ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో రెండో అత్యంత విలువైన సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు వ్యాపారం పరంగా ఎదురు దెబ్బ తగిలింది. టీసీఎస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ట్రాన్సామెరికా ప్రకటించింది. దీంతో టీసీఎస్ వేల కోట్లు నష్టపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికా కేంద్రంగా ట్రాన్సామెరికా హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు ఇతర ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, 2018 నుంచి 10 ఏళ్ల కాలానికి సేవలు పొందేందుకు దేశీయ టెక్ దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ డీల్ విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా టీఎస్‌ఎస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ట్రాన్సామెరికా ప్రకటించింది. ఈ ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో టీసీఎస్ మార్కెట్ వ్యాల్యూ రూ.11,76,842 కోట్ల నుంచి రూ.11,61,840 వద్ద స్థిర పడింది. రూ.15,000 కోట్ల సంపద తరిగింది.
ఏడాదికి 200మిలియన్ల ఆదాయం
2018 నుంచి ట్రాన్సామెరికాకు టీసీఎస్ సర్వీసుల్ని అందిస్తుంది. అందుకు గాను దేశీ టెక్ దిగ్గజం ఏడాదికి 200 మిలియన్ డాలర్ల ఆదాయన్ని గడిస్తుంది. ఈ సందర్భంగా అమెరికన్ ఆర్ధిక సేవల సంస్థ జేపీ మోర్గాన్.. తాము సైతం ఆర్ధిక అనిశ్చితి ఇబ్బంది పడుతున్నట్లు ఓ నివేదికను విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితులు గణనీయమైన లాభాల్ని సైతం పరిమితం చేస్తున్నట్లు తెలిపింది.
చదవండి👉 ‘మాకొద్దీ ఉద్యోగం’..టీసీఎస్‌కు షాకిస్తున్న మహిళా ఉద్యోగులు!
Comments
Please login to add a commentAdd a comment