water falls
-
ఉత్తర కోనలో ఓ జలపాతం, రెండు వేల అడుగులు దిగాలి!
కెంప్టీ ఫాల్స్... ఇది ఉత్తరాఖండ్‌లో ఓ జలపాతం. ముస్సోరీ హిల్‌స్టేషన్ టూర్లో చూడవచ్చు. కెంప్టీ అనే పేరులో భారతీయత ధ్వనించదు. ఆ మాటకు వస్తే మనదేశంలో చాలా హిల్ స్టేషన్ల పేర్లలో కూడా ఆంగ్లీకరణ ప్రభావం ఉంటుంది. కెంప్టీ అనే పదం క్యాంప్ టీ అనే మాట నుంచి వచ్చింది. బ్రిటిష్ వాళ్లు ఈ హిల్స్టేషన్ని, జలపాతాన్ని గుర్తించకముందు ఈ జలపాతానికి ఉన్న పేరేమిటి అని అడిగితే స్థానికుల్లో ఎవరి దగ్గరా సమాధానం దొరకదు. ఇది గర్వాలీ రీజియన్. వారి భాషలో ఈ జలపాతం పేరు ఏమి ఉండేదో గైడ్లు కూడా చెప్పలేరు. ఈ వాటర్‌ఫాల్ దగ్గరున్న గ్రామం పేరు రామ్‌గావ్.రెండు వేల అడుగులు దిగాలి!మనదగ్గర నివాసప్రదేశాలు విశాలమైన మైదానాల్లో విస్తరించి ఉంటాయి. ఒక ఊరికి మరో ఊరికి మధ్య ఓ కొండ లేదా ఊరి మధ్యలో కొండలు, గుట్టలు ఉంటాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం దాదాపుగా పర్వతశ్రేణుల్లో విస్తరించి ఉంటుంది. ముస్సోరీ పట్టణం కూడా అంతే. దారి పొడవునా రోడ్డుకి ఇరువైపులా ఉన్న కట్టడాలే పట్టణం అంటే. పట్టణం విస్తీర్ణాన్ని చదరపు కిలోమీటర్లలో చెప్పలేం, కిలో మీటర్లలో చెప్పాల్సిందే. లైబ్రరీ రోడ్, వ్యూపాయింట్, మాల్‌రోడ్, లాల్తిబ్బ, లాండౌర్, క్యామెల్స్ బ్యాక్ రోడ్... ఇలా అన్నీ కొండవాలులో ఉన్న రోడ్లే. గన్‌హిల్ మీద మాత్రం కొంత చదును నేల ఉంటుంది. ఢిల్లీ నుంచి మస్సోరీకి సుమారుగా 300 కిలో మీటర్లుంటుంది. ముస్సోరీ సముద్రమట్టానికి రెండువేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. కెంప్టీ ఫాల్స్‌కు చేరడానికి కొండల అవతలవైపు 13 కిలోమీటర్లు కిందకు ప్రయాణించాలి. ఆరువేల ఐదు వందల అడుగుల నుంచి నాలుగువేల ఐదువందల అడుగులకు చేరతాం. అంటే రెండు వేల అడుగుల కిందకు ప్రయాణిస్తామన్నమాట. ముస్సోరీ నుంచి తెల్లవారుజామున ప్రయాణం మొదలుపెడితే ఓ గంట లోపే కెంప్టీ ఫాల్స్‌కు చేరతాం. కొండవాలులో ప్రయాణం కాబట్టి వేగంపాతిక కిలోమీటర్లకు మించదు. ముస్సోరీ పట్టణం వాహనాల హారన్ల శబ్దం దూరమయ్యే సరికి సన్నగా జలపాతం ఝరి మొదలవుతుంది. దగ్గరకు వెళ్లేకొద్దీ ఝుమ్మనే శబ్దం వీనులవిందు చేస్తుంది. తెల్లగా పాలకుండ ఒలికినట్లుండే జలపాతం కిందకు వెళ్లే లోపే నీటి తుంపర మంచు బిందువులంత చల్లగా ఒంటిని తాకుతూ ఆహ్వానం పలుకుతాయి. శీతాకాలంలో జలపాతం హోరు ఎండాకాలంలో ఉన్నంత జోరుగా ఉండదు. నీరు గడ్డకడదామా నేల మీద పడదామా అన్నట్లు ఉంటుంది. కాబోయే కలెక్టర్లు కనిపిస్తారు!ముస్సోరీ టూర్లో సాయంత్రాలు కానీ వీకెండ్లో కానీ కనిపించే కొందరు యువతీయువకులను జాగ్రత్తగా గమనించి చూస్తే పర్యాటకులు కాదు, స్థానికులూ కాదనే సందేహం వస్తుంది. వాళ్లు సివిల్స్‌లో ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యి ముస్సోరీలో శిక్షణ పొందుతున్న భవిష్యత్తు కలెక్టర్లు. కెంప్టీ ఫాల్స్‌ను చూసిన తర్వాత తిరిగి ముసోరీ చేరుకుని ఇప్పుడు కేబుల్ కార్లో గన్హిల్కు చేరాలి. గన్హిల్కి రాత్రిపూట వెళ్తే లైట్ల కాంతిలో మిణుకుమిణుకు మంటున్న ముసోరీని చూడవచ్చు, పగలు వెళ్తే డెహ్రాడూన్ పట్టణం కూడా కనిపిస్తుంది. ఆకాశం మబ్బుల్లేకుండా నిర్మలంగా ఉంటే గన్‌హిల్ నుంచి హిమాలయ పర్వత శిఖరాలు కనిపించే అవకాశం ఉంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఈసారి దసరా వెకేషన్‌కి కుట్రాలం టూర్..!
దసరా అనగానే నవరాత్రులు పండుగ హడావిడితో ప్రతి ఇల్లు ఆద్యాత్మకతకు నిలయంగా మారిపోతాయి. రోజుకో అమ్మవారి అలంకారంతో దేవాలయాల్లో భక్తుల సందడితో కిటకిటలాడగా..ఇళ్లన్ని అమ్మవారి ఆరాధనతో హోరెత్తిపోతుంటాయి. అయితే చాలామందికి ఈ సమయంలో అలా కాసేపు కొత్త ప్రదేశాలకి వెళ్లి.. అక్కడ పండుగ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఆధ్యాత్మిక ఆనందాన్ని, ప్రకృతి అద్భుతాలని తిలకించేలా చేసే ఈ కుట్రాలం టూర్‌కి వెళ్లాల్సిందే!.ఇది పర్యాటకులకు జాలువారే జలపాతాల అందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించే ఈ గొప్ప పర్యాటక ప్రదేశం విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.కుట్రాలం లేదా కుట్రాళం అద్భుతమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. దీనిని తరచుగా "స్పా ఆఫ్ సౌత్ ఇండియా" అని పిలుస్తారు. ఈ ప్రాంతం జలపాతాల హోరు తోపాటు అక్కడ కొలువై ఉన్న కుట్రాల నాదర్ స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నటరాజు అవతారమైన పరమేశ్వరుడు కుర్తాల నాదర్‌గా వెలిశారని పురాణాలు చెబుతున్నాయి.ఈ కుర్తాలంలోని శివలింగాన్ని అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్టించారని పురాణ కథనం. ఇక ఈ ఆలయాన్ని తమిళ రాజ్యాధిపతులైన చోళ, పాండ్య రాజులు అభివృద్ధి చేసినట్టు ఇక్కడి శిలాశాసనాలు చెబుతున్నాయి. అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ ఆలయం శిల్ప సంపద చూపురులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ కుట్రాల లేదా కుర్తాల నాదర్‌గా పిలవబడుతున్న పరమేశ్వరుడి తోపాటు అమ్మవారు వేణువాగ్వాదినీ దేవిగా పూజలందుకుంటోంది. ఆ అమ్మవారి తోపాటు పరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉంది. ఇక్కడ కొలువై ఉన్న పరాశక్తి అమ్మవారి పీఠం 51 శక్తి పీఠాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ ఆలయంలో శివుడు లింగాకారంలో వెలిసినప్పటికీ ప్రధాన పూజలు మాత్రం నటరాజ స్వరూపానికే నిర్వహించడం విశేషం.కుట్రాలంలో కొలువైన జలపాతాలు..పేరరువి జలపాతం (పేరరువి)ఎత్తు: సుమారు 60 మీటర్లు.కుత్రాలంలో అత్యంత ప్రసిద్ధ, అతిపెద్ద జలపాతం. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు.చిత్తరువి జలపాతం ఎత్తు: పేరరువితో పోలిస్తే చిన్నది.పేరరువి జలపాతానికి దగ్గరగా ఉంది, త్వరగా స్నానం చేయడానికి అనువైనది.ఐదు జలపాతాలు (ఐంతరువి)విశేషం: నీరు ఐదు పాయలుగా విడిపోయి జాలువారుతుంది. టైగర్ ఫాల్స్ (పులియరువి)అత్యంత చిన్న జలపాతం కావడం వల్ల పిల్లలకు, పెద్దలకు సురక్షితమైనది. పాత కుర్తాళం జలపాతం (పజయ కుర్తాళం)ప్రధాన జలపాతం నుంచి సుమారు 8 కి.మీ.చుట్టూ పచ్చని చెట్లతో, నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తోంది.షెన్బాగా జలపాతం (శెనబగాదేవి జలపాతం)చేరుకోవడానికి కొంచెం ట్రెక్కింగ్ అవసరం. సమీపంలోని దేవాలయం ప్రత్యేక ఆకర్షణ.హనీ ఫాల్స్ (తేనరువి)మూడు వైపుల నుంచి నీటి ప్రవాహంతో చూడచక్కగా ఉంటుంది.కొత్త జలపాతం (పుత్తు అరువి)తక్కువ రద్దీ, ప్రశాంతమైన అనుభూతిని అందిస్తోంది.ఫ్రూట్ గార్డెన్ ఫాల్స్ (పజతోట్ట అరువి)పండ్ల తోటలో ఉంది, జలపాతం123 కోసం ప్రత్యేకమైన సెట్టింగ్‌ను అందిస్తుంది.ఇక ఈ జలపాతాలన్నీ చిత్తార్, మణిముత్తారు, పచైయార్ మరియు తామిరబరణి వంటి నదుల ద్వారా ప్రవహిస్తాయి. ఇవి ఏడాది పొడవునా స్థిరమైన నీటి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. ఎలా చేరుకోవాలంటే..తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నగరం నుంచి కుట్రాలంకు రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. కుట్రాలం ప్రాంతానికి సమీపంలోని రైల్వే స్టేషన్ పేరు తెన్కాశి. ఇక్కడినుంచి కుట్రాలం ప్రాంతానికి బస్సులు, ఆటోల సౌకర్యం ఉంది. ఇటు తెన్కాశి, కుట్రాలం ప్రాంతాల్లోనూ పర్యాటకులకు అన్ని సదుపాయాలు అందుబాటు ధరల్లోనే లభించడం విశేషం.(చదవండి: ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!) -
మారేడుమిల్లిలో వైద్య విద్యార్థుల విహారయాత్ర.. విషాదాంతం
అల్లూరి, సాక్షి: మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నిన్న గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరు మృతిచెందగా.. సోమవారం ఉదయం వాళ్ల మృతదేహాల్ని వెలికి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది వైద్యవిద్యార్థులు ఆదివారం ట్రావెలర్ వాహనంలో వెళ్లారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ‘జలతరంగిణి’ జలపాతం వద్దకు చేరుకుని అందులో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. జలపాతం ఉద్ధృతి పెరగడంతో ఐదుగురు కొట్టుకుపోయారు.హరిణిప్రియ, గాయత్రి పుష్పను ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడి, రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు. గల్లంతైనవారిలో సౌమ్య, హరదీప్, అమృత, హరిణిప్రియ, గాయత్రి పుష్ప ఉన్నారు. వీరిలో విజయనగరానికి చెందిన గల్లంతైన వారికోసం పోలీసులు, సీబీఈటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యమయ్యాయి. హరదీప్ కోసం గాలింపు కొనసాగుతోంది.కొసిరెడ్డి సౌమ్య (21) ది పార్వతీపురం జిల్లా బొబ్బిలి స్వస్థలంకాగా, బి.అమృత (21) బాపట్లగా పోలీసులు తెలిపారు. సీహెచ్ హరదీప్(20) ప్రకాశం జిల్లా మార్కాపురంగా తెలుస్తోంది. సౌమ్య, అమృత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. కెయిర్న్స్ సమీపంలోని ప్రముఖ స్విమ్మింగ్ స్పాట్ మిల్లా మిల్లా జలపాతం వద్ద ఘటన జరిగింది.బాధితులను బాపట్ల జిల్లాకు చెందిన చైతన్య ముప్పరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన సూర్యతేజ బొబ్బగా గుర్తించారు. వీరిద్దరూ మరో స్నేహితుడితో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుతున్నారు. ముగ్గురూ మంగళవారం మిల్లా మిల్ వాటర్ ఫాల్స్ చూసేందుకు స్నేహితుడితో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో కాలుజారి ఒకరు జలపాతంలో పడిపోవడంతో మునిగిపోతున్న స్నేహితుడిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితుడు ఒడ్డుకు చేరుకున్నాడు. చైతన్య, సూర్యతేజ అకాల మరణం వారి కుటుంబాల్లో పెను విషాదం నింపింది. -
ఫ్యామిలీతో ట్రిప్.. పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాటలు (ఫోటోలు)
-
ఉద్యోగం పోయిందనే బాధతో.. 4 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి!
యశవంతపుర: మిస్సింగ్ అయిన నగర టెక్కీ కథ విషాదంతామైంది. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా రాణిజరి జలపాతం వద్ద బెంగళూరు టెక్కీ భరత్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కొండ నుంచి నాలుగు వేల అడుగుల దిగువన మృతదేహాన్ని గుర్తించి అతికష్టంపై తాళ్ల సాయంతో వెలికితీశారు. ఆపై 14 కిలోమీటర్లు దూరం దట్టమైన అడవులు, లోయలను కాలినడకన దాటుకుంటూ తరలించారు. ఉద్యోగం పోయిందనే బాధతో.. ఈ నెల 6న భరత్ చిక్కమగళూరు రాణిజరి జలపాతం వద్దకు వెళ్లి మొబైల్‌ఫోన్, బైక్, ఐడీ కార్డు, బట్టలను గుట్టపై విడిచి కనిపించకుండాపోయాడు. బెంగళూరులో టెక్కీగా పనిచేసే భరత్.. కంపెనీ ఉద్యోగం నుంచి తీసేయడంతో విరక్తి చెంది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మూడు రోజులైనా జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు చిక్కమగళూరుకు చేరుకొని బణకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొబైల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా రాణిజరి వద్ద ఉన్నట్లు గుర్తించి గాలింపు చేపట్టారు. 25 మంది పోలీసు సిబ్బంది గాలింపులో పాల్గొన్నారు. అంత పై నుంచి భరత్ దూకడంతో మృతదేహం ఛిద్రమై, ఈ వారంరోజుల్లో కుళ్లిపోయింది. కుమారుడు ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇదిచదవండి:ల్యాబ్ టెక్నీషియన్ క్రూరత్వం? -
ఆంధ్రప్రదేశ్‌లో వర్ష బీభత్సం (ఫొటోలు)
-
వంద అడుగుల ‘కొండెంగలొద్ది’ పరుగెడుతున్న అగర్‌గూడ, గుండాల జలపాతాలు
► జాలువారే జలపాతాలు పెంచికల్పేట్ మండలం అగర్‌గూడ అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. దాదాపు వంద అడుగుల ఎత్తునుంచి దూకే జలధార ఇది. పెంచికల్పేట్ నుంచి అగర్‌గూడకు 7 కి.మీ.లు వాహనంలో వెళ్లి, మరో ఐదు కి.మీ.లు నడవాలి. తిర్యాణి మండలం గుండాల గ్రామ పంచాయతీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. 50 అడుగుల కొండవాలు నుంచి జాలువారుతోంది. తిర్యాణి నుంచి 10 కి.మీ.ల దూరంలో గల రొంపల్లి వరకు వాహనాల్లో వెళ్లొచ్చు. తర్వాత దట్టమైన అడవిలో ఆరు కి.మీ.లు కాలినడకన వెళ్లాలి. -
మళ్ళీ జలపాతం కిందికి మహీంద్రా కారు - ఈ సారి ఏమైందంటే?
Clarity About Mahindra Scorpio N Sunroof Leak: భారతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న అత్యంత సురక్షితమైన కార్లలో మహీంద్రా స్కార్పియో ఎన్ ఒకటి. గత కొంతకాలం కింద ఒక వ్యక్తి తన కారు సన్‌రూఫ్ నుంచి వాటర్ లీక్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేసి హల్ చల్ చేసాడు. అయితే ఈ సమస్యకు కంపెనీ పరిస్కారం అందించింది. కాగా తాజాగా మరో సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం యష్9డబ్ల్యు (Yash9w) అనే యూట్యూబర్, మహీంద్రా స్కార్పియో ఎన్ కారుని జలపాతం కిందికి తీసుకెళ్లి సన్‌రూఫ్ లీక్‌పై ఉన్న సందేహాలకు సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఇందులో భాగంగానే కారుని జలపాతం కిందికి తీసుకెళ్లాడు. జలపాతం నీరు కారుపై పడినా లోపలికి ఏ మాత్రమే రాలేదని స్పష్టం చేసాడు. అయితే మరో సారి కూడా కారుని జలపాతం కింది తీసుకెళతాడు. అప్పుడు చిన్న నీటి బిందువులను గమనించినట్లు వెల్లడించాడు. చిన్న నీటి బిందువులే కానీ అది అసలు చెప్పుకోదగ్గ సమస్య కాదని కూడా వీడియో ద్వారా వ్యక్తం చేసాడు. కారుని జలపాతం కిందికి తీసుకెళ్లాడనికి ముందు సన్‌రూఫ్ పూర్తిగా క్లోజ్ చేస్తాడు. సన్‌రూఫ్ మూసివేయడంతో ఏ చిన్న తప్పు జరిగినా వేగంగా వచ్చే నీరు లోపలి వస్తుంది. అయితే యూట్యూబర్ స్కార్పియో ఎన్ కారు చాలా పటిష్టమైందని, ఎలాంటి లీక్ లేదని స్పష్టంగా వెల్లడించాడు. (ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!) సాధారణంగా వాహన తయారీ సంస్థలు కార్లను చాలా పటిష్టంగా తయారు చేస్తాయి. అయితే వాహన వినియోగదారుడు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల సమస్యలు పుట్టుకొస్తాయి. అయితే కారులో ఏదైనా సమస్య ఉందని గమనిస్తే.. కంపెనీ తప్పకుండా దానికి తగిన పరిష్కారం అందిస్తుంది. అంతే కాకుండా సన్‌రూఫ్ అనేది వర్షపు నీటి బిందువులు లోపలికి రాకుండా కాపాడటానికి, కారులోకి కావలసినంత వెలుతురు రావడానికి ఉపయోగపడుతుంది. (ఇదీ చదవండి: బన్నీ మంచి బిజినెస్మెన్ కూడా! ఈ కంపెనీలన్నీ తనవే..) జలపాతాల కిందికి కారుని తీసుకెళ్లి సన్‌రూఫ్ టెస్ట్ చేయడమనేది సమంజసం కాదు. జలపాతం నుంచి కిందికి పడే నీరు చాలా వేగంతి పడుతుంది. అలాంటి సమయంలో ఏదైనా ఊహించని ప్రమాదం జరగవచ్చు. కావున ఇలాంటి సాహసాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచింది. మొత్తం మీద మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ పటిష్టంగా ఉందని మరోసారి ఋజువైంది. ఇది మహీంద్రా ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. -
ప్రపంచంలోని టాప్ 10 జలపాతాలు
-
పెన్నహోబిలంలో విషాదం..వెలికి తీసేలోపు..
సాక్షి, ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న జలపాతంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి ఓ బాలిక మృతి చెందింది. వివరాలు.... బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లికి చెందిన గోపాలకృష్ణారెడ్డి, హిమబిందు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మహిత (14) అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సంక్రాంతిని పురస్కరించుకుని పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో గురువారం ఉదయం పిల్లలను పిలుచుకుని తల్లి పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చింది. ఆలయంలో పూజలు ముగించుకుని దిగువన ఉన్న జలపాతం వద్దకు చేరుకున్నారు. సెల్‌ఫోన్‌తో సరదాగా ఫొటోలు దిగారు. ఈ క్రమంలో జలపాతానికి ఎగువన పిల్లలు వరుసగా నిలబడి ఉండగా తల్లి ఫొటో తీసింది. అదే సమయంలో నీళ్లలో ఉన్న పాచి పట్టిన రాతిపై కాలు పెట్టిన మహిత ఒక్కసారిగా జారిపడి జలపాతం దిగువకు కొట్టుకుపోయింది. గమనించిన తల్లి ఒక్కసారిగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయడంతో కొందరు యువకులు జలపాతంలోకి దూకి మహిత కోసం గాలింపు చేపట్టారు. అప్పటికే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన మహితను జలపాతానికి ఫర్లాంగు దూరంలో యువకులు గుర్తించి వెలికి తీశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని మహితను ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ఉరవకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: నా చావుకు ఎవరూ కారణం కాదు! అంటూ సెల్ఫీ వీడియో పంపి..) -
‘నీళ్ల’పై తడాఖా.. జోరుగా ప్రపంచ రాపెల్లింగ్ పోటీలు
సాక్షి, ఇచ్చోడ(బోథ్): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన గాయత్రి జలపాతం వద్ద శనివారం ప్రపంచ రాపెల్లింగ్ పోటీలు నిర్వహించారు. అడ్వెంచర్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు వివిధ దేశాల నుంచి 20 మంది యువతీ, యువకులు తరలివచ్చారు. శనివారం సాయంత్రం విదేశీ యువతితోపాటు ఇద్దరు యువకులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 30 మంది యువకులు పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం విదేశీ యువతతోపాటు మరో 30 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారు. రెండు ఎత్తైన భారీ కొండల మధ్య నుంచి వస్తున్న గాయత్రి జలపాతం చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. గాయత్రి జలపాతం వద్ద ప్రపంచ రాపెల్లింగ్ పోటీలు -
సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలోకి గల్లంతు
దొడ్డబళ్లాపురం: సెల్ఫీ తీసుకుంటూ ఓ యువకుడు గల్లంతైన సంఘటన కనకపుర తాలూకాలోని పర్యాటక కేంద్రం చుంచి ఫాల్స్ వద్ద జరిగింది. బెంగళూరు శంకరమఠం ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రవీణ్ చంద్ర (26) మంగళవారంనాడు ముగ్గురు స్నేహితులతో కలిసి చుంచి ఫాల్స్ చూడడానికి వచ్చాడు. నీరు ప్రవహించే చోట బండరాయిపై కూర్చుని సెల్ఫీ తీసుకుంటుండగా జారి 18 అడుగుల ఎత్తు నుంచి జలపాతంలోకి పడిపోయాడు. అతని స్నేహితులు కొంతసేపు వెతికినా కనిపించలేదు. దీంతో సాతనూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. చెక్‌డ్యాంలో మునిగి ఇద్దరు మృతి మైసూరు: దేవస్థానం దర్శనం కాస్తా విషాదమయం అయ్యింది. చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు అందులో మునిగిపోయి మృతి చెందిన సంఘటన చామరాజనగర జిల్లాలో కొళ్లెగాల తాలూకాలోని చిక్కల్లూరులో చోటుచేసుకుంది. మళవళ్లి తాలూకా లింగపట్టణ గ్రామానికి చెందిన సునీల్ (26), చంద్రు (19)లు 30 మందితో కలిసి చిక్కల్లూరు దేవస్థానానికి వచ్చారు. దేవుని దర్శనం అయిన అనంతరం హోసమఠం ముందు భాగంలో ఉన్న చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లారు. చాలా లోతుగా ఉండడంతో ఈత కొట్టలేక మునిగిపోయారు. స్థానికులు ఈతగాళ్ళను రప్పించి వారి మృతదేహాలను బయటికి తీశారు. కొళ్లెగాల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్) -
వైరల్ వీడియో: అదిరే..అదిరే.. అతిరాపల్లి వాటర్ ఫాల్స్
-
అదిరే..అదిరే.. అతిరాపల్లి వాటర్ ఫాల్స్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జూలై మాసంలో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు జలాశయాలు నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి. కేరళలోని త్రిస్సూర్‌లో మైమరిపించే అతిరాపల్లి వాటర్ ఫాల్స్ వద్ద జలకళ పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కళకళలాడుతున్నాయి. వీకెండ్ కావడంతో పర్యాటక ప్రదేశాల్లో రద్దీ ఏర్పడింది. కాగా ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో కృష్ణానది జలకళను సంతరించు కుంది. శ్రీశైలం డ్యామ్ మూడు గేట్లనుశనివారం ఉదయం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీంతో చిన్నా పెద్దా అంతా డ్యామ్ సౌందర్యాన్ని, ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు #WATCH | Tourists throng Thrissur in Kerala to witness mesmerizing Athirappilly Water Falls pic.twitter.com/U4jBJqWRq7 — ANI (@ANI) July 23, 2022 -
ఏడాది క్రితం పెళ్లి.. జోగ్ ఫాల్స్ చూడాలని వెళ్లి..
శివమొగ్గ: జోగ్ జలపాతాన్ని చూడాలని వచ్చిన దంపతులకు తీవ్ర విషాదం ఎదురైంది. భార్య నీటి కాలువలో పడి మృతి చెందింది. మృతురాలు బెంగళూరు నగరానికి చెందిన నిశా (24). ఆమెకు ఏడాది క్రితం నాగేష్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఇద్దరూ కలిసి జోగ్ జలపాతం చూడాలని వచ్చారు. మంగళవారం జలపాతం వెనుకాల ఉన్న జంగిల్ రిసార్టు కాలువలో ఆమె జారి పడింది. వెంటనే అక్కడ ఉన్న వారు బయటకు తీసి ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కార్గల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి) -
Seethampeta: వనవిహారీ.. ఇదీ దారి
వేకువ గాలులు నొసటన ముద్దాడుతూ ఉంటే ఈ కొండల్లో విహరించాలి. సూరీడి కిరణాలు నడినెత్తిపై వచ్చే వేళకు ఆ జలపాతం మన శిరసుపై నుంచి పాదాలపైకి దూకాలి. కడుపు లోపల చల్ల కదలకుండా సున్నపుగెడ్డ మధ్యన నడుం వాల్చాలి. వెలుతురు వెళ్లి చీకటి ఇంకా రాని ఆ కొన్ని ఘడియల పాటు చెమట్లు వచ్చేలా సాహస క్రీడల్లో మునిగి తేలాలి. కార్తీక వన విహారానికి ఇంతకు మించిన సాఫల్యత ఏముంటుంది..? ఇవన్నీ నిజం కావాలంటే మంచి సెలవు రోజు చూసుకుని చలో సీతంపేట అనేయడమే. సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం): సీతంపేట రారమ్మంటోంది. కార్తీకంలో వన విహారానికి తన బెస్ట్ టూరిజం ప్రదేశాలను చూపిస్తూ ఆకర్షిస్తోంది. ఓ వైపు జలపాతాలు, మరోవైపు పార్కు, ఇంకో వైపు అడవుల అందాలతో మన్యం అద్భుతంగా కనిపిస్తోంది. ఏటా ఎన్టీఆర్ అడ్వంచర్ పార్కు, జగతపల్లి, ఆడలి వ్యూపాయింట్లను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలతో పాటు ఇటు ఒడిశా నుంచి కూడా పర్యాటకులు క్యూ కడుతుంటారు. సాహస క్రీడా వినోదం సీతంపేట అడ్వంచర్ పార్కు స్థానికంగా దోనుబాయి రహదారి మలుపునకు సమీపంలో ఉంది. ఇక్కడ జలవిహార్‌లో బోటుషికారు ఏర్పాటు చేశారు. సైక్లింగ్, జెయింట్‌వీల్, ఆల్టర్న్ వెహికల్, షూటింగ్, బంజీట్రంపోలిన్ వంటివి ఉన్నాయి. సున్నపుగెడ్డకు ఇలా.. ఏజెన్సీలోని సున్నపు గెడ్డ జలపాతానికి మంచి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ వాతావరణం చూపరుల్ని కట్టిపడేస్తుంది. దోనుబాయి గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో సున్నపుగెడ్డ ఉంది. పొల్ల– దోనుబాయి మార్గంలో మేకవ గ్రామానికి సమీపంలో రోడ్డుదిగువ గుండా నడుచుకుంటూ వెళితే సున్నపుగెడ్డ జలపాతానికి చేరుకోవచ్చు. బస్సులు పరిమితంగా ఉంటాయి. సీతంపేట వచ్చి ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. సదుపాయాలు అంతంత మాత్రమే. తిను బండారాలు ఇతర ఆహార సామగ్రి పర్యాటకులు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మెట్టుగూడ.. ఇక్కడ.. ► మెట్టుగూడ జలపాతం మంచి ప్రాచుర్యం పొందింది. మా మూలు రోజుల్లో కూడా ఇక్కడకు వచ్చే సందర్శకుల సంఖ్య అ ధికంగా ఉంటుంది. ► సీతంపేట నుంచి కొత్తూరుకు వెళ్లే రహదారిలో ఈ జలపాతం ఉంది. ► కొత్తూరు నుంచి వస్తే 10 కిలోమీటర్లు, పాలకొండ నుంచి వస్తే 17 కిలోమీటర్ల దూరంలో రహదారి పక్కనే మెట్టుగూడ వస్తుంది. ► అక్కడ వాహనాలు దిగి కొద్ది దూరం నడిచి వెళ్తే జలపాతాన్ని చేరుకోవచ్చు. ► ఆర్టీసీ బస్సులు పాలకొండ–కొత్తూరు నుంచి అనునిత్యం తిరుగుతుంటాయి. పర్యాటకులకు అన్ని సౌకర్యాలున్నాయి. వ్యూపాయింట్ భలే పొల్ల: సున్నపుగెడ్డకు సమీపంలో పొల్ల వ్యూ పాయింట్ ఉంది. ఆడలి: ఏజెన్సీలోని ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లాలంటే కుశిమి జంక్షన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రత్యేక వాహనాల్లో వెళ్లాలి. జగతపల్లి: సీతంపేట నుంచి7 కిలోమీటర్ల దూరంలో జగతపల్లి ఉంది. వీటిని వీక్షించడానికి ప్రత్యేక టూరిజం వెహికల్‌ను ఏర్పాటు చేశారు. -
డేంజరస్ బట్ బ్యూటిఫుల్.. స్వర్గంలో ఉన్నట్లుగా..
-
భారీ వర్షం.. దూకుతున్న జలపాతం.. మధ్యలో రైలు!
Train Passing Through Goa Waterfall In Heavy Rain: గోవా- బెంగళూరు రైలు మార్గంలో ప్రకృతి రమణీయ దృశ్యం చోటుచేసుకుంది. భారీ వర్షాల దాటికి దూద్‌సాగర్ జలపాతం వెల్లువలా దూకుతున్న వీడియో కనువిందు చేసింది. అయితే, ఈ ఘటన కారణంగా రైలును మధ్యలోనే నిలిపివేయాల్సి రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వివరాలు... పశ్చిమ కనుమలలోని మొల్లెం జాతీయ పార్కు, భగవాన్ మహవీర్ సాంక్చురీ మధ్య గల ప్రదేశాలు జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. ఇక్కడే దూద్‌సాగర్ జలపాతం ఉంది. కర్ణాటకలోని బెలగావి జిల్లా నుంచి మొదలయ్యే మాండవీ నది పశ్చిమ కనుమల నుంచి గోవా రాజధాని పనాజీ, ఆపై అరేబియా సముద్రంలో కలిసేందుకు ప్రయాణం చేసే క్రమంలో ఈ వాటర్‌ఫాల్స్ రూపుదిద్దుకుంది. భారత్‌లోని పొడవైన(సుమారు 310 మీటర్లు) జలపాతంగా ఇది పేరొందింది. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జలపాతం ఉగ్రరూపం దాల్చింది. నదీ ప్రవాహం పెరగడంతో ఉవ్వెత్తున దూకుతుండటంతో గోవా- బెంగళూరు రైలు ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. దీంతో కాసేపు రైలును అక్కడే నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను పీబీఎన్ఎస్ ట్విటర్లో షేర్ చేసింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు... ‘‘అత్యంత ప్రమాదకరం.. కానీ ఎంతో అందంగా ఉంది. నిజంగా స్వర్గమే భూమి మీదకు దిగినట్లు ఉంది. పాల సముద్రాన్ని చూస్తున్నట్లు ఉంది. కానీ పాపం ఆ రైలులో ఉన్న వారి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో కదా’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరో మూడు రోజుల పాటు కొంకణ్ తీరంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. -
రోటీన్ లైఫ్‌తో విసిగి పోయారా ?.. ఈ వీడియో మీ కోసమే...
-
నది మీద నడవచ్చు.. జలపాతం మీద నుంచి జారచ్చు
నీరు ధారగా జాలువారితే అది జలపాతం. నీటి బిందువు మంచుధారగా మారిపోతే... అది మంచుపాతం. బిరబిర ప్రవహించాల్సిన నది ఘనీభవిస్తే... అది కదలని నది. జన్స్కార్ నది... నెరాక్ జలపాతం పర్యటన ఇది. మనుషులున్న ఈ ఫొటోను బాగా గమనించండి. ఇందులోని పర్యాటకులు నడుస్తున్నది నేల మీద కాదు... గడ్డకట్టిన నది మీద. ఇక్కడ నిలబడి తలెత్తి ఆకాశంలోకి చూస్తే నీలాకాశంలో తెల్లటి మబ్బులు మెల్లగా కదిలిపోతుంటాయి. తాము ఉన్న చోటనే ఉండిపోతే సూర్యుడు ఉదయించడం మానేస్తాడేమో, తాము కదలకపోతే ఈ భూభ్రమణం ఆగిపోతుందేమో అన్నట్లు... నిబద్ధతతో కదిలిపోతుంటాయి. కిందకు చూస్తే నిత్యచైతన్యంలా కదులుతూ ఉండాల్సిన నది తీరం గడ్డకట్టి ఉంటుంది. మధ్యలో మాత్రం నీలాకాశం రంగులో నది నీరు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 30 నుంచి 35 ఉంటాయి. వాతావరణంలో చల్లదనం, ప్రవాహ వేగంతో పుట్టే వేడి మధ్య నిత్యం ఘర్షణ తప్పదు. శీతాకాలంలో చల్లదనానిదే పై చేయి అవుతుంది. గడ్డకట్టిపోక తప్పని నీరు మంచుగా మారి... ప్రవహిస్తున్న నీటి మీద తేలుతూ... మజ్జిగ చిలికినప్పుడు పైకి తేలుతున్న వెన్నను తలపిస్తుంది. మొత్తానికి జన్స్కార్ నది అంటార్కిటికా ఖండానికి మీనియేచర్ రూపంలా ఉంటుంది. రాతి పలకను తలపించే ఆ మంచు పలకల మీద నడుస్తూ వెళ్తుంటే... ఏ క్షణాన ఆ మంచు విరిగి నీటిలోకి జారిపోతుందేమోనని భయం కూడా కలుగుతుంది. జన్స్కార్ నది స్వరూపం శ్రీనగర్ దాల్ సరస్సు పొడవుగా సాగినట్లు కూడా ఉంటుంది. నెరాక్ దిశగా నడక జన్స్కార్ నది మీద నుంచి సాగే ట్రెకింగ్‌ను చదర్ ట్రెక్ అంటారు. ఇందులో తొలి క్యాంప్ 10 వేల, నాలుగు వందల అడుగుల ఎత్తులో తిలాడ్ సుమ్దో ప్రదేశం, ఇక రెండో క్యాంప్ 11,150 అడుగుల ఎత్తులో ఉన్న నెరాక్ జలపాతం. ఇది ఇక్కడ కనిపించే మరో అద్భుతం. అద్భుతాలకు పరాకాష్ట. ఇప్పటి వరకు చూసిన అద్భుతాలకు కీర్తికిరీటం. కిందకు జాలువారుతున్న జలపాతం ప్రవాహంలోనే యథాతథ స్థితిలో నీరు మంచుగా మారిపోయిన దృశ్యం. ఈ జలపాతం పేరు నెరాక్. ఈ ప్రదేశానికి కూడా ఇదే పేరు ఖాయమైపోయింది. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుందో తెలుసా? కశ్మీర్, లధాక్‌లో ఉంది. జన్స్కార్ నది సింధు నదికి ఉపనది. ప్రవాహ తీరం వెంబడి ముందుకు వెళ్తే ఈ నీటికి మూలమైన జలపాతం దగ్గరకు చేరుతామన్నమాట. గడ్డకట్టిన జలపాతాన్ని చూడాలంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో వెళ్లాలి. మంచు కరిగి నెమ్మదిగా జాలువారుతున్న నీటి ధారలను చూడాలంటే ఎండాకాలం వెళ్లాలి. -
వయ్యారాలు పోతున్న నయగారాలను చూడాల్సిందే
ప్రకృతి ఒడిలో పాలపొంగులు.. ఎత్తైనకొండలు.. వాటిపైనుంచి జాలువారే పాల లాంటి నీళ్లు.. నిశ్శబ్దంగా ఉండే చిట్టడవిలో గలగల పారే సెలయేరులు.. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో జోరందుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలపాతాలు.. వెరసి నాలుగు జిల్లాల ప్రజలను కనువిందు చేస్తున్నాయి. ఒకవైపు జోరువానలు.. రాళ్ల మధ్యలోంచి.. గుట్టలపై నుంచి వయ్యారాలు ఒలుకుతూ దూకుతున్న జలపాతాలు నయగారాలను తలపిస్తున్నాయి. ప్రకృతి అందాలను వీక్షించేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. చేరుకోవడం కష్టమైనా.. ఆహ్లాదాన్ని ఆస్వాదించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పర్యాటకంగా పేరుగాంచకపోయినా.. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయీ జలపాతాలు.. ఎలా వెళ్లాలనే వివరాలు మీకోసం.. అద్భుతం.. పాండవలొంక పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్‌పేట సమీపంలో పాండవలొంక జలపాతం ఉంటుంది. ఇక్కడ బండరాళ్లు పల్లపరుపుగా ఉండి వర్షం పడినప్పుడు నీరు ఏటవాలుగా అంచెలంచెలుగ కిందకి జారే అపురూప దృశ్యాలు ఆకట్టుకుంటాయి. పెద్దపల్లి నుంచి అడవి శ్రీరాంపూర్, పారుపెల్లి, ముత్తారం వెళ్లే బస్సులు, ఆటోల్లో కూనారం వెళ్లే దారిలో వెన్నంపల్లి మీదుగా జాఫర్‌ఖాన్‌పేటకు చేరుకోవచ్చు. అక్కడి ప్రభుత్వపాఠశాల పక్కనుంచి ఉన్న రోడ్డుపై మూడుకిలో మీటర్లు ప్రయాణిస్తే శ్రీ రామపాదసరోవర్ (చెరువు) వరకు వెళ్లొచ్చు. రామునిపాదాలు, ఆంజనేయస్వామి గుడి, నాగదేవతలను దర్శించుకుంటూ మూడుకిలోమీటర్ల దూరంలోని పాండవలంక జలపాతాన్ని చేరుకోవచ్చు. ప్రయాణం కొంచెం కష్టమైనా.. ఇక్కడి ప్రకృతి అందాలు ఎంతో ఆకట్టుకుంటాయి. లొంక రామన్న జలపాతం కోరుట్ల: కథలాపూర్ మండలం పోతారం గ్రామశివారులోని లొంక రామన్న జలపాతం ఈ ప్రాంత ప్రజలను అలరిస్తోంది. మానాల గుట్టల నుంచి వచ్చే నీరు లొంక రామన్న శివాలయం పక్కనే ఉన్న రాళ్ల గుట్టలపై నుంచి జాలువారుతోంది. ఈ ప్రాంతానికి వర్షాకాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కోరుట్ల నుంచి వేములవాడ రోడ్లో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కథలాపూర్ మండలకేంద్రానికి చేరాలి. ఇప్పపల్లి గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల వెళితే పోతారం వస్తుంది. పోతారం నుంచి కిలోమీటర్ దూరం వెళితే లొంకరామన్న జలపాతం చేరుకోవచ్చు. కోరుట్ల నుంచి 28 కిలోమీటర్ల దూరం. సిరిసిల్ల జిల్లావాసులు రుద్రంగి మీదుగా ఇప్పపల్లికి చేరుకుని పోతారం మీదుగా లొంక రామన్నను చేరుకోవచ్చు. పోతారం గ్రామం నుంచి కిలోమీటర్ రోడ్ తప్ప మిగతా అంతా బీటీ రోడ్డు ఉంది. రాయికల్ జలపాతం సైదాపూర్(హుస్నాబాద్): సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం ఇటీవల కురుస్తున్న వర్షాలతో జాలువారుతోంది. ఎత్తులో ఉన్న 18 గుట్టల పైనుంచి పడే వర్షపు నీటితో ఈ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. రాయికల్, ఆకునూర్, పెరుకపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్న నీలగిరి గొలుసుకట్టు గుట్టల నుంచి నీరు పారుతోంది. హుజూరాబాద్, హుస్నాబాద్, ముల్కనూరు మీదుగా జలపాత సందర్శనకు రోడ్డుమార్గం ఉంది. సైదాపూర్‌కు 10 కిలోవీుటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది. మరో పొచ్చెర..‘గుండం’ కోరుట్ల: బోథ్సమీపంలోని ‘పొచ్చెర’కు తీసిపోని జలపాతం మల్లాపూర్– రాయికల్ సరిహద్దుల్లోని గోదావరి పరివాహక ప్రాంతంలో ‘వేంపల్లి గుండం’ ఉంది. గోదావరి మూడు పాయలుగా చీలి కొంత దూరం పయనించి మళ్లీ రెండు పాయలుగా మారి ‘వేంపల్లి గుండం’ వద్ద కలుస్తుంది. ఇక్కడ ఉన్న పెద్ద బండరాళ్ల మీదుగా గోదావరి జాలువారి జలపాతంగా మారింది. చూడటానికి ముచ్చటగా ఉంటుంది. కాగా.. వెళ్లడం కాస్త కష్టం. కోరుట్లనుంచి అయిలాపూర్ మీదుగా 25 కిలోమీటర్లు పయనిస్తే గొర్రెపల్లి గ్రామం వస్తుంది. గొర్రెపల్లి స్తూపం నుంచి ఎడమవైపు వెళితే.. వేంపల్లి– వెంకట్రావ్పేట వస్తుంది. జగన్నాథ్‌పూర్ రూట్లో 8కిలోవీుటర్లు వెళ్లిన తరువాత ఎడమవైపు ఉన్న చిన్నపాటి అడవిలో అర కిలోమీటర్ దూరం మోటార్‌సైకిల్‌పై వెళితే.. వేంపల్లి గుండం జలపాతం చేరుకోవచ్చు.అరకిలోవీుటర్ అటవీప్రాంతం తప్ప మిగతా చక్కని బీటీ రోడ్డు ఉంది. అందాల గౌరీగుండాలు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి– మంథని మార్గమధ్యంలో ఉన్న సబ్బితం పంచాయతీ పరిధిలో గౌరీగుండాలు జలపాతం ఉంది. వర్షం కురిసినపుడు ధారగా వచ్చే నీటిలో సరదాగ గడిపేందుకు పర్యాటకులు వస్తుంటారు. కరోనా వైరస్వ్యాప్తి కారణంగా ఈ సారి పర్యాటకులు రావొద్దంటూ పంచాయతీ పాలకమండలి విజ్ఞప్తి చేసింది. పెద్దపల్లినుంచి 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సబ్బితం మీదుగా యైటింక్లయిన్‌కాలనీ వెళ్లే బస్సులో చేరుకోవచ్చు. సొంత వాహనాల్లో వచ్చేవారు పెద్దపల్లి నుంచి మంథని మార్గంలో జలపాతానికి చేరుకోవచ్చు. -
జలపాతం అంచున సెల్ఫీ, అనూహ్యంగా మృత్యు ఒడిలోకి
హాంకాంగ్: డేర్‌డెవిల్ ఇన్ఫ్లూయెన్సర్ సోఫియా చుంగ్ (32) సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ కింద పడి మరణించింది. వాటర్‌ఫాల్ అందాలు వీక్షించడానికి శనివారం తన స్నేహితులతో కలిసి హాంకాంగ్‌లోని హాపాక్లై అనే పార్క్‌కు వెళ్లిన ఆమె అక్కడి అందాలను వీక్షిస్తూ మైమరిచిపోయింది. ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి జలపాతం అంచున సెల్ఫీ దిగడానికి ప్రయత్నించగా పట్టు తప్పి కింద పడిపోయింది. సుమారు 16 అడుగుల ఎత్తు నుంచి పడటంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. సోఫియాను పరీక్షించిన వైద్యులు ఆమె మరణించినట్లు ధృవీకరించారు. కాగా సోఫియా కొండలు, గుట్టలు ఎక్కుతూ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. డేంజరస్ స్టంట్లు చేయడంతో పాటు వాటి ఫొటోలను ఫాలోవర్లతో పంచుకునేది. ఇక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో.. అభిమానులందరికీ మంచి వీకెండ్ ఉండాలని ఆశిస్తూ పెట్టిన ఆఖరి పోస్ట్ వైరల్‌గా మారింది. 'అందరికీ మంచి జరగాలని ఆశించిన నువ్వు ఇప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయావు' అంటూ నెటిజన్లు సోఫియాకు నివాళులు అర్పిస్తున్నారు. -
తిరుమల: కనువిందు చేస్తున్న అందమైన దృశ్యాలు
-
అమెరికాలో కృష్ణాజిల్లా యువతి మృతి
-
అమెరికాలో కృష్ణాజిల్లా యువతి మృతి
సాక్షి, గుడ్లవల్లేరు: సెల్ఫీ సరదా మరో నిండుప్రాణాన్ని బలి తీసుకొంది. కోటి ఆశలతో సప్త సముద్రాలు దాటి వెళ్లిన యువతి నూరేళ్ళ జీవితాన్ని చిదిమేసింది. ఉన్నత చదువుల కోసం వెళ్ళిన కూతురిని జలరక్కసి మింగేయటంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి కృష్ణా జిల్లా యువతి దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కమల (27) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం కొలంబియాలో ఉద్యోగం చేస్తున్నారు. ఒహాయోలోని మేఫీల్డ్ హైట్స్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందారు. నాట్స్ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నైలోని పెద్దకుమార్తె వద్దకు వెళ్లిన తల్లితండ్రులు విషయం తెలిసి తల్లడిల్లిపోతున్నారు.అందరినీ ఆప్యాయంగా పలకరించే కమల ఇక లేదన్నా విషయాన్ని కుటుంబ సభ్యులు ,గ్రామస్థులు జీర్ణించుకోలేకున్నారు. -
సెల్ఫీల మోజులో పడి..
పెద్దపల్లిరూరల్: పచ్చని చెట్లు.. చుట్టూ ఎత్తైన గుట్టలు.. మధ్యలో నుంచి జాలువారుతున్న జలపాతం అందాలను చూసి ఆనందడోళికల్లో తేలియాడేందుకు వచ్చే యువత సెల్ఫీల మోజులో పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. పెద్దపల్లి మండలం సబ్బితం పంచాయతీ పరిధిలోని గట్టుసింగారం వద్ద జలపాతం ఉన్నట్లు ఆరేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచి వర్షకాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లా నుంచి కూడా పర్యాటకుల రాకపోకలతో సబ్బితం జలపాతం వద్ద సందడి నెలకొంటోంది. పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిపై గల సబ్బితం గ్రామం నుంచి మూడుకిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతానికి చేరుకోవడం పర్యాటకులకు పరీక్షగానే మారింది. వర్షాలు కురిసినపుడే జాలువారే జలపాతం అందాలను చూసేందుకు అక్కడికి చేరుకునేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. అయితే మూడేళ్ల క్రితం జలపాతం వద్దకు వచ్చిన మంత్రి ఈటల రాజేందర్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానంటూ ఇచ్చిన హామీ అటకెక్కింది. వానలు కురిసినపుడు ఈ మట్టిరోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలు సాగించేందుకు పర్యాటకులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. 15 మంది ప్రాణాలు పోయాయ్.. స్నేహితులతో కలిసి జలపాతం అందాలను చూసేందుకు వచ్చిన యువత సరదాగా గడుపుతూ తమ స్మార్ట్ఫోన్లలో సెల్ఫీ దిగేందుకు యత్నిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఈ సారి వర్షం కురిసిన తొలి రోజుల్లోనే జలపాతం వద్ద ఆవుల యశ్వంత్ అనే యువకుడు సెల్ఫీ దిగేందుకు యత్నిస్తూ అదుపుతప్పి నీటిలో పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా గత ఆరేళ్లలో 15మంది ప్రాణాలు పోయాయి. జలపాతం వెలుగులోకి వచ్చిన మొదట్లో కొందరు యువకులు గుట్ట పై భాగానికి వెళ్లి బాహుబలి సినిమాలో వలె నటిస్తూ ఫొటోలు తీసుకోబోయి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు. సబ్బితం జలపాతం వద్ద మృత్యువాత పడ్డ వారంతా యువకులే. రక్షణ ఏర్పాట్లేవి..! గట్టుసింగారం జలపాతం జాలువారే పై భాగానికి వెళ్లి అక్కడనుంచి దూకినట్టు నటించబోయి అదుపుతప్పి కిందపడి మరణించిన సందర్భంలో రక్షణ ఏర్పాట్లు చేస్తామంటూ అటవీ శాఖ అధికారులు ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. రక్షణ చర్యలు తీసుకోని కారణంగానే సరదాకోసం వచ్చిన యువకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయనే వాదనలున్నాయి. జలపాతం ఉన్న ప్రాంతం అటవీశాఖ పరిధిలోనే ఉన్నా..జలపాతం వద్ద నీరు నిల్వ ఉండే ప్రాంతంలో ఉన్న ఇసుక నిల్వలను కొందరు అక్రమార్కులు తరలించుకుపోవడంతో ఆ ప్రాంతంలో లోతు ఎక్కువై ప్రాణాలు పోయే పరిస్థితులు నెలకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి జలపాతం ఉన్న ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పులకింతల అరకు
అరకులోయ: మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా పచ్చందాల కనువిందే. జలపాతాల గలగలలు.. కొండ కోనల్లో సాగే ప్రయాణాలు.. పలకరించే కాఫీతోటలు.. ఆకట్టుకునే గిరిజనుల సంప్రదాయాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో అందాల సమాహారం. అందుకే అరకులోయ ఆంధ్రాఊటీగా ఖ్యాతిగాంచింది. ప్రపంచ స్థాయి పర్యాటకుల మది దోచుకుంది. ఇంతటి పేరుగాంచిన ‘లోయ’ భారీ ఉత్సవానికి ముస్తాబైంది. రెండురోజుల పాటు జరిగే ‘అరకు ఉత్సవం’ నేడు ప్రారంభం కానుంది. ఈ ఉత్సవానికి రూ. కోటి రూపాయల ఖర్చుతో టూరిజం శాఖ భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా ఊటీ అందాలపై ప్రత్యేక కథనం. జలపాతాల హోరు.. పర్యాటకుల హుషారు... అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో జలపాతాలు పర్యాటకుల్ని ఆహా్వనిస్తున్నాయి. ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న నీటి ధారలు సందర్శకులకు వింత అనుభూతిని మిగులుస్తున్నాయి. కటికి జలపాతం: ►బొర్రాగుహలకు సమీపంలో ఉంది ఈ జలపాతం. ►దీని ఎత్తు 300 మీటర్లు. ►రైలు ప్రయాణంలో కూడా ఈ జలపాతం అందాల్ని వీక్షించొచ్చు. ►కటికి జలపాతం వద్ద తరచూ ట్రెక్కింగ్ క్యాంప్‌లు జరుగుతుంటాయి. తాడిగుడ: అనంతగిరి మండల కేంద్రానికి సమీపంలో ఉంది తాడిగుడ జలపాతం. అమ్మ: అనంతగిరి–హుకుంపేట మండలాల సరిహద్దులోని వేలమామిడి సమీపంలో ఎత్తైన అమ్మ జలపాతం ఉంది. మారుమూల ప్రాంతంలో ఉండడం.. రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండడంతో పర్యాటకులు అంత దూరం వెళ్లలేకపోతున్నారు. ►అరకులోయ మండలంలోని రణజిల్లెడ, డుంబ్రిగుడ మండలంలోని కొల్లాపుట్టు, చాపరాయి జలపాతాలు కూడా పర్యాటకుల్ని రా..రమ్మంటున్నాయి. రైలు ప్రయాణం ఓ అద్భుతం... అరకులోయకు రైలు ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. బోలెడు జ్ఞాపకాల్ని మిగులుస్తుంది. విశాఖలో ఉదయం 7 గంటలకు విశాఖ–కిరండోల్ పాసింజర్ రైలు బయల్దేరుతుంది. ఇందులో ప్రయాణమంటే పర్యాటకులకు అమితమైన ఇష్టం. కొండల నడుమ సాగే ఆహ్లాదకర ప్రయాణంతో పర్యాటకులు పరవశిస్తారు. విజయనగరం జిల్లా ఎస్.కోట సమీపంలోని బొడ్డవర ప్రాంతం నుంచి అరకులోయ సమీపంలోని కరకవలస వరకు రైలు ప్రయాణం ఎత్తైన కొండల నడుమ సాగుతుంది. కొండలను చీల్చి గుహలలో నిర్మించిన రైలు మార్గం పర్యాటకులను మరింత ఆకట్టుకుంటుంది. చిన్నారులు, విద్యార్థులంతా టన్నెల్స్ మధ్య రైలు ప్రయాణాన్ని చూసి తెగ సంబరపడతారు. పగలు కూడా ఈ కొండల మధ్య టన్నెల్స్ దాటే సమయంలో చీకటి ఆవరిస్తుంది. ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని మిగులుస్తుంది. ప్రత్యేకతలివే... ►ఈ మార్గంలో మొత్తం 52 టన్నెల్స్ ఉన్నాయి. ►బొర్రా–చిమిడిపల్లి స్టేషన్ల మధ్య 900 మీటర్ల పొడవైన భారీ టన్నెల్ ఉంది. ►ఈ టన్నెల్‌ను రైలు దాటేందుకు 20 నిమిషాలు పడుతుంది. ►మిగతా టన్నెల్స్ 200 మీటర్ల లోపునే ఉంటాయి. ►ఘాట్ మార్గం కావడంతో రైలు ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది. ►బొర్రా గుహలు మీదుగానే రైలు పట్టాలు ఉండడం మరో ప్రత్యేకత. ►రైలు ప్రయాణమంతా దట్టమైన అటవీ ప్రాంతం గుండా సాగుతుంది. ►ఎత్తైన కొండలు, ప్రకృతి అందాలు, అక్కడక్కడా దర్శనమిచ్చే జలపాతాలను చూస్తూ పర్యాటకులు మంత్ర ముగ్థులవుతారు. బాగు.. యాపిల్ సాగు... యాపిల్ సాగు అంటే అందరికీ కాశ్మీర్‌లోయ గుర్తొస్తుంది. అరకులోయ కూడా యాపిల్ సాగుకు అనుకూలంగా ఉంది. పాడేరు ఐటీడీఏ, హారీ్టకల్చర్ శాఖలు ప్రయోగాత్మకంగా అరకులోయ మండలంలోని పద్మాపురం, చినలబుడులో మూడేళ్ల క్రితం యాపిల్ సాగుకు గిరిజన రైతులను ప్రోత్సహించాయి. అరకులోయలోని చల్లని వాతావరణం యాపిల్ సాగుకు అనుకూలంగా ఉండడంతో రెండేళ్ల నుంచి ఇక్కడ సిమ్లా యాపిల్స్ విరగ్గాస్తున్నాయి. అలాగే స్టాబెర్రీ పంటకు అరకులోయ ఖ్యాతిగాంచింది. ఘాట్ రోడ్లో అందాలు భలే... విశాఖపట్నం నుంచి అరకులోయకు ఉన్న రోడ్డు మార్గంలో కూడా ప్రకృతి అందాలు పర్యాటకుల్ని పలకరిస్తాయి. కొండల నడుమ ఘాట్‌రోడ్డులో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది. ఎత్తైన గాలికొండ ప్రధాన ఆకర్షణ. అలాగే దారి మధ్యలో కాఫీతోటలు కనువిందు చేస్తాయి. ఈ తోటల్లో చల్లని వాతావరణం మధ్య ప్రయాణం ఒత్తిడిని దూరం చేస్తుంది. సంప్రదాయాలకు ప్రతీకలు... అరకులోయను సందర్శించే పర్యాటకులు, చిన్నారులకు గిరిజన మ్యూజియ, పద్మాపురం గార్డెన్లు ఘన స్వాగతం పలుకుతాయి. గిరిజన మ్యూజియంలో గిరిజన ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించే కళాకృతులు ఉన్నాయి. ఇక్కడ బోటు షికారు కూడా ఏర్పాటు చేశారు. పద్మాపురం బొటానికల్ గార్డెన్లో పూలు, పండ్ల జాతుల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ టాయ్‌ట్రైన్‌లో ప్రయాణం చిన్నారులను ఆకట్టుకుంటుంది. గుహల అందాల చూడతరమా.. అనంతగిరి మండలంలోని బొర్రాగుహలు ప్రపంచ ఖ్యాతిగాంచాయి. వీటిని సందర్శించేందుకు విదేశీ పర్యాటకులు అధికంగా వస్తుంటారు. సహజసిద్ధంగా ఏర్పడిన బొర్రాగుహలు అరకులోయ అందాలకు ప్రధాన ఆకర్షణ. గుహలలో విభిన్న ఆకృతుల్లో శిలలు పర్యాటకుల్ని ఆలోచింపజేస్తాయి. పర్యాటక శాఖ ఈ గుహల్లో విద్యుత్ వెలుగుల్ని కూడా ఏర్పాటు చేసింది. పూర్వం బొర్రాగుహల అందాలను కాగడాల వెలుతురులో వీక్షించేవారు. ఉత్సవానికి వేళాయె... గత పాలకుల నిర్లక్ష్యంతో మూడేళ్లుగా ఉత్సవాలకు నోచుకోని పర్యాటక ప్రాంతం అరకులోయలో ఈ ఏడాది అరకు ఉత్సవ్–2020ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది. ►శని, ఆదివారాల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ►ఈ సంబరానికి అరకులోయలోని ఎన్టీఆర్ మైదానం వేదిక కానుంది. ►పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తోంది. ►ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పాడేరు ఐటీడీఏ పీవో బాలాజీ, సబ్‌కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ►శుక్రవారం సాయంత్రం ఎనీ్టఆర్ మైదానాన్ని పాడేరు సబ్‌కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర టూరిజం అధికారులు సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. అందరికీ ఆహ్వానాలు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తో పాటు, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ అరకు ఉత్సవాలకు తరలిరావాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ ఆహ్వానాలు పంపారు. -
మదిదోచే అందాల జలపాతాలు.. ఒక్కసారైనా..
కావేరి, కుమారధార, ఆర్కావతి ఇలా ఎన్నో నదులు ఆలంబనగా పుట్టిన జలపాతాల సోయగాలు పర్యాటకులను మైమరిపిస్తాయి. జలధారలు కురిపిస్తూ శ్వేతవర్ణంలో పొంగిపొర్లే జలాల అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఉరుకుల పరుగుల జీవితంలో నూతన ఆనందాన్ని అందుకోవడానికి జలపాతాల వీక్షణం ఉపకరిస్తుంది. సాక్షి, బెంగళూరు: రాచనగరి చుట్టుపక్కల ఉన్న జలపాతాలు పర్యాటక రంగానికి ఊపిరి పోస్తున్నాయి. ఆహ్లాదకర వాతావరణం మధ్య సెలవురోజుల్లో జలపాతాలను వీక్షించడం మనసంతా కొత్త ఉత్సాహం నింపుతోంది. ఇందుకోసమే బెంగళూరుతో సహా రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. మైసూరు చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన ఐదు జలపాతాలు చెలవర, చుంచనకట్టె, మల్లాలి, శివసముద్ర, చుంచి వేసవి మినహా మిగతా కాలమంతా ప్రవహిస్తూ కనువిందు చేస్తుంటాయి. చెలవర జలపాతం మైసూరు నుంచి 125 కిలోమీటర్లు, విరాజ్‌పేట నుంచి 20 కిలోమీటర్ల దూరంలో చెయ్యందనే గ్రామానికి సమీపంలో ఉన్న చెలవర జలపాతం ఉంది. సుందర జలపాతాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. స్థానిక పర్యాటకులకు మాత్రమే ప్రాచుర్యం పొందింది. జలపాతం బేస్ వద్ద ఏర్పడిన చెరువు వర్షాకాలంలో అంచు వరకు నిండిపోతుంది. ఇందులో దిగడం ప్రమాదంతో కూడుకున్నది. దూరం నుంచి జలపాతాన్ని వీక్షించడం ఉత్తమం. కావేరి నదిపై చుంచనకట్టే మైసూరు నుంచి 56 కిలోమీటర్ల దూరంలో కావేరి నదిపై చుంచనకట్టే జలపాతం ప్రసిద్ధి చెందింది. తప్పక చూడాల్సిన ప్రదేశం. సహజ సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక ప్రకాశం కారణంగా రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తారు. సమీపంలోనే కోదండ రామాలయం ఉంది. చుంచనకట్టే జలపాతం నీటిలోప్రశాంతంగా స్నానం చేసి రాముని ఆలయాన్ని దర్శించుకోవచ్చు. శివన సముద్ర జలపాతం మైసూరు నుంచి 78 కిలోమీటర్ల దూరంలో కావేరి నదిపై అందమైన శివనసముద్ర జలపాతం ఉంది. ఇది రెండు జలపాతాలుగా విడిపోతుంది. అవి పశ్చిమాన గగనాచుక్కి, తూర్పున భరచుక్కి జలపాతం. జలపాతంతో పాటు చూడదగ్గ ప్రకృతి దృశ్యాల వల్ల ఏడాది పొడవునా పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. ఆర్కావతి నదిపై చుంచి మైసూరు నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఆర్కావతి నదిపై ఉంది. రాముడు తన ప్రవాసంలో బస చేసిన మరో ప్రదేశంగా భావిస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో వారంతపు సెలవుల్లో విహరించేందుకు సరైన ప్రదేశం. దట్టమైన అడవులు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మళ్లళ్లి ఫాల్స్ మైసూరు నుంచి 135 కిలోమీటర్ల దూరంలో మల్లాలి జలపాతం కుమారధార నదిలో కలిసిపోయి ఉంటుంది. రాతి భూ భాగాలు, పశ్చిమ కనుమల పచ్చని వృక్షాలు కలిసి మనోహరంగా దర్శనమిస్తాయి. యువత ఎక్కువగా వస్తుంటారు. ఈ ప్రాంతంలోని ఎత్తైన జలపాతాల్లో ఒకటిగా ఉంది. అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉంటుంది. చుంచి ఫాల్స్ చుంచన కట్టె ఫాల్స్ -
విహార యాత్రలో విషాదం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: విహార యాత్ర విషాదాన్ని నింపింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఆరుగురు విద్యార్థులు కడప నగర శివారులోని పాలకొండలకు విహారయాత్రకు వెళ్లారు. వారిలో ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి గల్లంతయ్యారు. విహారయాత్రకు వచ్చిన వారంతా మూగ, చెవిటి విద్యార్థులు కాగా, బికాం చదువుతున్నారు. గల్లంతయిన విద్యార్థులను పొరుమామిళ్లకు చెందిన రసూల్, నెల్లూరుకు చెందిన అనిల్‌గా గుర్తించారు. విద్యార్థుల కోసం రిమ్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
భారీ వర్షాలకు కొండ కోనల్లో నుంచి నీరు
-
బాహుబలి.. జలధారి..
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు రాష్ట్రాలు ఈ సీజన్లో తడిసిముద్దయి జలసిరితో కళకళలాడుతున్నాయి. దగ్గర ప్రాంతాలు, వారాంతాల్లో వెళ్లి వచ్చే వీలుండడంతో సిటిజనులకు వాటర్ ఫాల్స్ క్రేజీగా మారాయి. దీంతో మారుమూల అడవుల్లో దాక్కున్న జలపాతాలూ వెలుగు చూస్తున్నాయి. వానలు ముమ్మరంగా కురిసే టైమ్‌లో మాత్రమే కళకళలాడే వీటిని సందర్శించిన వారు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం.. బాహుబలి.. జలధారి.. నగరం నుంచి దాదాపు 270కి.మీ దూరంలో ఉంది బొగత జలపాతం. ములుగు జిల్లా ఏటూరు నాగారం, మీదుగా 10 కి.మీ ప్రయాణం చేస్తే బొగత చేరుకోవచ్చు. అత్యంత వెడల్పుగా ఉండే ఈ జలపాతాన్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అని పిలుస్తున్నారు. ఇక్కడ గత రెండేళ్ల నుంచి సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. ఫు#డ్ కి చిన్న చిన్న హోటల్స్,రెస్టారెంట్స్ ఉన్నాయి. కృత్రిమంగా కట్టిన పూల్‌లో వాటర్ ఫ్లో ఎక్కువ లేనప్పుడు హాయిగా ఆడుకోవచ్చు. జలధారలను వాచ్ టవర్ నుంచి చూడడం చక్కని అనుభవం. ముత్యమంటి నీటి ధార... ఏటూరు నాగారం దాటాక రైట్ తీసుకుంటే వెంకటాపురం మండలంలో 7 కి.మీ చిక్కని అడవిలో ప్రయాణిస్తే ముత్యాలధార జలపాతం ఉంటుంది. ద్విచక్రవాహనాలైతే 4 కి.మీ వరకూ వెళ్లొచ్చు. ట్రాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కొంత దూరం పూర్తిగా నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం విచిత్రమైన అనుభూతినిస్తుంది. దేశంలోనే అత్యంత ఎత్తయిన జలపాతాల్లో ఒకటి ఇది. పైన ఉన్న రాక్ స్ట్రక్చర్ వల్ల చినుకులు ముత్యాల్లా మెరుస్తుంటాయి. ఎక్కువగా ట్రెక్కర్స్ వెళ్లే దీనిని సాహసయాత్రనే చెప్పాలి. నీళ్లలో నడక గంట సేపు ఉంటుంది. బాగా వాన పడిన సమయమైతే మోకాలి లోతు నీళ్లలో నడవాలి. స్థానికంగా దొరికే ట్రాక్టర్స్ ట్రిప్‌కి రూ..3 వేల దాకా వసూలు చేస్తారు. ఎలాంటి వసతి సౌకర్యాలు ఉండవు, ఫుడ్, దొరకదు. పొచ్చర..జరజర నిజామాబాద్ వెళ్లే దారిలో పొచ్చర వాటర్ ఫాల్స్ ఉంది. మెయిన్ వాటర్ ఫాల్స్ వెనుక 100 మీటర్ల ఎత్తులో చెక్‌డ్యామ్ ఉంటుంది. అదీ పెద్దగా లోతు ఉండదు. పార్కింగ్ సౌకర్యం, సెక్యూరిటీ, ఫుడ్‌స్టాల్స్ వంటివి ఉంటాయి. వెళ్లి రావడానికి రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కరోజులో వెళ్లి వచ్చేయవచ్చు. ఆడు‘కుంటా’లలా నగరం నుంచి 260 కి.మీ. ఆదిలాబాద్ నుంచి 70 కి.మీ ప్రయాణం చేస్తే వస్తుంది. ఇది 45 మీటర్లతో ఎత్తయిన జలపాతాల్లో ఒకటిగా పేరొందింది. పలు కుంటలు/సరస్సులు కలిపినది కాబట్టి దీన్ని కుంటాల అంటారు. నగరం నుంచి వాటర్ ఫాల్స్ ఎంట్రీ దాకా చక్కని రవాణా సౌకర్యం ఉండడంతో దీనికి వెళ్లి రావడం చాలా సులభమైన విషయం. జలపాతం అడుగుదాకా వెళ్లడానికి 300కిపైగా మెట్లు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలూ ఉన్నాయి. సమీప ప్రాంతంలోనే మరికొన్ని గుడులు, జలపాతాలు కూడా ఉన్నాయి. అవీ చూసిరావచ్చు. హిల్స్ ఎక్కి దిగితే ఫాల్స్... పోచర నుంచి 10, 15 కి.మీ దాటాక హైవే నుంచి 10కి.మీలలో ఉంటుంది గాయత్రి వాటర్ ఫాల్స్ . ఇదొక కఠినమైన ప్రయాణం. మ«ధ్యలో తగిలే గ్రామంలో ఉన్నవారు మనల్ని గాయత్రి వాటర్ ఫాల్స్‌కి తీసుకువెళ్లి తీసుకురావడానికి కొంత మొత్తం తీసుకుని సర్వీస్ ఇస్తారు. అత్యంత ఎత్తయిన వాటర్ ఫాల్స్‌లో ఒకటిగా పేరున్న ఈ జలపాతం చూడడానికి 3 కొండలు దిగి ఎక్కాల్సి ఉంటుంది. అయితే ఈ ఫాల్స్‌లోకి దిగడానికి మాత్రం కుదరదు. నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉంటుంది. మల్లెలంత హాయిగా... శ్రీశైలం హైవేలో వెళుతుంటే మున్ననూరు చెక్‌పోస్ట్ నుంచి ఎడమవైపు 10 కి.మీ వెళ్లాక మల్లెల తీర్థం ఉంటుంది. హాయిగా ఫ్యామిలీతో సులభంగా వెళ్లి రాగల వాటర్ ఫాల్స్ ఇది. జలపాతం నీళ్లలో శుభ్రంగా ఆడుకోవచ్చు. ఇక్కడ సౌకర్యాలు ఓ మోస్తరుగా ఉంటాయి. నగరం నుంచి ఒక్కరోజులో వెళ్లి రావచ్చు. శ్రీశైలం వెళ్లేటప్పుడు కూడా మధ్యలో 2/3 గంటల్లోచూసేయవచ్చు. -
ఎత్తైన కొండలు.. ముచ్చటైన పచ్చిక బయళ్లు
-
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
వాషింగ్టన్: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు నీట మునిగి చనిపోయిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతులను కోయలమూడి అజయ్‌కుమార్ (23), వోలేటి తేజ కౌశిక్ (22)గా గుర్తించినట్లు మీడియా కథనం పేర్కొంది. అర్లింగ్టన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న అజయ్, తేజ యూఎస్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఓక్లహోమాకు వెళ్లారు. మంగళవారం అక్కడి టర్నర్‌ఫాల్స్ అనే జలపాతంలో వారిలో ఓ వ్యక్తి ఈతకు వెళ్లి మునిగిపోగా, అతడ్ని రక్షించడానికి దూకిన మరో వ్యక్తి కూడా నీళ్లలో మునిగిపోయాడు. -
తెలంగాణ ‘నయాగరా’
సాక్షి, ఆసిఫాబాద్: చుట్టూ అడవి.. కొండల నుంచి జాలువారే జలపాతాలు.. పాలనురుగును తలపించే నీళ్లు.. దిగువకు దూకుతున్న జల సవ్వడులు.. రెప్పకూడా వేయకుండా తనివితీరా చూడాలనిపించే ప్రకృతి సోయగాలు.. ఫొటో చూస్తుంటేనే అదిరిపోతోంది.. నిజంగా అక్కడకు వెళ్లి చూస్తే తన్మయత్వంతో మైమరచిపోవడం ఖాయం అనిపిస్తోంది కదూ! మరి ఇంతటి అందమైన.. మినీ నయాగరాలా కనిపిస్తున్న ఈ జలపాతం ఎక్కడుందో తెలుసా? అచ్చంగా మన గడ్డ మీదే..! చదవండి: జలపాతాల కనువిందు మనసు దోచే జలపాతాలు, హృదయం పులకరించే ప్రకృతి సోయగాలు చూడాలంటే ఇకపై మనం ఎక్కడికో వెళ్లక్కర్లేదు. దర్జాగా మన గడ్డపైనే వాటిని చూస్తూ తన్మయత్వంతో మైమరచిపోవచ్చు. మదిని కట్టిపడేస్తూ కనువిందు చేస్తున్న ఈ అందాలు.. మన కుమురంభీం జిల్లాలోనే ఉన్నాయి. లింగాపూర్ మండల సమీపంలో ఈ జలపాతాలు హోయలొలికిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. సప్తగుండాలుగా పిలిచే ఏడు జలపాతాలు మదిని పులకరింపజేస్తున్నాయి. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న రామ గుండం, సీత గుండం, లక్ష్మణ గుండం, భీమ గుండం, సవితి గుండం, చిరుతల గుండం, సప్తగుండం అనే ఏడు గుండాలను కలిపి మిట్టె జలపాతం అని పిలుస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరద చేరడంతో ఎత్తైన కొండల నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను కట్టిపడేస్తోంది. కుమురంభీం జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని గతంలో పనిచేసిన కలెక్టర్ చంపాలాల్ సందర్శించడంతో మరింత వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విరజిల్లాల్సిన ఈ ప్రదేశం.. సరైన రోడ్డు మార్గం లేకపోవడంవల్ల ప్రాచుర్యం సంతరించుకోలేకపోతోంది. ఇవే కాకుండా ఈ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో అనేక జలపాతాలు ఉన్నా ఇన్నాళ్లూ అవి బాహ్య ప్రపంచానికి పరిచయం కాలేదు. -
సెవెన్.. హెవెన్
మనసు దోచే జలపాతాలు, హృదయం పులకరించే ప్రకృతి సోయగాలు చూడాలంటే ఇకపై మనం ఎక్కడికో వెళ్లక్కర్లేదు. దర్జాగా మన గడ్డపైనే వాటిని చూస్తూ తన్మయత్వంతో మైమరచిపోవచ్చు. మదిని కట్టిపడేస్తూ కనువిందు చేస్తున్న ఈ అందాలు.. మన కుమురంభీం జిల్లాలోనే ఉన్నాయి. లింగాపూర్ మండల సమీపంలో ఈ జలపాతాలు హయలొలికిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. సప్తగుండాలుగా పిలిచే ఏడు జలపాతాలు మదిని పులకరింపజేస్తున్నాయి. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న రామ గుండం, సీత గుండం, లక్ష్మణ గుండం, భీమ గుండం, సవితి గుండం, చిరుతల గుండం, సప్తగుండం అనే ఏడు గుండాలను కలిపి మిట్టె జలపాతం అని పిలుస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరద చేరడంతో ఎత్తైన కొండల నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను కట్టిపడేస్తోంది. కుమురంభీం జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని గతంలో పనిచేసిన కలెక్టర్ చంపాలాల్ సందర్శించడంతో మరింత వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విరజిల్లాల్సిన ఈ ప్రదేశం.. సరైన రోడ్డు మార్గం లేకపోవడంవల్ల ప్రాచుర్యం సంతరించుకోలేకపోతోంది. ఇవే కాకుండా ఈ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో అనేక జలపాతాలు ఉన్నా ఇన్నాళ్లూ అవి బాహ్య ప్రపంచానికి పరిచయం కాలేదు. – ఆకుల రాజు, సాక్షి, ఆసిఫాబాద్ -
పర్యాటకుల్ని మింగేస్తున్న సరియా జలపాతం..
విశాఖ ఏజెన్సీలోని జలపాతాలు మృత్యులోగిళ్లుగా మారుతున్నాయి.ఎంతో మందిని మింగేస్తున్నా రక్షణచర్యలు కానరావడం లేదు. పర్యాటకుల్లోఅవగాహన కరువవడం కూడా ఈ దుస్థితికి కారణం. తాజాగా జిల్లాలోని ‘సరియా జలపాతం’లో శనివారం ఓ యువకుడు జారిపడి మరణించాడు. 2015లోఇక్కడ మొదలైన మరణమృదంగం ఏ యేటికాయేడు పెరుగుతోంది. – అనంతగిరి (అరకులోయ) ప్రకృతి ఒడిలో ఆనందంగా గడిపిరావాలని.. ఒత్తిడికి దూరమవ్వాలనే కోరికతో విహారయాత్రలకు వచ్చే పర్యాటకులు చిన్నచిన్న పొరపాట్ల కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిన జీనబాడు పంచాయతీ సరియా జలపాతంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. 2015లో సరియా జలపాతం బాహ్య ప్రపంచానికి పరిచయం అయింది. కొద్దికాలంలోనే పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందింది. గడిచిన నాలుగేళ్లలో 10మంది వరకు ఇక్కడ మృత్యువాతపడడం ఆందోళన కలిగిస్తోంది. ప్రకృతి ఒడిలో.. సహజ సిద్ధమైన ప్రకృతి అందాల ఒడిలో ఈ జలపాతం ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే దేవరాపల్లి నుంచి పెదగంగవరం మీదుగా ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అడవిలో ప్రయాణం తరువాత సరియా జలపాతం వస్తుంది. చూసేందుకు జలపాతం అందంగా కనిపించినా ఈతకొట్టేందుకు అనువైన ప్రాంతం కాదని స్థానికులు, గైడ్లు చెబుతున్నారు. ఈత సరదాతోనే అధికశాతం మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నీటిని చూసి ఆనందంతో ఈతకు దిగడం, ఆ హుషారులో ప్రమాదకర ప్రదేశాల్ని పట్టించుకోకపోవడంతో ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు. కొందరైతే మద్యం సేవించి పట్టుతప్పి జలపాతంలోకి జారిపోతున్నారు. హెచ్చరికల్ని పట్టించుకోరు... జీనబాడు పంచాయతీ అ«ధికారులు, స్థానిక నాయకుల సహకారంతో జలపాతం వద్ద హెచ్చరిక బోర్డుల్ని ఏర్పాటు చేశారు. జలపాతం సమీపంలోని రాళ్లపై కూడా రాయించారు. కొందరు పర్యాటకులు, విద్యార్థులు వీటిని ఖాతరచేయకుండా మొండిగా ముందుకు వెళ్లి ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. తరచూ ప్రమాద ఘటనలతో ఈ జలపాతం వార్తాల్లోకి ఎక్కుతుంది. సెల్ఫీల జోరు.. తీస్తోంది ఉసురు.. ఏజెన్సీలో జలపాతాల్ని సందర్శిస్తున్న పర్యాటకుల్లో ఉత్తరాంధ్రవాసులే అధికంగా ఉన్నారు. వీరిలో యువత ఎక్కువ. వీరంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు జోరుగా ప్రవహించే నీటిలో సెల్ఫీలు దిగుతున్నారు. పరిసరాల్ని పట్టించుకోకుండా ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటున్నారు. జలపాత వీక్షణం.. జరభద్రం.. ♦ మీరు జలపాతాల్ని సందర్శించేందుకు వెళుతున్నట్లయితేముందుగా ఆ ప్రాంతంపై అవగాహన పెంచుకోండి. ♦ స్థానిక గైడ్ల సూచనల్ని కచ్చితంగా పాటించండి. ♦ నాచు ఎక్కువగా ఉండే ప్రాంతాల విషయంలో జాగ్రత్త. ♦ లోతైన ప్రాంతాలు, ఊబిలు, ప్రమాదకర ప్రవాహాల మలుపులు, ♦ పెద్దసైజులో ఉండే రాళ్లు విషయంలో జాగ్రత్త. ♦ హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా చదవండి. సూచనల్ని పాటించండి. ♦ సెల్ఫీలు, ఫొటోల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ♦ ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి జలపాతాల వద్దకు వెళ్లకండి. ♦ ఈతకొట్టడం, ఎత్తైన ప్రదేశాల నుంచి నీటిలోకి దూకడం వంటివి చేయొద్దు. రక్షణ చర్యలు తీసుకున్నాం... జలపాతం వద్ద రక్షణ చర్యల్లో భాగంగా గతంలోనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థానిక గిరిజనులు గైడ్లుగా వ్యవహరించి ఈ ప్రాంతం మీద అవగాహన కల్పిస్తుంటారు. ప్రమాదకరమైన ప్రదేశాలను ముందుగానే వివరిస్తున్నారు. అయినా సరే కొంతమంది పర్యాటకులు మొండిగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.– సుధాకర్, అనంతగిరి ఎస్ఐ మృత్యుఘటనలివే.. 2015 కోటరువురట్ల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పంచార్ల నానీ (19), విశాఖ జిల్లా వాంబేకాలనీకి చెందిన ఆకాష్ హేమ సుందర్(22)లు ఇక్కడ రాయిమీద నుంచి జారిపడి మృత్యువాతపడ్డారు 2016 ♦ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఒడ్డుపేట గ్రామానికి చెందిన ఎం.సంభుల్(50) అనే విశ్రాంత ఉద్యోగి కాలుజారి మరణించారు ♦ విశాఖ జిల్లా దొండపర్తికి చెందిన నందిక మురళి (28) ఈతకొట్టేందుకు దిగి జలపాతంలో మునిగి చనిపోయాడు ♦ విశాఖ జిల్లా సబ్బవరం మండలం గొల్లెపల్లి గ్రామానికి చెందిన లోవరాజు (20) ఈతకు దిగి మరణించాడు 2017 ♦ విశాఖ జిల్లా మల్కాపురం ప్రాంతానికి చెందిన ఉల్లంగి వెంకటరావు (52) జలపాతంలోకి దిగి మృతి చెందారు ♦ అనకాపల్లి మండలం గవరపాలెంకు చెందిన వై. నాగశివకుమార్ (20) ఈతకు దిగితే మృత్యువు కాటేసింది 2018 ♦ విశాఖ ప్రాంతానికి చెందిన పార్థసారథి(25) జలపాతం వద్ద కాలు జారి పడి మృతి చెందాడు. ఇవి పోలీస్ లెక్కల్లో ఉన్నవి మాత్రమే. వెలుగులోకి రాని మరణాలు చాలా ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. -
భీమునిపాదం జలపాతంలో పర్యాటకుల సందడి
గూడూరు(మహబూబాబాద్): మండలంలోని సీతానగరం శివారు కొమ్ములవంచ సమీపంలోని భీమునిపాదం జలపాతంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భీమునిపాదం జలపాతం జాలువారుతోంది. వర్షాకాలం మొదలు వేసవికాలం చివరి వరకు సెలవు దినాల్లో జలపాతాన్ని వీక్షించడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. సరదాగా స్నానాలు చేస్తు, ప్రకృతి రమణీయతను చూసి కనువిందు పొందుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తిస్తామని పర్యాటక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు చెపుతూ వస్తున్నారు. జలపాతం వద్ద మౌళిక వసతులు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. -
వరదలో కొట్టుకు పోయిన దర్శకుడు..
యశవంతపుర: కన్నడ చలనచిత్ర రంగం వర్ధమాన దర్శకుడిని కోల్పోయింది. దక్షిణ కన్నడ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చలనచిత్ర రంగానికి చెందిన వర్ధమాన దర్శకుడు సంతోశ్‌శెట్టి దుర్మరణం చెందారు. 2013లో విడుదలైన కన్నడ సినిమా ‘కనసు’ చిత్ర దర్శకుడైన సంతోశ్‌శెట్టి మరో ఐదుగురితో కలిసి బుధవారం ఉదయం బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్ ఫాల్స్‌లో షూటింగ్‌కు వెళ్లారు. షూటింగ్లో భాగంగా సంతోశ్‌శెట్టి తన కాలికి బరువైన వస్తువు కట్టుకున్నాడు. ఒక్కసారిగా నీటి ఉధృతి పెరగడంతో అదుపు తప్పి నీటిలోపడి కొట్టుకుపోయాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాలించగా సంతోశ్‌శెట్టి విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని వెలికి తీసి బెళ్తంగడికి తరలించారు. తర్వాత కటిల్‌లోని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పర్యాటకులతో ‘కొత్తపల్లి’ కిటకిట
జి.మాడుగుల: ప్రకృతి అందాలకు పుట్టినిల్లు విశాఖ మన్యం అంటే అతిశయోక్తికాదు. ఎత్తయిన పర్వతాలు, కొండలు, పెద్దపెద్దలోయలు, గలగలా పారే సెలయేళ్లు, ఎటుచూసినా పచ్చని తోటలతో ఆహ్లాదపరిచే వాతావరణం ఈ ప్రాంత సొంతం. ఇందులో విశాఖ మన్యంలో జి.మాడుగుల–చింతపల్లి రోడ్డులో కొత్తపల్లి జలపాతం అందరినీ ఆకర్షిస్తోంది. ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా నుంచి తరలి వచ్చిన పర్యాటకులు సందడి చేశారు. జలకాలాదుతూ ఆనందంగా గడిపారు. -
జలకళ తప్పింది
మోతుగూడెం (రంపచోడవరం):ఇంకా పూర్తి స్థాయిలో వేసవి రాకముందే సీలేరు జలాశయాలు కళ తప్పాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నీటిమట్టాలు పడిపోయాయి. గత 40 ఏళ్లలో ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్ధితి ఏర్పడలేదు. ముఖ్యంగా సీలేరు జలవిద్యుత్ కేంద్రాలకు సంబంధించి గుంటవాడ, డొంకరాయి, ఫోర్‌బే రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఏటా మార్చి నాటికి ఈ మూడు రిజర్వాయర్లలో 10 నుంచి 15 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. కానీ ఈసారి ఇప్పటికే నీటిమట్టాలు దారుణంగా పడిపోయి, మట్టిదిబ్బలు పైకి కనిపిస్తున్నాయి. మరో పది రోజుల్లో ఈ రిజర్వాయర్లలో ఉన్న మూడు టీఎంసీల నీటిని గోదావరి డెల్టాకు తరలిస్తే పరిసర గ్రామాలకు తాగునీటి సమస్య ఎదురు కానుంది. బలిమెల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తే తప్ప నీటి ఎద్దడి నుంచి గట్టెక్కె పరిస్థితి కనిపించడం లేదు. గోదావరి డెల్టాకు మరో 10 టీఎంసీల వరకూ నీటి అవసరం ఉంది. బలిమెల రిజర్వాయర్ నుంచి 10 టీఎంసీల నీటి విడుదలకు కోరినా ఒడిశా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే బలిమెల రిజర్వాయర్ ఆంధ్రా టన్నెల్ నుంచి అధిక మొత్తంలో నీరు దిగువన ఉన్న సీలేరు కాంప్లెక్స్ జలాశయాలకు వచ్చింది. దీంతో అదనంగా నీరు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెల్టాలో పంటలను కాపాడేందుకు ప్రభుత్వం పరంగా చర్చలు జరిగితేనే కానీ బలిమెల నుంచి నీటి విడుదల సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. -
జాలువారుతున్న జలపాతం
బట్రేపల్లి జలపాతం బాహుబలి సెట్టింగ్‌ను తలపిస్తోంది. కొండ పైనుంచి బండల మీదుగా నీరు కిందికి జాలవారుతూ సందర్శకులను కనువిందు చేస్తోంది. కొండపై నుంచి నీళ్లొస్తున్నాయని తెలుసుకున్న ప్రజలు జలకాలాడుతూ సంబర పడిపోతున్నారు. యువత సాహొరే.. బాహుబలి అంటూ కేరింతలు కొడుతోంది. ఆదివారం సెలవు కావడంతో జలపాతాన్ని చూసేందుకు మరింత మంది వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరో నాలుగురోజుల పాటు అడపాదడపా వర్షాలు కురిస్తే దసరా సెలవుల్లో బట్రేపల్లి జలపాతానికి సందర్శకుల తాకిడి మరింత పెరిగవచ్చు. సెప్టెంబర్ మొదటివారంలో మొదలై మూడు, నాలుగు రోజులపాటు జాలువారిన తలుపుల మండలం బట్రేపల్లి జలపాతం శనివారం మళ్లీ మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు బట్రేపల్లి అడవుల్లో నీటిఊట ప్రారంభమైంది. అది పాయలు పాయలుగా ఇక్కడకు చేరి జలపాతమైంది. - కదిరి -
అబ్బురపరిచే జలపాతాలు
సాక్షి,వీకెండ్: జలపాతాలు జలజల పారుతున్నాయి.. పచ్చని పరిసరాలు ఆనందం, ఆహ్లాదం పంచుతున్నాయి... మరెందుకాలస్యం పదండి జలపాత్రయం... – కోన సుధాకర్‌రెడ్డి జలపాతాలకు ఆదిలాబాద్ జిల్లా పెట్టింది పేరు. మూడు ప్రముఖ జలపాతాలు కుంటాల, పొచ్చెర, కనకాయ్ ఈ జిల్లాలోనే ఉన్నాయి. అందుకే దీనికి జలపాత్రయం అనే పేరొచ్చింది. కుంటాల... తెలంగాణలోనే పెద్ద జలపాతం ఇది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడిగొండ మండలంలో కడెం నదీపై ఉందీ. హైదరాబాద్ నుంచి 250 కి.మీ దూరం. సిటీ నుంచి నిర్మల్ (210 కి.మీ) వెళ్లి, అక్కడి నుంచి నేరేడిగొండ (30) వెళ్లాలి. నేరేడిగొండ నుంచి 10కి.మీ దూరంలో ఉందీ జలపాతం. సిటీ నుంచి నిర్మల్‌కు, అక్కడి నుంచి నేరేడిగొం డకు బస్ సౌకర్యం ఉంది. నేరేడిగొండ నుంచి ప్రైవేట్ వాహనాల్లో కుంటాల చేరుకోవచ్చు. పొచ్చెర... ఇక్కడ గోదావరి గలగలలు మీకు స్వాగతం పలుకుతాయి. చిన్న చిన్న జలపాతాలు జలజలపారుతూ మిమ్మల్ని మైమరిపిస్తాయి. ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 47 కి.మీ దూరంలో ఉంది. నగరం నుంచి నిర్మల్‌కు 210 కి.మీ దూరం. బస్ సౌకర్యం ఉంది. అక్కడి నుంచి పొచ్చెర జలపాతానికి వాహనాలు ఉంటాయి. కనకాయ్... కనకాయ్ జలపాతాన్ని ట్రెక్కింగ్ చేసేవారు ఎక్కువగా ఇష్టపడతారు. ఇది సిటీ నుంచి 260 కి.మీ దూరంలో ఉంది. నిర్మల్ నుంచి 50 కి.మీ దూరంలో ఉంటుంది. నగరం నుంచి నిర్మల్‌కు బస్ సౌకర్యం ఉంది. అక్కడి నుంచి వాహనాల్లో కనకాయ్ చేరుకోవచ్చు. టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో... తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) బృందాలుగా వెళ్లే వారి కోసం ప్రత్యేక వాహనాలు సమకూరుస్తోంది. వివరాలకు 040– 6674 6370,6674 5986, 98485 40371 నంబర్లలో సంప్రదించొచ్చు. -
జలపాతంలో పడి ఇద్దరు గల్లంతు
-
జలపాతంలో పడి ఇద్దరు గల్లంతు
అనంతగిరి: విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని సరియా వాటర్‌ఫాల్స్‌లో ఇద్దరు యువకులు ఆదివారం గల్లంతయ్యారు. ఈ సంఘటన అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. గాజువాక ప్రాంతానికి చెందిన పది మంది విహారయాత్రలో భాగంగా సరియా వాటర్ ఫాల్స్‌కు వెళ్లారు. జలకాలాడేందుకు దిగగా ఇద్దరు గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జలపాతంలో వ్యక్తి గల్లంతు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కొవ్వూరు సమీపంలోని గాలిగుమ్మి జలపాతంలో ప్రమాదవ శాత్తు ఓ వ్యక్తి పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జయభేరి మారుతీ కంపెనీలో పని చేస్తున్న నవీన్(28) తోటి ఉద్యోగులతో కలసి జలపాతం దగ్గర సరదాగా గడిపేందుకు వచ్చారు. అయితే ప్రమాదవ శాత్తు నవీన్ కాలుజారి నీటి ప్రవాహంలో పడ్డాడు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ నవీన్ ఆచూకీ లభించలేదు.