దసరా అనగానే నవరాత్రులు పండుగ హడావిడితో ప్రతి ఇల్లు ఆద్యాత్మకతకు నిలయంగా మారిపోతాయి. రోజుకో అమ్మవారి అలంకారంతో దేవాలయాల్లో భక్తుల సందడితో కిటకిటలాడగా..ఇళ్లన్ని అమ్మవారి ఆరాధనతో హోరెత్తిపోతుంటాయి. అయితే చాలామందికి ఈ సమయంలో అలా కాసేపు కొత్త ప్రదేశాలకి వెళ్లి.. అక్కడ పండుగ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఆధ్యాత్మిక ఆనందాన్ని, ప్రకృతి అద్భుతాలని తిలకించేలా చేసే ఈ కుట్రాలం టూర్‌కి వెళ్లాల్సిందే!.ఇది పర్యాటకులకు జాలువారే జలపాతాల అందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించే ఈ గొప్ప పర్యాటక ప్రదేశం విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
కుట్రాలం లేదా కుట్రాళం అద్భుతమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. దీనిని తరచుగా "స్పా ఆఫ్ సౌత్ ఇండియా" అని పిలుస్తారు. ఈ ప్రాంతం జలపాతాల హోరు తోపాటు అక్కడ కొలువై ఉన్న కుట్రాల నాదర్ స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నటరాజు అవతారమైన పరమేశ్వరుడు కుర్తాల నాదర్‌గా వెలిశారని పురాణాలు చెబుతున్నాయి.
ఈ కుర్తాలంలోని శివలింగాన్ని అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్టించారని పురాణ కథనం. ఇక ఈ ఆలయాన్ని తమిళ రాజ్యాధిపతులైన చోళ, పాండ్య రాజులు అభివృద్ధి చేసినట్టు ఇక్కడి శిలాశాసనాలు చెబుతున్నాయి. అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ ఆలయం శిల్ప సంపద చూపురులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ కుట్రాల లేదా కుర్తాల నాదర్‌గా పిలవబడుతున్న పరమేశ్వరుడి తోపాటు అమ్మవారు వేణువాగ్వాదినీ దేవిగా పూజలందుకుంటోంది. ఆ అమ్మవారి తోపాటు పరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉంది. ఇక్కడ కొలువై ఉన్న పరాశక్తి అమ్మవారి పీఠం 51 శక్తి పీఠాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ ఆలయంలో శివుడు లింగాకారంలో వెలిసినప్పటికీ ప్రధాన పూజలు మాత్రం నటరాజ స్వరూపానికే నిర్వహించడం విశేషం.
కుట్రాలంలో కొలువైన జలపాతాలు..
పేరరువి జలపాతం (పేరరువి)
ఎత్తు: సుమారు 60 మీటర్లు.
కుత్రాలంలో అత్యంత ప్రసిద్ధ, అతిపెద్ద జలపాతం. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు.
చిత్తరువి జలపాతం
ఎత్తు: పేరరువితో పోలిస్తే చిన్నది.
పేరరువి జలపాతానికి దగ్గరగా ఉంది, త్వరగా స్నానం చేయడానికి అనువైనది.
ఐదు జలపాతాలు (ఐంతరువి)
విశేషం: నీరు ఐదు పాయలుగా విడిపోయి జాలువారుతుంది.
టైగర్ ఫాల్స్ (పులియరువి)
అత్యంత చిన్న జలపాతం కావడం వల్ల పిల్లలకు, పెద్దలకు సురక్షితమైనది.
పాత కుర్తాళం జలపాతం (పజయ కుర్తాళం)
ప్రధాన జలపాతం నుంచి సుమారు 8 కి.మీ.
చుట్టూ పచ్చని చెట్లతో, నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తోంది.
షెన్‌బాగా జలపాతం (శెనబగాదేవి జలపాతం)
చేరుకోవడానికి కొంచెం ట్రెక్కింగ్ అవసరం. సమీపంలోని దేవాలయం ప్రత్యేక ఆకర్షణ.
హనీ ఫాల్స్ (తేనరువి)
మూడు వైపుల నుంచి నీటి ప్రవాహంతో చూడచక్కగా ఉంటుంది.
కొత్త జలపాతం (పుత్తు అరువి)
తక్కువ రద్దీ, ప్రశాంతమైన అనుభూతిని అందిస్తోంది.
ఫ్రూట్ గార్డెన్ ఫాల్స్ (పజతోట్ట అరువి)
పండ్ల తోటలో ఉంది, జలపాతం123 కోసం ప్రత్యేకమైన సెట్టింగ్‌ను అందిస్తుంది.
ఇక ఈ జలపాతాలన్నీ చిత్తార్, మణిముత్తారు, పచైయార్ మరియు తామిరబరణి వంటి నదుల ద్వారా ప్రవహిస్తాయి. ఇవి ఏడాది పొడవునా స్థిరమైన నీటి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి.
ఎలా చేరుకోవాలంటే..
తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నగరం నుంచి కుట్రాలంకు రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. కుట్రాలం ప్రాంతానికి సమీపంలోని రైల్వే స్టేషన్ పేరు తెన్‌కాశి. ఇక్కడినుంచి కుట్రాలం ప్రాంతానికి బస్సులు, ఆటోల సౌకర్యం ఉంది. ఇటు తెన్‌కాశి, కుట్రాలం ప్రాంతాల్లోనూ పర్యాటకులకు అన్ని సదుపాయాలు అందుబాటు ధరల్లోనే లభించడం విశేషం.
(చదవండి: ఈసారి వెకేషన్‌కి పోర్‌బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!)
Comments
Please login to add a commentAdd a comment