వారం కనిష్టానికి సెన్సెక్స్ | BSE Sensex falls around 97 points; IT shares slump | Sakshi
Sakshi News home page

వారం కనిష్టానికి సెన్సెక్స్

Published Thu, Oct 24 2013 1:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

వారం కనిష్టానికి సెన్సెక్స్

వారం కనిష్టానికి సెన్సెక్స్

ముంబై: బ్లూచిప్ షేర్లలో అమ్మకాలు కొనసాగడం, అమెరికాలో నిరుత్సాహకర ఉద్యోగ గణాంకాలతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉండటం వంటి అంశాల కారణంగా దేశీ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ క్షీణించాయి. బుధవారం సెన్సెక్స్ మరో 97 పాయింట్లు కోల్పోయి.. వారం రోజుల కనిష్ట స్థాయి 20,768 పాయింట్లకి తగ్గింది. అటు నిఫ్టీ సైతం 24 పాయింట్లు క్షీణించి 6,178 వద్ద ముగిసింది.
 
 క్రితం రోజున 29 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ బుధవారం రోజున కాస్త అధికంగా 20,875 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. విదేశీ నిధుల రాకతో ప్రారంభంలో కొనుగోళ్లు జరగడం ఇందుకు దోహదపడింది. కానీ ఆ తర్వాత 20,590 పాయింట్ల స్థాయికి కూడా క్షీణించి చివరికి 20,768 వద్ద ముగిసింది. అక్టోబర్ 17 నాటి 20,416 తర్వాత ఇది కనిష్ట ముగింపు. అమెరికాలో ఉపాధి గణాంకాలు బలహీనంగా ఉండటంతో అక్కడి దిగుమతిదారులతో ముడిపడి ఉన్న భారత ఎగుమతి సంస్థలపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్న ఆందోళన మార్కెట్లో నెలకొందని బ్రోకింగ్ సంస్థ ఆర్‌కేఎస్‌వీ సహ వ్యవస్థాపకుడు రఘు కుమార్ తెలిపారు. ఆటోమొబైల్, ఐటీ రంగ షేర్లు ఇందువల్ల పతనమైనట్లు వివరించారు. మంగళవారం విడుదలైన అమెరికా ఉపాధి గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో 1,48,000 మందికి ఉద్యోగాలు లభించాయి. ఇది నిపుణులు అంచనా వేసిన 1,70,000- 1,80,000 కన్నా తక్కువ.
 
 టీసీఎస్, ఇన్ఫోసిస్‌లో అమ్మకాలు..
 సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 21 స్క్రిప్స్ నష్టాల్లో ముగిశాయి. ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ కౌంటర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఈ షేర్లు క్షీణించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆర్‌ఐఎల్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ సుమారు 1-2 శాతం శ్రేణిలో క్షీణించాయి. అయితే.. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, హీరో మోటోకార్ప్ తదితర షేర్లు పెరిగాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 14,000 కోట్ల మేర మూలధనం సమకూర్చే ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేయడంతో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు కాస్త బలపడ్డాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ రీసెర్చ్ ఆనలిస్ట్ నిధి సారస్వత్ తెలిపారు. ఇక రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో రియల్టీ సూచీ 1.46 శాతం, పవర్ సూచీ 1.28 శాతం, ఐటీ సూచీ 0.93 శాతం మేర క్షీణించాయి. మొత్తం మీద 1,230 షేర్లు నష్టాల్లోనూ, 1,184 స్టాక్స్ లాభాల్లోనూ ముగిశాయి. బీఎస్‌ఈలో టర్నోవర్ రూ. 2,162 కోట్ల నుంచి రూ. 2,227 కోట్లకు పెరిగింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ. 645 కోట్లు కొనుగోలు చేయగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 546 కోట్ల అమ్మకాలు జరిపారు. మరోవైపు, ఎన్‌ఎస్‌ఈ స్టాక్స్‌లో రూ. 12,070 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ. 1,90,148 కోట్ల టర్నోవరు నమోదైంది.
 
 నష్టాల్లో ఆసియా మార్కెట్లు..
 ఆసియా మార్కెట్లు ప్రారంభంలో లాభపడినా తర్వాత నష్టపోయాయి. సింగపూర్, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్, చైనా, హాంకాంగ్ సూచీలు 0.17-1.95 శాతం శ్రేణిలో నష్టపోయాయి. యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి.
 
 విప్రో మార్కెట్ క్యాప్ 4 శాతం డౌన్..
 రెండో త్రైమాసిక ఫలితాల వెల్లడించిన ఐటీ దిగ్గజం విప్రో షేరు 4.41 శాతం క్షీణించింది. దీంతో సంస్థ మార్కెట్ విలువ రూ. 5,596 కోట్లు హరించుకుపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి విప్రో షేరు రూ. 492.20 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 4.60 శాతం క్షీణించి రూ. 491.10 వద్ద ముగిసింది. మార్కెట్‌క్యాప్ పరంగా ప్రస్తుతం విప్రో విలువ రూ. 1,21,331 కోట్లుగా ఉంది.
 
 బ్యాంకింగ్ కౌంటర్లలో షార్ట్ కవరింగ్....
 వురోవారంలో రిజర్వుబ్యాంక్ పరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో బుధవారం బ్యాంకింగ్ కౌంటర్లలో షార్ట్ కవరింగ్ జరిగింది. ఇటీవల కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకులు వూర్కెట్ అంచనాల్ని మించిన ఫలితాలు ప్రకటించడం, పీఎస్‌యుూ బ్యాంకుల కు తాజా వుూలధనాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణరుుంచడం ఈ షార్ట్ కవరింగ్‌కు కారణవుని వూర్కెట్ వర్గాలు చెపుతున్నారుు. 2 శాతం ఎగిసిన ఎస్‌బీఐ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 27 వేల షేర్లు కట్‌కాగా, మొత్తం ఓఐ 62.90 లక్షల షేర్లకు తగ్గింది. రూ. 1,650 స్ట్రరుుక్ వద్ద కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగింది. ఫలితంగా ఈ కాల్ ఆప్షన్ నుంచి 80 వేల షేర్లు కట్‌కాగా, పుట్ ఆప్షన్లో 68 వేల షేర్లు యూడ్ అయ్యూరుు.  సమీప భవిష్యత్తులో ఈ షేరుకు రూ. 1.650 స్థారుు వుద్దతునివ్వవచ్చని ఈ డేటా సూచిస్తోంది.  
 
 6 శాతం ర్యాలీ జరిపిన బ్యాంక్ ఆఫ్ ఇండియూ ఫ్యూచర్ నుంచి 1.11 లక్షల షేర్లు (3.5 శాతం), 2 శాతం పెరిగిన యుూనియున్ బ్యాంక్ ఫ్యూచర్ నుంచి 1.64 లక్షల షేర్లు (2 శాతం) కట్ అయ్యూరుు. శుక్రవారం ఫలితాలు వెల్లడించనున్న ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంక్ ఫ్యూచర్ ఓఐ నుంచి 2.99 లక్షల షేర్లు (3.58 శాతం) కట్‌కావడంతో మొత్తం ఓఐ 80.57 లక్షల షేర్లకు దిగింది. యూక్సిస్ బ్యాంక్ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి 98 లక్షల షేర్లు (1.93 శాతం) కట్ అయ్యూరుు. షేరు తగ్గుతుందన్న అంచనాలతో ఫ్యూచర్ కాంట్రాక్టును విక్రరుుంచడం షార్టింగ్ అని అంటారు. అలా విక్రరుుంచిన కాంట్రాక్టును తిరిగి కొనుగోలు చేయుడాన్ని షార్ట్ కవరింగ్‌గా వ్యవహరిస్తారు. షార్ట్ చేసినపుడు షేరు ఫ్యూచర్లో ఒక కొత్త కాంట్రాక్టు యూడ్ అవుతుంది. దానిని తిరిగి కొనుగోలుచేస్తే ఆ కాంట్రాక్టు కాస్తా ఓపెన్ ఇంట్రస్ట్ నుంచి కట్ అవుతుంది. ఏదైనా ఒక ఫ్యూచర్లో వున్న మొత్తం కాంట్రాక్టులను ఓపెన్ ఇంట్రస్ట్‌గా వ్యవహరిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement