floating
-
యమునలో విషపు నురుగులు
న్యూఢిల్లీ: యమునా నదిలో కాలుష్య స్థాయి మరింతగా పెరిగింది. కాళింది కుంజ్ ప్రాంతానికి చెందిన ఒక వీడియోలో యమునా నది ఉపరితలంపై విషపూరిత నురుగుతో కూడిన మందపాటి పొర కనిపిస్తోంది. ఈ నదిలో గత కొన్ని రోజులుగా నురుగు కనిపిస్తోంది.వారాంతాల్లో యమునా ఘాట్లను శుభ్రం చేసే ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఇక్కడి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. నదిలో నురుగు ఎక్కువగా ఉందని, ఇది చర్మంతో పాటు కళ్లకు కూడా ప్రమాదకరంగా మారిందని తెలిపారు. ఢిల్లీలో వాయుకాలుష్యం, యమునలో విషపు నురుగలకు ఆప్ కారణమంటూ బీజేపీ విమర్శిస్తోంది.ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా యమునలో స్నానం చేసిన కొన్ని గంటలకు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన వైద్యులను సంప్రదించారు. వారు ఆయనకు చికిత్స అందించాక, విశ్రాంతి అవసరమని సూచించారు. యమునా ప్రక్షాళన విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మోసం చేసిందని వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. 2025 ఫిబ్రవరిలో బీజేపీ అధికారంలోకి వస్తే యమునా క్లీనింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. #WATCH | Delhi | Thick toxic foam seen floating on the Yamuna River in Kalindi Kunj, as pollution level in the river continues to remain high. pic.twitter.com/VZhXwvPNd4— ANI (@ANI) October 26, 2024ఇది కూడా చదవండి: దేశంలోని ప్రముఖ మహాలక్ష్మి ఆలయాలు -
నీటిపై తేలే ఇల్లు.. చాలా ఆనందంగా ఉంది: ఆనంద్ మహీంద్రా
పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనించినట్లయితే.. నీటిపై తేలియాడే ఇంటిని చూడవచ్చు. దీనిని మొత్తం నేచురల్ మెటీరియల్స్ ఉపయోగించి నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కుమార్ అనే ఇంజినీర్.. వర్షాలు పడినప్పుడు ఇల్లు మునిగిపోకుండా ఉండాలని అలోచించి ఇలాంటి ఓ అద్భుతమైన నిర్మాణం రూపొందించారు.ఇలాంటి ఇల్లు డిజైన్ చేయాలని 2020లోనే అనుకున్నట్లు.. ఆ తరువాత ఇంటి నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసినట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. ఈ ఇంటికి కరెంట్ కోసం సోలార్ ప్యానెల్స్ కూడా సెట్ చేసి ఉండటం వీడియోలో చూడవచ్చు. ఇల్లు పూర్తిగా నీటిపైన తేలడానికి అవసరమైనవన్నీ ప్రశాంత్ ఉపయోగించారు.ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకంఈ వీడియో షేర్ చేస్తూ.. వాతావరణ మార్పుల వల్ల జీవితాల్లో ఏర్పడే అంతరాయాలను పరిష్కరించడానికి ఈ ఇల్లు ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఇలాంటి ఆవిష్కరణలు కనిపిస్తాయి. దీనికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రశాంత్‌ను సంప్రదిస్తాను, నేను అతనికి ఎలా మద్దతు ఇవ్వగలనో చూస్తానని ఆనంద్ మహీంద్రా అన్నారు.Prashant Kumar came back to Bihar and…With a Modest budget & Modest materials—combined with dramatic ambition & a desire to drive positive change—he’s created a disruptive solution to mitigate the disruption of lives by climate change. I’ve always believed that… pic.twitter.com/jFs18eznFm— anand mahindra (@anandmahindra) September 26, 2024 -
వారెవ్వా.. నీళ్లలో తేలియాడే రెస్టారెంట్
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గోరఖ్‌పూర్‌లోని పర్యాటక ప్రాంతం రామ్‌గఢ్ తాల్ సరస్సులో తేలియాడే రెస్టారెంట్ ఇది. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ రెస్టారెంట్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రారంభించారు. महायोगी गुरु श्री गोरखनाथ जी की तपोस्थली गोरखपुर में आज रामगढ़ताल में फ्लोटिंग रेस्टोरेंट के लोकार्पण तथा ग्रीनवुड अपार्टमेंट आवासीय परियोजना के आवंटियों को प्रमाण-पत्र वितरण हेतु आयोजित कार्यक्रम में सम्मिलित हुआ।रामगढ़ताल क्षेत्र देश-दुनिया के पर्यटकों को आकर्षित करने के साथ… pic.twitter.com/eDEErOF6Nm— Yogi Adityanath (@myogiadityanath) September 19, 2024 -
నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్
మనదేశంలోని పలు ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు కనిపిస్తాయి. వీటిని ఇంటి పైకప్పులపైన, మైదాన ప్రాంతాల్లో చూడవచ్చు. అయితే నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్‌ను ఎప్పుడైనా చూశారా? త్వరలో నీటిపై తేలియాడే 15 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్‌ను మనం చూడబోతున్నాం. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో గల భిలాయిలో సెయిల్ భిలాయి స్టీల్ ప్లాంట్ తాజాగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో భాగంగా ముందుగా 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధిత అధికారులు మరోదా-1 జలాశయంలో శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు.ఇది ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటవుతున్న తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్. కర్బన ఉద్గారాలను వీలైనంత వరకూ తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను చేపడుతోంది. ఈ ప్లాంట్ ఏడాదికి 34.26 మిలియన్ యూనిట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయనున్నదనే అంచనాలున్నాయి. అలాగే ఈ ప్రాజెక్టు కారణంగా ఏటా 28,330 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి. -
కాకినాడలో భారీ ఎల్ఎన్జీ ఫ్లోటింగ్ టెర్మినల్
సాక్షి, అమరావతి: నార్వేకు చెందిన క్రౌన్ ఎల్ఎన్జీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. కాకినాడ వద్ద సముద్రంలో రూ.8,300 కోట్లతో ఫ్లోటింగ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుని దానిని రీగ్యాసిఫికేషన్ చేసి దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే విధంగా 7.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు క్రౌన్ ఎల్ఎన్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్వపన్ కఠారియా ప్రకటించారు. భారతదేశ పర్యటనకు వచ్చిన కఠారియా తాజాగా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ 2028 నాటికి కాకినాడ వద్ద సముద్రంలో తేలియాడే ఎల్ఎన్జీ యూనిట్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తీవ్ర తుపానులు అధికంగా ఉండే ప్రాంతం కావడంతో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఈ టెర్మినల్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం కోసం పలు అంతర్జాతీయ సంస్థలతో క్రౌన్ ఎల్ఎన్జీ ఒప్పందం కుదుర్చుకుంటోందని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఆరు ఎల్ఎల్జీ టెర్మినల్స్ ఉండగా, ఇవి పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయడంలేదన్నారు. ప్రపంచంలో చౌకగా లభించే ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుని రీగ్యాసిఫికేషన్ ప్రక్రియ నిర్వహించి తిరిగి సరఫరా చేసే విధంగా దేశంలోనే రెండో అతిపెద్ద టెర్మినల్‌గా కాకినాడ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కఠారియా వివరించారు. ఎల్ఎన్జీకి పెరుగుతున్న డిమాండ్ దేశీయ ఇంధన అవసరాల్లో సహజవాయువు వినియోగాన్ని భారీగా పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకోవడంతో ఎల్ఎన్జీకి డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం దేశీయ ఇంధన అవసరాల్లో ఎల్ఎన్జీ వినియోగం 6 శాతంగా ఉందని, దానిని 2030 నాటికి 15 శాతానికి పెంచాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 20.2 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ వినియోగం జరగ్గా, పదేళ్లలో ఇది 72.9 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరిలో రాష్ట్రానికి క్రౌన్ ఎల్ఎన్జీ ప్రతినిధుల బృందం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్రౌన్ ఎల్ఎన్జీ ఆసక్తి చూపిస్తోందని, ఇప్పటికే తొలి దశ చర్చలు పూర్తయ్యాయని ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుందని చెప్పారు. ఫిబ్రవరిలో క్రౌన్ ఎల్ఎన్జీ ప్రతినిధుల బృందం రాష్ట్ర పర్యటనకు రానుందని వెల్లడించారు. -
దుబాయ్‌లో మరో అద్భుతం: ఈ వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
Sheybarah Resort దుబాయ్ మరో అద్భుత ఆవిష్కారానికి నాంది పలుకుతోంది. సౌదీ అరేబియాలోని మునుపెన్నడూ చూడని విధంగా ఒక లగ్జరీ రిసార్ట్‌ను నిర్మిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ప్రపంచంలోని మొట్టమొదటి ఫ్యూచరిస్టిక్ లగ్జరీ షేబరా రిసార్ట్ ను రూపొందిస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ హోటల్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను సౌదీకి చెందిన రెడ్ సీ గ్లోబల్ (RSG) సంస్థ విడుదల చేసింది. సముద్ర గుర్రం ఆకారంలో ఉన్న దీన్ని 2024 నాటికి ప్రజలకు అందుబాటులోకి తెరిచేందుకు సిద్ధంగా ఉంది. అలాగే మెగా-ప్రాజెక్ట్ ది రెడ్ సీలో 13 అంతర్జాతీయ హోటళ్లను ప్రారంభించనున్నట్టు గతంలోనే ప్రకటించింది. హైపర్-లగ్జరీ రిసార్ట్ దేశంలో పర్యాటక ఆదాయాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. దుబాయ్‌కి చెందిన కిల్లా డిజైన్ రూపొందించింది. ఆధునిక టచ్‌తో పాటు, రిసార్ట్ మడ అడవులు, ఎడారి వృక్షజాలం, సహజమైన పగడపు దిబ్బలపై రిఫ్లెక్టివ్ డిజైన్ విజువల్ అప్పీల్‌తో విభిన్న పర్యావరణ అనుకూలంగా ఇది సిద్ధమవుతోంది. ఈ రిసార్ట్‌లో, పగడపు దిబ్బల పైన ఉండేలా LEED-ప్లాటినం భవనం నిర్మిస్తోంది. "ఏరియల్ అకామడేషన్ పాడ్స్" అని పిలిచే ఈ అసాధారణ భవనాలు సందర్శకులకు సముద్ర స్వర్గంలో లీనమయ్యే అనుభవాన్ని అందిస్తాయట.పూర్తిగా కేంద్రీకృత సోలార్ ఫామ్‌తో నడిచే సోలార్ డీశాలినేషన్ ప్లాంట్‌ను ఉపయోగిస్తోంది. ఆకాశం, సముద్రాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ షేబరా ఆర్బ్స్ నీటిపై తేలుతాయి. అంతేకాదు, షేబరా హోటల్ 73 విల్లాలతో కూడిన హైపర్ లగ్జరీ రిసార్ట్ ఆర్బ్స్ వాటర్‌లైన్ క్రింద ఉన్న పగడపు దిబ్బలుచూస్తే మతిపోవాల్సిందే. ఇందులో మౌలిక సదుపాయాలు సందర్శకులకు ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించనున్నాయి. రిసార్ట్ వెలుపలి భాగాన్ని నిర్మించడానికి దాదాపు 150 టన్నుల స్టెయిన్లెస్-స్టీల్ ఆర్బ్లతో చాలాయూనీక్గా రూపొందించారు. నిర్మాణంలో ఉండగానే ఇంత అద్భుతంగా కనువిందు చేస్తున్న ఈ హోటల్ పూర్తిగా అందుబాటులోకి రావాలని, ఈ మెరైన్ ప్యారడైజ్ అందాలను ఆస్వాదించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు.ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, ఫోటోలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, అడ్రస్ బీచ్ రిసార్ట్, ఆఫీస్ ఆఫ్ ది ఫ్యూచర్, సిటీ వాక్, మరిన్నింటితో సహా దుబాయ్‌లోని కొన్ని ఐకానిక్ ప్రాజెక్ట్‌లను అందించిన ఘనత కిల్లా డిజైన్ సొంతం. نفخر بأن جزيرة #أمهات في #وجهة_البحر_الأحمر سترحب بطلائع زوارها قريباً! لقد وصلت نسبة الإنجاز في تطوير منتجع "سانت ريجيس البحر الأحمر" لـ 93%، فيما وصلت جاهزية منتجع "نجومه، ريتز كارلتون ريزيرف" لـ 87.% كم هي نسبة حماسَك أنت؟ pic.twitter.com/Fyg8MCMTzs — البحر الأحمر الدولية (@RedSeaGlobalAR) August 14, 2023 /> -
యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం
సముద్రంలో తేలియాడే నగరాన్ని జపాన్‌కు చెందిన ఎన్–ఆర్క్ సంస్థ నిర్మిస్తోంది. మూడు భాగాల సమ్మేళనంగా నలభైవేల జనాభాకు ఆవాసం కల్పించేలా ఎన్–ఆర్క్ నిపుణులు ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. బయటివైపు ఉన్న వర్తుల భాగంలో స్థిర నివాస భవనాలు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ఉంటాయి. రెండో వర్తుల భాగంలో తేలియాడే భవంతులు, నగరంలో జనాల రాకపోకలకు వీలుగా పడవ మార్గాలు ఉంటాయి. లోపలి వైపు నడిమధ్యన ఉండే వర్తుల భాగంలో ఉపరితలంపై ఎలాంటి నిర్మాణం ఉండదుగాని, నీటి అడుగున డేటా సెంటర్, వైద్య పరిశోధన కేంద్రం ఉంటాయి. ‘డోజెన్ సిటీ’గా పేర్కొంటున్న ఈ నగరం సముద్రంలో వైద్య పర్యాటక కేంద్రంగా జనాలను ఆకట్టుకోగలదని దీని నిర్మాతలు చెబుతున్నారు. ఇందులో తేలియాడే భవంతులు ఉన్న భాగంలో నివాస భవనాలతో పాటు తేలియాడే ప్రార్థనాలయాలు, హోటళ్లు, శ్మశాన వాటికలు కూడా ఉంటాయి. అలాగే నగర ప్రజల అవసరాల కోసం పంటలు పండించుకునే చిన్న చిన్న పొలాలు, తోటలు కూడా ఉంటాయి. నాలుగు కిలోమీటర్ల పరిధిలో చేపడుతున్న ఈ నగర నిర్మాణం 2030 నాటికి పూర్తి కాగలదని చెబుతున్నారు. (చదవండి: 600 ఏళ్లనాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే) -
పేరుకే ఫ్రీక్వెన్సీ! తప్పని నిరీక్షణ
సాక్షి,హైదరాబాద్: నగరంలో రద్దీ వేళల్లో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి నాలుగైదు నిమిషాలకోసారి మెట్రో రైలు నడుపుతామన్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో 8 నుంచి 10 నిమిషాల పాటు నిరీక్షణ తప్పడంలేదని చెబుతున్నారు. కొన్నిసార్లు ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం మూడు మెట్రో కారిడార్ల పరిధిలోని 54 మెట్రో మెట్రో స్టేషన్లకు చేరుతున్న ప్రయాణికులు ప్లాట్‌ఫారాలపై కిక్కిరిసిపోతున్నారు. రైలులోకి ప్రవేశించే సమయంలోనూ తోపులాట తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బోగీల్లోనూ బయటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏసీని పెంచడం లేదా తగ్గించడం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ.. మధ్యాహ్నం వేళల్లో బోగీల్లో ఉక్కపోతతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు విలవిల్లాడుతున్నారు. మెట్రో అధికారుల పర్యవేక్షణ లోపంతోనే తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. క్రమంగా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య.. కోవిడ్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో నగరంలో మెట్రో రైళ్లలో రద్దీ క్రమంగా పెరుగుతోందని మెట్రో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సాధారణ రోజుల్లో మూడు కారిడార్లతో కలిపి రద్దీ 3 నుంచి 3.5 లక్షలుకాగా.. సెలవు రోజుల్లో రద్దీ నాలుగు లక్షలకు చేరువవుతోందని పేర్కొన్నాయి. సాధారణ రోజుల్లో అత్యధికంగా ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో నిత్యం సరాసరిన సుమారు 1.75 లక్షల మంది జర్నీ చేస్తున్నారని.. ఆతర్వాత నాగోల్– రాయదుర్గం మార్గంలో 1.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారని.. ఇక జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో రద్దీ 25 వేలుగా ఉంటుందని తెలిపాయి. నగరంలో అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు తమ ద్విచక్ర వాహనాలు, కార్లను పార్కింగ్ చేసుకునే అవకాశం లేకపోవడం, పార్కింగ్ ఉన్న చోట చార్జీల బాదుడు షరామామూలే. సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ఇటీవలి కాలంలో పలు మెట్రో స్టేషన్లలో మధ్యభాగం (కాన్కోర్స్)వద్ద చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు నిర్మాణ సంస్థ అవకాశం ఇచి్చంది. ఈ ప్రాంతంలో నిత్యావసరాల దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో రైలు దిగిన వెంటనే సిటీజన్లు వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. (చదవండి: మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో హైటెన్షన్) -
తేలియాడే రామసేతు రాయి! భక్తుల పూజలు... వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో ఇషాన్ నదిలో తేలియాడే రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఆ రాయిపై ‘రామా’ అనే అక్షరాలు ఉండటం విశేషం. ఈ రాయి రామాయణ కాలంలో భారతదేశం నుంచి లంకకు సముద్రంపై శ్రీరాముడు నిర్మించిన ‘రామసేతు’ వారధిలోనిదే అంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి రాయిని చూసివెళ్తున్నారు. ఈ రాయి దాదాపు ఆరు కేజీల బరువుంది. మెయిన్‌పురీ జిల్లాలోని థానాబేవార్ పరిధిలోని అహిమాల్‌పూర్‌లో తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రాయిని ఆలయంలో ఉంచి స్థానికులు పూజలు జరుపుతున్నారు. -
వావ్ వండర్ హౌస్.. ఎన్ని వరదలు వచ్చినా ఆ ఇంటికి ఏం కాదు!
ప్రతి ఏటా వరదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అందులో ప్రధానంగా ఇల్లు కూలిపోవడం వంటివి జరుగుతాయనేది కాదనలేని నిజం. అయితే ఎప్పటినుంచో ప్రజలను పట్టి పీడిస్తున్న ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికిందనే అంటున్నారు జపనీస్ హౌసింగ్ డెవలపర్ ఇంజనీర్లు. ప్రజల ఇళ్లను వరదలు ముంచెత్తకుండా అలాగే వరదల వల్ల కొట్టుకుపోకుండా ఉండేందుకు ఒక సమాధానాన్ని కనుగొన్నట్లు చెప్తున్నారు. జపాన్‌కు సంబంధించిన టీబీఎస్ టీవీ చానెల్లో దీనికి సంబంధించి ప్రసారం చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలేముంది ఆ వీడియోలో.. ఓ ఇల్లు సాధారణంగా కనిపిస్తుంది. అయితే దాని చుట్టూ నీరు పెరగడంతో ఒక్కసారిగా అది నేలనుంచి కొన్ని అంగుళాలు తేలుతూ కనిపిస్తుంది. అదేంటి ఇల్లు తేలియాడటం ఏంటని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అసలు మ్యాటర్ ఏంటంటే జపనీస్ హౌసింగ్ డెవలపర్ సంస్ధ వరద ధాటికి ఇల్లు కొట్టుకుపోకుండా అందుకు అనుగుణంగా ఉండే ఇళ్లను నిర్మించారు. దానికి సంబంధించి వీడియో డెమోనే అది. ఆ ఇంటిని చాలా మందపాటి ఇనుప కడ్డీలను నిర్మాణంలో ఉపయోగించడం మూలాన అవి నీరు ప్రవహిస్తున్నప్పుడు తేలుతూ అలాగే ఉండేలా చేస్తుంది. నీరు తగ్గినప్పుడు ఆ ఇల్లు తిరిగి దాని అసలు స్థితికి చేరుకుంటుంది. దీంతో వరదల్లో ఇంటికి అయ్యే డ్యామేజ్ కాకుండా వరద ధాటికి కూలిపోవడం లాంటి సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆ సంస్ధ ప్రతినిధులు చెప్తున్నారు. ప్లంబింగ్‌లో ప్రత్యేక వాల్వ్ అమరిక కూడా ఉండడంతో, ఇవి ఇంటిలోకి నీరు రాకుండా అడ్డుకుంటాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ దీని నిర్మాణానికి పెద్దగా ఖర్చు కూడా కాదంటున్నారు సంస్ధ ప్రతినిధులు. -
సముద్రంలో తేలియాడే నగరం.. పంటలు కూడా.. ఎక్కడో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా సాగరతీరాల్లో ఉన్న నగరాలు తక్కువేమీ కాదు గాని, సాగరంలోని అలలపై తేలియాడే నగరం ఎక్కడైనా ఉందంటే అది వింతే! అలాంటి వింతనే దక్షిణ కొరియా ఆవిష్కరించింది. ప్రపంచంలోనే తొలి తేలియాడే నగరాన్ని బ్యూసన్ సాగరతీరానికి ఆవల సముద్రం అలలపై నిర్మించింది. ‘ఓషియానిక్స్’ పేరిట పూర్తి జనావాసానికి అనుకూలమైన నగరాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి సహకారంతో నిర్మించింది. త్వరలోనే ఇది పర్యాటకుల రాకపోకలకు, నౌకల రవాణాలకు అనువుగా సిద్ధం కానుంది. సముద్రంలో తేలియాడే ఈ నగరంలో రకరకాల ఆహార పంటలను పండిస్తుండటం, పండ్ల తోటలను పెంచుతుండటం కూడా విశేషం. -
సముద్రంలో ఫ్లోటింగ్ ప్యాలెస్.. చుట్టూ విల్లాలు.. వెకేషన్ అదిరిపోద్దంతే!
చాలా మంది ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెకేషన్‌కు వెళ్తుంటారు. కొండ ప్రాంతాలు, సముద్రతీరాల్లాంటి మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రాంతాలకైతే మరీ మరీ ఇష్టపడి వెళ్తారు. ఇలాంటి వాళ్లను మరింత ఆశ్చర్యపరిచేందుకు ఓ అద్భుతమైన ఫ్లోటింగ్ ప్యాలెస్ రెడీ కాబోతోంది. అది కూడా సముద్రంలో. అలా ఇలా కాదు.. నీటిపై తేలేలా 156 రూములతో నిర్మితమవుతోంది. ప్యాలెస్ ఒక్కటే కాదండోయ్.. దాని చుట్టూ విల్లాలు కూడా సిద్ధం కాబోతున్నాయి. అవి కూడా నీటిపై తేలేవే. అలా సముద్రాన్ని చుట్టొద్దామనుకుంటే ఆ విల్లాలే ప్యాలెస్ నుంచి విడిపోయి బోట్లలా మారిపోతాయి. అలా తిరిగొచ్చాక షిప్‌లు కదా ‘డాక్’ అయినట్టు ఆ పెద్ద ప్యాలెస్‌కు అతుక్కుపోతాయి. వినడానికి భలేగా ఉన్నా, వెంటనే చూడాలనేలా ఊరిసున్నా ఈ ప్యాలెస్ హోటల్ దుబాయ్‌లో జుమెయ్రా బీచ్‌కు దగ్గర్లో నిర్మితమవుతోంది. 2023లో అందుబాటులోకి రానుంది. 16 బోట్లు పార్క్ చేసేలా పార్కింగ్ డెక్ బోట్లు, హెలికాప్టర్ల ద్వారా ప్యాలెస్‌ను చేరుకోవచ్చు. 16 బోట్లు పార్క్ చేసేలా పార్కింగ్ డెక్ ఏర్పాటు చేశారు. తేలాడే హెలిప్యాడ్‌ను కూడా నిర్మించబోతున్నారు. ప్రధాన ప్యాలెస్ 4 భాగాలుగా ఉంటుంది. వాటిని మధ్యలో ఉండే గ్లాస్ పిరమిడ్ కలుపుతుంది. ప్యాలెస్‌లో రెస్టారెంట్, బార్, స్పా, పూల్స్, బొటీక్స్ లాంటి సౌకర్యాలెన్నో ఉన్నాయి. విల్లాల్లో ఉండే వాళ్లు కూడా ఈ సౌకర్యాలు పొందవచ్చు. ప్యాలెస్‌ను, విల్లాలను నీటిపై తేలేలా ఎలా నిర్మిస్తున్నారో వెల్లడించలేదు. ప్యాలెస్ ఓపెనింగ్ తేదీ.. అందులోని రూమ్‌లు, సర్వీసుల ధరలు కూడా చెప్పలేదు. చదవండి: పాపికొండల సోయగాలు.. నదీ విహారం విల్లాల్లో ఏమేముంటాయ్? తేలియాడే ఆ పెద్ద ప్యాలెస్ చుట్టూ 12 విల్లాలను నిర్మించనున్నారు. ఒక్కోటి రెండంతస్తులు ఉంటుంది. 1, 4 బెడ్రూమ్ల గదులతో పాటు పైన టెర్రస్.. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఇంతేకాదు.. విల్లాలను పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్నారు. వాటిల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్యాలెస్‌లో గాని, విల్లాలో గాని ఏ ప్రాపర్టీనైనా కొనుక్కోవచ్చు. చదవండి: విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త! – సాక్షి సెంట్రల్ డెస్క్ -
వైరల్: పెళ్లంటే ఇదేరా.. వంట పాత్రలో వెడ్డింగ్ హాల్‌కి వచ్చిన కొత్త జంట
అలప్పజ( కొచ్చి): కేరళను వరదలు ముంచెత్తడంతో అక్కడి రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల రవాణా కూడా పూర్తిగా స్తంభించడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఓ జంట పెద్దలు నిశ్చయించిన ముహుర్తానికే తమ పెళ్లి చేసుకోవాలనే నిశ్చయించుకుని, ఆటంకాలను దాటుకుంటూ వివాహ తంతుని పూర్తి చేశారు. అయితే ఇందులో ఏముందనుకుంటున్నారా.. వానలు కాబట్టి పడవ మీద వచ్చుంటారు అనుకుంటే పొరపాటే. పెండ్లి మంటపానికి వారిద్దరు అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని వచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో స్థానిక టీవీ చానెల్లో ప్రసారమవడంతో పాటు ఆ జంట సెలబ్రిటీగా మారంది. వివరాల్లోకి వెళితే.. ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తున్న ఆకాష్, ఐశ్వర్యల వివాహం సోమవారం జరపాలని పెద్దలు నిశ్చయించారు. అయితే ప్రస్తుతం కేరళలోని వరదల కారణంగా అది వీలుపడదని అనుకున్నారంతా. కానీ తమ జీవితంలో ముఖ్యమైన రోజుని వాయిదా వేయడం ఇష్టంలేని ఆ వధూవరులు మాత్రం ధైర్యంతో ముందుకు కదిలారు. చుట్టూ ఎటు చూసిన నీళ్లు ఉండడంతో వారు ఏకంగా ఓ భారీ అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని తలవడిలోని ఫంక్షన్ హాల్‌కు అతి కష్టం మీద చేరుకున్నారు. అఖరికి పెండ్లి మంటపం సైతం నీటితో నిండిపోయింది అయినా అవేవి వారి నిర్ణయాన్ని ఆపలేకపోయింది. ఈ పెళ్లికి పరిమిత అతిధులు, బంధువులను ఆహ్వానించి వారి సమక్షంలోనే తమ వివాహ తంతు ముగించేశారు. ఇక నవ దంపతులు ఇద్దరూ చెంగనూర్‌లోని దవాఖానలో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. #Kerala couple uses a huge cooking vessel as a makeshift boat to reach their wedding venue amidst #heavyrains #KeralaFloods #KeralaRains pic.twitter.com/NiIUpRcrnc — Diksha Yadav (@DikshaY62646349) October 18, 2021 చదవండి: లాక్డౌన్లో తిండి కూడా లేదు.. అప్పుడొచ్చిన ఓ ఐడియా జీవితాన్నే మార్చింది -
గంగానదిలో మృతదేహాలు : యూపీ, బిహార్ మధ్య చిచ్చు
లక్నో: పవిత్ర గంగా నదిలో తేలుతున్న మృతదేహాలు కలవరం పుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందినవిగా భావిస్తున్న మృతేదేహాలు ఈ రోజు మరిన్ని బయట పడటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. గంగానదిలో ఒడ్డుకు కొట్టుకొస్తున్న శవాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒకవైపు భయంకరంగా విస్తురిస్తున్న కరోనా, మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమీపంలో గంగా నదిలో శవాలు తేలుతూ కనిపించడంతో ప్రజలు మరింత వణికిపోతున్నారు. సోమవారం బిహార్ జిల్లా బక్సర్ వద్ద గంగానదిలో డజన్లకొద్దీ మృతదేహాలు తెలియాడగా, బక్సర్ నుండి 55 కి.మీ. దూరంలో మంగళవారం ఉత్తరప్రదేశ్, ఘాజీపూర్ సమీపంలో నదిలో మృతదేహాలు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవన్నీ ఉత్తరప్రదేశ్‌కు చెందినవేనని బిహార్ అధికారులు వాదిస్తున్నారు. అంబులెన్స్ డ్రైవర్లు వీటిని విసిరిపారేసినట్టు ఆరోపిస్తున్నారు. దీనిపై శేఖర్ సుమన్, బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుండటంతో కోవిడ్ బాధితులు, కుటుంబాలకు లభిస్తున్న గౌరవంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. యూపీ సరిహద్దు సమీపంలో బిహార్‌లోని సరన్‌లో ఉన్న జైప్రభా సేతు అనే వంతెనపైనుంచి అంబులెన్స్‌ల నుంచి కోవిడ్ బాధితుల మృతదేహాలను డ్రైవర్లు నదిలోకి విసిరివేస్తున్నారని బిహార్ బిజెపి ఎంపీ జనార్థన్ సింగ్ సిగ్రివాల్ ఆరోపించారు. దీనిపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా సరన్ జిల్లా యంత్రాంగాన్ని కోరినట్లు తెలిపారు. అయితే ఇరు రాష్ట్రాలు వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. యూపీ, బిహార్ రెండు రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను తీసుకొచ్చి గంగానదిలో వేస్తున్నారని స్థానికుడు అరవింద్ సింగ్ ఆరోపించారు. కోవిడ్ బాధితులవిగా చెబుతున్న కుళ్ళిపోయిన కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకున్న బిహార్ పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. పూర్తిగా కుళ్ళిపోయినందున, మరణానికి కారణాలను ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు. శవాలను గుర్తించేందుకు వీలుగా డీఎన్ఏలను భద్రపరిచామని చెప్పారు. అయితే మృతదేహాలను దహనం చేయడానికి కట్టెలకు అధిక ధరలు వసూలు చేస్తున్నందు వల్లే మృతదేహాలను స్థానిక ప్రజలు నదిలోకి విసిరేస్తున్నారన్న వాదనలను బక్సర్ జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్ తోసిపుచ్చారు. శశ్మానాల్లో తగినంత కట్టెలు ఉన్నాయనీ, ప్రతి రోజు సగటున ఆరు నుండి ఎనిమిది మృతదేహాలు దహనం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని అటూ యూపీ అధికారులను, తమ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని, మృతదేహాలను నదిలోకి విసిరేయకుండా స్థానికులకు అవగాహన కల్పించాలని కోరామని కూడా తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారని మంత్రి సంజయ్ కుమార్ ఝా అన్నారు. మృతదేహాలు యూపీ నుంచి బిహార్‌లో తేలుతున్నాయన్నారు. అటు కరోనాతో చనిపోయిన వారికి, ఇటు పవిత్ర గంగానదికి కూడా తగిన గౌరవం లభించాలని సీఎం భావిస్తున్నారన్నారు. అలాగే ఈ డెడ్‌బాడీస్ దాదాపు నాలుగైదు రోజులనాటివని పోస్టుమార్టం నివేదికలో తమ వైద్యులు ధృవీకరించారని తెలిపారు. చదవండి: బీ, ఏబీ బ్లడ్ గ్రూపుల వారికే కరోనా ముప్పు ఎక్కువ 150 half burnt bodies of suspected Corona victims found floating in Ganga river in Bihar.If this is not Apoclaypse"Pralay"then wat is it?We don't deserve this.We don't. Frightening ,horrifying to say the least.God plz save us from this cataclysm. 🙏🙏🙏 — Shekhar Suman (@shekharsuman7) May 11, 2021 -
63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..!
ఆమెకు థాయ్‌లాండ్ గవర్నమెంట్ 43 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఇంతకీ ఆమె చేసిన ఘోరనేరం ఏమిటి? థాయ్ రాచకుటుంబాన్ని తిట్టిందంతే! ఈ మాత్రం దానికే అంత శిక్షా! అంటే ‘అక్కడంతే..అక్కడంతే’ అనే ఆన్సర్ తప్ప ఏదీ వినిపించదు. 63 సంవత్సరాల అంచన్ రాజకుటుంబాన్ని తిట్టి అట్టి వీడియోను సోషల్ మిడియాలో వదిలింది. అదే ఆమె చేసిన పాపం అయింది. ప్రపంచంలోనే పెద్దదయిన హైస్పీడ్ రైల్‌నెట్ వర్క్‌కు చైనా పెట్టింది పేరు. తాజాగా జియోటోంగో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సరికొత్త హై స్పీడ్ రైలును ప్రవేశపెట్టారు. విశేషం ఏమిటంటే ఈ రైలుబండికి చక్రాలు ఉండవు. హై–టెంపరేచర్ సూపర్‌కండక్టింగ్ (హెచ్‌టీఎస్) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ మాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్ గంటకు 620 కి.మీలు ప్రయాణం చేస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి ముంబైకి గంటలో వెళ్లవచ్చు. గంటలో రావచ్చు! -
అలలపై అణు విద్యుత్
మాస్కో: రష్యా మరో కీలక ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నీటిలో తేలియాడే అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. రష్యా ప్రభుత్వ అణుశక్తి సంస్థ రోసాటమ్ రూపొందించిన ఈ అణు కేంద్రానికి ‘ది అకడెమిక్ లొమొనోసొవ్’గా నామకరణం చేశారు. దీన్ని రష్యాలోని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం అందించేందుకు అభివృద్ధి చేశారు. తాజాగా ‘ది అకడెమిక్ లొమొనోసొవ్’ తన గమ్యస్థలాన్ని చేరుకుంది. ఆర్కిటిక్ మహాసముద్రంలో 5,000 కి.మీ ప్రయాణించి రష్యాలోని చుకోట్కాలో పీవెక్ అనే ప్రాంతానికి చేరుకుంది. ఈ అణు విద్యుత్ కేంద్రం బరువు 21 టన్నులు కాగా, ఎత్తు 470 అడుగులు ఉంటుంది. ఇందులోని 35 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు అణురియాక్టర్లు ఉన్నాయి. ఈ రియాక్టర్ ద్వారా చుకోట్కాలోని లక్ష మందికిపైగా ప్రజలకు విద్యుత్ సరఫరా చేయొచ్చు. ఈ ఏడాది చివరికల్లా ‘ది అకడెమిక్ లొమొనోసొవ్’ అందుబాటులోకి రానుంది. ఇది ఓసారి పనిచేయడం ప్రారంభిస్తే 3 నుంచి ఐదేళ్ల వరకూ ఇంధనాన్ని మార్చాల్సిన అవసరముండదు. మిశ్రమ స్పందన.. ఈ తేలియాడే అణు కేంద్రంపై రష్యాలోని గ్రీన్ పీస్ అనే పర్యావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి అణు విద్యుత్ కేంద్రాలను తరలిస్తున్నప్పుడు ఏదైనా విపత్తు సంభవిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. చుకోట్కా వంటి మంచు ప్రాంతాల్లో ఒకవేళ అణు విపత్తు సంభవిస్తే పర్యావరణంపై పడే దుష్ప్రభావం ఊహకు కూడా అందదని హెచ్చరించింది. దీన్ని ఓ ‘అణు టైటానిక్’గా సదరు సంస్థ అభివర్ణించింది. అయితే రోసాటమ్, ప్రభుత్వ అనుకూలవర్గాలు మాత్రం ఇందులోని సానుకూలతలు కూడా చూడాలని చెబుతున్నాయి. ఎందుకంటే మారుమూల చుకోట్కా ప్రాంతంలో ఈ అణు కేంద్రం ఏర్పాటుతో థర్మల్ ప్లాంట్, మరో అణుకేంద్రం మూతపడతాయని రోసాటమ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తద్వారా పర్యావరణంలోకి విడుదలవుతున్న కాలుష్యం భారీఎత్తున తగ్గుతుందని వెల్లడించారు. అణు ఇంధనంతో నడిచే సబ్మెరైన్ల వల్ల ఎలాంటి ముప్పు ఉండదనీ, తమ అణు విద్యుత్ కేంద్రం కూడా అంతే సురక్షితమని వ్యాఖ్యానించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా ఇందులో భద్రతను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. -
తేలియాడే అణువిద్యుత్ కేంద్రం
రష్యా: అకడమిక్ లోమనోసోవ్ అనే ఈ నావలో ప్రపంచంలోనే తొలిసారిగా అణువిద్యుత్ కేంద్రాన్ని రూపొందించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని షిప్‌యార్డులో రష్యా ప్రభుత్వ అణుశక్తి కార్పొరేషన్ దీన్ని నిర్మించింది. చుక్టోకాలోని పోర్ట్ ఆఫ్ పెవెక్కు దీన్ని తరలిస్తున్నారు. చుక్టోకాకు వెళ్లాక ఇంధనాన్ని నింపి ఉత్పత్తి ప్రారంభిస్తారు. 2019లో ప్రారంభమయ్యే ఈ కేంద్రం ద్వారా ఏటా 50వేల టన్నుల కార్బన్డయాక్సైడ్ ఉద్గారాన్ని తగ్గించవచ్చు. -
పాతాళగంగలో వృద్ధ దంపతుల మృతదేహాలు
కర్నూలు జిల్లా : శ్రీశైలంలోని పాతాళ గంగలో వృద్ధ దంపతుల మృతదేహాలు సోమవారం బయటపడ్డాయి. ఉదయం పాతాళ గంగలో నీటిపై మృతదేహాలు తెలియాడుతుండటం అక్కడే చేపలు పడుతున్న వారు గమనించారు. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎసై వరప్రసాద్ తమ బృందంతో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేశారు. మృతులు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నదిలో నోట్లు కొట్టుకువచ్చాయి..
-
నదిలో నోట్లు కొట్టుకువచ్చాయి..
లక్నో: 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంచలన నిర్ణయంతో నల్లధనం దాచుకున్న కుబేరులు హడలిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నోట్ల కట్టలు చెత్తకుండీల్లో కనిపించినట్టు వార్తలు రాగా, ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో కొందరు 500, 1000 రూపాయల నోట్లను కాల్చి గంగానదిలోకి విసిరేశారు. మీర్జాపూర్ వద్ద నదిలో కొట్టుకు వస్తున్న నోట్లను స్థానికులు గుర్తించారు. వందలాది నోట్లు తేలియాడుతూ కనిపించాయి. ఈ విషయం తెలియగానే స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొందరు పడవలపై వెళ్లి, మరికొందరు నదిలో ఈతకొడుతూ నోట్లను సేకరించారు. కొన్ని నోట్లు కొద్దిగా కాలిపోయి ఉండగా, మరికొన్ని చిరిగిపోయాయి. కొన్ని మాత్రం బాగానే ఉన్నాయి. స్థానికులు ఈ నోట్లను ఎండలో ఆరబెట్టి తీసుకెళ్లారు. పోలీసులకు సమాచారం రావడంతో అక్కడి వెళ్లి నదిలోకి జనం వెళ్లకుండా అడ్డుకున్నారు. నదిలో చాలా నోట్లు కొట్టుకు వచ్చాయని, అయితే కచ్చితంగా ఎన్ని నోట్లు అన్న విషయం తెలియదని పోలీసులు చెప్పారు. -
అలల్లాంటి విల్లాలు
విలాసాల అడ్డా దుబాయ్‌లో మరో అట్రాక్షన్ సిద్ధమవుతోంది. సముద్రంపై ఈతచెట్టు... ప్రపంచపటం ఆకారాల్లో దీవులు.. వాటిపై ఇళ్లు కట్టేసిన ఈ ఎడారి దేశంలో తాజాగా సముద్రం నీటిపై తేలియాడే విల్లాలు పుట్టుకొస్తున్నాయి. డచ్ ఆర్కిటెక్చర్ సంస్థ ‘న్యూ లివింగ్ ఆన్ వాటర్’ పేరుతో ఫొటోలో కనిపిస్తున్న విలాసవంతమైన ఫ్లోటింగ్ విల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కోడిగుడ్డు ఆకారంలో 164 అడుగుల పొడవు, 98 అడుగుల వెడల్పు ఉండే ఒక్కో విల్లా మూడు అంతస్తులు కలిగి ఉంటుంది. బేస్మెంట్ మొత్తం కాంక్రీట్‌తో నిర్మిస్తారు. చిన్నచిన్న గదులతో సగభాగం నిండితే మిగిలిన సగాన్ని ఇంటిని నిలకడగా ఉంచేందుకు వాడతారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో అధునాతనమైన నాలుగు బెడ్రూమ్లు, లివింగ్‌రూమ్, కిచెన్‌లుంటాయి. ప్రతి బెడ్రూమ్కు ప్రత్యేకం గా ఔట్‌డోర్ వ్యూ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫస్ట్‌ఫ్లోర్‌లో బాల్కనీ, డైనింగ్ రూమ్‌లతోపాటు చిన్నసైజు స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సముద్రపు నీటితోనే గదులను చల్లబరిచేందుకు లేదా వెచ్చగా ఉంచేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. వినియోగదారులు కోరితే వీటికి సోలార్ ప్యానెల్స్ బిగించుకోవచ్చునని, అలాగే ఎక్కడికక్కడ నీటిని శుద్ధి చేసే యంత్రాలూ ఏర్పాటు చేస్తామని అంటోంది న్యూ లివింగ్ ఆన్ వాటర్ సంస్థ. వచ్చేనెల ఆరవ తేదీన దుబాయ్‌లో మొదలుకానున్న సిటీస్కేప్ గ్లోబల్ ప్రదర్శనలో నమూనా ఇంటిని ప్రదర్శిస్తామని కంపెనీ తెలిపింది. దాదాపు 16 వేల చదరపు అడుగుల వైశాల్యం ఉండే ఒక్కో ఇంటి ఖరీదు సుమారు రూ.70 కోట్లు! -
దుర్గగుడిపై రద్దీ అంతంతే
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఒకవైపు పవిత్ర పుష్కరాలు, చెంతనే ఉన్న దుర్గమ్మ దర్శనానికి భక్తజనం పోటెత్తుతుందని అంచనా. అయితే ఆలయ ఉన్నతాధికారుల నిర్వాకం వల్ల వేలమంది భక్తజనం అమ్మవారి దర్శనానికి రాకుండానే వెనుదిరిగారు. తొలిరోజునే భారీ గందరగోళం చోటుచేసుకుంది. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం రద్దీ సాధారణమే. శ్రావణ మాసం రెండో శుక్రవారం, పుష్కర రద్దీ అయినప్పటికీ 50 వేల లోపే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మరో వైపున పుష్కరాలలో 22 గంటలు అమ్మవారి దర్శనం కల్పిస్తామని చెప్పినప్పటికీ అది ఆచరణలో సాధ్య పడలేదు. గురువారం రాత్రి 9 గంటలకే అమ్మవారి దర్శనం నిలిపివేసినప్పటికీ శుక్రవారం తెల్లవారుజామున 1 గంటలకు దర్శనం కల్పించాల్సి ఉండగా , అలంకరణలో ఇబ్బందుల కారణంగా తెల్లవారుజామున 5 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. సర్వ దర్శనంలో క్యూలైన్లోనే భక్తుల తాకిడి కనిపించగా, శీఘ్రదర్శనం, రూ. 5 వందల దర్శనం క్యూలైన్లలో రద్దీ నామమాత్రం. బుద్ధా సొంత వాహనంలో బాలకృష్ణ ఇక వీఐపీలను దేవస్థాన వాహనాలపైనే దుర్గగుడి పైకి తీసుకువచ్చి దర్శనం అయిన తర్వాత అదే వాహనంపై సాగనంపుతామని చెప్పారు. అయితే దీనిని ఉల్లంఘిస్తూ సీఎం చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణను స్థానిక ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన వాహనంపై కొండపైకి తీసుకువెళ్లడంతో టోల్గేట్ వద్ద డ్యూటీలో ఉన్న ఆర్డీఓపై దుర్గగుడి ఈవోసూర్యకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై ప్రతాపం మీడియా ప్రతినిధులకు పాస్‌లు లేవనే కారణంతో పోలీసు అధికారులు వారిని పైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. మీడియాకు దేవస్థానం నుంచి ఎటువంటి డ్యూటీ పాస్‌లు ఇవ్వలేదని చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు.ఈవోకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తొలి రోజు ఆదాయం రూ.8.38 లక్షలు పుష్కరాల తొలి రోజున దుర్గగుడికి ప్రసాదాలు, టికెట్ల విక్రయాల ద్వారా రూ. 8,38,818ల ఆదాయం సమకూరింది. వీఐపీ దర్శనం టికెట్లు కేవలం 96 మాత్రమే విక్రయించారు. ఇక 68,400 లడ్డూలను విక్రయించగా రూ. 6.84 లక్షల ఆదాయం సమకూరింది. భవానీ ప్రసాదం విక్రయాల ద్వారా రూ. 71,850ల ఆదాయం సమకూరింది. -
రైల్వే ‘పుష్కర’ సమీక్ష
మునుముందు రద్దీకి తగినట్లు సన్నాహాలు ఉన్నతాధికారుల పరిశీలన విజయవాడ (రైల్వే స్టేషన్) : పుష్కర యాత్రికులకు రైల్వే మెరుగైన సౌకర్యాలను కల్పించింది. రానున్న రోజుల్లో పెరిగే రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ పరిసరాలయిన రైల్వేస్టేడియం, తారాపేట టెర్మినల్, బి.ఆర్.టి.ఎస్ రోడ్లలలో పుష్కరనగర్లను ఏర్పాటు చేసింది. మరోవైపు శాటిలైట్ స్టేషన్లలో ప్రత్యేక రైళ్లు నిలిపివేసి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో తరలించడంతో విజయవాడ స్టేషన్లో రద్దీ తగ్గింది. అదనపు బుకింగ్ కౌంటర్లు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు, ఎలక్ట్రానిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేయడం వల్ల సత్వరం టికెట్లు పొందుతుండంతో బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గింది. స్టేషన్లో పుష్కర రద్దీని దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏ.కె.గుప్తా శుక్రవారం పరిశీలించారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని డి.ఆర్.ఎం అశోక్‌కుమార్, ఏ.డీ.ఆర్.ఎం కె.వేణుగోపాలరావులకు సూచించారు. వివిధ రైళ్ల రాక,పోకలను తెలిపే వివరాలతో కూడిన చార్టులను యాత్రికుల బస చేసే పుష్కర నగర్లలో ఏర్పాటు చేశారు. తూర్పు ద్వారం వద్ద నిషేధాజ్ఞలు స్టేషన్‌లోని తూర్పుముఖద్వారం నుంచి కేవలం రిజర్వుడు ప్రయాణికులను మాత్రమే అనుమతించడంతో శుక్రవారం పలువురు యాత్రికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. అన్‌రిజర్వుడు ప్రయాణికులను తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్, తారాపేట టెర్మినల్ నుంచి మాత్రమే అనుమతిస్తున్నారు. కొందరు ఆర్పీఎఫ్ సిబ్బందితో గొడవకు దిగారు. -
'ఫ్లోటింగ్ పియర్స్' తో నీటిపై నడవొచ్చు!
ఇటలీః బల్గేరియాకు చెందిన ఎనభై ఏళ్ళ క్రిస్టో వ్లాదిమిరోవ్ జావచెఫ్ తన ఆలోచనను అమల్లోకి తెచ్చాడు. రెండు ద్వీపాల మధ్య వంతెన నిర్మించాల్సిన అవసరం లేకుండా నీటిపై నడిచే విధానాన్ని కనుగొన్నాడు. తన ఆలోచనల రూపాన్ని ప్రజలకు, ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చి గంటలకొద్దీ ప్రయాణించాల్సిన పనిలేకుండా చేశాడు. ఇటలీలోని లాంబర్డేకు సమీపంలోని లేక్ ఐసోలో మోన్టేఐసోలో ద్వీపంలో సుమారు 2 వేల మంది జనాభా ఉంటారు. అక్కడినుంచీ లాంబర్డేకు వెళ్ళాలంటే పడవలను ఆశ్రయించాల్సిందే. పడవ ప్రయాణంతో కొద్దిపాటి దూరానికే నీటిలో గంటలదరబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది. అయితే ఈ సమయాన్ని తగ్గించాలంటే వంతెన ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమా? అది జరిగే అవకాశం ఉందా అంటూ తీవ్రంగా ఆలోచించిన క్రిస్టోకు మెరుపులాంటి ఐడియా తట్టింది. నీటిపై నడిచే విధానం అమల్లోకి తెచ్చే అవకాశం ఉందేమోనన్న తన ఆలోచనకు పదును పెట్టిన క్రిస్టో రెండు ద్వీపాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు నీటిలోనే మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. అనుకున్నదే తడవుగా గతేడాది ఫ్లోటింగ్ పియర్స్ పేరున తన కొత్త ప్రాజెక్టును ప్రారంభించాడు. నీటిపై తేలే రహదారిని ఏర్పాటు చేసేందుకు లక్షలకొద్దీ పాలిథిన్ క్యూబ్స్ ను వినియోగించాడు. సుమారు 3 కిలోమీటర్ల మేర సముద్రంపై తేలియాడే రోడ్డును నిర్మించి విజయం సాధించాడు. ఈ రోడ్డు మార్గం నిర్మించేందుకు సుమారు వంద కోట్ల రూపాయలను క్రిస్టో ఖర్చు చేశాడు. ప్రస్తుతం క్రిస్టో రూపొందించిన మార్గం పరిశీలిస్తున్న అధికారులు... అన్నిరకాలుగా తట్టుకునేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత ప్రజలు దీనిపై నడిచేందుకు అనుమతిస్తారు. వచ్చే నెల్లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుపై నడిచేందుకు స్థానికులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. నీటిపై తేలియాడే మార్గంలో ప్రయాణించేందుకు అత్యధిక జనాభా వచ్చే అవకాశం ఉండటంతో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక వాలంటీర్లను, లైఫ్ గార్డులను ఏర్పాటు చేశారు. -
మధ్యాహ్న భోజనంలో తేలు
సోమందేపల్లి : మధ్యా హ్న భోజనంలో తేలు ప్రత్యక్షమయిన సంఘటన శుక్రవారం మండలంలోని మండ్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దాదాపు 30 మంది విద్యార్థులకు భోజన ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం వడ్డించడం జరిగింది. విద్యార్థులు తినే సమయంలో ప్లేటులో తేలు కనిపించడంతో భయభ్రాంతులకు గురై ఈ విషయాన్ని వారు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. అక్కడికి చేరుకున్న సర్పంచ్ బైల ఆంజనేయులు విద్యార్థులను వైద్య పరీక్షల నిమిత్తం సోమందేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించారు. విద్యార్థులు క్షేమంగా ఉన్నారని తెలియడంతో అందరూ శాంతించారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. చర్యలు చేపడతాం ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి చర్యలు చేపడతాం. భోజన ఏజెన్సీ నిర్వాహకుడు హనుమంతప్పను విచారించాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని మండలంలోని అన్ని ఏజెన్సీల నిర్వాహకులకు హెచ్చరించాం. - ఆంజనేయులు నాయక్, ఎంఈఓ