project
-
అసంపూర్తి నిర్మాణాలకు మళ్లీ జీవం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీలాంచ్, బై బ్యాక్ స్కీమ్‌ల పేరిట కొందరు బిల్డర్లు చేస్తున్న మోసా లకు అటు రూ. కోట్లలో డబ్బు పోగొట్టుకోవడంతోపాటు ఇటు సొంతింటి కలకు దూరమవుతున్న బాధితులకు న్యాయం చేసేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా), రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా దుండిగల్‌లో ఇలా బోర్డు తిప్పేసిన జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థకు చెందిన ‘ప్లాటినం’ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీ (మరో బిల్డర్)కు అప్పగించాయి. ఈ మేరకు టీజీ–రెరా చేసిన ప్రతి పాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది.దీంతో రెరా–2016 చట్టంలోని సెక్షన్ 8 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఆ ప్రాజెక్టును థర్డ్ పార్టీకి బదిలీ చేస్తూ టీజీ–రెరా మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది. త్వరలోనే ఇలా ఆగిపోయిన మరికొన్ని ప్రాజెక్టులను కూడా థర్డ్ పారీ్టలకు ఇచ్చేందుకు టీజీ రెరా కసరత్తు చేస్తోంది. దీంతో ఆగిపో యిన నిర్మాణాలు మళ్లీ జీవం పోసుకోనున్నాయి. ఇదీ ‘ప్లాటినం’కథ..: ఐదేళ్ల క్రితం జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ యజమాని కాకర్ల శ్రీనివాస్ దుండిగల్‌లో ప్లాటినం పేరుతో అపార్ట్మెంట్ ప్రాజెక్టును ప్రకటించాడు. 3,267 గజాల స్థలంలో స్టిల్ట్+5 అంతస్తులకు హెచ్ఎండీఏ నుంచి అను మతి తీసుకొని 5,865 చ.అ. బిల్టప్ ఏరియాలో 60 అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నామని ప్రచారం చేశాడు. రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే ప్రీలాంచ్ ఆఫర్ కింద కస్టమర్ల నుంచి రూ. కోట్లు వసూలు చేశాడు. కొనుగోలుదారులను నమ్మించేందుకు శ్లాబ్ లెవల్స్ వరకు నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టాడు. హెచ్ఎండీఏకు తనఖా పెట్టిన 9 ఫ్లాట్లు మినహా మిగిలిన 51 ఫ్లాట్లను విక్రయించేశాడు. అయితే నిధుల దురి్వనియోగం కారణంగా ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో గతేడాది సెపె్టంబర్లో కస్టమర్లు ‘రెరా’కు ఫిర్యాదు చేశారు. త్వరలోనే సాహితీ, మంత్రి ప్రాజెక్ట్‌లు కూడా..: జయత్రీ కేసులాగే సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్, మంత్రి డెవలపర్స్ మధ్యలోనే వదిలేసిన పలు అపార్ట్మెంట్ ప్రాజెక్టులను కూడా సెక్షన్–8 కింద ఉత్తర్వులు ఇచ్చేందుకు రెరా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గచి్చ»ౌలి, గుండ్లపోచంపల్లి, అమీన్పూర్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నామని కస్టమర్ల నుంచి సొమ్ము వసూలు చేసి సాహితీ సంస్థ చేతులెత్తేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద లగ్జరీ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని వినియోగదారుల నుంచి మంత్రి డెవలపర్స్ రూ. కోట్లు వసూలు చేసింది. నిధుల దురి్వనియోగం కారణంగా ఆయా ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. బాధితుల ఫిర్యాదుతో సెక్షన్–8 కింద ఆయా ప్రాజెక్టుల నిర్మాణ పనులను థర్డ్ పార్టీ బిల్డర్‌కు అప్పగించేందుకు ‘రెరా’కసరత్తు చేస్తోంది. 8 కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉంటే ‘రెరా’పరిధిలోకి..: గృహ కొనుగోలుదారుల భద్రత, పెట్టుబడులకు భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ‘రెరా’తెలంగాణలో 2016 మే 1న అమల్లోకి వచ్చింది. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా ఒక అపార్ట్మెంట్లో 8 అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు నిర్మించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ‘రెరా’పరిధిలోకి వస్తాయి. స్థానిక మున్సిపాలిటీ/కార్పొరేష న్ అనుమతులు ఉన్నప్పటికీ ఫ్లాట్ల వ్యాపారం చేస్తే తప్పనిసరిగా సదరు ప్రాజెక్టు ‘రెరా’రిజి్రస్టేషన్ పొందాలి. అయితే చాలా మంది బిల్డర్లు నిర్మాణ అనుమతులు రాకముందే.. ‘రెరా’రిజిస్ట్రేషన్ లేకుండానే ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. నిధుల మళ్లింపు, దురి్వనియోగం కారణంగా ప్రాజెక్టు నిర్మాణ పను లు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీంతో కస్టమర్లు రోడ్డున పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో రెరా– 2016 చట్టంలోని సెక్షన్–8 కింద థర్డ్ పారీ్టకి నిర్మా ణ పనులను బదలాయించే అధికారం రెరాకు ఉంది. కస్టమర్లకు ఊరట లభిస్తుంది పలువురు బిల్డర్లు, ఏజెంట్లు అబద్ధపు హామీలతో కస్టమర్లను నమ్మించి మోసం చేస్తున్నారు. అలాంటి వారిని వదిలిపెట్టం. టీజీ–రెరాకు విస్తృత అధికారాలు ఉన్నాయి. చట్ట పరిధిలో గృహ కొనుగోలుదారులకు న్యాయం అందించి తీరతాం. మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ‘రెరా’అధికారాలను వినియోగించి కస్టమర్లకు ఊరట కల్పిస్తాం. – కె. శ్రీనివాసరావు, టీజీ–రెరా సభ్యుడు -
ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!
అండమాన్, నికోబార్ దీవులలో ‘అండమాన్, నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొ రేషన్’ (ఏఎన్ఐఐడీసీఓ) అనే పాక్షిక–ప్రభుత్వ ఏజెన్సీ ఉంది. ‘ఈ ప్రాంత సమతుల్య పర్యావరణ అనుకూల అభివృద్ధి కోసం సహజ వనరులను వాణిజ్యపరంగా ఉప యోగించుకోవడానికీ, అభివృద్ధి చేయడానికీ’ దీనిని కంపెనీల చట్టం కింద 1988లో స్థాపించారు. దాని ప్రధాన కార్యకలాపాలలో పెట్రోలియం ఉత్పత్తుల వర్తకంతో సహా, భారతదేశంలో తయారయ్యే విదేశీ మద్యం, పాలు, పర్యాటక రిసార్ట్‌ల నిర్వహణ; పర్యాటకం కోసం, మత్స్య సంపద కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివీ ఉన్నాయి. అంతవరకు పెద్దగా తెలియని ఈ సంస్థకు 2020 ఆగస్టులో రాత్రికి రాత్రే గ్రేట్ నికోబార్ ద్వీపంలో 72 వేల కోట్ల భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను అప్పగించారు. ఇందులో భారీ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, పవర్ ప్లాంట్, విమానాశ్రయం, టౌన్షిప్ నిర్మాణంతో పాటు, 130 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ భూమిలో విస్తరించే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమై ఉన్నాయి. రెండు సంవత్సరాల తరువాత, ఏఎన్ఐఐడీసీఓ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్సీసీ) నుండి రెండు కీలకమైన అనుమతులను పొందింది. మొదటిది, అక్టోబర్ 2022లో చోటు చేసుకుంది. మంత్రిత్వ శాఖకు చెందిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్ఏసీ) అటవీ భూమిని ఇతర అవసరాలకోసం మళ్లించేందుకు అనుమతించింది. అత్యంత సహజమైన, జీవవైవిధ్యం కలిగిన ఉష్ణమండల అడవులలో 130 చదరపు కి.మీ. (ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కంటే పెద్దది) విస్తీర్ణం కల భూమి మళ్లింపుపై ఈ కమిటీ సంతకం చేసింది. దాదాపు ఒక నెల తర్వాత, నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ) కీలకమైన పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపు పది లక్షల చెట్లను నరికివేయనున్నారన్న విషయంపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి. ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటనలో ప్రాజెక్ట్ డాక్యుమెంట్లలో దాదాపు 8.5 లక్షల నుండి 9.64 లక్షల వరకు చెట్లు నరికివేయడంపై ప్రాథమిక అంచనాలు మారాయి. వాతావరణ సంక్షోభం వేగవంతమైన ఈ యుగంలో బలి ఇవ్వాల్సిన చెట్ల సంఖ్యను చూసి చాలా మంది నివ్వెరపోయారు. ఒక జాతీయ పత్రికలో నివేదించి నట్లుగా, నిజానికి మనం కనీసం 30 లక్షల చెట్లను కోల్పో వలసి ఉంటుంది. ఇది చాలా చాలా ఎక్కువ అనే చెప్పాలి.ఇది వాస్తవమైతే అందుబాటులో ఉన్న డేటాను బట్టి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రాజెక్ట్, అటవీ భూమి మళ్లింపు కోసం అనుమతి కోరినప్పుడు, ఈ ప్రాజెక్ట్ ప్రతి పాదకుడు మంత్రిత్వ శాఖకు ఏ సమాచారాన్ని అందించారు? ద్వీపంలో రూ. 72 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ఈ ఏజెన్సీని కోరినప్పుడు, నరికివేయాల్సిన చెట్ల సంఖ్య ఎవరికీ తెలియదా? పాలు, ఆల్కహాల్, పెట్రోలియం అమ్మకంలో ప్రధాన వ్యాపార అనుభవం ఉన్న సంస్థను ఈ వ్యవహారంలో ఎవరైనా క్షమించవచ్చు. కానీ మంత్రిత్వ శాఖలోని శాస్త్రీయ, పర్యావరణ సంస్థల మాట ఏమిటి? పైగా పర్యావరణం, అటవీ అనుమతుల మాట ఏంటి?అన్ని వనరులూ, అధికారం తమ వద్దే ఉన్నందున, ఈఏసీ, ఎఫ్సీఏ సరైన ప్రశ్నలను ఎందుకు అడగలేదు? ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతిని మంజూరు చేసేటప్పుడు ఈఏసీ స్థానం కేసి అంతర్ దృష్టితో చూస్తే శాస్త్రీయ సామర్థ్యం, భాషలో నైపుణ్యం అనేవి ఈఏసీ నిర్దేశించిన ప్రమాణాల్లోనే కనిపిస్తాయి. ఇక్కడ రెండు ఉదాహరణలు ఉన్నాయి: ‘ఏ చెట్లూ ఒకేసారి నరికివేయబడవు. వార్షిక ప్రాతిపదికన పని పురోగతిని బట్టి దశలవారీగా ఈ పని జరుగుతుంది. అసాధారణంగా పొడవుగానూ, వయ స్సులో పెద్దగా ఉన్న అన్ని చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ ‘అసాధారణంగా పొడవైన చెట్టు’ అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే? చెట్టు పాతదిగా పరిగణించ బడటానికి సరైన వయస్సును ఎలా నిర్ణయిస్తారు? ప్రారంభించడానికి, మీరు చెట్టు వయస్సును ఎలా అంచనా వేస్తారు? అలాగే ‘సాధ్యమైనంత వరకు’ వాటిని రక్షించడం అంటే అర్థం ఏమిటి? రెండవ ఉదాహరణ మరింత మెరుగైనది– ‘స్థానిక గుడ్లగూబల గూడు రంధ్రాలు ఉన్న చెట్లను ఎస్ఏసీఓఎన్ (సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచర్) సహాయంతో గుర్తించి జియో–ట్యాగ్ చేయాలి. అటువంటి చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ పక్షి ప్రవర్తన, రాత్రిపూట దాని అలవాట్లను పరిగణ నలోకి తీసుకుని, గుడ్లగూబను (ఏదైనా గుడ్లగూబ) చూడటం ఎంత కష్టమో తెలియనిది కాదు. నిజానికి, నికోబార్ వర్షాటవిలోని చెట్లు ఆకాశంలోకి 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఒక్కో చెట్టుకు కేవలం ఐదు నిమిషాలు కేటాయించినట్లయితే, ఒక మిలియన్ చెట్లకు గూడు రంధ్రాలు వెతకడానికి మొత్తం 83,000 గంటల సమయం పడుతుంది. మన ఉత్తమ పక్షి వీక్షకు లలో 10 మంది ఏకకాలంలో రోజుకు 8 గంటలు సర్వే చేసినా, అది పూర్తి కావడానికి దాదాపు ఆరేళ్లు పడుతుంది.ఇప్పుడు ఈ ఆమోదిత షరతును మళ్లీ చదవండి. మీరు దీని గురించి ఏ భావాన్ని పొందగలరో చూడండి. ఈ చెట్లను లెక్కించడానికి, కత్తిరించడానికి రవాణా చేయ డానికి ఇప్పటికే ఏఎన్ఐఐడీసీఓ కాంట్రాక్టర్లను ఆహ్వానించింది. గొడ్డళ్లు చెట్లను నేలకూల్చుతుంటే వాటిని రక్షించడం మాని... భూమికి వంద అడుగుల ఎత్తులో ఉన్న గుడ్లగూబల గూడు రంధ్రాల కోసం మన ఎస్ఏసీఓఎన్ మిత్రులు వెతుకుతూ ఉండరని ఆశిద్దాం.-పంకజ్ సేఖసరియావ్యాసకర్త ఐఐటీ బాంబే అసోసియేట్ ప్రొఫెసర్(‘ది హిందుస్థాన్ టైవ్స్ సౌజన్యంతో) -
బీఆర్ఐ నుంచి తప్పుకుని.. చైనాకు షాకిచ్చిన బ్రెజిల్
బీజింగ్ : చైనాకు బ్రెజిల్ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రణాళికకు బ్రెజిల్ అడ్డుకట్టవేసింది. చైనా చేపట్టిన బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టులో చేరకూడదని నిర్ణయించుకుంది. తద్వారా ఈ భారీ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వని బ్రిక్స్ గ్రూపులోని రెండో దేశంగా బ్రెజిల్ అవతరించింది.బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా ప్రత్యేక సలహాదారు సెల్సో అమోరిమ్ మీడియాతో మాట్లాడుతూ బ్రెజిల్ బీర్ఐలో చేరదని, అయితే ఇందుకు బదులుగా చైనా పెట్టుబడిదారులతో భాగస్వామిగా ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని తెలిపారు. బ్రెజిల్ ఎటువంటి ఒప్పందాలపై సంతకం చేయకుండా, చైనాతో తన సంబంధాలను కొత్త స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటోందన్నారు.హాంకాంగ్‌కు చెందిన వార్తాపత్రిక 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్'లోని వార్తల ప్రకారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించిన చైనా ప్రణాళికకు బ్రెజిల్ మద్దతునివ్వడం లేదు. బ్రెజిల్ ఆర్థిక, విదేశాంగ మంత్రిత్వ శాఖల అధికారులు ఇటీవల చైనా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో ఇప్పటికే భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బీఆర్ఐ ప్రాజక్టు అంతర్జాతీయ చట్టాలు, సూత్రాలకు విరుద్ధమని భారత్ పేర్కొంది.ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
ఎవరి అర్థాలు వాళ్లవి...
దసరా పండుగ నాడు ఢిల్లీ ‘భారత మండపం’లోని ‘గతిశక్తి అనుభూతి కేంద్ర’ను మోదీ హఠాత్తుగా సందర్శించారు. ఆ రోజు ‘ప్రధాన మంత్రి గతి శక్తి’ కేంద్రం మూడవ వార్షికోత్సవం వేళ అక్కడికి వెళ్లి తన ప్రాధాన్యాన్ని దేశానికి వెల్లడించారు. అయితే, ఇది అందరికీ ఒకేలా అర్థం కావాలనే షరతు ఏమీ లేదు. వీటి తాత్పర్యం చంద్ర బాబుకు ఒకలాగా, జగన్మోహన్ రెడ్డికి మరొక లాగా అర్థం కావొచ్చు. అందుకు వాళ్ళ వయస్సు, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన కాలం, వారి ప్రాపంచిక దృక్పథం, మరెన్నో కారణాలు కావొచ్చు. అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఈ పదేళ్ళలో అదీ దేశానికి తూర్పున ఈ చివరన ఉన్నామేమో, ఇందులో ‘మనకు ఏముంది’ అని చూసినప్పుడు, మనం అర్థం చేసుకోవాల్సింది కొంచెం ఎక్కువే ఉంది.ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 15.39 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన 208 భారీ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు ఉన్నాయి. దీని అమలుకు వేర్వేరు శాఖలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలతో సమన్వయం కోసం ఒక ‘నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూప్’ పనిచేస్తున్నది. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ – ఇంటర్నల్ ట్రేడ్’ కార్యదర్శి అమర్ దీప్ సింగ్ భాటియా... ‘ఇందులో 101 జాతీయ రహదారులు, 73 రైల్వే ప్రాజెక్టులు, 12 పట్టణ అభివృద్ధి ప్రణాళికలు, 4 చమురు–గ్యాస్ ప్రాజెక్టులు ఉన్నాయి’ అంటున్నారు. ఈ నాలుగు రంగాలు కూడా ప్రాంతాల మధ్య దూరాలనుతగ్గించి వాటిని చేరువ చేస్తూ, విద్యుత్తు భద్రత, పట్టణీకరణ లకు దోహదం చేస్తాయి. ఇందులో కీలకమైన అంశం ‘పి.ఎం. గతిశక్తి’... ‘బ్రాడర్ విజన్’ పేరుతో దేశవ్యాప్తంగా 1600 రకాల ‘జియో స్పైటల్ డేటా’ను సేకరించి ఈ ‘నేషనల్ మాస్టర్ ప్లాన్’ ప్రాజెక్టు కోసం ఇక్కడ భద్రపరుస్తున్నారు. పక్కా ‘డేటా’తో అభివృద్ధి ప్రణాళికల తయారీకోసం వీటిని సేకరిస్తున్నారు. ఇందులో ‘నేచురల్ రిసోర్సెస్ డేటా’ సేకరణ ఒక అంశంగా ఉంది. ప్రాంతాల స్వరూపం తెలి యడం కోసం ‘ల్యాండ్ రికార్డ్ డేటా’ అవసరం. అలాగే సాగు కోసం భూగర్భ జలాల వినియోగం ఎంతో తెలియడానికి వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చాలి. నిజానికి ఇవి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు లోకి తెచ్చిన వీటిని ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఏ స్థాయిలో అల్లరి చేసిందీ తెలిసిందే. ‘అభివృద్ధి’ గురించి ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడితే అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు మార్చి 2023లో విశాఖలో జరిగిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పింది ఏమిటో చూడాలి. ఇందులో కీలకం ఏమంటే, ఆయన దృష్టి ఆసాంతం ఢిల్లీ నుంచి కిందికి దక్షిణాదికి దిగే క్రమంలో ఢిల్లీ యంత్రాంగాన్ని నేరుగా తూర్పు తీరానికి చేర్చడంపై పెట్టారు. ‘ప్రస్తుతం ఢిల్లీ నుంచి బొంబాయి చేరి అక్కణ్ణించి నాగపూర్ వచ్చి అక్కణ్ణించి దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి రోడ్డు ప్రయాణంలో ఎదురవుతున్న కష్టాన్ని చెబుతూ... ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ‘నేషనల్ హైవేస్’ డిసెంబర్ 2024 నాటికి పూర్తి అవుతాయనీ, అవి పూర్తి అయితే వాటిలో ఒకటైన ‘రాయపూర్–విశాఖపట్టణం’ రోడ్డు ద్వారా ఖనిజ నిక్షేపాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు ఏపీ పోర్టులు అందుబాటులోకి వస్తాయనీ ఆయన అన్నారు. ప్రస్తుతం ఇక్కడ 2,014 కి.మీ. పొడవైన 70 రోడ్డు ప్రాజెక్టులు రూ. 33.540 కోట్ల వ్యయంతో నిర్మిస్తు న్నామన్నారు. ఇలా ఢిల్లీ నుంచే కాకుండా, సెంట్రల్ ఇండియా నుంచి దక్షిణాన మన సముద్ర తీరానికి రెండు మూడు మార్గాల్లో తేలిగ్గా చేరవచ్చన్నారు. సరే, ఇది విని ‘ఎందుకు?’ అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు నాలుగు నెలల తర్వాత కాకినాడలో దొరికింది. అక్టోబర్ 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు–వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్’ సదరన్ కేంపస్ ప్రారంభానికి హాజరై ఆంధ్ర సముద్ర తీరం డిల్లీకి ఎంత కీలకమో చెప్పకనే చెప్పారు. ఇక వెనకబడిన మెట్ట కరవు ప్రాంతాలను ‘ఓపెన్’ చేయడానికి నడికుడి– శ్రీకాళహస్తి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నడికుడి నుంచి పల్నాడు జిల్లా శావల్యాపురం వరకు పనులు పూర్తి చేశారు. రెండో దశలో దర్శి వరకు రైల్వే లైన్ మార్చి నాటికి పూర్తయింది. అద్దంకి రోడ్డు వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తనదైన సంక్షేమ ముద్రను ప్రతి రంగం మీద వేసింది. కుర్చీ ఎక్కిన ఆరు నెలల్లోనే వచ్చిన ‘కరోనా’ మహమ్మారిని నిలువరించడంలో దేశంలోనే ‘ఏపీ’ ముందు నిలిచింది. జగన్ ముందు చూపు అప్పట్లో అందరికీ అర్థం కాలేదు. కేంద్రం ‘గతిశక్తి సంఘటన్’ పేరుతో చేస్తున్న మౌలిక వసతుల కల్పన వల్ల రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, జగన్ ప్రభుత్వం ప్రజల పాటవ నిర్మాణం (కెపా సిటీ బిల్డింగ్) పై దృష్టి పెట్టింది. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, విద్య–వైద్యం ప్రాధాన్యత పెంచింది. కొత్త జిల్లాలతో ప్రభుత్వాన్ని, కొత్త మెడికల్ కాలేజీలతో వైద్యాన్ని కొత్త ప్రాంతాలకు చేర్చింది. నైపుణ్యాలు తప్పనిసరి అయ్యే సామాజిక వర్గాలు – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవిక కోసం ‘స్కిల్ డెవలప్మెంట్’పై దృష్టి పెట్టింది. అయినా ఎన్నికలప్పుడు ‘అభివృద్ధి ఏది?’ అనే విమర్శ చేయడం చాలా తేలిక. కానీ ‘అభివృద్ధి’ అంటే ‘మానవాభివృద్ధి’ అని అర్థమయ్యేట్టుగా చెప్పడం మరీ కష్టం. వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
‘సరళ’జల తరంగిణి
పది గ్రామాల్లో పంట సిరుల కోసం సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలనుకున్నారు. అనుకున్నదే తడవు అమెరికాకు చెందినఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. స్వాతం్రత్యానికి ముందు మొదలై.. స్వాతం్రత్యానంతరం ప్రారంభమైన ఆ సాగునీటి ప్రాజెక్టు వయసు ఏడున్నర దశాబ్దాలు.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలో సంస్థానాదీశుల కాలంలో అప్పట్లో రూ.35 లక్షలతో నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టు విశేషాలివి. – వనపర్తివనపర్తి సంస్థానాదీశుడి ఆలోచనే.. స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన.. అప్పటి వనపర్తి సంస్థానా«దీశుడు రాజారామేశ్వర్రావుకు వచ్చింది. తన తల్లి సరళాదేవి పేరుపై ప్రత్యేకంగా నిర్మించేందుకు ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అనధికారికంగా 1947 జూలై 10న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. స్వాతం్రత్యానంతరం అప్పటి మిలిటరీ గవర్నర్ జేఎన్ చౌదరి 1949 సెపె్టంబర్ 15న తిరిగి శంకుస్థాపన చేశారు. పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అప్పట్లో రూ.35 లక్షలతో దీన్ని పూర్తి చేశారు. 1959 జూలై 26న అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి జేవీ రంగారావు ప్రాజెక్టును ప్రారంభించారు. ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అంటే.. ప్రాజెక్టులోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతటవే తెరుచుకుంటాయి. అప్పట్లో ఈ పరిజ్ఞానంతో ఆసియాలోనే నిర్మించిన మొదటి ప్రాజెక్టు కాగా.. ప్రపంచంలో రెండోది కావడం విశేషం. 17 వుడ్ సైఫన్లు, 4 ప్రీమింగ్ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్‌ను నిర్మించారు. ఒక్కొక్క సైఫన్ నుంచి 520 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. మట్టికట్ట పొడవు 3,537 అడుగులు, రాతికట్ట పొడవు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 అడుగులు. నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడికాల్వ 8 కిలోమీటర్లు, ఎడమ కాల్వ 20 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న కట్ట ఇప్పటికి రెండుసార్లు తెగిపోయింది. 1964లో మొదటిసారి, 2019 డిసెంబర్ 31వ తేదీన రెండోసారి కట్టకు గండిపడింది. ముంపు సమస్య పరిష్కారానికే.. వర్షం నీరు ఊకచెట్టు వాగులో నుంచి వృథాగా కృష్ణానదిలో కలిసిపోవటం.. ఈ వాగు సమీపంలోని గ్రామాలు తరచూ వరద ముంపునకు గురయ్యేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు సరళాసాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వనపర్తి సంస్థానం అధీనంలోని పది గ్రామాల్లోని సుమారు 4,182 ఎకరాలకు సాగునీరందించేలా 0.5 టీఎంసీ సామర్థ్యంతో సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు సాగునీరందే గ్రామాలు ప్రస్తుతం మదనాపురం మండల పరిధిలో ఉన్నాయి. ఎడమ కాల్వ పరిధిలో శంకరంపేట, దంతనూరు, మదనాపురం, తిరుమలాయపల్లి, వడ్డెవాట, చర్లపల్లి, రామన్‌పాడు, అజ్జకోలు, కుడికాల్వ పరిధిలో నెల్విడి నర్సింగాపూర్ గ్రామాలున్నాయి. కాగా.. సరళాసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇటీవల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి సరళాసాగర్‌ను సందర్శించినా.. ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం గమనార్హం. మరమ్మతులకు ప్రతిపాదనలు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టుకు అక్కడక్కడా ఏర్పడిన నెర్రెలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇందుకోసం నిపుణులైన ఇంజనీర్లను రప్పించి.. ఆధునిక పద్ధతిలో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూపరింటెండింగ్ ఇంజనీరు ఆదేశించారు. ఈ మేరకు సరళాసాగర్‌ను సందర్శించనున్నాం. – రనీల్‌రెడ్డి, ఇంజనీర్, నీటి పారుదలశాఖ -
మన దేశంలోనూ టైమ్ బ్యాంక్
విశాఖపట్నానికి చెందిన సత్యమూర్తి విద్యాశాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తన ఇద్దరు పిల్లలను అమెరికా పంపించి బాగా చదివించారు. ఉన్నతోద్యోగాల్లో వారు అక్కడే సెటిల్ అయ్యారు. ఏడాదికి ఓసారి భార్యతో కలిసి అమెరికాలోని కొడుకుల వద్దకు వెళ్లి కొద్దిరోజులుండి రావడం ఆయనకు అలవాటు. అయితే, ఏడాది క్రితం భార్య చనిపోవడంతో ఇక్కడ ఒంటరైపోయారు. తమ వద్దకు వచ్చేయమని కొడుకులు కోరుతున్నా ఆయన ఒప్పుకోవడం లేదు. తాను టైమ్ బ్యాంక్‌లో కొంత సమయం దాచుకున్నానని, తనకు అవసరం వచ్చినప్పుడు తనను చూసుకునేందుకు మనుషులు వస్తారని చెప్పడంతో కొడుకులు ఆశ్చర్యపోయారు. విలువైన నగలు, డాక్యుమెంట్లను లాకర్లో దాచుకున్నట్టు బ్యాంకులో టైమును కూడా దాచుకోవచ్చా..అలాంటి అవకాశం కూడా ఉందా!! సాక్షి, అమరావతి: ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. జీవితాలు అపార్ట్మెంట్లలో బందీ అయ్యాయి. ఇది ఒంటరిగా ఉన్న వృద్ధులకు పెద్ద సవాలుగా మారింది. విదేశాల్లోనో లేక మరో దూర ప్రాంతంలోనో ఉండటంతో తల్లిదండ్రులను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో పిల్లలు ఉన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకో లేక ఇంటి వద్దే కొన్ని పనులు చేసిపెట్టేందుకో ఓ వయసు దాటాక ప్రతి ఒక్కరికీ మరొకరి సాయం తప్పనిసరైంది. ఇలాంటి అవసరాలు ఉన్న వారిని చూసుకునేందుకు రోటరీ సంస్థ ‘టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో సామాజిక కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ని అందుబాటులోకి తెచ్చి కుటుంబ అవసరాల అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది.ఏమిటీ టైమ్ బ్యాంక్.. అరవై ఏళ్లు దాటి ఆరోగ్యవంతమైన వ్యక్తి టైమ్ బ్యాంక్ సభ్యుడిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన సమయంలో సహాయం చేయడం ద్వారా వారి సమయాన్ని కొంత ఇతరులకు వెచ్చించవచ్చు. ఇలా ఎన్ని గంటలు వెచి్చస్తే అన్ని గంటలు సదరు సమయం కేటాయించిన వ్యక్తి పేరుపై అతని ఖాతాలో ఆ సమయం జమ అవుతుంది. దానిని వారు అవసరమైన సమయంలో ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ సభ్యులకు ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా ఇతర అవసరాలు ఉన్నపుడు ఇంకో సభ్యుడు వీరికి సాయం చేస్తారు. ఇందులో సభ్యులు.. సేవ కోరేవారి మధ్య డబ్బు లావాదేవీ ఉండదు. ఉదాహరణకు, ఒక సభ్యుడు వారానికి నాలుగు గంటలు మరొకరికి సేవ చేస్తున్నట్టయితే, అతను నెలకు 16 గంటలు సంపాదిస్తాడు లేదా ఆదా చేస్తాడు. ఇలా సంవత్సరానికి 192 గంటలు లేదా 8 రోజులు అతని/ఆమె ఖాతాలో జమ అవుతాయి. ఈ సమయాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత విడతల వారీగా లేదా ఒకేసారి తన అవసరాల కోసం ఖర్చు చేసుకోవచ్చు. దీనికోసం సదరు బ్యాంకులో నమోదు చేసుకుంటే మరో సభ్యుడు లేదా సభ్యురాలు వచ్చి సేవలందిస్తారు. సరళంగా చెప్పాలంటే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజి్రస్టేషన్ అనేది జీరో బ్యాలెన్స్‌తో బ్యాంక్ ఖాతాను తెరవడం లాంటిది. పెద్దలకు సేవ చేయడం ద్వారా డబ్బుకు బదులు సమయాన్ని జమ చేసుకుంటారు. వారి అవసరాల సమయంలో వారి డిపాజిట్ సమయానికి సమానమైన సమయాన్ని విత్‌డ్రా చేసుకుంటారు. ప్రపంచంలో 34 దేశాల్లో అమలు స్విట్జర్లాండ్‌లో మొదలైన టైమ్ బ్యాంక్ కాన్సెప్‌్టను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాలు అమలు చేస్తున్నాయి. ఇందులో యూకే, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, స్పెయిన్, గ్రీస్, సింగపూర్, తైవాన్, సెనెగల్, అర్జెంటీనా, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో 300కు పైగా ఈ తరహా బ్యాంకులు ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే 40 రాష్ట్రాల ప్రభుత్వాలు టైమ్ బ్యాంక్‌ను అమలు చేస్తున్నాయంటే వీటి ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోనూ ఈ తరహా కాన్సెప్ట్ అవసరమని 2018లో జాతీయ మానవ హక్కుల సంఘం కేంద్రానికి సూచించింది. అయితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే 2019లో టైమ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రస్తుతం 50 వేల మంది వలంటీర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతోపాటు సామాజిక సేవల్లో ముందుండే రోటరీ క్లబ్ కూడా టైమ్ బ్యాంక్‌ను ప్రారంభించగా, ఇందులో 5 వేల మంది వరకు సభ్యులుగా చేరారు. 2012లో స్విట్జర్లాండ్‌లో ప్రారంభండబ్బుతో అవసరం లేకుండా ‘మనిíÙకి మనిషి సాయం’ అందించే వినూత్న విధానానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నాంది పలికింది. స్విస్ ప్రభుత్వం వృద్ధులకు ప్రత్యేకంగా పెన్షన్ అందిస్తోంది. అయితే, తమకు డబ్బు కంటే సాయం చేసేవారు అవసరమని, చాలా సందర్భాల్లో ఏ పనీ చేసుకోలేకపోతున్నామని అక్కడి వృద్ధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తమతో మాట్లాడేందుకు మనిíÙని తోడు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన అక్కడి ఫెడరల్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసి అధ్యయనం చేసింది. దేశంలో వృద్ధుల్లో అత్యధికులు ఒంటరి జీవితాలు గడుపుతున్నారని, వారు డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మనిషి సాయం కోరుతున్నట్టు గుర్తించారు. దాంతో ఇంట్లో ఉండే ఒంటరి వృద్ధులకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2012లో ‘టైమ్ బ్యాంక్’ను అక్కడి ప్రభుత్వం ప్రారంభించి ‘టైమ్ ఈజ్ మనీ’ కాన్సెప్‌్టను వర్తింపజేస్తోంది. ఈ కాన్సెప్ట్‌ని కచ్చితంగా ఆచరించడంలో స్విట్జర్లాండ్ ముందడుగు వేసింది. ఆ దేశంలో పౌరులు తమ సమయాన్ని బ్యాంకుల్లో ‘పొదుపు’ చేసేలా ప్రోత్సహించింది. ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా సరే అక్కడి ప్రభుత్వ వెబ్సైట్లో వలంటీర్‌గా రిజిస్టర్ చేసుకుంటే వారిని అవసరం ఉన్నవారికి అలాట్ చేస్తారు. అలా వారు తోటపని, ఇంటి పని, బయటకి తీసుకెళ్లడం, కబుర్లు చెప్పడం, వృద్ధులు చెప్పే మాటలు వినడం, ఆస్పత్రికి తీసుకెళ్లడం వంటి పనుల్లో సాయంగా ఉంటారు. వీరు ఎన్ని గంటలు కేటాయించారో అంత సమయం సాయం చేసిన వ్యక్తి అకౌంట్లో జమ చేయడం ప్రారంభించారు. -
మరమ్మతులకు తక్షణమే టెండర్లు
సాక్షి, హైదరాబాద్: భారీవర్షాలు, వరదలతో దెబ్బతిన్న చెరువుల కట్టలు, కాల్వలు, ఇతర ప్రాజెక్టుల పునరుద్ధరణకు తక్షణమే స్వల్పకాలిక టెండర్లు ఆహ్వానించాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పనులకు పరిపాలనాపర అనుమతులను అత్యవసరంగా జారీ చేసి శుక్రవారం ఉదయం నాటికి ఆన్లైన్లో టెండర్లను పొందుపర్చాలని సూచించారు. దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, ఇతర ప్రాజెక్టుల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఆయన జలసౌధ నుంచి క్షేత్రస్థాయిలోని నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మొత్తంగా 544 జలవనరులకు నష్టం వాటిల్లిందని, అత్యవసర మరమ్మతులకు రూ.113 కోట్లు అవసరమని అధికారులు మంత్రికి నివేదించారు.అత్యవసర, శాశ్వత మరమ్మతులకు రూ.1,100 కోట్లు కేటాయించాలని కోరగా, రాష్ట్ర ఆర్థిక శాఖ రూ.350 కోట్లు కేటాయించిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, తక్షణమే అన్ని పనులకు షార్ట్ టెండర్లు ఆహ్వానించాలని మంత్రి ఆదేశించారు. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మానవ తప్పిదంతో ఏదైనా నష్టం జరిగితే సంబంధిత చీఫ్ ఇంజనీర్లను బాధ్యులుగా చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వట్టెం పంప్‌హౌస్ పునరుద్ధరణ ఖర్చు నిర్మాణ సంస్థదే...: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని వట్టెం వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌తోపాటు సొరంగం నీటమునగగా, 4000 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన 16 పంపుల ద్వారా నీళ్లను బయటకు తోడేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు మంత్రికి చెప్పారు. నిర్మాణ సంస్థే సొంతఖర్చుతో పునరుద్ధరణ పనులు నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. త్వరలో పదోన్నతులు, బదిలీలు..: విపత్తుల సమయంలో 90 శాతం మంది ఉద్యోగులు బాగా పనిచేశారని, మిగిలిన 10 శాతం మంది సైతం తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. కొత్తగా నియామకం పొందిన 700 మంది ఏఈలకు త్వరలో పోస్టింగులతోపాటు నీటిపారుదల శాఖలో ఇంజనీర్లకు పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలిక పదోన్నతులు కాకుండా శాశ్వత పదోన్నతులే ఇస్తామన్నారు. నీటిపారుదలశాఖలో ఖాళీగా ఉన్న 1,800 లస్కర్ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదనలను పంపించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
సుంకిశాలపై మాటల యుద్దం.. కేటీఆర్‌కు భట్టి కౌంటర్
సాక్షి, ఖమ్మం: సుంకిశాల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కేటీఆర్‌కు కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌లు కూలిపోతే మా ప్రభుత్వానికి ఎలా బాధ్యత అవుతుందని భట్టి ప్రశ్నించారు.కాగా, తాజాగా భట్టి విక్రమార్క ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాళేశ్వరం, సుంకిశాల కట్టింది బీఆర్ఎస్ పార్టీనే. ప్రాజెక్ట్‌లు మీరే కట్టారు కాబట్టి.. అవి కూలితే మీదే బాధ్యత. మా ప్రభుత్వంలో కట్టడాలపై మాది బాధ్యత అవుతుంది. సాగర్‌లోకి నీళ్లు రాకుండా ఉంటాయా?. మేము ఎందుకు దాచిపెడతాము. మేడిగడ్డ కరెక్ట్ కాదిన మేము ముందే చెప్పాం. మీరు కట్టిన ప్రాజెక్ట్‌లు క్వాలిటీ లేకుండా అవినీతితో కట్టారు. రాష్ట్రంలో మిగతా ప్రాజెక్ట్‌లు కూడా చెక్ చేయాల్సి అవసరం ఉంది. ప్రాజెక్ట్‌ల విషయంలో జరిగిన తప్పులను కేటీఆర్, బీఆర్ఎస్ ఒప్పుకుని ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రాజెక్ట్‌లో ఇంజినీర్లు చేయాల్సిన పని మీరు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.ఇక, సుంకిశాల విషయంలో అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడకూలిపోవడం హైదరాబాద్ నగర ప్రజలకు విషాద వార్త. ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా లేక విషయం కప్పిపెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ తెలియకపోతే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. సుంకిశాలలో ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలింది. హైదరాబాద్‌కు తాగునీరు ఇవ్వాలని సుంకిశాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ప్రారంభించాం. గత దశాబ్దంగా హైదరాబాద్ విస్తరించింది. సాగు నీటికి ఇబ్బంది లేదని రైతుల్లో విశ్వాసం కల్పించిన తర్వాతే సుంకిశాల ప్రారంభించాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాం. రాబోయే 50 ఏళ్లలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా శరవేగంగా నిర్మాణం చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయం లేదు. మున్సిపల్ శాఖలో పాలన పడకేసింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు
రిషికేశ్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రిషికేశ్- కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులోని ప్యాకేజీ-2లో శివపురి, గూలర్ మధ్య ఆరు కిలోమీటర్ల రైలు సొరంగ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యింది. దీనికి సమాంతరంగా వెళ్లే సొరంగ నిర్మాణం 2023 సెప్టెంబరు నాటికే పూర్తయ్యింది.రిషికేశ్‌లోని కర్ణప్రయాగ్ వరకూ 125 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైనులోని 104 కిలోమీటర్ల ప్రాంతం 17 విభిన్న సొరంగాల మధ్య నుంచి వెళుతుంది. అన్ని సొరంగాల మొత్తం పొడవు 213.4 కిలోమీటర్లు. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టులోని మొత్తం 213.4 కిలోమీటర్లలో ఇప్పటికే 169.496(79.42 శాతం) సొరంగం తవ్వకాల పనులు పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో రైల్వే ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్న లార్సన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) బృందానికి అభినందనలు తెలిపారు.రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు ఎల్ అండ్ టీ కంపెనీ చేపడుతున్న నేపధ్యంలో తాజాగా కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ రాజేష్ చోప్రా మాట్లాడుతూ ప్యాకేజీ-2లో ఎల్ అండ్ టీ చేతిలో ఎడిట్-2(56 మీటర్లు), మెయిన్ టన్నెల్-2లో డబుల్ లైన్ 7-స్టేజ్(80 మీటర్లు) ముఖ్య సొరంగం(6002) మీటర్లు, నికాస్ సొరంగం(6066 మీటర్లు)నకు సంబంధించిన టన్నలింగ్ పనులు ఉన్నాయన్నారు. వీటిలోని చాలా పనులు 2023 సెప్టెంబరు 12 నాటికే పూర్తయ్యాయని తెలిపారు. -
నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్
మనదేశంలోని పలు ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు కనిపిస్తాయి. వీటిని ఇంటి పైకప్పులపైన, మైదాన ప్రాంతాల్లో చూడవచ్చు. అయితే నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్‌ను ఎప్పుడైనా చూశారా? త్వరలో నీటిపై తేలియాడే 15 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్‌ను మనం చూడబోతున్నాం. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో గల భిలాయిలో సెయిల్ భిలాయి స్టీల్ ప్లాంట్ తాజాగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో భాగంగా ముందుగా 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధిత అధికారులు మరోదా-1 జలాశయంలో శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు.ఇది ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటవుతున్న తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్. కర్బన ఉద్గారాలను వీలైనంత వరకూ తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను చేపడుతోంది. ఈ ప్లాంట్ ఏడాదికి 34.26 మిలియన్ యూనిట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయనున్నదనే అంచనాలున్నాయి. అలాగే ఈ ప్రాజెక్టు కారణంగా ఏటా 28,330 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి. -
ఏపీలో కోరమాండల్ ప్లాంటు నిర్మాణం ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద ఏర్పాటు చేస్తున్న ఫాస్ఫరిక్ యాసిడ్–సల్ఫరిక్ యాసిడ్ కాంప్లెక్స్ ఫెసిలిటీ నిర్మాణ పనులను ప్రారంభించింది. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఈ ఫెసిలిటీ కోసం రూ.1,000 కోట్లకుపైగా పెట్టుబడి చేస్తున్నట్టు కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ వెల్లడించారు. రోజుకు 650 టన్నుల తయారీ సామర్థ్యంతో ఫాస్ఫరిక్ యాసిడ్ ఉత్పత్తి కేంద్రం రానుంది. అలాగే రోజుకు 1,800 టన్నుల సామర్థ్యంగల సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటు సైతం కొలువుదీరనుంది. కాకినాడ ప్లాంటు దిగుమతి చేసుకుంటున్న యాసిడ్ అవసరాల్లో ప్రతిపాదిత కేంద్రం సగానికిపైగా భర్తీ చేస్తుందని.. ఎరువుల తయారీకి కావాల్సిన ఫాస్ఫరిక్ యాసిడ్ స్థిరంగా సరఫరా చేస్తుందని సంస్థ తెలిపింది. ప్రాజెక్టు కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి పెట్టుబడి మద్దతును కూడా కంపెనీ అన్వేíÙస్తోంది. ఇది ఎరువుల తయారీలో ఉపయోగించే కీలక ముడి పదార్థాలకు సరఫరా భద్రతను నిర్ధారిస్తుందని సంస్థ భావిస్తోంది. కాగా, కాకినాడ వద్ద ఉన్న కోరమాండల్ ప్లాంటు ఫాస్ఫటిక్ ఫెర్టిలైజర్ తయారీలో దేశంలో రెండవ అతిపెద్దది. సామర్థ్యం 20 లక్షల టన్నులు. దేశవ్యాప్తంగా తయారవుతున్న నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయం (ఎన్పీకే) ఆధారిత ఎరువుల పరిమాణంలో కోరమాండల్ కాకినాడ ప్లాంటు వాటా 15 శాతం ఉంది. -
