దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందనే దేశీయ ద్రవ్యోల్బణం ఆందోళన కుదుట పడిన నేపథ్యంలో ఆరంభంలో భారీగా ఎగిసింది. ఫలితంగా ఆల్ టైం గరిష్టానికి చేరిన సూచీలు డే హై నుంచి వెనక్కి తగ్గాయి. లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 165 పాయింట్ల లాభానికి పరిమితమై 65,559 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు లాభంతో పెరిగి 19,414 వద్ద ముగిసింది. ప్రధానంగా ఐటీ, రియల్టీ షేర్లు మార్కెట్ లాభాలను నిలబెట్టాయి. ఫలితంగా నిఫ్టీ 19400 ఎగువన, సెన్సెక్స్ 65500 కి ఎగువన స్థిరపడడటం విశేషం.
నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టిసిఎస్, ఇన్ఫోసిస్, ఎల్‌టిఐఎండ్‌ట్రీ, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్‌గా ఉండగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, బిపిసిఎల్, యుపిఎల్, మారుతీ సుజుకీ నష్టపోయాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసిజి, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్, పవర్ రంగాలలో అమ్మకాలు కనిపించగా, బ్యాంక్, మెటల్, రియాల్టీ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేర్లలో బైయింగ్ కనిపించింది.
విశేషాలు
- సెన్సెక్స్ తొలిసారిగా చారిత్రాత్మక 66,000 మార్క్‌ను అధిగమించింది.
- సెన్సెక్స్ డే హై నుంచి 600 పాయింట్లు పతనమైంది
- 19567 పాయింట్ల వద్ద నిఫ్టీ ఆల్ టైం హై
- నిఫ్టీ 160 పాయింట్లు క్షీణించి, ఒక దశలో 19,400 దిగువకు జారిపోయింది. చివరికి ఈ స్థాయిని నిలబెట్టుకుంది.
- నిఫ్టీ బ్యాంక్ రోజు గరిష్టం నుండి 400 పాయింట్లకు పైగా క్షీణించింది.
రూపాయి
రూపాయి మార్కెట్ల మద్దతుతో ఆరంభంలో 21పైసలు ఎగిసింది. చివరికి గత ముగింపు 82.24తో పోలిస్తే డాలర్ మారకంలో రూపాయి 17 పైసలు పెరిగి 82.07 వద్ద ముగిసింది.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు
Comments
Please login to add a commentAdd a comment