అలప్పజ( కొచ్చి): కేరళను వరదలు ముంచెత్తడంతో అక్కడి రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల రవాణా కూడా పూర్తిగా స్తంభించడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఓ జంట పెద్దలు నిశ్చయించిన ముహుర్తానికే తమ పెళ్లి చేసుకోవాలనే నిశ్చయించుకుని, ఆటంకాలను దాటుకుంటూ వివాహ తంతుని పూర్తి చేశారు. అయితే ఇందులో ఏముందనుకుంటున్నారా.. వానలు కాబట్టి పడవ మీద వచ్చుంటారు అనుకుంటే పొరపాటే.
పెండ్లి మంటపానికి వారిద్దరు అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని వచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో స్థానిక టీవీ చానెల్‌లో ప్రసారమవడంతో పాటు ఆ జంట సెలబ్రిటీగా మారంది. వివరాల్లోకి వెళితే.. ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తున్న ఆకాష్, ఐశ్వర్యల వివాహం సోమవారం జరపాలని పెద్దలు నిశ్చయించారు. అయితే ప్రస్తుతం కేరళలోని వరదల కారణంగా అది వీలుపడదని అనుకున్నారంతా. కానీ తమ జీవితంలో ముఖ్యమైన రోజుని వాయిదా వేయడం ఇష్టంలేని ఆ వధూవరులు మాత్రం ధైర్యంతో ముందుకు కదిలారు.
చుట్టూ ఎటు చూసిన నీళ్లు ఉండడంతో వారు ఏకంగా ఓ భారీ అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని తలవడిలోని ఫంక్షన్ హాల్‌కు అతి కష్టం మీద చేరుకున్నారు. అఖరికి పెండ్లి మంటపం సైతం నీటితో నిండిపోయింది అయినా అవేవి వారి నిర్ణయాన్ని ఆపలేకపోయింది. ఈ పెళ్లికి పరిమిత అతిధులు, బంధువులను ఆహ్వానించి వారి సమక్షంలోనే తమ వివాహ తంతు ముగించేశారు. ఇక నవ దంపతులు ఇద్దరూ చెంగనూర్‌లోని దవాఖానలో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్నారు.
#Kerala couple uses a huge cooking vessel as a makeshift boat to reach their wedding venue amidst #heavyrains #KeralaFloods #KeralaRains pic.twitter.com/NiIUpRcrnc
— Diksha Yadav (@DikshaY62646349) October 18, 2021
చదవండి: లాక్‌డౌన్‌లో తిండి కూడా లేదు.. అప్పుడొచ్చిన ఓ ఐడియా జీవితాన్నే మార్చింది
Comments
Please login to add a commentAdd a comment