సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిసాయి. రోజంతా లాభాలతో కళకళలాడిన మార్కెట్లు చివరిదాకా అదో జోరును కంటిన్యూ చేశాయి. ఒక్క ఐటీ తప్ప అన్నిరంగాల షేర్లు లాభాలనార్జించాయి. భారతదేశ ఐటి కంపెనీలకు రాబోయే కొన్ని త్రైమాసికాలలో అట్రిషన్ ఎక్కువగా ఉంటుందని నోమురా అంచనాల మధ్య ఐటీ దిగ్గజ కంపెనీల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బ్యాంకింగ్, ఆటో కంపెనీలు కొనుగోళ్లు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 462 పాయింట్లు ఎగిసి 52728 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 15699 వద్ద పటిష్టంగా ముగిసాయి.
హీరో మోటో, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాప్ ఫైనాన్స్, హెచ్ యూఎల్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్ టాప్ లూజర్స్‌గా ముగిసాయి. అటు డాలరు మారకంలో రూపీ ఆరంభ లాభాలను కోల్పోయి 78.31 వద్ద స్వల్ప నష్టాలతో ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment