IT shares
-
రికార్డుల ర్యాలీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు బ్యాంకులు, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ మూడో రోజూ కొనసాగింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడి ఇంట్రాడే, ముగింపులో సరికొత్త రికార్డులు లిఖించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి ఆర్థిక సంవత్సరం(2024–25) కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న సమగ్ర బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే., ప్రజారంజకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. సెన్సెక్స్ ఉదయం 242 పాయింట్ల లాభంతో 77,235 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 374 పాయింట్లు పెరిగి 77,366 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 308 పాయింట్ల లాభంతో 77,301 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 23,579 వద్ద రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 92 పాయింట్లు 23,558 వద్ద ముగిసింది. బ్యాంకులు, ఐటీతో పాటు రియలీ్ట, కన్జూమర్, యుటిలిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 1శాతం, అరశాతం చొప్పున రాణించాయి. ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద రయ్...సెన్సెక్స్ నాలుగోరోజూ రాణించడంతో బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్టానికి చేరింది. మంగళవారం ఒక్కరోజే రూ.2.42 లక్షల కోట్లు పెరగడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 437.24 లక్షల కోట్లకు చేరింది. ఈ మొత్తం 4 రోజుల్లో రూ.10.29 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.⇒ అమెరికా ఫ్యాషన్ దుస్తుల సంస్థ హానెస్ బ్రాండ్స్‌తో వ్యాపార కాంట్రాక్టు కొనసాగింపుతో పాటు జీబీఎస్టీతో కొత్త వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో విప్రో షేరు 3% పెరిగి రూ.492 వద్ద ముగిసింది. ⇒ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోళ్ల ఆర్డర్ దక్కించుకోవడంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) షేరు 6 శాతం పెరిగి రూ. 5,533 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ. 5,565 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. -
బుల్ బ్యాక్ ర్యాలీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం దాదాపు ఒకశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 677 పాయింట్లు పెరిగి 73,664 వద్ద నిలిచింది. నిఫ్టీ 203 పాయింట్లు లాభపడి 22,404 వద్ద స్థిరపడింది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే నమోదవడంతో ఈ ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ కనీసం రెండు సార్లు వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపింది. ఒక దశలో సెన్సెక్స్ 762 పాయింట్లు బలపడి 73,749 వద్ద, నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 22,432 ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 1.07%, 0.85% లాభపడ్డాయి. → ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ.3.1 లక్షల కోట్లు పెరిగి బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 407.35 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం 30కి గానూ 25 షేర్లు లాభపడ్డాయి. → అమెరికాలో పారిశ్రామిక రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే డోజోన్స్ సూచీ తొలిసారి 40వేల పాయింట్ల పైకి చేరింది. -
మూడు రోజుల ర్యాలీకి బ్రేక్
ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకులు, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల అంశాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 111 పాయింట్లు నష్టపోయి 73,904 వద్ద స్థిరపడింది. నిఫ్టీ తొమ్మిది పాయింట్లు నష్టపోయి 22,453 వద్ద నిలిచింది. దీంతో సూచీల మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 271 పాయింట్లు పతనమై 73,744 వద్ద కనిష్టాన్ని, నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 22,388 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. ఆఖరి గంటలో కన్జూమర్ డ్యూరబుల్స్, సర్వీసెస్, మెటల్, యుటిలిటీ, కమోడిటీ రంగాలకు చెందిన మధ్య, తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాలు కొంత తగ్గాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.28%, 1.14% చొప్పున పెరిగాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. రిటైల్ విభా గాన్ని విభజిస్తుందన్న వార్తలతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ షేరు 12% లాభపడి రూ.236 వద్ద ముగిసింది. -
ఆర్బీఐ పాలసీ అప్రమత్తత
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆర్బీఐ ద్రవ్య కమిటీ సమావేశ నిర్ణయాల వెల్లడి (నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీన సంకేతాలు సైతం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇంట్రాడేలో 621 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరికి 34 పాయింట్ల స్వల్ప నష్టంతో 72,152 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 71,938 వద్ద కనిష్టాన్ని, 72,559 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 22,053 – 21,860 రేంజ్ లో కదలాడింది. చివరికి ఒక పాయింటు లాభపడి 21,930 వద్ద నిలిచింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఫార్మా, రియల్టీ షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.31%, 0.38% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,691 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,096 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్, ఇండోనేíసియా, చైనా తప్ప మిగిలిన అన్ని దేశాల సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 0.50% – 0.10% నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు 0.25% లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► అమెరికా దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో పాటు ఇటీవల ర్యాలీ నేపథ్యంలో ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. టెక్ మహీంద్రా 2.31%, ఇన్ఫోసిస్ 2%, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ షేర్లు ఒకశాతం చొప్పున నష్టపోయాయి. ► పేటీఎం రికవరీ ప్రయాణం బుధవారం కొనసాగింది. బీఎస్ఈలో ట్రేడింగ్ ప్రారంభంలో 10% పెరిగి రూ.496 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి లాకైంది. రెండు రోజుల్లో షేరు 13% బౌన్స్‌బ్యాక్‌తో కంపెనీ మార్కెట్ విలువ రూ.3,720 కోట్లు పెరిగి రూ.31,548 కోట్లకు చేరింది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంకు వాటా కొనుగోలుకు ఆర్బీఐ అనుమతినివ్వడంతో యస్‌బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు వరుసగా 17%, 7% చొప్పున లాభపడ్డాయి. -
65 వేల దిగువకు సెన్సెక్స్
ముంబై: ద్రవ్యోల్బణ డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, రూపాయి బలహీనతలు సెంటిమెంట్‌పై మరింత పెంచాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 326 పాయింట్లు నష్టపోయి 64,934 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 19,444 వద్ద నిలిచింది. దీంతో సూచీలకు ముహూరత్ ట్రేడింగ్ లాభాలన్నీ మాయమ య్యాయి. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా బలహీనంగా ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 406 పాయింట్లు నష్టపోయి 64,853 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు క్షీణించి 19,415 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. నష్టాల మార్కెట్లోనూ ఇంధన, యుటిలిటీ, విద్యుత్, ఆటో షేర్ల రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,244 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.830 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బలిప్రతిపద సందర్భంగా నేడు ఎక్సే్చంజీలకు సెలవు. ట్రేడింగ్ తిరిగి యథావిధిగా బుధవారం ప్రారంభవుతుంది. ప్రొటీయన్ ఈగవ్ టెక్నాలజీస్ షేరు లిస్టింగ్ రోజు 11% లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.792) వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో క్రమంగా కొనుగోళ్ల మద్దతు పెరగడంతో ఈ షేరు పుంజుకుంది. ట్రేడింగ్‌లో 12% ర్యాలీ చేసి రూ.891 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభంతో రూ.883 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.3,571 కోట్లుగా నమోదైంది. ‘‘అంతర్జాతీయ అనిశి్చతితో దీపావళి మరుసటి రోజూ భారత ఈక్విటీ మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు ప్రభావాలతో ఐఐపీ వృద్ధి, తయారీ రంగ పీఐఎం భారీగా క్షీణించాయి. అయితే మెరుగైన కార్పొరేట్ ఆదాయాలు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, సంస్థాగత కొనుగోళ్లు తదితర అంశాలు దిగువ స్థాయిలో దేశీయ మార్కెట్‌కు దన్నుగా నిలిచే వీలుంది’. – దీపక్ జెసానీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ -
సాక్షి మనీ మంత్రా: రికార్డు స్థాయినుంచి వెనక్కి, ఐటీ జోరు
దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందనే దేశీయ ద్రవ్యోల్బణం ఆందోళన కుదుట పడిన నేపథ్యంలో ఆరంభంలో భారీగా ఎగిసింది. ఫలితంగా ఆల్ టైం గరిష్టానికి చేరిన సూచీలు డే హై నుంచి వెనక్కి తగ్గాయి. లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 165 పాయింట్ల లాభానికి పరిమితమై 65,559 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు లాభంతో పెరిగి 19,414 వద్ద ముగిసింది. ప్రధానంగా ఐటీ, రియల్టీ షేర్లు మార్కెట్ లాభాలను నిలబెట్టాయి. ఫలితంగా నిఫ్టీ 19400 ఎగువన, సెన్సెక్స్ 65500 కి ఎగువన స్థిరపడడటం విశేషం. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టిసిఎస్, ఇన్ఫోసిస్, ఎల్‌టిఐఎండ్‌ట్రీ, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్‌గా ఉండగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, బిపిసిఎల్, యుపిఎల్, మారుతీ సుజుకీ నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజి, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్, పవర్ రంగాలలో అమ్మకాలు కనిపించగా, బ్యాంక్, మెటల్, రియాల్టీ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేర్లలో బైయింగ్ కనిపించింది. విశేషాలు - సెన్సెక్స్ తొలిసారిగా చారిత్రాత్మక 66,000 మార్క్‌ను అధిగమించింది. - సెన్సెక్స్ డే హై నుంచి 600 పాయింట్లు పతనమైంది - 19567 పాయింట్ల వద్ద నిఫ్టీ ఆల్ టైం హై - నిఫ్టీ 160 పాయింట్లు క్షీణించి, ఒక దశలో 19,400 దిగువకు జారిపోయింది. చివరికి ఈ స్థాయిని నిలబెట్టుకుంది. - నిఫ్టీ బ్యాంక్ రోజు గరిష్టం నుండి 400 పాయింట్లకు పైగా క్షీణించింది. రూపాయి రూపాయి మార్కెట్ల మద్దతుతో ఆరంభంలో 21పైసలు ఎగిసింది. చివరికి గత ముగింపు 82.24తో పోలిస్తే డాలర్ మారకంలో రూపాయి 17 పైసలు పెరిగి 82.07 వద్ద ముగిసింది. Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు -
భారీ లాభాలు: రికార్డ్ క్లోజింగ్, ఇన్వెస్టర్లకు పండగ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వారాంతంలో లాభాలతో మురిపించింది. భారీ లాభాలతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ రికార్డు క్లోజింగ్న నమోదు చేశాయి. ఆరంభం నుంచి ఉత్సాహంగా సూచీలు చివరి వరకూ అదే ధోరణిని కొనసాగించాయి. సెన్సెక్స్ 467 పాయింట్లు ఎగిసి 63,385, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 18,826 వద్ద స్థిరపడింది. ఐటీ షేర్లు తప్ప మిగతా రంగాలు లాభాలనార్జించాయి నెస్లే ఇండియా, టాటా స్టీల్, టైటాన్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, మారుతీ, హెచ్‌సీఎల్ షేర్లు టాప్ విన్నర్స్‌గా, విప్రో, టీసీఎస్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. అటు డాలరుతోపో లిస్తే రూపాయి మారకం విలువ 81.94గా నిలిచింది. రూ. 2 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద బీఎస్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో రూ. 290.7 లక్షల కోట్ల నుండి రికార్డు స్థాయిలో రూ. 292.7 లక్షల కోట్లకు పెరిగింది, ఈఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 2 లక్షల కోట్లు పెరిగింది. -
ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఐటీ, ఫైనాన్స్, విద్యుత్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు మూడోరోజూ నష్టాలను చవిచూశాయి. ఇప్పటివరకు వెల్లడైన కార్పొరేట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయాయి. అలాగే అంతర్జాతీయ బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఉదయం సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 59,746 వద్ద, నిఫ్టీ ఏడు పాయింట్లు నష్టపోయి 17,653 వద్ద మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 292 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్ 59,453 వద్ద కనిష్టాన్ని, 59,745 గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 159 పాయింట్లు నష్టపోయి 59,568 వద్ద నిలిచింది. నిఫ్టీ 17,580 – 17,666 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి 41 పాయింట్లు పతనమై 17,619 వద్ద నిలిచింది. మెటల్, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు చెందిన మధ్య తరహా షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా 0.12 శాతం పెరిగింది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఆయా కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధాన వైఖరిపై ఎదురుచూపుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు లాభ, నష్టాల మధ్య ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి(గురువారం)కి ముందు హెచ్‌సీఎల్ టెక్ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో రెండున్నర శాతం నష్టపోయి రూ.1,038 వద్ద స్థిరపడింది. ► రియల్టీ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ షేరు రెండున్నర శాతం లాభపడి రూ.450 వద్ద ముగిసింది. ఆర్థిక సంవత్సరం(2022–23)లో వార్షిక ప్రాతిపదికన రూ. 12,930 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడంతో ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. మ్యాన్‌కైండ్ @ రూ. 1,026–1,080 ఈ నెల 25–27 మధ్య ఐపీవో రూ. 4,326 కోట్ల సమీకరణకు రెడీ న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ మ్యాన్‌కైండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూలో భాగంగా షేరుకి రూ. 1,026–1,080 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ మొత్తం 4 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తోంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 4,326 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. -
Today StockMarketOpening: అదానీ, ఐటీ షేర్లు ఢమాల్; సెన్సెక్స్ పతనం
సాక్షి,ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ ఏకంగా 372 పాయింట్లు కుప్ప కూలి 60307 వద్ద, నిఫ్టీ 107 పాయింట్ల పతనంతో 17749 వద్ద కొనసాగుతున్నాయి. మెటల్ తప్ప అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా అదానీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఫసిస్ తదితర ఐటీ స్టాక్స్ పతనం మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. అదానీ సంక్షోభం మార్కెట్లో అదానీ సంక్షోభం కొనసాగుతోంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ (శుక్రవారం) నాలుగు అదానీ స్టాక్‌ల రేటింగ్ 'స్టేబుల్' నుండి 'నెగటివ్'కి డౌన్‌గ్రేడ్ చేయడంతో అమ్మకాలు కొనసాగుతున్నాయి. అటు సంస్థ కూడా తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని సగానికి తగ్గించింది. తాజాగా మూలధన వ్యయాన్ని తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది అదానీ. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దారుణంగా దెబ్బతింది. ఇప్పటికే అదానీ లిస్టెడ్ ఎంటిటీలు మార్కెట్ విలువ 120 బిలియన్ డాలర్లకు పైగా కుప్పకూలింది. అటు జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల కోసం పెట్టుబడిదారులు వెయిట్ చేస్తున్నారు. టైటన్, హిందాల్కో, టాటా స్టీల్, సన్‌ఫార్మ, బజాజ్ ఆటో లాభపడుతుండగా, అదానీ ఎంటర్పప్రైజెస్, ఎస్బీఐ, ఎం అండ్ఎం, ఇన్ఫోసిష్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు డాలరుమారకంలో రూపాయి 28 పైసలు నష్టంతో 82.73 వద్ద కొనసాగుతోంది. -
ఐటీ షైన్: సెన్సెక్స్, నిఫ్టీ జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 320 పాయింట్లు లాభంతో 60,942 వద్ద, నిఫ్టీ 92 పాయింట్లు ఎగిసి 18,118 వద్ద స్థిరపడ్డాయి. ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసిజి, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్ , ఐటీ షేర్లు లాభపడగా, రియల్టీ, పవర్ రంగ షేర్లు నష్టపోయాయి. సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్ర, హిందాల్కో, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, యూపీఎల్, విప్రో టాప్ విన్నర్స్‌గా నిలవగా, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 33 పైసలు నష్టపోయి 81.39 వద్ద ఉంది. -
కొనసాగుతున్న ఐటీ షేర్ల పతనం: మార్కెట్ ఢమాల్!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 451 పాయింట్లు కుప్పకూలి 61735 వద్ద, నిఫ్టీ 120 పాయింట్లు నష్టంతో 18375 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో తదితర ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఐషర్, మారుతి లాంటి ఆటో షేర్లుకూడా బలహీనంగా ఉన్నాయి. ఐటీసీ, ఎం అండ్, నెస్లే, కోల్ ఇండియా, డా. రెడ్డీస్ గ్రాసిం, ఎన్టీపీసీ లాభపడుతున్నాయి. ఈ సాయంత్రం విడుదల కానున్న నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా, అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) డేటాకానుందని పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు సులా వైన్యార్డ్స్ , అబాన్స్ హోల్డింగ్స్ IPO ఈరోజు షురూ కానుంది. -
ఐటీ షేర్ల ర్యాలీ: తగ్గేదేలే దలాల్ స్ట్రీట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం దలాల్ స్ట్రీట్ లాభాల పరుగందుకుంది. బలమైన అంతర్జాతీయ సంకేతాలు, ముడి చమురు ధరల సడలింపుతో దేశీ సూచీలు తగ్గేదేలే అన్నట్టున్నాయి. నిఫ్టీ 300 పాయింట్లు ఎగిసి 17,300 స్థాయిని తాకింది. సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా ఎగబాకి 58,267 ఎగువకు చేరింది. వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ సూచీలుతోపాటు అన్ని రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి.ముఖ్యంగా ఐటీ మేజర్ ఇన్ఫీ 11 శాతం వృద్ధితో 6,021 కోట్ల రూపాయల నికర లాభాల ఫలితాల జోష్‌తో కంపెనీషేర్లు 3 శాతానికి పైగాఎగిసాయి. ఇంకా హెచ్‌సీఎల్, టెక్ ఎం, లార్సెన్, యూపీల్ కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. ఒక్క సన్ ఫార్మ మాత్రమే నష్టపోతోంది. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 82.33 వద్ద ఉంది. -
ఐటీ జోరు, బుల్ దౌడు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి. ఆరంభంలోనే కీలకమైన 60వేల మార్క్‌ను మరోసారి అధిగమించిన సెన్సెక్స్ అదే ధోరణిని కొనసాగించి దాదాపు 400 పాయింట్లకుపైగా ఎగిసింది. అయితే మిడ్‌సెషన్ తరువాత లాభాల స్వీకరణతో కాస్త వెనక్కి తగ్గినా కీలక మద్దతు స్థాయిలకు ఎగువన ముగిసాయి. ఐటీ, రియాల్టీ షేర్ల లాభాలు మార్కెట్లకు భారీ మద్దతునిచ్చాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాడాయి. సెన్సెక్స్ 323 పాయింట్లుఎగిసి 60115 వద్ద,నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 17936 వద్ద స్థిరపడ్డాయి. అదానీ పోర్ట్స్, టైటన్, టెక్ మహీంద్ర, దివీస్, యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, హెచసీఎల్ టెక్, ఎం అండ్ ఎం, విప్రో, టీసీఎస్‌డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. కోల్ ఇండియా, శ్రీ సిమెట్, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంకు నష్ట పోయాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభంతో 79.52 వద్ద ఉంది. -
లాభాల పరుగు : ప్చ్..ఐటీ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిసాయి. రోజంతా లాభాలతో కళకళలాడిన మార్కెట్లు చివరిదాకా అదో జోరును కంటిన్యూ చేశాయి. ఒక్క ఐటీ తప్ప అన్నిరంగాల షేర్లు లాభాలనార్జించాయి. భారతదేశ ఐటి కంపెనీలకు రాబోయే కొన్ని త్రైమాసికాలలో అట్రిషన్ ఎక్కువగా ఉంటుందని నోమురా అంచనాల మధ్య ఐటీ దిగ్గజ కంపెనీల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బ్యాంకింగ్, ఆటో కంపెనీలు కొనుగోళ్లు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 462 పాయింట్లు ఎగిసి 52728 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 15699 వద్ద పటిష్టంగా ముగిసాయి. హీరో మోటో, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాప్ ఫైనాన్స్, హెచ్ యూఎల్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్ టాప్ లూజర్స్‌గా ముగిసాయి. అటు డాలరు మారకంలో రూపీ ఆరంభ లాభాలను కోల్పోయి 78.31 వద్ద స్వల్ప నష్టాలతో ముగిసింది. -
2022లో ఐటీ షేర్లకు ఏమైంది? ఎందుకింత నష్టం
సాక్షి, ముంబై: భారతీయ ఐటీ కంపెనీల షేర్లు ఈ ఏడాది ప్రధాన రంగాల నష్టాల్లో నిలిచాయి. సాధారణంగా రేసుగుర్రాల్లా దూసుకుపోయే ఐటీ కంపెనీలకు 2022లో ఎదురు దెబ్బ తగిలింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, క్యూ4 ఆదాయాల సీజన్లో ప్రతికూల సెంటిమెంట్, ఎఫ్ఐఐల నిరంతర విక్రయాలు మార్కెట్లో ఐటీ షేర్లను అశనిపాతంలా చుట్టుకుంది. బిజినెస్ టుడే కథనం ప్రకారం బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 2022లో 25 శాతం లేదా 9,524 పాయింట్లను కోల్పోయింది. ఈ కాలంలో సెన్సెక్స్ 7.44 శాతం లేదా 4,336 పాయింట్లు క్షీణించింది. అలాగే, నిఫ్టీ ఐటి ఇండెక్స్ 37,071 స్థాయినుంచి 27,708కి పడిపోయింది. వార్షిక ప్రాతి పదికన 9,363 పాయింట్లు లేదా 25.25 శాతం నష్టపోయింది. అలాగే ఎఫ్ఐఐలు ఈ ఏడాది భారత మార్కెట్లో రూ. 1.60 లక్షల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించడంతో ఐటీ స్టాక్‌ల సెంటిమెంట్ బలహీనపడింది. టెక్ మహీంద్ర, విప్రో, సియంట్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, జస్ట్ డయల్, టీ సీఎస్ ప్రధానంగా నష్టపోయిన ఐటీ షేర్లు ఇక ఆదాయాల విషయంలో మెజారిటీ ఐటీ కంపెనీలు వృద్ధి అంచనాలను అందుకో లేకపోయాయి. క్యూ4లో దిగ్గజ ఐటీ కంపెనీల మార్జిన్ ఔట్లుక్ మితంగా ఉండడం కూడా ఈ నష్టాలకుఒక కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా బుధవారం నాటి స్టాక్‌మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 303 పాయింట్ల నష్టంతో 54 వేల దిగువకు చేరింది. అటు నిఫ్టీ 99 పాయంట్లను కోల్పోయి 16025 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐటీ షేర్ల నష్టాలతో వరుసగా మూడో రోజు కూడా ఈక్విటీ మార్కెట్ నెగిటివ్‌గా ముగిసింది. -
రెండోరోజూ బుల్ సందడి
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండోరోజూ బుల్ సందడి చేసింది. ఇంధన, ఐటీ, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 446 పాయింట్లు పెరిగి 59,745 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి 17,822 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితులు, బాండ్, ఫారెక్స్ మార్కెట్లలో అస్థిరతలను విస్మరిస్తూ కొనుగోళ్లకే కట్టుబడ్డారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఇంధన షేర్లకు, డాలర్ మారకంలో రూపాయి క్షీణత ఐటీ షేర్లకు కలిసొచ్చింది. అయితే ఫార్మా, మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.చిన్న, మధ్య తరహా షేర్లలో ఓ మోస్తారు కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు అర శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో 10 షేర్లు నష్టాన్ని చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1915 కోట్ల షేర్లను అమ్మగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.1868 కోట్ల షేర్లను కొన్నారు. క్రూడాయిల్ ధరల ప్రభావంతో ఆసియా మార్కెట్లు బలహీనంగా ముగిశాయి. టెక్నాలజీ షేర్లు రికవరీతో యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇంట్రాడే గరిష్టాల వద్ద ముగింపు... దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం మిశ్రమంగా మొదలైంది. సెన్సెక్స్ 21 పాయింట్ల స్వల్ప లాభంతో 59,320 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 17,661 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రపంచ మార్కెట్లోని ప్రతికూలతలతో సూచీలు ఆరంభంలో తడబడ్డాయి. అయితే దేశీయ మార్కెట్లో నెలకొన్న సానుకూలతలో వెంటనే కోలుకున్నాయి. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో సేవల రంగ నెమ్మదించినా.., గణాంకాలు ఆర్థికవేత్తల అంచనాలను అందుకోవడం మార్కెట్ వర్గాలకు ఉత్సాహాన్నిచ్చింది. యూరప్ మార్కెట్ల స్వల్ప లాభాల ప్రారంభంతో కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 479 పాయింట్లు ఎగసి 59,778 వద్ద, నిఫ్టీ 142 పాయింట్లు ర్యాలీ చేసి 17,833 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదుచేశాయి. మిడ్‌సెషన్‌లోనూ స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో సూచీలు దాదాపు ఇంట్రాడే గరిష్టాల వద్ద ముగిశాయి. రెండు రోజుల్లో రూ.5.17 లక్షల కోట్లు... స్టాక్ సూచీలు వరుస లాభాలతో దూసుకెళ్లడంతో స్టాక్ మార్కెట్లో రెండో రోజుల్లో రూ.5.17 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.265 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరినట్లైంది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 980 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు పెరిగింది. ప్రభుత్వానికి పీఎస్‌యూల డివిడెండ్లు ఓఎన్జీసీ, కోల్ ఇండియా చెల్లింపులు న్యూఢిల్లీ: ప్రమోటర్‌గా కేంద్ర ప్రభుత్వం ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు ఓఎన్జీసీ, కోల్ ఇండియా నుంచి తాజాగా డివిడెండ్లను అందుకుంది. కోల్ ఇండియా రూ. 1,426 కోట్లు, ఓఎన్జీసీ రూ. 1,406 కోట్లు చొప్పున ప్రభుత్వానికి చెల్లించినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు. దీంతో ఈ ఏడాది (2021–22)లో సీపీఎస్ఈల నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం డివిడెండ్ల రూపేణా రూ. 4,576 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేశారు. మరోవైపు ఇదే సమయంలో ప్రభుత్వ సంస్థల(సీపీఎస్ఈలు)లో వాటాల విక్రయం ద్వారా రూ. 9,110 కోట్లను సమీకరించినట్లు పేర్కొన్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ►దాదాపు రూ.300 కోట్ల ఆర్డర్లను దక్కించుకోవడంతో హెచ్ఎఫ్సీఎల్ షేరు 5% ఎగసి అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యింది. షేరు రూ.79 స్థాయి వద్ద స్థిరపడింది. ►కేంద్రం స్పెక్ట్రం వినియోగ ఛార్జీలను తగ్గించడంతో టెలికాం షేర్లు లాభాల మోత మోగించాయి. ఈ రంగానికి చెందిన ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్ తదితర కంపెనీల షేర్లు ఐదు శాతం నుంచి 2% లాభపడ్డాయి. ►ఇంధన షేర్లలో ర్యాలీ భాగంగా రిలయన్స్ షేరు రాణించింది. బీఎస్ఈ ఇంట్రాడేలో రెండు శాతానికి పైగా ఎగసి రూ.2612 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి 2% లాభంతో రూ.2609 వద్ద స్థిరపింది. ►చెల్లింపుల్లో విఫలం కావడంతో పాటు నిర్వహణ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆర్బీఐ బోర్డును రద్దు చేయడంతో శ్రేయీ ఇన్ఫ్రా షేర్లు ఐదుశాతం నష్టపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. -
మూడు రోజుల లాభాలకు బ్రేక్
ముంబై: స్టాక్ సూచీల మూడు రోజుల లాభాలకు మంగళవారం అడ్డుకట్ట పడింది. ఐటీ, ఆర్థిక, టెలికాం షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆర్థిక అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల్లో తలెత్తిన ఇబ్బందులు భారత్‌తో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపు(గురువారం) దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించారు. డాలర్ మారకంలో రూపాయి 23 పైసలు పతనమైంది. ఫలితంగా సెన్సెక్స్ 410 పాయింట్లు పతనమై 60 వేల దిగువున 59,668 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 106 పాయింట్లు నష్టపోయి 17,749 వద్ద ముగిసింది. మెటల్, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ఆద్యంతం స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1243 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 337 పాయింట్ల రేంజ్ కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1958 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.161 కోట్ల షేర్లను కొన్నారు. లాభాలతో మొదలై నష్టాల్లోకి.., దేశీయ మార్కెట్ ఉదయం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 208 పాయింట్లు లాభంతో 60,286 వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 17,906 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లో ప్రతికూలతలతో పాటు గరిష్ట స్థాయి లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు ఆరంభ లాభాలన్ని కోల్పోయాయి. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూరప్ మార్కెట్లు నష్టాలతో మొదలవడంతో అమ్మకాల తీవ్రత మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(60,288) నుంచి 1243 పాయింట్లు నష్టపోయి 59,046 వద్ద, నిఫ్టీ డే హై(17,913) నుంచి 337 పాయింట్లు కోల్పోయి 17,912 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. నష్టాలు పరిమితం మిడ్ సెషన్ చివర్లో సూచీలకు దిగువ స్థాయిల వద్ద మద్దతు లభించడంతో అమ్మకాలు తగ్గాయి. మరో గంటలో ట్రేడింగ్ ముగుస్తుందనగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆస్తకి చూపారు. ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లు రాణించాయి. దీంతో సూచీలు భారీ నష్టాల నుంచి తేరుకొని పరిమిత నష్టాలతో ముగిశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టును దక్కించుకోవడంతో ఎన్టీపీసీ షేరు నాలుగు శాతం లాభపడి రూ.132 వద్ద ముగిసింది. ►ఆర్బీఐ రెండు కోట్ల జరిమానా విధించడంతో ఆర్బీఎల్ షేరు రెండుశాతం నష్టపోయి రూ.187 వద్ద ముగిసింది. ►గోవా షిప్‌యార్డ్ నుంచి కాంట్రాక్టు దక్కించుకోవడంతో భెల్ షేరు ఆరుశాతం ర్యాలీ చేసి రూ.60 వద్ద స్థిరపడింది. -
కేంద్రం సరళతర నిర్ణయాలతో ఐటీ షేర్లకు భారీ డిమాండ్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ జూన్ ఎఫ్ అండ్ ఓ ముగింపు రోజున లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు అందాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రికవరీ కలిసొచ్చింది. ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ప్రారంభం నుంచి కొనుగోళ్లకే కట్టుబడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 393 పాయింట్లు లాభపడి 52,699 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 15,790 వద్ద నిలిచింది. ఐటీ, మెటల్, ప్రైవేట్ రంగ బ్యాంక్స్, ఆర్థిక, ఆటో షేర్లకు చెందిన కౌంటర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. మరో వైపు ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఫార్మా, మీడియా, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వాయిస్ ఆధారిత బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో) కార్యకలాపాలకు భారత్‌ను ప్రధాన కేంద్రంగా నిలిపేందుకు కేంద్రం తీసుకున్న సరళతర నిర్ణయాలతో ఐటీ రంగ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరమైన కొనుగోళ్లతో ఒక దశలో సెన్సెక్స్ 525 పాయింట్లు పెరిగి 52,831 వద్ద, నిఫ్టీ 134 పాయింట్లు 15,821 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,891 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకోగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 1,139 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండురోజూ బలపడింది. డాలర్ మారకంలో తొమ్మిది పైసలు ర్యాలీ చేసి 74.18 వద్ద స్థిరపడింది. ‘‘గత ఆరునెలల్లో ఎన్నడూ లేనంతగా ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ తేదీన ఎన్ఎస్ఈలో అతి తక్కువ వ్యాల్యూమ్స్ నమోదయ్యాయి. దీంతో సూచీలు మార్కెట్ ఆరంభం నుంచి స్థిరమైన ట్రేడింగ్‌ను కనబరిచాయి. భారత మార్కెట్లో ద్రవ్య లభ్యతకు భరోసానిస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏప్రిల్‌లో 60 శాతం పెరిగినట్లు గణాంకాలు వెలువడ్డాయి. ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశపు నిర్ణయాలను విదేశీ ఇన్వెస్టర్లు ఆకళింపు చేసుకున్నారు. ఇప్పుడు అమెరికా ఉద్యోగ గణాంకాలు, వడ్డీరేట్లపై బ్రిటన్ నిర్ణయం అంశాల కోసం వారు ఎదురుచూస్తున్నారు’’ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. -
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఫ్లాట్‌గా రిలయన్స్ షేర్లు!
ముంబై: దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ షేర్లు భారీగా లాభపడ్డయ్యాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాతో పాటు ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి. సెన్సెక్స్ 393 పాయింట్లు లాభాపడి 52, 699 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 104 పాయింట్లతో 15,790.45 దగ్గర స్థిరపడింది. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకులు నష్టాలను చవి చూశాయి. రిలయన్స్ ఏజీఎం వార్షిక సర్వ సభ్య సమావేశ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ప్లాట్‌గా ముగిశాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలను చవిచూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, ఐఓసీఎల్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ షేర్లు నష్టపోయాయి. చదవండి: Reliance AGM 2021: బోర్డులో స్వతంత్ర డైరక్టర్‌గా ఆరాంకో చైర్మన్..! -
ఐటీ సెగ : రెండో రోజూ నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో కూడా నష్టాలతో ముగిసింది. కొత్త ఏడాదితో తొలిసారిగా బుధవారం భారీగా నష్టపోయిన సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ప్రధానంగా ఎఫ్‌ఎంపీసీ, ఐటీ, ఫార్మ షేర్ల నష్టాలతో ఆరంభ లాభాలను కోల్పోయిన సెన్సెక్స్ 81 పాయింట్లు నష్టపోయి 48093 వద్ద ముగియగా, నిఫ్టీ 9 పాయింట్లు కోల్పోయింది. తద్వారా 14150 దిగువకు చేరింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, టీసీఎస్, ఐటీసీ లాంటి హెవీవెయిట్లలో బలహీనత కారణంగా సెన్సెక్స్ రోజు గరిష్ట స్థాయి నుండి 500 పాయింట్లకు పైగా పడిపోయింది. మరోవైపు టాటా స్టీల్, హిందాల్కో, భారతి ఎయిర్టెల్, అదానిపోర్ట్స్, ఇండస్ ఇంక్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. -
‘క్యూ3’ సీజన్ వస్తోంది... ఐటీ మెరుపులు..!
భారత ఐటీ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (క్యూ3) ఫలితాలు అంచనాలను మించుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ క్యూ3 ఫలితాలు ఇవే కావచ్చని వారంటున్నారు. సాధారణంగా ఐటీ కంపెనీలకు క్యూ3 సీజన్ బలహీనమైనది. అయితే ఈసారి మాత్రం ఐటీ కంపెనీలు క్యూ3 ఫలితాల్లో దుమ్ము రేపుతాయని, కంపెనీల ఆదాయం జోరుగానే వృద్ధి చెందగల అవకాశాలున్నాయంటున్న విశ్లేషకుల అభిప్రాయాలపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ..... ఐటీ కంపెనీలకు క్యూ3 సీజన్ బలహీనమైనది. ఈ సీజన్లో సెలవులు అధికంగా ఉంటాయి. అవుట్‌సోర్సింగ్‌పై కంపెనీలు స్వల్పంగానే ఖర్చు చేస్తాయి. ఫలితంగా ఐటీ కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండబోతోంది. కరోనా కల్లోలాన్ని తట్టుకోవడానికి డిమాండ్‌ను పెంచుకోవడానికి వివిధ రంగాల కంపెనీలు టెక్నాలజీ వినియోగాన్ని పెంచాయి. ఇది ఐటీ కంపెనీలకు కలసివచ్చింది. గత ఏడాది చివరి ఆర్నెళ్లలో వివిధ కంపెనీలు ఐటీ సేవల కోసం భారీగానే వ్యయం చేశాయి. ఐటీకి సంబంధించిన భారీ డీల్స్ బాగా పెరగడం, ఎన్నడూ లేనంత స్థాయిల్లో కంపెనీల ఆర్డర్ల బుక్‌లు కళకళలాడుతుండటం, డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలకు డిమాండ్ బాగా పెరుగుతుండటం, కరోనా కారణంగా కుదేలైన రిటైల్, రవాణా తదితర రంగాలు కోలుకుంటుండటం, అధిక శాతం సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వర్తిస్తుండటంతో వ్యయాలు తగ్గడం, పర్యాటక, మార్కెటింగ్ సంబంధిత వ్యయాలు కూడా తగ్గడం... ఈ కారణాలన్నింటి వల్ల ఈసారి క్యూ3 ఫలితాలు దుమ్ము రేపనున్నాయి. వేతన పెంపు తప్ప మరే ఇతర ఒత్తిడులు మార్జిన్లపై ప్రభావం చూపవని నిపుణులు భావిస్తున్నారు. గైడెన్స్ (భవిష్యత్తు అంచనాలు) కూడా బాగా ఉంటాయని బ్రోకరేజ్ సంస్థలు ఆశిస్తున్నాయి. మధ్య స్థాయి కంపెనీలదీ అదే దారి...: దిగ్గజ ఐటీ కంపెనీలతో పాటు మైండ్‌ట్రీ, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ఎల్ అండ్ టీ ఇన్పోటెక్‌లు కూడా మంచి ఫలితాలనే ఇస్తాయని అంచనాలున్నాయి. ఫలితాల సందర్భంగా కంపెనీలు వెల్లడించే విషయాలపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీల్స్‌కు సంబంధించిన వివరాలు, కంపెనీలు అనుసరిస్తున్న కొత్త వ్యూహాలపై పురోగతి, ఇటీవల టేకోవర్ చేసిన సంస్థల ప్రభావం, వీటికి సంబంధించి యాజమాన్యాల వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. భారీ డీల్స్...: ఈ క్యూ3లో ఇన్ఫోసిస్ కంపెనీ 320 కోట్ల డాలర్ల భారీ ఒప్పందాన్ని దైమ్లర్ కంపెనీతో కుదుర్చుకుంది. ఇక టీసీఎస్ కంపెనీ డాషే బ్యాంక్, ప్రుడెన్షియల్ సంస్థల నుంచి భారీ డీల్స్‌ను సాధించింది. ఇక విప్రో కంపెనీ జర్మనీ హోల్‌సేల్ దిగ్గజం మెట్రో ఏజీతో 100 కోట్ల డాలర్ల డీల్ కుదుర్చుకుంది. ఈఆన్, మారెల్లీ తదితర దిగ్గజాల నుంచి భారీ డీల్స్‌ను సాధించింది. ఈ నెల 8న టీసీఎస్ ఫలితాలు టీసీఎస్ ఈ నెల 8న క్యూ3 ఫలితాలను వెల్లడిస్తుంది. ఈ నెల 13న ఇన్ఫోసిస్, విప్రోలు ఫలితాలను ప్రకటించనున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలు ఈ నెల 15న వస్తాయి. ఇటీవలి ఐటీ షేర్లు జోరుగా పెరిగాయి. ఫలితాలపై భారీ అంచనాలతో చాలా ఐటీ షేర్లు మంగళవారం ఆల్‌టైమ్ హైలను తాకాయి. అనలిస్ట్‌ల అంచనాలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఈ కంపెనీల ఆదాయాలు సీక్వెన్షియల్‌గా 2–3% మేర పెరగగలవనేది విశ్లేషకుల అంచనా. 2021–22 ఆదాయ అంచనాలను పెంచే అవకాశాలు అధికంగా ఉన్నాయని వారంటున్నారు. టీసీఎస్: ఆదాయ వృద్ధి సీక్వెన్షియల్‌గా 2–3 శాతం ఉండొచ్చు. గత ఏడాది అక్టోబర్ నుంచి వేతనాలు పెంచినందున నిర్వహణ లాభం ఒకింత తగ్గవచ్చు. నికర లాభం కూడా 1–1.2 శాతం మేర తగ్గవచ్చు. ఇన్ఫోసిస్: ఆదాయం 3 శాతం మేర పెరుగుతుంది. నిర్వహణ లాభం ఫ్లాట్‌గా ఉండొచ్చు. లేదా ఒకింత తగ్గవచ్చు. అయితే నికర లాభం 15% పెరిగే అవకాశాలున్నాయి. కరోనా వల్ల పొదుపు చర్యలు పెరగడం, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం, రూపాయి క్షీణత... ప్రధాన కారణాలు. విప్రో: ఈ కంపెనీ నిర్వహణ లాభం నిలకడగా ఉండొచ్చు. లేదా స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: ఆదాయం (సీక్వెన్షియల్‌గా)2–3 శాతం రేంజ్లో పెరగవచ్చు. -
ఐటీ షేర్లు.. ధూమ్‌ధామ్- సరికొత్త రికార్డ్స్
వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 407 పాయింట్లు జంప్‌చేసి 39,104ను తాకింది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 11,537 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఐటీ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 3 శాతం ఎగసింది. ఇంట్రాడేలో 20,748ను తాకడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని చేరింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల కారణంగా పలు కౌంటర్లు బుల్ దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జాబితా ఇలా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనను ప్రకటించింది. ఇది ఐటీ పరిశ్రమకు బూస్ట్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఐటీ కంపెనీలు పటిష్ట పనితీరును ప్రదర్శించవచ్చన్న అంచనాలు పెరగడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. దీంతో టీసీఎస్తోపాటు.. ఇన్ఫోసిస్, మైండ్‌ట్రీ, కేపీఐటీ టెక్నాలజీస్, కోఫోర్జ్, బిర్లాసాఫ్ట్ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. జోరుగా హుషారుగా ఎన్ఎస్ఈలో టీసీఎస్ షేరు తొలుత 6 శాతం ఎగసింది. రూ. 2,679 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఇదే విధంగా ఇన్ఫోసిస్ రూ. 1,055 వద్ద, మైండ్‌ట్రీ రూ. 1,374 వద్ద, బిర్లాసాఫ్ట్ రూ. 210 వద్ద, కేపీఐటీ టెక్నాలజీస్ రూ. 130 వద్ద, కోఫోర్జ్ రూ. 2,439 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఇక విప్రో 6 శాతం జంప్‌చేసి రూ. 331కు చేరింది. ఇది రెండు దశాబ్దాల గరిష్టంకాగా.. ఇంతక్రితం 2000 ఫిబ్రవరి 22న రూ. 388 వద్ద ఆల్‌టైమ్ హై'ని తాకింది. ఇతర కౌంటర్లలో మాస్టెక్, రామ్‌కో సిస్టమ్స్, స్యుబెక్స్, ఇంటెలెక్ట్ డిజైన్, టాటా ఎలక్సీ, ఈక్లెర్క్స్, న్యూక్లియస్ తదితరాలు 5-3 శాతం మధ్య లాభపడి ట్రేడవుతున్నాయి. -
ఐటీ జోరు: లాభాల్లో మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి. కానీ వెంటనే తేరకుని బలపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 298 పాయింట్ల లాభంతో 36350 వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు ఎగిసి 10660 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా ఐటీ షేర్ల లాభాల హవా రెండో రోజు కూడా కొనసాగుతోంది. అయితే బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇన్ఫోసిస్ 10శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ అయింది. ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. హెచ్‌సీఎల్ టెక్ 4శాతం, టెక్ మహీంద్రా 2శాతం, టీసీఎస్ 1.50 శాతం లాభంతో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభపడుతుండగా, బంధన్ బ్యాంకు, వొడాఫోన్ఐడియా, భారతి ఇన్ఫ్రాటెల్, ఐటీసీ, హిందాల్కో, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ నష్టపోతున్నాయి. -
ఐటీ దన్ను : లాభాల జోరు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. రెండు రోజుల నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు జూలై డెరివేటివ్ సిరీస్‌ను శుభారంభాన్నిచ్చాయి. చివరి గంటలో మరింత పుంజుకుని వారాంతంలో హుషారుగా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 329 పాయింట్లు ఎగిసి 35171 వద్ద, నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 10383 వద్ద స్థిరంగా ముగిసాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల నార్జించాయి. మెటల్, పీఎస్‌యు బ్యాంక్ ఇండెక్స్ లాభపడ్డాయి. ముఖ్యంగా ఐటీ లాభాలు మార్కెట్ కు మద్దతునిచ్చాయి. ఊహించిన దానికంటే యాక్సెంచర్ ప్రకటించిన మెరుగైన త్రైమాసిక ఫలితాలతో టెక్నాలజీ (ఐటి) కంపెనీల షేర్లు ర్యాలీగా అయ్యాయి. ఇన్ఫోసిస్ టాప్ విన్నర్ గా ఉండగా, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, రిలయన్స్, టీసీఎస్, విప్రో, జీ, ఒఎన్జీసీ, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర, బజాజ్ ఆటో, మైండ్‌ట్రీ, మాస్టెక్, ఎన్ఐఐటి టెక్ లాభపడ్డాయి. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఇన్ఫ్రాటెల్, ఐటిసి, బజాజ్ ఫైనాన్స్, హిందుస్తాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ నష్టపోయాయి. -
ఐటీ షేర్లకు ట్రంప్ షాక్ : రికవరీ
సాక్షి, ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్క్ వీసాలపై సంచలన నిర్ణయం తీసుకోవడంతో మంగళవారం నాటి మార్కెట్లో ఐటీ షేర్లకు అమ్మకాల సెగ తాకింది. 2020, డిసెంబర్ 31వరకు హెచ్1బీ, హెచ్ 2బీ, తదితర వర్క్ వీసాల జారీని ట్రంప్ సర్కార్ నిలిపివేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. దీంతో టాప్ ఐటీ షేర్లతో పాటు మిగిలిన ఐటీ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్ భారీగా నష్టాలను నమోదు చేశాయి. ఇన్ఫోసిస్ షేర్ ధర 1శాతం పైగా కోల్పోయి 692 రూపాయల వద్ద, హెచ్ఎస్ఎల్ దాదాపు 1 శాతం తగ్గి 564 రూపాయలకు చేరుకుంది. టీసీఎస్ షేర్ అంతకుముందు ముగింపు 2028 రూపాయలతో పోలిస్తే 2010 వద్ద ట్రేడ్ అయింది. టెక్ మహీంద్రా షేర్ ధర 0.92 శాతం క్షీణించి 543.50 రూపాయలకు చేరుకుంది. అయితే దీని ప్రభావం తాత్కాలికమేనని, భారతీయ ఐటీ ఉద్యోగులు లేకుండా అమెరికా ఐటీ పరిశ్రమ మనుగడ కష్టమని ఐటీ నిపుణులు భరోసా ఇవ్వడంతో తిరిగి అదే స్థాయిలో రీబౌండ్ అయ్యాయి. దీంతో మిడ్ సెషన్ తరువాత కోలుకుని ప్రస్తుతం లాభాలతో కొనసాగుతుండటం విశేషం. అటు సెన్సెక్స్ 351 పాయింట్ల లాభంతో 35263 వద్ద, నిఫ్టీ 108 పాయింట్లు ఎగిసి 10421 వద్ద కొనసాగుతున్నాయి. (ట్రిపుల్ సెంచరీ లాభాలతో సెన్సెక్స్) ఐటీ నిపుణులు, విశ్లేషకులు ఏమన్నారు ట్రంప్ సర్కార్ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీల కంటే అమెరికా కంపెనీలనే ఎక్కువగా ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019లో హెచ్ 1బీ వీసాలు పొందిన మొదటి పది కంపెనీల్లో ఏడు అమెరికా కంపెనీలే ఉన్నాయని ఒక నివేదిక ద్వారా తెలుస్తోంది. అంతేకాదు హెచ్1బీ వీసాలపై ఆధారపడటం ఐటీ పరిశ్రమలో గణనీయంగా తగ్గిందని వెడ్ బుష్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ మోషే కత్రి చెప్పారు. దురదృష్టవశాత్తు అమెరికాలో ఎన్నికల సంవత్సరంలో ఇదొక ఎత్తుగడ అని వ్యాఖ్యానించారు. ఇమ్మిగ్రేషన్ సవాళ్లకు భారత ఐటీ పరిశ్రమ ఇప్పటికే తనను తాను సిద్ధం చేసుకుందని టెక్ మహీంద్రా సీఎండీ సీపీ గుర్నాని చెప్పారు. ట్రంప్ ప్రకటనపై నిరాశను వ్యక్తం చేసిన గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, అటు అమెరికా ఆర్థిక విజయానికి, టెక్ రంగలో గ్లోబల్ లీడర్‌గా నిలిచేందుకు, ఇటు గూగుల్ సంస్థకూ వలసదారులు ఎంతో దోహదపడ్డారని పేర్కొన్నారు. అందరికీ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తాం, వలసదారులకు అండగా వుంటామని భరోసా ఇస్తూ ట్వీట్ చేశారు. Immigration has contributed immensely to America’s economic success, making it a global leader in tech, and also Google the company it is today. Disappointed by today’s proclamation - we’ll continue to stand with immigrants and work to expand opportunity for all. — Sundar Pichai (@sundarpichai) June 22, 2020 మరోవైపు వరుసగా రెండో రోజూ రూపాయి లాభాలతో ప్రారంభమైంది. డాలర్‌తో పోలిస్తే 16 పైసలు బలపడి 75.86 వద్ద ట్రేడ్ అయింది. చివరకు 37 పైసలు ఎగిసి 75.66 వద్ద ముగిసింది. నిన్న (సోమవారం) 76.02 వద్ద ముగిసింది.