ఎంతోమంది రాజులు రాజ్యాలేలారు.. కాలంతో పాటు కనుమరుగైపోయారు. అయితే వారు కట్టిన కట్టడాలు మాత్రం ఇప్పటికీ వారి ఉనికిని తెలియజేస్తూ ఉన్నాయి. కట్టడాలకు అంత చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా కొంత మంది ఆర్కిటెక్చర్లు లేదా సంస్థలు కనీవినీ ఎరుగని కట్టడాలను నిర్మించి అక్కడి ప్రాంతాల రూపురేఖలనే మార్చేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి నిర్మాణాలు భూమిపై అనేకం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది (2025) 11 ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లు సిద్ధమవుతున్నాయి. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
న్యూ సిడ్నీ ఫిష్ మార్కెట్ (సిడ్నీ)
ప్రపంచంలోని మూడో అతిపెద్ద చేపల మార్కెట్‌గా ప్రసిద్ధి చెందిన 'సిడ్నీ ఫిష్ మార్కెట్' (Sydney Fish Market) మరింత పెద్దదికానుంది. దీనికోసం 3XN ఆర్కిటెక్ట్‌లు, ఆస్ట్రేలియన్ సంస్థ BVN ముందడుగు వేసాయి. లాజిస్టిక్‌లు, ఇతర కార్యకలాపాలు గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్వహించనున్నారు. పై అంతస్తులలో సందర్శకుల కోసం మార్కెట్ హాల్, వేలం హాలు ఉంటాయి. ఇక్కడ రెస్టారెంట్‌లు, రిటైలర్లు పాంటూన్‌లు వంటివన్నీ చూడవచ్చు.
గ్రాండ్ రింగ్, ఒసాకా (జపాన్)
ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు.. జపాన్ రెండవ నగరమైన ఒసాకాలో నిర్వహించే ఎక్స్‌పో 2025 కార్యక్రమానికి 28 మిలియన్ల మంది సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉంది. వేదిక మధ్య భాగంలో ఉంటుంది. గ్రాండ్ రింగ్ వృత్తాకార చెక్క నిర్మాణంతో పూర్తవుతుంది. 1970లో ఒసాకా మొదటిసారిగా ఎక్స్‌పోను నిర్వహించినప్పుడు, ఆ సమయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అవాంట్-గార్డ్ జపనీస్ వాస్తుశిల్పులు భారీ స్పేస్-ఫ్రేమ్ పైకప్పును నిర్మించారు. దాదాపు 6,46,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఇది ప్రపంచంలోని అతిపెద్ద చెక్క భవనాలలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.
లైఫ్ అండ్ మైండ్ బిల్డింగ్, ఆక్స్‌ఫర్డ్ (యూకే)
లైఫ్ అండ్ మైండ్ బిల్డింగ్ అనేది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ చరిత్రలో అతిపెద్ద నిర్మాణ ప్రాజెక్ట్. ఈ నిర్మాణ డిజైన్ సూత్రాలు విద్యాసంబంధమైన వాటికి దగ్గరగా ఉన్నాయి. లోపల ఫ్లెక్సిబుల్ ల్యాబ్ స్పేస్‌లు వివిధ విభాగాల అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఇది కూడా గొప్ప ఆర్కిటెక్చర్ నిర్మాణాలలో ఒకటిగా ఉంటుంది.
కెనడియన్ స్కూల్, చోలులా (మెక్సికో)
మెక్సికోలోని చోలులాలోని ఆర్కిటెక్చర్ సంస్థ సోర్డో మడలెనోస్ కెనడియన్ స్కూల్ ప్రాజెక్ట్ చేపట్టింది. ప్రకృతిలో మమేకమయ్యే ఈ ప్రాజెక్ట్ ఇతర ప్రాజెక్టులకంటే భిన్నంగా ఉంటుంది. అయితే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మెక్సికన్ ఆర్కిటెక్ట్ ఫెర్నాండో సోర్డో మడలెనో.. దీనిని పర్యావరణంతో మిళితం చేయడంతో పాటు భవనం కూడా ఆట స్థలంలో భాగమవుతుందని పేర్కొన్నాడు.
టెక్కో అంతర్జాతీయ విమానాశ్రయం, నమ్ పెన్ (కంబోడియా)
కంబోడియా దాని రాజధాని నమ్ పెన్.. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత పెద్దది కానుంది. ఇది ఇప్పటి కంటే ఆరు రెట్లు ఎక్కువ మంది సందర్శకులను నిర్వహించగల సామర్థ్యం పొందనుంది. పర్యాటకుల సంఖ్యను పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ విమానయాన కేంద్రంగా మారడానికి దీనిని సిద్ధం చేస్తున్నారు. సిటీ సెంటర్‌కు దక్షిణంగా 12 మైళ్ల దూరంలో ఉన్న ఈ టెర్మినల్ భవనం ఆగ్నేయాసియాలో అతిపెద్దది.
సౌత్ స్టేషన్ రీడెవలప్‌మెంట్, బోస్టన్ (ఇంగ్లాండ్)
న్యూ ఇంగ్లాండ్‌లో అత్యంత రద్దీగా ఉండే గ్రౌండ్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ అయిన బోస్టన్ సౌత్ స్టేషన్‌ను కూడా రీడెవలప్‌మెంట్ చేయనున్నారు. ఇది పూర్తయితే.. బస్సు, రైలు సామర్థ్యం వరుసగా 50 శాతం, 70 శాతం పెరుగుతుంది. 1899 నుంచి అలాగే ఉన్న ఈ నిర్మాణం కొత్త హంగులు సంతరించుకోనుంది.
గోథే ఇన్‌స్టిట్యూట్, డాకర్ (సెనెగల్)
"నోబెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్"గా ప్రసిద్ధి చెందిన ప్రిట్జ్‌కర్ ప్రైజ్‌ని.. మొట్టమొదటి ఆఫ్రికన్ విజేత ఫ్రాన్సిస్ కేరే తన స్వదేశీ ఖండంలో నిర్మించిన వాతావరణాన్ని మార్చనున్నారు. 18,300 చదరపు అడుగుల భవనం వక్రతలు చుట్టుపక్కల ఉన్న పందిరి రూపురేఖలను ప్రతిబింబించేలా రూపొందించారు. దీనిని ప్రధానంగా స్థానికంగా లభించే ఇటుకలతో నిర్మించారు. కాగా ఇది ఈ ఏడాది మరింత సుందరంగా మారనుంది.
అర్బన్ గ్లెన్, హాంగ్‌జౌ (చైనా)
బీజింగ్‌లోని సీసీటీవీ హెడ్‌క్వార్టర్స్.. చైనాలోని అత్యంత ప్రసిద్ధి చెందిన సమకాలీన భవనంగా మారనుంది. తూర్పు నగరమైన హాంగ్‌జౌలో దాదాపు 9,00,000 చదరపు అడుగుల ఆఫీసు, హోటల్, విశ్రాంతి స్థలాన్ని కలిగి ఉన్న ఒక జత టవర్‌లు అర్బన్ గ్లెన్‌లో అత్యంత అద్భుతమైనవిగా రూపుదిద్దుకోనుంది.
రియాద్ మెట్రో, రియాద్ (సౌదీ అరేబియా)
2020లలో సౌదీ అరేబియాలో ఈ రియాద్ మెట్రో వెంచర్‌లను ప్రకటించారు. ఇది క్యూబ్ ఆకారంలో ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణాలలో ఒకటిగా మారనుంది. ఇది ఆరు లైన్లతో ఉంటుంది. దీని రోజువారీ సామర్థ్యం రోజుకు 3.6 మిలియన్లు. ఈ ప్రాజెక్టు నవంబర్‌లో ప్రారంభమైంది.
స్కైపార్క్ బిజినెస్ సెంటర్, లక్సెంబర్గ్ (ఫ్రాన్స్)
యూరప్ దేశంలోని కొత్త పబ్లిక్ భవనాలు కనీసం 50 శాతం కలపను కలిగి ఉండాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే లక్సెంబర్గ్ రూపుదిద్దుకుంటోంది. ఇది ఖండంలోని అతిపెద్ద హైబ్రిడ్ చెక్క భవనాలలో ఒకటిగా మారనుంది. దీని విస్తీర్ణం 8,44,000 చదరపు అడుగులు. ఇందులో సుమారు 5,42,000 క్యూబిక్ అడుగులు కలపతో మిర్మించనున్నారు. ఈ భవనం, మొదటి దశ ఫిబ్రవరితో పూర్తవుతుంది.
డాంజియాంగ్ బ్రిడ్జ్, తైపీ (తైవాన్)
డాన్జియాంగ్ బ్రిడ్జ్ దాదాపు తొమ్మిదేళ్లుగా, దివంగత జహా హదీద్ సంస్థ తన వారసత్వాన్ని కొనసాగించింది. 3,018 అడుగుల పొడవైన నిర్మాణం తైవాన్ రాజధాని తైపీ గుండా ప్రవహించే తమ్సుయ్ నది ముఖద్వారం మీదుగా నాలుగు ప్రధాన రహదారులను కలుపుతుంది. మొత్తం నిర్మాణం కేవలం ఒకే కాంక్రీట్ మాస్ట్‌తో ఉంటుంది. ఇది పూర్తయిన తరువాత ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్-మాస్ట్ అసమాన కేబుల్-స్టేడ్ బ్రిడ్జ్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment