సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి. ఆరంభంలోనే కీలకమైన 60వేల మార్క్‌ను మరోసారి అధిగమించిన సెన్సెక్స్ అదే ధోరణిని కొనసాగించి దాదాపు 400 పాయింట్లకుపైగా ఎగిసింది. అయితే మిడ్‌సెషన్ తరువాత లాభాల స్వీకరణతో కాస్త వెనక్కి తగ్గినా కీలక మద్దతు స్థాయిలకు ఎగువన ముగిసాయి. ఐటీ, రియాల్టీ షేర్ల లాభాలు మార్కెట్లకు భారీ మద్దతునిచ్చాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు లాభ నష్టాల మధ‍్య ఊగిసలాడాయి.
సెన్సెక్స్ 323 పాయింట్లుఎగిసి 60115 వద్ద,నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 17936 వద్ద స్థిరపడ్డాయి. అదానీ పోర్ట్స్, టైటన్, టెక్ మహీంద్ర, దివీస్, యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, హెచసీఎల్ టెక్, ఎం అండ్ ఎం, విప్రో, టీసీఎస్‌డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. కోల్ ఇండియా, శ్రీ సిమెట్, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నష్ట పోయాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభంతో 79.52 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment