
తిలకిస్తున్న సందర్శకులు
జి.మాడుగుల: ప్రకృతి అందాలకు పుట్టినిల్లు విశాఖ మన్యం అంటే అతిశయోక్తికాదు. ఎత్తయిన పర్వతాలు, కొండలు, పెద్దపెద్దలోయలు, గలగలా పారే సెలయేళ్లు, ఎటుచూసినా పచ్చని తోటలతో ఆహ్లాదపరిచే వాతావరణం ఈ ప్రాంత సొంతం. ఇందులో విశాఖ మన్యంలో జి.మాడుగుల–చింతపల్లి రోడ్డులో కొత్తపల్లి జలపాతం అందరినీ ఆకర్షిస్తోంది. ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా నుంచి తరలి వచ్చిన పర్యాటకులు సందడి చేశారు. జలకాలాదుతూ ఆనందంగా గడిపారు.