
నిశా (ఫైల్)
ఏడాది క్రితం నాగేష్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఇద్దరూ కలిసి జోగ్ జలపాతం చూడాలని వచ్చారు. మంగళవారం జలపాతం వెనుకాల ఉన్న జంగిల్ రిసార్టు కాలువలో ఆమె జారి పడింది.
శివమొగ్గ: జోగ్ జలపాతాన్ని చూడాలని వచ్చిన దంపతులకు తీవ్ర విషాదం ఎదురైంది. భార్య నీటి కాలువలో పడి మృతి చెందింది. మృతురాలు బెంగళూరు నగరానికి చెందిన నిశా (24). ఆమెకు ఏడాది క్రితం నాగేష్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఇద్దరూ కలిసి జోగ్ జలపాతం చూడాలని వచ్చారు. మంగళవారం జలపాతం వెనుకాల ఉన్న జంగిల్ రిసార్టు కాలువలో ఆమె జారి పడింది. వెంటనే అక్కడ ఉన్న వారు బయటకు తీసి ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కార్గల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: (సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి)