. కాగా గత కొన్ని నెలలుగా సిమెంట్ ధరలు దూకుడు మీదున్నాయి. చాలా షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. దీంతో ఈ షేర్లకు డిమాండ్ బాగానే పుంజుకుని మార్కెట్ల ఫేవరెట్‌గా నిలుస్తున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో పలు సిమెంట్ కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించాయి. మొత్తం 36 సిమెంట్ కంపెనీల సంయుక్త నికరలాభం 84 శాతం ఎగసి రూ. 2,823 కోట్లను తాకింది. ముడివ్యయాలు తగ్గడం, సిమెంట్ రియలైజేషన్లు మెరుగుపడటం వంటి అంశాలు కంపెనీల లాభాలు పెంచాయి. -
విదేశీ పెట్టుబడుల ఆక ర్షించేందుకు సంస్కరణలు: జైట్లీ
దావోస్: దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తగిన నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచం భారత్‌ను వృద్ధి దేశంగా పరిగణిస్తోందన్నారు. ప్రపంచంలో కేవలం భారత్ మాత్రమే 7 శాతంపైగా వృద్ధిరేటును నమోదు చేస్తోందని చెప్పారు. ఇన్వెస్టర్లకు భారత్‌పై సానుకూల దృక్పథం ఉందని, వారు భారత్‌ను వృద్ధి అవకాశాల దేశంగా చూస్తున్నారని అందుకే అధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ కార్యక్రమం ఆనంతరం ఆయన పీటీఐ ప్రతినిధితో మాట్లాడారు. తాము నిర్మాణాత్మక సంస్కరణలను కొనసాగిస్తామని, భారత ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతను పెంపొందిస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగ పెట్టుబడుల పునరుద్ధరణకు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, అమెరికా కూడా కొన్ని సమస్యలతో సతమతమౌతోందని, యూరప్‌లో అస్థిరత పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. -
టీఎస్‌కు మిగులు.. ఏపీకి దిగులు
-
టీఎస్‌కు మిగులు.. ఏపీకి దిగులు
- బస్‌భవన్‌లో మళ్లీ ‘విభజన’ కిరికిరి - ఏపీఎస్ఆర్టీసీలో దిగువస్థాయి సిబ్బంది కొరత - అదనంగా ఉన్న తెలంగాణవారిని తీసుకోవడానికి నిరాకరణ - ఆంధ్రా నుంచి ఔట్సోర్సింగ్ సిబ్బందిని తెచ్చుకోవాలని నిర్ణయం - ఫర్నిచర్ పంపకంపై టీఎస్ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రధాన పరిపాలన కేంద్రం బస్‌భవన్‌లో మళ్లీ విభజన చిచ్చు రగులుకుంది. ఇటీవలే పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీల్లో ‘ఎక్కడి వారక్కడే’ పద్ధతిలో అధికారులు, ఉద్యోగుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించినప్పటికీ... ఆ తర్వాత లొల్లి మొదలైంది. బస్‌భవన్‌లో ప్రస్తుతం 875 మంది వరకు సిబ్బంది పని చేస్తున్నారు. జనాభా సంఖ్య పద్ధతిలో 58:42 నిష్పత్తిలో వారి పంపకం పూర్తి చేశారు. కానీ ఆంధ్రా ప్రాంతానికి చెందిన సిబ్బంది తక్కువ ఉండడంతో దాదాపు 160 మంది వరకు ఏపీకి సిబ్బంది కొరత ఏర్పడింది. అదే సమయంలో తెలంగాణకు చెందిన సిబ్బంది ఎక్కువ ఉండడంతో టీఎస్ ఆర్టీసీకి అదనపు సిబ్బంది వచ్చారు. దీంతో అదనంగా ఉన్నవారిని డిప్యుటేషన్ పద్ధతిలో ఏపీఎస్ ఆర్టీసీకి కేటాయించాల్సి ఉంది. కానీ, తాజాగా వారిని తీసుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిరాకరిస్తున్నట్టు సమాచారం. వారి బదులు ఆంధ్రాప్రాంతానికి చెందిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తెచ్చి నియమించుకునేందుకు కసరత్తు మొదలైనట్టు తెలిసింది. అవసరమైతే వారికి కాస్త అధికంగా వేతనాలు చెల్లించేందుకు కూడా సిద్ధపడ్డట్టు సమాచారం. ఏపీఎస్ ఆర్టీసీకి బస్‌భవన్‌లోని ‘ఎ’ బ్లాకు, టీఎస్ ఆర్టీసీకి ‘బి’ బ్లాకును కేటాయించడంతో కార్యాలయాల సర్దుబాటు కొనసాగుతోంది. అయితే ఈ కార్యాలయాల్లో ఫర్నిచర్ పంపకంపై ఇప్పుడు వివాదం రగులుకుంటోంది. ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో ఈ పంపకాలు జరిగినప్పటికీ... తెలంగాణకు పనిచేయని కంప్యూటర్లు, పాత ఫర్నిచర్, పాతకార్లు వచ్చాయని, ఏపీఎస్ ఆర్టీసీ పరిధిలోకి లేటెస్ట్ కంప్యూటర్లు, కొత్త ఫర్నిచర్, కొత్త కార్లు చేరాయంటూ తెలంగాణ అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు ఉన్నతాధికారులు కావాలనే తెలంగాణకు పాత సామగ్రి వచ్చేలా చక్రం తిప్పారనేది వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల సిబ్బంది మధ్య వాదోపవాదనలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఇప్పుడు మరో సమస్యకు దారి తీసింది. ఉద్యోగుల విభజన ప్రశాంతంగా ముగిసినా... తదనంతర పరిణామాలతో మళ్లీ బస్‌భవన్‌లో కాస్త వేడి రగిలినట్టు కనిపిస్తోంది.