సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జూలై మాసంలో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు జలాశయాలు నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి. కేరళలోని త్రిస్సూర్‌లో మైమరిపించే అతిరాపల్లి వాటర్ ఫాల్స్ వద్ద జలకళ పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కళకళలాడుతున్నాయి. వీకెండ్ కావడంతో పర్యాటక ప్రదేశాల్లో రద్దీ ఏర్పడింది.
కాగా ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో కృష్ణానది జలకళను సంతరించు కుంది. శ్రీశైలం డ్యామ్ మూడు గేట్లనుశనివారం ఉదయం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీంతో చిన్నా పెద్దా అంతా డ్యామ్ సౌందర్యాన్ని, ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు
#WATCH | Tourists throng Thrissur in Kerala to witness mesmerizing Athirappilly Water Falls pic.twitter.com/U4jBJqWRq7
— ANI (@ANI) July 23, 2022
Comments
Please login to add a commentAdd a comment