గోద్రెజ్ ప్రాపర్టీస్ ధరఖాస్తు రిజెక్ట్ చేసిన రెరా
ప్రముఖ రియల్టీ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్‌కు భారీ షాక్ తగిలింది. గురుగ్రామ్, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్స్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ 2016కు అనుగుణంగా లేని కారణంగా గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మాణ ప్రాజెక్ట్‌ల పొడిగింపు దరఖాస్తును రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తిరస్కరించింది. గోద్రెజ్ డెవలపర్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను పొడిగించాలని కోరుతూ ఆ సంస్థ ప్రమోటర్లు రెరాకు దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తులో లైసెన్స్ పునరుద్ధరణ, త్రైమాసిక పురోగతి నివేదిక (క్యూపీఆర్)లో అందించిన బ్యాంక్ బ్యాలెన్స్‌కు సంబంధించిన వివరాల్లో లోపాలు తలెత్తాయి. ఆ లోపాల్ని సరిదిద్దాలని రెరా అనేక సార్లు గోద్రెజ్‌కు ఆదేశాలు చేసింది. అయితే, వాటిని సరిదిద్దడంలో సదరు నిర్మాణ సంస్థ ప్రమోటర్లు విఫలమయ్యారు. దీంతో తాజాగా గోద్రెజ్ డెవలపర్ల ప్రాజెక్ట్ పొడింపు ధరఖాస్తును రిజెక్ట్ చేసింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ సెక్టార్ 85, గురుగ్రామ్‌లో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ గోద్రెజ్ ఎయిర్ ఫేజ్ 4 నిర్మాణాలు చేపడుతోంది. ఇందుకోసం రెరా నుంచి గోద్రెజ్ 2018 నుంచి 2023 వరకు రిజిస్ట్రేషన్ పొందింది. రిజిస్ట్రేషన్ తేదీ ముగియడంతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్‌ను పొడిగించాలని కోరుతూ గోద్రెజ్ ప్రాపర్టీస్ రెరా చట్టంలోని సెక్షన్ 6 కింద దరఖాస్తు చేసింది. దరఖాస్తును పరిశీలించిన రెరా.. ఆ దరఖాస్తులో అనేక లోపాలను గుర్తించింది. వాటిని సరిదిద్దాలని కోరింది. చివరికి తీరు మార్చుకోకపోవడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ దరఖాస్తును తిరస్కరించింది. -
చేతులు కలిపిన అంబానీ– అదానీ
న్యూఢిల్లీ: బిలియనీర్ పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తొలిసారి చేతులు కలిపారు. దీనిలో భాగంగా అదానీ పవర్‌కు చెందిన పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్‌లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఆర్ఐఎల్ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వెరసి అదానీ పవర్ పూర్తి అనుబంధ సంస్థ మహన్ ఎనర్జెన్ లిమిటెడ్‌లో 5 కోట్ల ఈక్విటీ షేర్లను ఆర్ఐఎల్ సొంతం చేసుకోనుంది. రూ. 10 ముఖ విలువకే(రూ. 50 కోట్లు) వీటిని చేజిక్కించుకోవడంతోపాటు.. 500 మెగావాట్ల విద్యుత్‌ను సొంత అవసరాలకు ఆర్ఐఎల్ వినియోగించుకోనుంది. సొంత వినియోగ పాలసీలో భాగంగా ఆర్ఐఎల్ 20 ఏళ్ల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) ఎంఈఎల్‌తో కుదుర్చుకున్నట్లు అదానీ పవర్ వెల్లడించింది. మొత్తం 2,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఎంఈఎల్ ప్లాంటులో 600 మెగావాట్ల యూనిట్‌ను సొంత అవసరాల పద్ధతిలో తెరతీయనున్నట్లు వివరించింది. -
రహస్య ప్రాజెక్ట్.. ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు
Facebook Secret Project: మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్‌చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్ క్రంచ్’ కథనం ప్రకారం.. స్నాప్‌చాట్ (Snapchat) యాప్‌కి, తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్‌ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్‌బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్ బిహేవియర్‌ను అర్థం చేసుకోవడానికి, స్నాప్‌చాట్‌పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ ఈ చొరవను రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్‌లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్నాప్‌చాట్‌లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్డొమైన్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది. -
బ్యారేజీల వైఫల్యం తర్వాత చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు ఏర్పడిన తర్వాత డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తీసుకున్న చర్యలేంటి? ఏమైనా కమిటీలు వేసి, విచారణ జరిపారా? వైఫల్యానికి కారణాలను నిర్ధారించారా?.. అని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం నిపుణుల కమిటీ ఎస్డీఎస్ఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) అధికారులతో సమావేశమై బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీసింది. 2024 ముగిసే వరకు బ్యారేజీల నిర్వహణ నిర్మాణ సంస్థల చేతుల్లోనే ఉండటంతో వార్షిక మరమ్మతులపై ఎలాంటి నివేదికలు తమకు అందలేదని, బ్యారేజీల్లో లోపాలు ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందీ నివేదించలేదని అధికారులు బదులిచ్చినట్టు తెలిసింది. బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులను కమిటీ ప్రశ్నించింది. డిజైన్లు, డ్రాయింగ్స్‌ను అనుసరించి పనులు చేశారా? మధ్యలో ఏమైనా మార్పులు చేశారా? అని కమిటీ అడగ్గా, డిజైన్ల ప్రకారమే నిర్మించినట్టు అధికారులు బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి వరదలకే మూడు బ్యారేజీల కింద సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ దెబ్బతిన్నా నాణ్యత సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిటీ ప్రశ్నించింది. ఐఎస్ కోడ్ ప్రకారమే నిర్మాణ పనులు జరిగినట్లు గుర్తించి, సర్టిఫికెట్లు ఇచ్చామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బదులిచ్చారు. కాగా, రాజేంద్రనగర్‌లోని తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీని అయ్యర్ కమిటీ సందర్శించి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నమూనా బ్యారేజీల పనితీరును పరిశీలించింది. అత్యవసర రక్షణ చర్యలు సూచించండి వర్షాకాలం ప్రారంభానికి ముందే బ్యారేజీల రక్షణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాలని అయ్యర్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్ కుమార్ కమిటీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. మంగళవారంలోగా తాము అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తే అత్యవసర పనులను సిఫారసు చేస్తామని అయ్యర్ వారికి హామీ ఇచ్చారు. బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన అత్యవసర పనులను ఈఎన్సీ అనిల్‌కుమార్ కమిటీకి ప్రతిపాదించి అభిప్రాయాన్ని కోరగా, పరిశీలించి చెప్తామని కమిటీ బదులిచ్చింది. ఆ పనులు ఇలా ఉన్నాయి.. ► ఒరిజినల్ డిజైన్లకు అనుగు ణంగా బ్యారేజీలను పున రుద్ధరించేలా.. సంబంధిత ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) కోడ్స్ ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ పనులను నిర్మాణ సంస్థలు చేపట్టాలి. ► బ్యారేజీల పునాదుల (ర్యాఫ్ట్) కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన ఖాళీలను ప్రెజర్ గ్రౌటింగ్ ద్వారా భర్తీ చేసేందుకు తగిన పద్ధతులను అవలంబించాలి. ► బ్యారేజీలు పూర్తిగా నిండి ఉన్నప్పుడు గేట్లను తక్కువగా ఎత్తి స్వల్ప పరిమాణంలో నీళ్లను విడుదల చేసినప్పుడు తీవ్ర ఉధృతితో వరద బయటకు పొంగివస్తుంది. దీంతో బ్యారేజీల దిగువన భారీ రంధ్రాలు పడుతున్నాయి. ఇలా జరగకుండా స్వల్ప మోతాదుల్లో నీళ్లను విడుదల చేసేందుకు బ్యారేజీల్లో అనువైన చోట కొత్తగా రెగ్యులేటర్లను నిర్మించాలి. ► 3డీ మోడల్ స్టడీస్ ఆధారంగా బ్యారేజీల ఎగువన, దిగువన ప్రవాహాలకు అడ్డంగా ఉండే రాళ్లను తొలగించాలి. ► బ్యారేజీలకి ఎగువ, దిగువ న పేరుకుపోయిన ఇసుకను నీటిపారుదల శాఖ పర్యవేక్షణ లో శాస్త్రీయంగా తొలగించాలి. ► వానాకాలంలో గేట్లన్నీ తెరిచే ఉంచాలి. ► మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లో జామ్ అయిన గేట్లను తొలగించాలి. ఈ బ్లాక్‌కు స్టీల్ షీట్ పైల్స్‌ను అదనంగా ఏర్పాటు చేయాలి. సమాచారం అందిన తర్వాతే స్పష్టత: చంద్రశేఖర్ అయ్యర్ కాళేశ్వరం బ్యారేజీలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే బ్యారేజీల వైఫల్యాల పై ఒక అంచనాకు రాగలమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశా రు. పర్యటన ముగి సిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరికొంత సమాచారాన్ని కోరామని, అందిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. -
జస్ట్ రూ. 150ల ప్రాజెక్టుతో నాసాకు, ఈ విద్యార్థి చాలా స్పెషల్!
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఓ బాలుడు నాసాకి ఎంపికయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జస్ట్ అతడు చేసిన రూ. 150ల ప్రాజెక్టు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా నిర్వహించే ఇంజనీరింగ్ డిజైన్ ఛాలెంజ్ టీమ్‌లో సెలక్టయ్యేలా చేసింది. ఓ సాదాసీదా ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటూ నాసాకి ఎంపికవ్వడమే కాకుండా తన అద్భుత మేధాతో అందర్నీ అబ్బురపరుస్తున్నాడు ఈ బాలుడు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీలోని చిన్నగ్రామమైన ఛాయ్సన్కు చెందిన 15 ఏళ్ల ఉత్కర్ష్ అనే బాలుడు నాసాకు వెళ్తున్నాడు. పదోవతరగతి చదువుతున్న ఈ ఉత్కర్ష్ జనవరిలో సైన్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ పోటీల్లో వివిధ పాఠశాల విద్యార్థులంతా సుమారు రూ. 25 వేల నుంచి లక్షలు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు ప్రిపేర్ చేస్తే, ఉత్కర్ష్ కేవలం రూ. 150ల ప్రాజెక్టుతో పాల్గొన్నాడు. అంతమంది విద్యార్థుల మందు నిలబడగలనా? అనుకున్న ఉత్కర్ష్ ..తన అద్భుత ప్రతిభతో తయారు చేసిన వైర్లెస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అదికూడా తక్కువ మొత్తంలో ప్రాజెక్టుని ప్రజెంట్ చేయడంతో ఉత్కర్షని అంతా ప్రశంసలతో ముంచెత్తారు. అతడిలో ఉన్న ఆ అసాధారణ మేధస్సే నాసా హ్యుమన్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్(హెచ్‌ఈఆర్‌సీ) అని పిలిచే ఇంజనీర్ డిజైన్ ఛాలెంజ్ 2024లో పాల్గొనే కైజెల్ టీమ్‌లో ఉత్కర్షని భాగమయ్యేలా చేసింది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మానవ అంతరిక్ష పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులనే భాగం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా ఇంజనీరింగ్ డిజైన్ ఛాలెంజ్‌ని నిర్వహిస్తుంది. ఆ రోవర్ ఛాలెంజ్‌లో ఉత్కర్ష్ తన బృందంతో కలసి పాల్గొననున్నాడు. ఈ ఛాలెంజ్ వచ్చే నెల ఏప్రిల్ 18 నుంచి 20, 2024 వరకు జరుగుతుంది. ఇక ఉత్కర్ష నేపథ్యం వచ్చేటప్పటికీ..ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. వారి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. ఉత్కర్ష్ తన తాత సురేంద్ర సింగ్ చేసే వ్యవసాయ పనుల్లో సాయం చేస్తుంటాడు కూడా. చిన్నతనంలోనే ఉత్కర్ష్ బ్రెయిన్ హేమరేజ్కి గురయ్యి దాదాపు మూడు నెలలు వెంటిలేటర్ ఉన్నట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. "మృత్యముఖం నుంచి కాపడుకున్నా మా బిడ్డ ఈ రోజు ప్రతిష్టాత్మకమైన నాసా వంటి అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఎంపిక కావడం అన్నది మాకెంతో గర్వంగా ఉంది". అని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక ఉత్కర్ష్ తోపాటు పదోవతరగతి చదువుతున్న టౌరుకు చెందిన లోకేష్ కుమార్, గుహ, గురుగ్రామ్‌కి చెందిన పల్లవి, ఫరీదాబాద్‌కి చెందిన అరుణ్ కుమార్, పానిపట్ నుంచి రోహిత్ పాల్, నోయిడా నుంచి ఓమ్ తదితర విధ్యార్థులు ఎంపికయ్యారు. ఎంత్రీఎం ఫౌండేష్ ఈ వైఎంఆర్డీ టీమ కైజెల్కి మద్దతు ఇస్తుంది. నాసా నిర్వహించే ఈ ఇంజనీరింగ్ ఛాలెంజ్‌లో భారత్ తరుఫు నుంచి ఎనిమిది టీమ్‌లను ఎంపిక చేయగా, వాటిలో ఎన్జీవో మద్దతు గల జట్టే ఈ కైజెల్ టీమే. (చదవండి: స్నానమే ఆమెకు శాపం! చేసిందా..నరకమే..!) -
భూసార పరిరక్షణకు విద్యార్థి సైన్యం
సాక్షి, అమరావతి: ఎరువులు, పురుగు మందుల్ని మితిమీరి వినియోగించడం వల్ల దిగుబడులు రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున భూసార పరీక్షలు చేయిస్తూ ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డులను అందజేస్తోంది. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో ఎరువులు, మందులు వాడేలా ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పిస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి భవిష్యత్ తరాలకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పించేలా ‘స్కూల్ సాయిల్ హెల్త్ ప్రాజెక్ట్’ చేపట్టింది. భవిష్యత్ తరాలకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో ప్రకృతిపై ఆరాధన భావం పెంపొందించడం, వ్యవసాయంపై ఆసక్తి, ఉత్సుకత, రైతుల కష్టంపై చిన్ననాటి నుంచే అవగాహన కల్పించడం, వారిపట్ల బాధ్యతాయుత ప్రేమ, సాగుపై ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తోంది. 6–12వ తరగతి విద్యార్థులకు అవగాహన తొలి దశలో రాష్ట్రంలోని 29 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 13 జవహర్ నవోదయ పాఠశాలలతో పాటు 8 కేంద్రీయ విద్యాలయాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని చేçపడుతున్నారు. విద్యాశాఖ సమన్వయంతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమం అమలు చేస్తోంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు భూసార పరిరక్షణ–చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులతో అవగాహన కల్పిస్తారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు కూడా మట్టి నమూనాల సేకరణ, రసాయనిక విశ్లేషణ, యాప్ ద్వారా ఫలితాల నమోదు, సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీపై ఎస్‌హెచ్‌సీ మొబైల్ యాప్ ద్వారా శిక్షణ ఇస్తారు. ఇందుకు అవసరమైన సాయిల్ టెస్టింగ్ పరికరాలను పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. మట్టి నమూనాల సేకరణ, పరీక్ష, విశ్లేషణ కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి పాఠశాల పరిధిలో 50 నమూనాలు ప్రతి పాఠశాల పరిధిలోని గ్రామంలో సీజన్‌కు 25 చొప్పున ఖరీఫ్, రబీ సీజన్లలో కనీసం 50 శాంపిల్స్‌కు తక్కువ కాకుండా సేకరించనున్నారు. వీటిని పాఠశాలకు అందజేసిన సాయిల్ టెస్టింగ్ కిట్ ద్వారా విశ్లేషించి ఫలితాలను మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 24వ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. జూన్ 15న ఆయా పాఠశాలల పరిధిలోని గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేస్తారు. భూమిలో ఉండే పోషక లోపాలను వివరిస్తూ, కోల్పోయిన భూసారం తిరిగి పొందాలంటే భూమికి ఎలాంటి పోషకాలు అందించాలి, సాగువేళ ఏ పంటకు ఎంత మోతాదులో ఎరువులు, పురుగుల మందులు వినియోగించాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే అంశాలపై గ్రామసభల్లో శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పిస్తారు. విద్యార్థి దశ నుంచే ఆసక్తి విద్యార్థి దశ నుంచే సాగు, రైతులపై గౌరవభావం పెంపొందించడం, భూసారం పట్ల ఆసక్తి కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే అన్ని పాఠశాలలకు విస్తరిస్తాం. ఈ ప్రాజెక్ట్ కింద విద్యార్థులే స్వయంగా మట్టి నమూనాలు సేకరించి, పాఠశాలకు అందించిన కిట్ ద్వారా భూసార పరీక్షలు చేస్తారు. మట్టిలో ఏ లోపం ఉందో గుర్తిస్తారు. దీనివల్ల భూసార పరిరక్షణపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు అవగాహన కలుగుతుంది. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఇంధన ఆదాకు రోల్‌మోడల్ ‘ఈసీబీసీ బిల్డింగ్’
సాక్షి, విశాఖపట్నం: త్వరలో విద్యుత్, ఇంధన రంగాల్లో దక్షిణాది నగరాలకు దీటుగా విశాఖపట్నంను రోల్ మోడల్లా నిలిపేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ), ఏపీఈపీడీసీఎల్, ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) భాగస్వామ్యంతో వైజాగ్‌లో అత్యాధునిక సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. దీనికి బీఈఈ నిధులు మంజూరు చేసింది. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) బిల్డింగ్‌గా ఏపీఈపీడీసీఎల్ నిర్మిస్తున్న ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తొలుత జీ+1 నిర్మాణంగా భావించినా.. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ) సహకారంతో జీ+2కు ప్లాన్‌లో మార్పులు చేశారు. జూన్ నెలాఖరుకు ఇది అందుబాటులోకి రానుంది. అదనపు నిధుల కోసం... గతేడాది మేలో సాగర్ నగర్ సమీపంలోని బీచ్‌రోడ్డులో భవన నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటివరకూ రూ.4 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఒప్పంద విలువ తొలుత రూ.10.61 కోట్లుగా భావించినా.. అదనంగా మరో అంతస్తు చేర్చడంతో రూ.15.38 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తం వ్యయాన్ని భరించేలా అదనంగా రూ.10 కోట్ల గ్రాంట్ విడుదల చేయాలని కేంద్ర విద్యుత్‌శాఖను రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ కోరారు. 50 శాతానికి పైగా విద్యుత్ ఆదా ఈసీబీసీ, ఈసీబీసీ ప్లస్, సూపర్ ఈసీబీసీ అనే మూడు పెర్ఫార్మెన్స్ స్థాయి ప్రమాణాలను ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) సూచిస్తుంది. ఇందులో విశాఖలో నిరి్మస్తున్న ‘సూపర్ ఈసీబీసీ’ ఇంధన సామర్థ్య నిర్వహణలో అత్యుత్తమ స్థాయికి సూచీ. సంప్రదాయ భవనాలతో పోలిస్తే 50 శాతానిపైగా ఇంధనం పొదుపు అవుతుంది. అంతేకాకుండా పర్యావరణ సవాళ్లని పరిష్కరించడంతో పాటు ఇంధన డిమాండ్ తీర్చడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తుంది. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్పెషల్ సెక్రటరీ కె.విజయానంద్, ఎనర్జీ డిపార్ట్మెంట్, డిస్కమ్‌లు వినూత్న కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా.. బీఈఈ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరి్మస్తున్న ఈ భవనం ఏపీని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు 24/7 విద్యుత్ సరఫరాకు సహాయకారిగా మారనుంది. 24వ రెగ్యులేటరీ–పాలసీ మేకర్స్ రిట్రీట్, ఇప్పాయ్ పవర్ నేషనల్ అవార్డుల్ని ఏపీఈపీడీసీఎల్ సాధించడమే ఇందుకు నిదర్శనంగా దేశమంతా ప్రశంసిస్తుండటం గర్వంగా ఉంది. – పృద్వితేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పొదుపులో అగ్రగామి ఇంధన వినియోగం, ఉద్గారాల నియంత్రణలో సూపర్ ఈసీబీసీ బిల్డింగ్ కీలకం. విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గడం, తక్కువ నిర్వహణ ఖర్చుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా మెరుగుపడనున్నాయి. ఈ భవన నిర్మాణం పర్యావరణ పరిరక్షణ, సరికొత్త ఆవిష్కరణలకు రోల్‌మోడల్‌గా వ్యవహరించనుంది. ఇంధన వనరుల పొదుపులో ఏపీ ప్రభుత్వం, ఈపీడీసీఎల్ చొరవను బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్భాక్రే కూడా ప్రశంసించారు. – ఎ.చంద్రశేఖర్ రెడ్డి, బీఈఈ సదరన్ స్టేట్స్, యూటీ మీడియా అడ్వైజర్ -
చర్చ పెట్టు..సమాధానమిస్తాం
వనస్థలిపురం (హైదరాబాద్), సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర విషయం లేదు గనకనే ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌కు ప్రతిసవాల్ చేశారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చపెట్టాలని.. దిమ్మతిరిగే సమాధానం చెప్తామని పేర్కొన్నారు. గతంలో తాము అసెంబ్లీలో చర్చ పెడితే ప్రిపేర్ కాలేదంటూ కాంగ్రెస్ తప్పించుకుందని.. ఇప్పుడు తాము అలా చేయకుండా ధైర్యంగా చర్చకు వస్తామని చెప్పారు. గత పదేళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా తాము రాష్ట్ర ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించలేదని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని హస్తినాపురంలో, సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం రేవంత్‌కు ఆలోచన లేక, అర్ధంకాక ఆగమాగమై మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి నీటి సమస్యను తీసుకువస్తున్నారని ఆరోపించారు. విభజన బిల్లులో పెట్టిందెవరు? ‘‘రాష్ట్ర విభజన సమయంలో.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని బిల్లు పెట్టి పాస్ చేసింది కాంగ్రెస్ కాదా? ఆ బిల్లును తయారుచేసింది మీ జైపాల్‌రెడ్డి, జైరాం రమేశ్ కాదా? అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు. దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో గట్టిగా పోరాడింది మేమే. పోతిరెడ్డిపాడుకు బొక్క కొట్టి నీళ్లు తీసుకెళ్తుంటే అసెంబ్లీని 30 రోజులు స్తంభింపజేశాం. నాడు టీడీపీలో ఉన్న రేవంత్ పోతిరెడ్డిపాడుపై ఏమాత్రం స్పందించలేదు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని వెంకయ్యనాయుడు ఉదయమే రేవంత్‌కు చెప్పారు. కానీ మధ్యాహ్నమే రేవంత్ చిల్లర మాటలు మాట్లాడారు..’’అని హరీశ్‌రావు మండిపడ్డారు. తాము మేం కృష్ణా నీటిలో 50శాతం వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే హైదరాబాద్‌కు మంచినీటి సమస్య వస్తుందని.. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లకు సాగునీరు, తాగునీటి సమస్య నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే ఆరోపణలా? కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైందని.. హామీలపై ప్రశ్నిస్తే పసలేని అంశాలతో ఎదురుదాడి చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. డిసెంబర్లోనే రూ.4వేలు పింఛన్ ఇస్తామని, ఫిబ్రవరి 1న గ్రూప్–1 నోటిఫికేషన్ ఇస్తామని, డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని డేట్లు పెట్టి.. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమి ముక్కలవుతోందని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవని హరీశ్‌రావు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలవనందున రాష్ట్రంలో హామీలను అమలు చేయడం కుదరడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి సాకు చెప్పబోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోతున్నాయని, తెలంగాణలోనూ అదే జరగబోతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
AP: ‘ప్రాజెక్ట్ జలధార’.. అద్భుత ఫలితాలు
సాక్షి, అనంతపురం : ఇటీవల నీటి నిర్వహణ ప్రాజెక్టులకు సంబంధించి భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ కోకా–కోలా ఇండియా ఫౌండేషన్ ను జాతీయ అవార్డుతో సత్కరించింది. అనంతపురంలో సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ జలధార ద్వారా కరువు ప్రాంతాలలో అభివృద్ధికి దోహదపడినందుకు ఈ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహకారంతో ’ప్రాజెక్ట్ జలధార’ ద్వారా ...ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోసాధించిన ఫలితాలను గురించి ఆనందన –కోకా–కోలా ఇండియా ఫౌండేషన్, ఎస్ ఎం సెహగల్ ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. ఈ ప్రాజెక్ట్ భూగర్భ జలాలను పెంపొందించటంలో ఎన్నదగిన ఫలితాలను సాధించిందన్నారు. వివరాల్లోకి వెళితే... పెరిగిన భూగర్భజలసిరి... గ్రామీణాభివృద్ధి ఎన్జిఓ ఎస్ఎం సెహగల్ ఫౌండేషన్ సహకారంతో ఆనందన – కోకా–కోలా ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ’వాటర్ స్టీవార్డ్‌షిప్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగమైన ప్రాజెక్ట్ ’జలధార’ ను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. తద్వారా అనంతపురంలో 5 చెక్ డ్యామ్స్‌ను కోడూరు– సుబ్బారావుపేట, ముద్దపల్లి– తిమ్మడిపల్లి , మధురేపల్లి – కందురుపర్తి నల్లపరెడ్డి పల్లి గ్రామాలలో 416 మిలియన్ లీటర్ల నీటి సేకరణ సామర్థ్యంతో నిర్మించారు.దీంతో భూగర్భజలాల పెంపుదల కారణంగా సాగు విస్తీర్ణంలో 35% పెరుగుదల నమోదయింది, తగ్గుతున్న నీటి కొరత... ఈ ప్రాంతంలో నీటి కొరత సమస్య కూడా పరిష్కారమవుతోంది. భూగర్భ జలాలు పెరగటంతో పంట దిగుబడిలో కూడా గణనీయమైన రీతిలో 75% పెరుగుదల నమోదయింది. దానితో పాటే భూసారమూ పెరిగింది. ఒక సంవత్సరంలో రైతులు బహుళ పంటలు పండించడానికి ఇది వీలు కల్పించింది. అదనంగా, 82% మంది రైతులు పంటల నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను గమనించారు. ప్రాజెక్ట్ అమలులో భాగంగా 7 నీటి నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిర్వహణలో స్థానికుల ప్రమేయాన్ని కూడా పొందగలిగింది. ఇందులో 75 మంది పురుషులు, 17 మంది మహిళలు సహా 92 మంది సభ్యులు ఉన్నారు. నీటి–ఎద్దడి ఉన్న భూములలో భూగర్భ జలాలను పెంచటం, వాటర్షెడ్లను మెరుగుపరచడం ద్వారా కోకోకోలా ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆ కృషి ఫలితంగానే కంపెనీ వినియోగిస్తున్న నీటిలో 200% పైగా తిరిగి అందించగలిగింది. మంచి ఫలితాలు సాధించాం... అనంతపురంలో చెక్ డ్యామ్‌ల నిర్మాణంతో. భూమి నాణ్యత మెరుగుపరచి పంట దిగుబడిని, భూగర్భజల స్థాయిలను గణనీయంగా పెంచగలిగాం. ఫలితంగా, నేడు రైతులు విభిన్న పంటలను పండిస్తున్నారు మా నీటి నిర్వహణ కమిటీలు ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి తగిన శిక్షణ పొందాయి. ఇదీచదవండి.. వేడెక్కిన ఏపీ రాజకీయం -
పెండింగ్ పనులకు నిధులిస్తాం
సాక్షి, హైదరాబాద్: అవసరమైన రోడ్లను మెరుగు పరచటంతోపాటు రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ పనులకు నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆ శాఖ బడ్జెట్ సన్నాహక సమావేశంలో సమీక్షించారు. రాష్ట్ర వ్యా ప్తంగా జరుగుతున్న పనులు, వాటికి సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ప్రస్తుత అవసరా ల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసు కున్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు వారికి వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు ఆలైన్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఇష్టం వచ్చినట్టు కాకుండా, క్రమ పద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. ఆ ప్రాజెక్టు భూసేకరణతోపాటు కలెక్టరేట్ భవనాల నిర్మాణం, రోడ్లకు సంబంధించిన పనులకు నిధులు కేటాయించాలని అధికారులు కోరారు. సీఐఆర్ఎఫ్ పనులకు భూసేకరణ నిధుల కొరత లేకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా, భట్టి విక్రమార్క అంగీకరించారు. చేప ప్రసాదం పంపిణీ, బోనాల ఉత్సవాలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా కోరారు. సినీ భూములను కాపాడాలని ఆదేశాలు సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలో, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూముల ను కాపాడాలని ఉపముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు. సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్ లాంటి మహమ్మారిలకు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో సినీ సెలబ్రిటీలు పొల్గొనేలా చూడాలని సూచించారు. నంది అవార్డుల కార్యక్రమం నిర్వహణపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. చిన్న నిర్మాతల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సినిమా హాళ్లలో చిరుతిళ్ల ధరలను నియంత్రించాలని, ఆన్లైన్ టికెటింగ్ కోసం వేసిన కమిటీ నివేదిక వచ్చాక వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. చిత్రపురి కాలనీలో అవకతవకలపై దృష్టి పెట్టాలి: కోమటిరెడ్డి చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవ కలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నందున ఆ విష యంలో కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివా సరాజు, ఆర్థికశాఖ జాయింట్ సెక్రెటరి హరిత, ఉప ముఖ్యమంత్రి కార్యదర్శి కృష్ణ భాస్కర్, సమాచార శాఖ కమిషన్ అశోక్‌రెడ్డి, ఈఎన్సీలు రవీందర్ రావు, గణపతిరెడ్డితో పాటు సీఈలు మధుసూధన్ రెడ్డి, సతీష్, మోహన్ నాయక్ పాల్గొన్నారు. -
Visakhapatnam: 76 కిమీ.. రూ.14వేల కోట్లు..
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ మరింత అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో లైట్‌మెట్రోకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. 76 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయమవుతుందని తెలిపింది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను అందించేందుకు కావల్సిన పూర్తి డాక్యుమెంట్లను సిద్ధంచేసే పనిలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు నిమగ్నమయ్యారు. 76.90 కి.మీ. మేర ప్రాజెక్టు.. విశాఖ నగర ప్రజలకు భవిష్యత్తులో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు మెట్రోపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. నెలరోజుల క్రితం సీఎం జగన్ ఆధ్వర్యంలో లైట్‌మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన జీఓను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 76.90 కిమీ మేర లైట్‌మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. హెవీ మెట్రోతో పోల్చిచూస్తే.. లైట్ మెట్రో ద్వారా నిర్మాణ వ్యయంలో 20 శాతం, వార్షిక నిర్వహణలో 15 శాతం భారం తగ్గనున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లైట్‌మెట్రో వైపే మొగ్గు చూపింది. మెట్రో రైలు రాకతో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. ఒక మెట్రో రైలు వెళ్తే ఎనిమిది బస్సులు వెళ్లినట్లు సమానం. ఒకసారి వెళ్లే మెట్రోలో 400 మంది ప్రయాణించగలరు. ప్రాజెక్టు గడువు ఎనిమిదేళ్లు.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)–వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు జీఓలో స్పష్టంచేశారు. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.14,309 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇక టెండర్లు దక్కించుకున్న సంస్థ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు దక్కించుకున్న మూడేళ్లకు తొలిమార్గంలో ప్రయాణికులకు మెట్రో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని జీఓలో స్పష్టంచేశారు. 30 ఏళ్ల పాటు సదరు నిర్మాణ సంస్థకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ద్వారా నిర్వహించాల్సి ఉంటుందని, ఈ సమయంలో ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని సదరు సంస్థ ఆర్జిస్తుందని డీపీఆర్‌లో తెలిపారు. 17న కేంద్రానికి డీపీఆర్ ఇక విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. కేబినెట్ డీపీఆర్‌ను ఆమోదించినందున లైట్‌మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన జీఓ నెం.161ని ప్రభుత్వం విడుదల చేసింది. జీఓ, డీపీఆర్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పిస్తాం. కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కాపీలు అందిస్తాం. వీలైనంత త్వరగా ప్రాజెక్టును ఆమోదింపజేసి టెండర్లకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. లైట్ మెట్రో ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష. ఏపీలో కీలకంగా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలు కూడా కోర్ సిటీకి సమానంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. రాబోయే 35–40 ఏళ్లలో నగర ట్రాఫిక్ డిమాండ్‌కి అనుగుణంగా డీపీఆర్ సిద్ధంచేశాం. – యూజేఎం రావు, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ -
అరుణాచల్ హైవే ప్రాజెక్టు ఏమిటి? చైనా మండిపాటు ఎందుకు?
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా అనునిత్యం చొరబాటు ప్రయత్నాలను చేస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలోనే అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే పనులను భారత్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సరిహద్దు ప్రాంతాలకు సైన్యం చేరుకోవడం మరింత సులభతరం కానుంది. అప్పుడు సైన్యం ఎల్ఏసీకి చేరుకోవడానికి అధిక సమయం పట్టదు. 1748 కి.మీ పొడవైన నేషనల్ హైవే-913ని పూర్తి చేయడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టనుంది. ఈ ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తికానుంది. ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని అన్ని గ్రామాలను ఆల్-వెదర్ రోడ్ల ద్వారా అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. 2016లో భారత్ ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించిన తర్వాత చైనా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్ ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించకూడదని చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే చైనా అభ్యంతరాన్ని భారత్ పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా హున్లీ- హ్యూలియాంగ్ మధ్య దాదాపు 121 కిలోమీటర్ల పొడవున హైవే నిర్మించనున్నారు. అదే సమయంలో హున్లీ- ఇతున్ మధ్య 17 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక వంతెన, టుటిన్ నుండి జిడో వరకు 13 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మిస్తున్నారు. అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే భూటాన్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ నుంచి ప్రారంభమై భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగర్‌లో ముగుస్తుంది. ఈ హైవే సిద్ధమైన తర్వాత తవాంగ్ సమీపంలోని బోమ్డిలా నుండి మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగరానికి అనుసంధానం ఏర్పడుతుంది. అన్ని వాతావరణాల్లోనూ ఉపయుక్తమయ్యేలా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాలకు ఈ రహదారితో అనుసంధానం ఏర్పడుతుంది. ఈ హైవే నిర్మాణం కోసం అనేక సొరంగాలు కూడా నిర్మించనున్నారు. ఈ హైవే భూటాన్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ నుంచి ప్రారంభమై, భారత్-మయన్మార్ సరిహద్దులోని విజయనగర్ వద్ద ముగుస్తుంది. ఈ రహదారి భారతదేశం-టిబెట్-చైనా, మయన్మార్ సరిహద్దులకు దగ్గరగా వెళుతుంది. -
విదేశీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో..!
దాదాపుగా 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వ కార్తికేయ. జై సేన, కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాలతో తనదైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం కలియుగం పట్టణంలో అనే ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విశ్వ కార్తికేయకు జోడిగా ఆయుషి పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే మరో ఇండోనేషియన్ ప్రాజెక్ట్‌లో వీరిద్దరు క్రేజీ ఆఫర్ పట్టేశారు. ‘శూన్యం చాప్టర్ -1’ అంటూ రాబోతోన్న ఈ మూవీలో హిందీ, ఇండోనేషియన్ భాషల్లోని నటీనటులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అతీంద్రీయ శక్తుల కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. సిల్వర్ బ్లైండ్స్ (ఇండోనేషియా) బ్యానర్ మీద రాబోతోన్న ఈ మూవీకి దర్శక, నిర్మాణ బాధ్యతలను సీకే గౌస్ మోదిన్ నిర్వర్తిస్తున్నారు. ఉన్ని రవి (యూఎస్ఏ) కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. తెలుగు, హిందీ, బహస (ఇండోనేషియన్ భాష) భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే డ్రామా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి కాలయాపన చేసేందుకే శ్వేతపత్రాలు, జ్యుడీషియ ల్ ఎంక్వైరీ, ప్రాజెక్టుల సందర్శన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహ రి విమర్శించారు. కాలయాపనతో ఎన్నికల హామీ లను ప్రజలు మరిచిపోతారని ప్రభుత్వం భావిస్తోందని, ఆరు నెలల్లోపు హామీలు నెరవేర్చకుండా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. అవినీతికి హక్కుదారు కాంగ్రెస్ పార్టీ అని, గత ప్రభుత్వంపై వేసే ప్రతి విచారణను బీఆర్ఎస్ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.లక్ష కోట్ల అవినీతి అవాస్తవమని తేలింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రస్తుత సీఎం రేవంత్, రాహు ల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరో పణలు అవాస్తవమని శుక్రవారం మంత్రుల మేడి గడ్డ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా తేలిందని కడియం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 93 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా 98 వేల ఎకరాల ఆయకట్టు ఏర్పడిందని, 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి నట్లు మంత్రులు తమ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లోనే అంగీకరించారని పేర్కొన్నారు. బ్యారేజీ కుంగుబాటుపై సమగ్ర విచారణ 2014లో తెలంగాణ ఏర్పాటుతో ఏర్పడిన తమ ప్రభుత్వం.. నీటి లభ్యత, ఇతర సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని తుమ్మిడిహట్టి వద్ద ఎత్తిపోతల పథకం సాధ్యం కాదని తేలినందునే.. కాళేశ్వరం ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ ద్వారా రీ డిజైన్ చేసిందని కడియం శ్రీహరి చెప్పారు. 19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.62 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ జరిగిందని తెలిపారు. సీడబ్ల్యూసీ సహా 11 రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించామన్నారు. డిసెంబర్ 2008లో తుమ్మిడిహట్టి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగ్గా 2014 వరకు కేంద్రంలో, ఉమ్మడి ఏపీలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎనిమిదేళ్ల పాటు అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు. ఈపీసీ విధానం తెచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సులు తదితరాల పేరిట గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు సాగునీరు అందించలేదని అన్నారు. కేబినెట్ ఆమోదంతోనే ల్యాండ్ క్రూజర్ల కొనుగోలు వాస్తవాలను పక్కన పెట్టి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మంత్రులు జ్యుడీషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని కడియం ధ్వజమెత్తారు. బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు పై సమగ్ర విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ క్రూజ ర్ల కొనుగోలు కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని, ఇలాంటి అంశాలపై పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు లంకెబిందెల కోసం అధికారంలోకి వ చ్చారా? బడ్జెట్ గణాంకాలు అధ్యయనం చేయ కుండానే హామీలిచ్చారా? అని ప్రశ్నించారు.