సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి. కానీ వెంటనే తేరకుని బలపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 298 పాయింట్ల లాభంతో 36350 వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు ఎగిసి 10660 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా ఐటీ షేర్ల లాభాల హవా రెండో రోజు కూడా కొనసాగుతోంది. అయితే బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది.
ఇన్ఫోసిస్ 10శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ అయింది. ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. హెచ్‌సీఎల్ టెక్ 4శాతం, టెక్ మహీంద్రా 2శాతం, టీసీఎస్ 1.50 శాతం లాభంతో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభపడుతుండగా, బంధన్ బ్యాంకు, వొడాఫోన్‌ఐడియా, భారతి ఇన్‌ఫ్రాటెల్, ఐటీసీ, హిందాల్కో, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment