మనదేశంలోని పలు ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు కనిపిస్తాయి. వీటిని ఇంటి పైకప్పులపైన, మైదాన ప్రాంతాల్లో చూడవచ్చు. అయితే నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్‌ను ఎప్పుడైనా చూశారా? త్వరలో నీటిపై తేలియాడే 15 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్‌ను మనం చూడబోతున్నాం.
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో గల భిలాయిలో సెయిల్ భిలాయి స్టీల్ ప్లాంట్ తాజాగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో భాగంగా ముందుగా 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధిత అధికారులు మరోదా-1 జలాశయంలో శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు.
ఇది ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటవుతున్న తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్. కర్బన ఉద్గారాలను వీలైనంత వరకూ తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను చేపడుతోంది. ఈ ప్లాంట్ ఏడాదికి 34.26 మిలియన్ యూనిట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయనున్నదనే అంచనాలున్నాయి. అలాగే ఈ ప్రాజెక్టు కారణంగా ఏటా 28,330 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment