సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వారాంతంలో లాభాలతో మురిపించింది. భారీ లాభాలతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ రికార్డు క్లోజింగ్‌న నమోదు చేశాయి. ఆరంభం నుంచి ఉత్సాహంగా సూచీలు చివరి వరకూ అదే ధోరణిని కొనసాగించాయి. సెన్సెక్స్ 467 పాయింట్లు ఎగిసి 63,385, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 18,826 వద్ద స్థిరపడింది.
ఐటీ షేర్లు తప్ప మిగతా రంగాలు లాభాలనార్జించాయి నెస్లే ఇండియా, టాటా స్టీల్, టైటాన్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, మారుతీ, హెచ్‌సీఎల్ షేర్లు టాప్ విన్నర్స్‌గా, విప్రో, టీసీఎస్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. అటు డాలరుతోపో లిస్తే రూపాయి మారకం విలువ 81.94గా నిలిచింది.
రూ. 2 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
బీఎస్‌సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లో రూ. 290.7 లక్షల కోట్ల నుండి రికార్డు స్థాయిలో రూ. 292.7 లక్షల కోట్లకు పెరిగింది, ఈఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 2 లక్షల కోట్లు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment