Kothapalli
-
కొత్తపల్లిలో చిరుత కలకలం
-
1 నుంచి సీఈవో క్లబ్స్ ఇండియా సదస్సు
న్యూఢిల్లీ: సీఈవో క్లబ్స్ ఇండియా తమ వార్షిక సదస్సును మార్చి 1 నుంచి 3 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనుంది. ఇందులో 150 పైచిలుకు కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గోనున్నారు. మెడ్‌ప్లస్ హెల్త్ సరీ్వసెస్ వ్యవస్థాపకుడు మధుకర్ గంగాడి, స్టార్ హాస్పిటల్స్ ఎండీ గోపీచంద్ మన్నం, నాంగియా ఆండర్సన్ ఇండియా చైర్మన్ రాకేష్ నాంగియా తదితరులు వీరిలో ఉంటారని సీఈవో క్లబ్స్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కిశోర్ కొత్తపల్లి తెలిపారు. కొత్త సవాళ్లు, అవకాశాలు, కలిసి పనిచేసేందుకు ఆస్కారమున్న అంశాలు మొదలైన వాటి గురించి చర్చించేందుకు, వివిధ రంగాల సీఈవోలు, ఎంట్రప్రెన్యూర్లు, ఆవిష్కర్తలు, లీడర్లు మొదలైన వారితో కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. 1977లో అమెరికాలో నెలకొలి్పన సీఈవో క్లబ్స్ ఇంటర్నేషనల్ కింద 2008లో హైదరాబాద్‌లో సీఈవో క్లబ్స్ ఇండియా ఏర్పడింది. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కొత్తపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కొత్తపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న శిబిరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. వెంటనే తేరుకున్న మావోయిస్టులు ఎదురుకాల్పులు జరుపుతూ సమీప అటవీప్రాంతంలోకి పారిపోయినట్టు సమాచారం. పోలీసులు మావోల క్యాంప్‌ను ధ్వంసం చేశారు. ఘటనాస్థలిలో భారీగా పేలుడు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు. ‘‘మావోల జాడ కోసం గాలింపు చేపట్టగా సమీప ప్రాంతాల్లో రక్తపు మరకలు ఎక్కువగా కనిపించాయి. ఎన్కౌంటర్ సందర్భంగా దాదాపు ఆరుగురు మావోలు తీవ్రంగా గాయపడి ఉండొచ్చు లేదా మరణించి ఉండొచ్చు ఉండొచ్చు’’ అని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. -
Photo Feature: మన్యం అందం.. ద్విగుణీకృతం
కవుల వర్ణనలో కనిపించే అందాలెన్నో మన్యంలో కనువిందు చేస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జలపాతాలు పొంగిపొర్లుతూ.. కొత్త సోయగాలు సంతరించుకుంటున్నాయి. ఆకాశం నుంచి నేలకు తాకుతున్న మబ్బులతో కొత్తందాలు ఆవిష్కృతమవుతున్నాయి. ప్రకృతి పచ్చని తివాచీ పరిచిందా అన్నట్లు అబ్బురపరిచే పొలాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సీలేరు జలాశయం వ్యూ పాయింట్, గుంటవాడ డ్యాం, సీలేరు సమీపంలోని తురాయి జలపాతం, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, గుర్రాయి, ఎగ కంఠవరంలోని అక్కాచెల్లెల జలపాతాలు, కుంబిడిసింగి మార్గంలో జలపాతం అందాలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తున్నాయి. అరమ, సొవ్వ, సాగర, కొర్రా తదితర ప్రాంతాలు పచ్చదనంతో ముచ్చటగొల్పుతున్నాయి. కొండ ప్రాంత అందాలకు ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు. – సీలేరు, జి.మాడుగుల, డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా) -
రెండు వర్గాల ఘర్షణ : పిడిగుద్దుల వర్షం
-
రెండు వర్గాల ఘర్షణ : పిడిగుద్దుల వర్షం
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాల్లోని ఎన్ కొత్తపల్లి గ్రామంలో గురువారం ఉదయం జరిగిన ఒక సామాజిక వర్గ సమావేశంలో చిన్నపాటి మాటలు కాస్తా ఘర్షణకు దారితీశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఉపాధి క్షేత్ర సహయకుడిగా పని చేస్తున్న పీ సత్యనారాయణ రాజపై గతంలో కొన్ని అభియోగాల వచ్చాయి. అందుకు సంబంధించిన విషయాలు సామాజిక వర్గ సమావేశంలో చర్చకు వచ్చాయి. చర్చల్లో ఒకరుపై ఒకరు వాదనలకు దిగారు. ఒకే సామాజిక వర్గంలో ఉన్న మనం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పెద్దలు సముదాయించే లోపు వివాదం తలెత్తి రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలోనే తోపులాటకు దిగారు. దీంతో సమావేశం రసాబసాగా మారి అంతా రోడ్డుపైకి రావడంతో గలాటా ఏర్పడి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఇందులో పలువురు గాయాల పాలయ్యారు. ఇరు వర్గాలకు చెందిన వారి ఆసుపత్రికి వెళ్ళడంతో అక్కడ నుంచి వచ్చిన సమాచారంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సామాజిక వర్గంలో ఏర్పడ్డ ఘర్షణ ఏ పరిస్థితికి దారితీస్తోందో అని అమలాపురం డీఎస్సీ మసూం భాషా, సీఐలు ఆర్ భీమరాజు, సురేష్‌బాబులతో వచ్చి గ్రామంలో పరిస్థితిని సమీక్షించి పోలీస్ పికెట్ ఏర్పాటు చేయించారు. అనవసరంగా గొడవలకు దిగి ఘర్షణలు సృష్టిస్తే ఊరుకునేది లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం శిక్షలు తప్పవని హెచ్చరించారు. చిన్న చిన్న గొడవలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి పెద్దవి చేస్తున్నారని, అలాంటి వారిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, కొత్తపల్లి(కరీంనగర్) : కొత్తపల్లి శివారులోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందడం కలకలం రేపింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సంతోష్‌కుమార్–వందనల కుమార్తె బి.వైష్ణవి(9) నాల్గో తరగతి చదువుతూ అదే పాఠశాల హాస్టల్లో ఉంటోంది. ఇటీవల సెలవులు రావడంతో ఈనెల 10న తన ఇంటికి వెళ్లింది. ఈనెల 18న బాలికను ఆమె తండ్రి హాస్టల్లో వదిలివెళ్లాడు. సోమవారం అనారోగ్యంతో ఉన్న బాలికను విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. మంగళవారం ఫిట్స్ రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. అయితే పోచమ్మ, దురద, జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురై అనారోగ్యంతో ఉన్న బాలికను తల్లిదండ్రులే ఆసుపత్రిలో చూపించి తగ్గకుండానే మందులతో హాస్టల్లో వదిలి వెళ్లారని యాజమాన్యం చెబుతుండగా..జ్వరం తగ్గాకే హాస్టల్లో వదిలి వెళ్లామని, మందులు వాడే విధానాన్ని టీచర్‌కు తెలపాల్సిందిగా సోమవారం ఫోన్లో తెలపడం జరిగిందని, ఇంతలోనే మంగళవారం మధ్యాహ్నం మీ కూతురుకు ఫిట్స్ వచ్చాయని, సీరియన్‌గా ఉందని ఫోన్లో తెలపడంతోనే కరీంనగర్‌కు చేరకున్నామని, ఇక్కడికి రాగానే చిట్టితల్లి విగతజీవిగా మార్చురీలో పడుందని తల్లి వందన బోరున విలపించింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే వైష్ణవి మృతి చెందిందని కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆందోళనకు దిగాయి. ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఎన్‌టీఎస్‌ఎఫ్, ఏఐఎస్బీ, ఎల్‌హెచ్‌పీఎస్ విద్యార్థి సంఘాలు మార్చురీ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి. çసంఘటన స్థలానికి చేరుకున్న కరీంనగర్ టూటౌన్, రూరల్ పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. విచారణ జరిపించాలి.. విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కరీంనగర్ రూరల్ సీఐ శశిధర్‌రెడ్డికి విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలోని సీసీ టీవీ పుటేజీలను బయటకు తీస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, బుర్ర సంజయ్, గుగులోత్ రాజునాయక్, జూపాక శ్రీనివాస్, గవ్వ వంశీధర్‌రెడ్డి, గట్టు యాదవ్, మల్లేశం, రత్నం రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విషాదంలో కొత్తపల్లి
-
పాపం.. బలి‘పశువులు’
సాక్షి, పిఠాపురం (తూర్పు గోదావరి): పశుగ్రాసం కొరత, వ్యాధులు పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు పశువులను మేప లేక తెగనమ్ముకుంటున్నారు. దీంతో రోజూ వందలాది పశువులు వధించి వందలాది టన్నుల పశు మాంసం రవాణా భారీగా సాగుతోంది. ఇటీవల పశు మాంసంతో వెళుతున్న టాటా ఏస్ వ్యాన్ ఒక వ్యక్తిని గొల్లప్రోలు మండలం తాటిపర్తి రోడ్డులో ఢీకొట్టిన సంఘటనతో పశు మాంసం తరలిస్తున్న విషయం బయటపడింది. ఇతర జిల్లాల నుంచి ఎక్కువ మొత్తంలో పశు మాంసం నియోజకవర్గం మీదుగా తరలిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల నుంచి పదుల సంఖ్యలో లారీల్లో పశు మాంసాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. హైవేపై వెళితే ఇబ్బందులు వస్తాయని తుని నుంచి పిఠాపురం నియోజకవర్గం మీదుగా తరలిస్తున్నారు. టన్నుల కొద్దీ రవాణా రోజూ నియోజకవర్గం నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి పశు మాంసం లారీలపై టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. పోలీసులు ముడుపులు తీసుకుని పట్టుకున్న మాంసం కొంత ధ్వంసం చేసి మొక్కుబడిగా కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పట్టుబడిన మాంసంలో అధిక శాతం వ్యాపారులు తిరిగి తీసుకువెళ్లేలా లాబీయింగ్ సాగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. రెండు నెలల్లో పది లారీలకు పైగా పశు మాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు. తాజాగా కొత్తపల్లి పోలీసులు సోమవారం ఒక కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న ఆరుటన్నుల పశుమాంసాన్ని, కంటైనర్‌ను స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఆ మాంసాన్ని ఉప్పాడ తీరంలో పూడ్చిపెట్టారు. ఎక్కడ చూసినా అక్రమ కబేళాలే గొల్లప్రోలు మండలం చెందుర్తి, కొడవలి, తదితర గ్రామాలతో పాటు పిఠాపురం పట్టణ నడిబొడ్డున అక్రమ కబేళాలు ఉన్నట్టు సమాచారం. చీకటి పడితే జనరేటర్ల లైట్ల వెలుగులో పశు వధ ప్రారంభమవుతుందని, పశువుల తలలు ఎండిన తరువాత దుమ్ములు, కొమ్ములను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తోంది. 216 జాతీయ రహదారి పక్కనే ఉండడంతో రవాణాకు వీలుగా ఈ ప్రాంతాలను అడ్డాలుగా చేసుకున్నారు. కబేళాల్లో ఎక్కువగా గోవులు, లేగ దూడలను వధిస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం అక్రమ కబేళాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. దాడులు ముమ్మరం చేశాం. అక్రమంగా తరలిస్తున్న పశువులను స్వాధీనం చేసుకుంటున్నాం. పలువురిపై కేసులు నమోదు చేశాం. అనుమానితులను పిలిపించి హెచ్చరికలు జారీ చేశాం. పిఠాపురం పశువుల సంతలో ప్రతి శనివారం పోలీసులను ఏర్పాటు చేసి పాడి పశువులను తప్ప కొనుగోళ్లు సాగుకుండా చూస్తున్నాం. – అప్పారావు, పిఠాపురం సీఐ -
ఆశీర్వదిస్తే.. ఐదేళ్లు అండగా ఉంటా
కొత్తపల్లి: ఒక్కసారి ఆశీర్వదించి గెలిపిస్తే మీ కష్టసుఖాల్లో ఐదేళ్ల పాటు అండగా నిలుస్తానని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. కొత్తపల్లి మండలం కమాన్‌పూర్, రేకుర్తి గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఇంటింటా ప్రచారం చేపడుతూ ఓట్లు అభ్యర్థించారు. బంగారు తెలంగాణ నిర్మిద్దామని ప్రగల్భాలు పలికి బంగారు కుటుంబాన్ని తయారు చేసుకుంటున్నారని విమర్శించారు. నాయకులు వేముల అనిల్‌కుమార్, కుంట తిరుపతి, రాధ శ్రీనివాస్, కృష్ణ, పర్శరాం, పొన్నల రాము, దొంతి చంద్రశేఖర్, ఎడమ సాయికృష్ణ, కొలిపాక రమేశ్, పర్వతం మల్లేశం, సాయికుమార్, కోలి చరణ్, రాంచంద్రారెడ్డి, కిరణ్, ప్రవీణ్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొనగా..టీఆర్ఎస్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రుద్ర రాజు, బూస సంతోష్, దేవకృష్ణ, మహిపాల్, సాయికృష్ణ తదితరులు బీజేపీలో చేరారు. ప్రజా బలానిదే విజయం: తమ ఆగడాలను కొనసాగించుకునేందుకు ధనబలంతో ప్రలోభాలకు గురి చేస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు..ప్రజాబలం ముందు ఓడిపోవడం ఖాయమని బండి సంజయ్‌కుమార్ అన్నారు. కోట్ల రూపాయలతో ఎలాగైనా నెగ్గుతామని ప్రజల్లో విసృతంగా ప్రచారం చేసుకుంటున్న గంగుల, పొన్నంలను ధర్మపోరాటంలో నైతిక బలంతో ఓడిస్తామని వివరించారు. నగరంలోని వైష్ణవి గార్డెన్స్‌లో జరిగిన పలు ప్రజా సంఘాల, కులవృత్తి సంఘాల పెద్దలతో శుక్రవారం బీజేపీ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోట్టె మురళీకృష్ణ, తాళ్లపల్లి హరికుమార్‌గౌడ్, కొరిటాల శివరామయ్య, ఎంపీటీసీ గుంజేటి శివకుమార్, తాళ్లపల్లి శ్రీనివాస్, బోయినిపల్లి ప్రవీణ్‌రావు, దుబాల శ్రీనివాస్, జవ్వాజి రమేశ్, మూడపల్లి స్వామి, నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి, దాసరి రమణారెడ్డి, కడార్ల రతన్‌కుమార్, బండ రమణారెడ్డి, అంజన్‌కుమార్, పాశం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నేడు మహా బైక్‌ర్యాలీ.. బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ నియోజకవర్గంలో మహాబైక్ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బోయినిపల్లి ప్రవీణ్‌రావు ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు బైపాస్‌రోడ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నుంచి ప్రారంభమై చింతకుంట గ్రామంలోని సాంప్రదాయ గార్డెన్ వరకు ర్యాలీ చేరుకుంటుందని తెలిపారు. -
టీఆర్ఎస్ అభ్యర్థులను నిలదీయండి
కొత్తపల్లి: మిషన్ భగీరథ నీరు, డబుల్‌బెడ్ రూం ఇళ్లు ఇవ్వకుండా ఓట్లడగమన్న టీఆర్ఎస్ అభ్యర్థులు..ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ ముఖంతో గ్రామాల్లోకి వస్తున్నారో నిలదీయాలని..టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కోరారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్, రేకుర్తి గ్రామాల్లో ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, టీపీసీసీ కార్యదర్శిచలిమెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి శుక్రవారం బైక్ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయ జన్మనిచ్చిన టీడీపీపైనే అహంకారపూరితంగా కమలాకర్ వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి ఏంటో..ఐదేళ్లలో తాను ఎంపీగా చేసిన అభివృద్ధి ఏంటో చర్చించుకుందామా అంటూ సవాల్ చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి, కళ్యాడపు ఆగయ్య, జాడి బాల్‌రెడ్డి, మాజీ మేయర్ శంకర్, గందె మాధవి, ఎంపీటీసీలు జక్కుల నాగరాణి మల్లేశం, బొమ్మ ఈశ్వర్‌గౌడ్, నాయకులు రాచకొండ ప్రభాకర్, ఖాజాఖాన్, బోనాల మురళి, మూల వెంకటరవీందర్ రెడ్డి, జువ్వాడి మారుతిరావు, ఎండి చాంద్, దుర్గం మనోహర్ పాల్గొన్నారు. మహాకూటమి గెలుపు ఖాయం: రాష్ట్రంలో సాగుతున్న రాచరిక పాలనను అంతం చేయడానికే మహాకూటమిగా జట్టుకట్టామని.. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులకు పాల్పడ్డ ఓటమి తప్పదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, అన్నారు. శుక్రవారం టవర్‌సర్కిల్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపించాలని కోరారు. 5వ డివిజన్లో.. ఎస్సీసెల్ నగర కాంగ్రెస్ కమిటీ నాయకులు కల్వల రాంచందర్ ఆధ్వర్యంలో 5వ డివిజన్లో పొన్నం ప్రభాకర్‌కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు పొన్నం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 9వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ తౌటి శంకరయ్య ఆధ్వర్యంలో వంద మంది యువకులు పొన్నం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నందగిరి జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో పలువురు వికలాంగులు కాంగ్రెస్‌లో చేరారు. 20వ డివిజన్లోని కాపువాడకు చెందిన వాసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు యువకులు పార్టీలో పొన్నం సమక్షంలో చేరారు. -
మా భూములు మాకిచ్చేయండయ్యా
సాక్షి, కొత్తపల్లి : ‘అయ్యా.. మీ కాళ్లు పట్టుకుంటాం.. మా భూములు మాకిచ్చేయండి’.. అంటూ రైతులు పోలీసుల కాళ్ల మీద పడ్డా ఖాకీల హృదయం కరగలేదు.. బాధిత రైతులతో పాటు వారికి మద్దతుగా వచ్చిన వివిధ పార్టీల నేతల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైతుల పోరాటాన్ని అణచి వేయడానికి ప్రభుత్వం భారీ స్థాయిలో పోలీసు బలగాలను రంగంలోకి దించి ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సెజ్ బాధిత రైతులు వారం కిందట సమావేశమై సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు చింతా సూర్యనారాయణమూర్తి పొలంలో నాట్లు వేసేందుకు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఆదివారం సూర్యనారాయణమూర్తితో కలిసి మూలపేట నుంచి కొత్తమూలపేటకు బయలుదేరారు. సెజ్ ప్రాంతాల్లో అప్పటికే మోహరించిన సుమారు 500 మంది పోలీసులు, ప్రత్యేక బలగాలు వారిని అడ్డుకున్నాయి. అలాగే పొన్నాడ శివారు రావివారుపోడు, రమణక్కపేటకు చెందిన సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు బావిశెట్టి నారాయణస్వామి, పెనుమల్లు సుబ్బిరెడ్డి తదితరులతో పాటు సీపీఎం రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏవీ నరసింహం, సీపీఎం జిల్లా కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్, సీపీఎం నేత కూరాకుల సింహాచలం, వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేసి అన్నవరం, పిఠాపురం, కొత్తపల్లి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా తమ భూములు తమకిచ్చేయాలంటూ ఓ రైతు పోలీసు కాళ్లపై పడ్డాడు. 1983 భూసేకరణ చట్ట ప్రకారం కాకుండా.. 2013 భూసేకరణ చట్టం ప్రకారమైనా తమకు పరిహారం ఇవ్వాలని వారు వేడుకున్నారు. అనంతరం మొత్తం 147 మందిని పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సెజ్ ప్రాంతాల్లో 144 సెక్షన్, సెక్షన్ 30 అమల్లో ఉన్నందున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరించారు. రైతులకు మద్దతిచ్చిన వైఎస్సార్సీపీ నేత దొరబాబును అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు రైతులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండ సెజ్ రైతులకు మద్దతు తెలిపేందుకు పిఠాపురం నుంచి వస్తున్న వైఎస్సార్సీపీ పిఠాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పెండెం దొరబాబు, వైఎస్సార్ సీపీ కొత్తపల్లి మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్‌తో పాటు పలువురిని నాగులాపల్లిలో అరెస్ట్ చేసి తిమ్మాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ తమ భూముల కోసం పోరాడుతున్న రైతులను అక్రమంగా అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా రైతులు, వారికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్‌లను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి ఖండించారు. -
పర్యాటకులతో ‘కొత్తపల్లి’ కిటకిట
జి.మాడుగుల: ప్రకృతి అందాలకు పుట్టినిల్లు విశాఖ మన్యం అంటే అతిశయోక్తికాదు. ఎత్తయిన పర్వతాలు, కొండలు, పెద్దపెద్దలోయలు, గలగలా పారే సెలయేళ్లు, ఎటుచూసినా పచ్చని తోటలతో ఆహ్లాదపరిచే వాతావరణం ఈ ప్రాంత సొంతం. ఇందులో విశాఖ మన్యంలో జి.మాడుగుల–చింతపల్లి రోడ్డులో కొత్తపల్లి జలపాతం అందరినీ ఆకర్షిస్తోంది. ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా నుంచి తరలి వచ్చిన పర్యాటకులు సందడి చేశారు. జలకాలాదుతూ ఆనందంగా గడిపారు. -
విశాఖలో కనువిందు చేస్తోన్న కొత్తపల్లి జలపాతం
-
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
విద్యుత్ మోటారు ఆడటం లేదని స్తంభమెక్కి మరమ్మతులు చేస్తున్న యువ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులంతా గుండెలవిసేలా రోదించారు. తమ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలియని చిన్నారులు బిత్తరచూపులు చూస్తూ ఉండటం అందరి హృదయాలనూ కలచివేసింది. అమడగూరు మండలం బావాచిగాని కొత్తపల్లి (బి.కొత్తపల్లి)లో మంగళవారం ఈ సంఘటన జరిగింది. అమడగూరు: బి.కొత్తపల్లికి చెందిన లేట్ కదిరిరెడ్డి, ప్రభావతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మంజునాథరెడ్డి (32)కి ఏడేళ్ల క్రితం చిత్తూరు జిల్లా బిళ్లూరోళ్లపల్లికి చెందిన జ్యోతితో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. మంజునాథరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ప్రస్తుతం రెండు ఎకరాల్లో టమాట, ఎకరం విస్తీర్ణంలో సజ్జ సాగు చేశాడు. వారం రోజులుగా వ్యవసాయ బోరు మోటార్ పనిచేయడం లేదు. దీంతో మంజునాథరెడ్డి మంగళవారం ఉదయం వ్యవసాయ బోరు దగ్గరకెళ్లి సర్వీస్ వైరును పరిశీలించాడు. ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేయబోయాడు. కొద్దిసేపటికే కరెంట్ రావడంతో విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. గంటసేపటి తర్వాత పశువుల కాపరులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన వచ్చి సమీపంలోని బాగేపల్లి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాయకుల పరామర్శ గత ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన ప్రభావతమ్మ కొడుకు ధనుంజయరెడ్డి మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీఈసీ సభ్యుడు కడపల మోహన్‌రెడ్డి, నాయకులు దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. -
అగ్నిప్రమాదంలో కోళ్ల ఫారం దగ్ధం
కణేకల్లు (రాయదుర్గం) : కణేకల్లు మండలం కె.కొత్తపల్లి రోడ్డు వద్ద నాగప్ప అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారం అగ్నిప్రమాదంలో కాలి బూడిదైంది. ఆదివారం సాయంత్రం బలమైన గాలులు వీచడంతో కోళ్లఫారం పక్కలో ఉన్న మెయిన్ విద్యుత్ తీగ ఒకటి తెగి మరోదానిపై పడింది. దీంతో విద్యుత్ తీగల రాపిడికి నిప్పురవ్వలు ఎగిసి కోళ్లఫారంపై పడ్డాయి. నిమిషాల వ్యవధిలో ఫారం మొత్తం అగ్నికి ఆహుతైంది. 2,500 పెద్ద కోళ్లు కాలి బూడిదయ్యాయని యజమాని నాగప్ప తెలిపాడు. కోళ్లు, షెడ్ కలిపి మొత్తం రూ.5 లక్షల దాకా నష్టం వాటిల్లిందని చెప్పాడు. -
మేజిస్టీరియల్ కాదు.. న్యాయ విచారణ కావాలి
కొత్తపల్లి, న్యూస్‌లైన్: వాకతిప్పలో గతనెల 20న 18 మందిని పొట్టన పెట్టుకున్న బాణసంచా తయారీ కేంద్రం విస్ఫోటంపై మేజిస్టీరియల్ విచారణ కాక.. న్యాయ విచారణ జరిపించాలని బాధితులు, ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. విస్ఫోటంపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్ శనివారం రెండో విడత మేజిస్టీరియల్ విచారణ నిర్వహించారు. గ్రామ కారదర్శి, రెవెన్యూఅధికారి, మృతుడు పిల్లి మణికంఠ స్వామి బంధువులు విచారణలో పాల్గొన్నారు. ఈనెల 10ననిర్వహించిన తొలి విడత విచారణను బాధిత కుటుంబాలు, ఎంఆర్పీఎస్ నాయకులు బహిష్కరించిన సంగతి తెలిసిందే. వాకతిప్పకు చెందిన మృతురాలు ద్రాక్షారపు చిన్నబుల్లి మృతదేహం లభ్యం కాకపోవడం, లభించిన కొన్ని శరీరావయవాలు ఆమెవేనని నిర్ధారణ కాకపోవడంతో పరిహారం ఇవ్వలేదని అప్పుడు కుటుంబ సబ్యులు ఆందోళన చేశారు. కాగా తాజా విచారణ సందర్భంగా చిన్నబుల్లి కుటుంబానికి పరిహారం చెక్కు ఆమె భర్త, తహశీల్దార్ల పేరున వచ్చిందని ఆర్డీఓ తెలిపారు. అయితే జాయింట్ చెక్ తమకు వద్దని కుటుంబసభ్యులు తిరస్కరించారు. అంతేకాక.. విస్ఫోటంపై అధికారులు బాణసంచా తయారీ కేంద్రం యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని బాధితులు, ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. న్యాయ విచారణ వల్లే న్యాయం జరుగుతుందన్నారు. ఆర్డీఓ విచారణను బహిష్కరించారు. ఆర్డీఓ విలేకరులతో మాట్లాడుతూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు తెలిపిన వివరాలను రికార్డు చేసి కలెక్టరు సమర్పించడమే తన బాధ్యత అన్నారు. అనవసర ఆరోపణలు చేయడం సమంజసం కాదని, ఆధారాలుంటే అందించాలని సూచించారు. విస్ఫోటం జరిగిన మణికంఠ ఫైర్వర్క్స్ లెసైన్సు రెన్యువల్ కోసం తనకు దరఖాస్తు రాగా, ఒరిజినల్ లెసైన్సు లేనందున తిరిగి తహశీల్దారుకు పంపించేశానని చెప్పారు. ఆ బాణసంచా కేంద్రానికి 15 కేజీల మందుగుండు తయారీకి మాత్రమే అనుమతులు ఉన్నాయన్నారు. విస్ఫోటంలో 18 మృతి చెందినట్టు గుర్తించినా, వారిలో ద్రాక్షారపు చిన్నబుల్లి మృతదేహం లభించకపోవడంతో ఆమె శరీర భాగాలను డీఎన్ఏ పరీక్షల కోసం బంధువులతో హైదరాబాద్ పంపించామన్నారు. ఆ నివేదిక వచ్చాక తయారీ కేంద్రంలో ఎంత సామర్థ్యంతో పేలే మందుగుండును వినియోగిస్తున్నారు వంటి వివరాలు తెలుస్తాయన్నారు. ప్రమాద స్థలంలో మట్టి నమూనా, డీఎన్ఏ నివేదికలు వచ్చాక మరోమారు బహిరంగ విచారణ నిర్వహిస్తామని చెప్పారు. విస్ఫోటానికి 20 రోజుల ముందూ ప్రమాదం.. విస్ఫోటానికి 20 రోజుల ముందూ మణికంఠ ఫైర్వర్క్స్లో ఓ ప్రమాదం జరిగిందని మృతుడు మణికంఠస్వామి బావ గంటా వెంకటేశ్వరావు చెప్పాడు. మాట్లాడుతూ...భారీ విస్పోటణానికి 20 రోజుల ముందు ఒక ప్రమాదం జరిగిందని చెప్పారు. అపుడు మణికంఠతో పాటు సత్తిబాబు అనే వ్యక్తి గాయపడగా ఫైర్వర్క్స్ యజమానులే ఉప్పాడ ఆస్పత్రిలో చికిత్స చేయించి, మళ్లీ వారితో పనిచేయించుకున్నారన్నారు. ఆ ప్రమాదం జరిగిన వారం రోజుల వరకూ తమకు తెలియనివ్వలేదన్నారు. మణికంఠ ఫైర్వర్క్స్లో మొదటి నుంచీ భారీగా మందుగుండు సామగ్రి తయారవుతోందన్నారు. -
బాణసంచా పేలుడు భారీ ప్రాణ నష్టం
-
బాణసంచా కేంద్రంలో పేలుడు.. భారీ ప్రాణ నష్టం
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. యూ కొత్తపల్లి మండలం వాకతిప్పలో ఎండీవో కార్యాలయం సమీపంలోని ఓ బాణసంచా గోదాములో సోమవారం పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించగా, మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. కాలిన శరీరాలతో అక్కడ భయానకవాతావరణం నెలకొంది. బాణసంచా గోదాములో మంటలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పేలుడు శబ్దం పది కిలో మీటర్ల దూరం వరకు వినిపించినట్టు స్థానికులు చెప్పారు. క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ప్రమాదంపై స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మంటలను వెంటనే ఆర్పివేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. -
బాణసంచా పేలుడు భయానక దృశ్యమిదీ!
-
బాణసంచా కేంద్రంలో పేలుడు : 10మంది మృతి
-
మమకారంతో వెళ్లి.. మృత్యు ఒడికి...
కొత్తపల్లి :భవాని మాలధారణ చేయాలని అతడు సంకల్పించాడు. మనవరాలి పుట్టిన రోజుకు వెళ్లలేనేమోనని భావించి, ఈలోగా చూసొద్దామని ఆ చిన్నారిపై ఉన్న మమకారంతో కుమార్తె ఇంటికి వచ్చాడు. వారితో ఆనందంగా గడిపి, స్వగ్రామానికి బైక్‌పై తిరుగుపయనమయ్యాడు. వారంతా అతడికి సంతోషంగా వీడ్కోలు పలికారు. అదే అతడికి తుది వీడ్కోలు అయింది. ఉప్పాడ-పిఠాపురం రోడ్డులో యండపల్లి జంక్షన్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భవన నిర్మాణ కార్మికుడు మరణించాడు. అతడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి రూరల్ మండలంలోని పాత చింతల నామవరానికి చెందిన కడియపు సత్యనారాయణ (55) తాపీ పని చేస్తుంటాడు. సోమవారం అతడు భవాని మాలధారణ వేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ నెల 24వ తేదీన తన మనవరాలి పుట్టిన రోజు చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి వెళ్లలేనని భావించి, ఈలోగా మనవరాలితో పాటు అల్లుడు, కుమార్తెను చూసొద్మాని ఆదివారం ఉదయం వారి ఊరైన కొత్తపల్లికి బయలుదేరాడు. కొత్తపల్లిలో ఉన్న అల్లుడు శ్రీనివాస్, కుమార్తెను కలుసుకున్నాడు. ఐదేళ్ల మనవరాలిని ఎత్తుకుని కొద్దిసేపు గారాబం చేశాడు. స్వగ్రామానికి వెళ్తేందుకు బైక్‌పై తిరుగు పయనమయ్యాడు. ఉప్పాడ-పిఠాపురం రోడ్డులో యండపల్లి జంక్షన్ శివారున అతడి బైక్‌ను వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొని, ఆగకుండా వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికుల సహకారంతో 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. అతడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎస్సై ఎన్.కొండయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. పని చేయని ఆక్సిజన్ సిలిండర్ సంఘటనలో సత్యనారాయణకు తీవ్ర గాయాలు కాగా, 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు సిబ్బంది అంబులెన్సలో ఎక్కించారు. అతడికి ఆక్సిజన్ ఎక్కించేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించగా సిలిండర్ ఓపెన్ చేసే బటన్ విరిగి ఉంది. స్థానికంగా ఉన్న నాగులాపల్లి రక్షిత మంచినీటి పథకం కాంట్రాక్ట్ సిబ్బంది సిలిండర్ బటన్‌ను ఓపెన్ చేశారు. సమయానికి ఆక్సిజన్ అంది ఉంటే అతడు చనిపోయి ఉండేవాడు కాదని స్థానికులు పేర్కొన్నారు. -
కొత్తపల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మాచర్లటౌన్: తండ్రి మందలించాడని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన షేక్ పెద్ద సైదులు కుమారుడు సైదులు (19) గుంటూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సరిగా చదువుకోకుండా తరుచూ ఇంటికి వస్తుండడంతో కుమారుడిపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కూడా మందలించడంతో ఇంట్లో ఎవరూ లేని సైదులు ఇంట్లో నిల్వ ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కొద్దిసేపటికి విషయాన్ని గమనించిన బంధువులు సైదులును మాచర్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్థారించారు. సైదులు మృతదేహాన్ని కొత్తపల్లికి తరలించారు. విషయం తెలుసుకున్న విజయపురిసౌత్ పోలీసులు ఆత్మహత్యకు సంబంధించి వివరాలు సేకరించారు. -
చితికిన చిరుప్రాణాలు
కొత్తపల్లి :ఆ కుటుంబానికి ఓ కొత్త చిగురును కానుకగా ఇచ్చిన కాలం.. అంతలోనే ఆ మురిపాన్ని క్రూరంగా కాలరాసింది. అదే కుటుంబంలోని రెండు లేతరెమ్మలను తుంచేసింది. ఓ పచ్చిబాలింత ఒడిలో రెండువారాల పసికందుతో పాటు గుండెళ్లో పుట్టెడు దుఃఖాన్ని మోయాల్సి వచ్చింది. ఉప్పాడ-కోనపాపపేట బీచ్‌రోడ్‌లో పొన్నాడ శివారు శీలంవారిపాలెం వద్ద ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఒకరి తండ్రి గాయపడ్డాడు. మండలంలోని కోనపాపపేట, సామర్లకోట మండలం ఉండూరు శివారు ప్రకాశరావుపేటల్లో విషాదాన్ని నింపిన ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశరావుపేట కొత్తూరుకు చెందిన ఉప్పలపాటి సూరిబాబుకు, పొన్నాడ శివారు కోనపాపపేటకు చెందిన చావ నపల్లి సత్యనారాయణ పెదకుమార్తె దేవికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి నందు (4) అనే కుమారుడు ఉన్నాడు. దేవి గత నెల 19న పుట్టింట్లో మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. భార్యాబిడ్డలను చూసేందుకు సూరిబాబు రెండు రోజుల క్రితం అత్తవారింటికి వెళ్లాడు. నందును వెంటబెట్టుకుని శనివారం ఉండూరు వచ్చాడు. ఆదివారం నందుతో మోటార్‌సైకిల్‌పై తిరిగి కోనపాపపేట బయల్దేరాడు. పిన్నికి పుట్టిన బుల్లి తమ్ముణ్ని తానూ చూస్తానంటూ సూరిబాబు అన్న ఉప్పలపాటి సన్యాసిరావు కుమార్తె శివజ్యోతి (8) కూడా వారితో బయల్దేరింది. పొన్నాడ శివారు శీలంవారి పాలెం వద్ద సామర్లకోట నుంచి పెరుమాళ్లపురం ఊకలోడు కోసం ముందు వెళుతున్న లారీని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పిన మోటార్‌సైకిల్ రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. లారీ వెనుక చక్రం కిందపడ్డ శివజ్యోతి, నందు అక్కడికక్కడే మరణించారు. సూరిబాబుకు స్వల్పంగా గాయాలయ్యాయి. కొత్తపల్లి ఏఎస్సై లోవరాజు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శనివారం వరకూ తమతో ఉన్న నందు..తండ్రి వెంట ఉండూరు వెళ్లకపోయినా ఈ గండాన్ని తప్పించుకునే వాడని, రెండో బిడ్డను ఇచ్చిన దేవుడు.. అంతలోనే తొలిబిడ్డను తీసుకుపోయాడని దేవి బావురుమంటోంది. అటు కోనపాపపేటలో, ఇటు ప్రకాశరావుపేట కొత్తూరులో ఆ రెండు కుటుంబాల బంధువులూ విషాదంలో మునిగారు. పసిబిడ్డను చూడాలని వెళ్లి దూరమయ్యావా బిడ్డా..! ఉండూరు (సామర్లకోట) : బతుకుతెరువుకు కూలి పనులు చేసుకుంటున్నా పిల్లలను మంచిగా చదివించాలనుకున్నామని, ఇంతలో ఇలా అయిందని శివజ్యోతి తల్లిదండ్రులు వరలక్ష్మి, సన్యాసిరావు కన్నీరుమున్నీరయ్యారు. పసిబిడ్డను చూడాలని వెళ్లిన తన బిడ్డ తనకు కాకుండా పోయిందని వరలక్ష్మి గుండెలు బాదుకుంటూ రోదించింది. బుల్లి తమ్ముడిని చూడడానికి వెళుతున్నందుకు మురిసిపోయిన తన బిడ్డ ఆ ముచ్చట తీరకుండానే కడతేరిపోయిందని విలపించింది. -
చేనేతకు సిసలైన చేవ్రాలు
అతివల మనస్సు దోచే తళుకుబెళుకుల ‘జాందాని’ చేనేత చీరలు... వీటి రూపకల్పన వెనుక శక్తిలాంటి ఒక వ్యక్తి కఠోర శ్రమ... అకుంఠిత దీక్ష... అంతకు మించిన నైపుణ్యం ఉన్నాయి! ఏదో సాధించాలనే తపన... పదిమందికి ఉపయోగపడాలనే తాపత్రయం... పది మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యం ఉన్నాయి. తొమ్మిది పదులు మీద పడినా... చేనేత రంగ అభివృద్ధిపై ఉన్న పట్టుదల, హస్త కళలపై ఉన్న మక్కువ... చేనేత పారిశ్రామికవేత్త లొల్ల వెంకట్రావుకు ఇంకా ఈ రంగంలో కొనసాగేలా స్ఫూర్తి నింపుతున్నాయి... ఈ వయసులోనూ ఆయన అవిశ్రాంత కృషి చూస్తే ఎవరైనా సరే సలామ్ చేయక మానరు! తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలోని ఆ ఇంట్లోకి ప్రవేశించగానే ఒక టేబుల్ మీద పెద్ద డ్రాయింగ్ షీటు పరుచుకుని డి జైన్లు వేస్తున్న తొమ్మిది పదుల వయస్సు నిండిన ఒక పండు యువకుడు దర్శనమిస్తారు. ఆయన అలా డిజైన్లు ఎందుకు వేస్తున్నారా అని చూసేలోపే, కుర్చీలోంచి లేచి, మగ్గం మీద కూర్చుని తాను ముందుగా గీసిన డిజైన్‌ను చీర మీద తయారుచేస్తూ కనపడతారు. పూవుకు తావి అద్దినట్టుగా చీరెలకు బంగారు లతలు, పూవులు పూయిస్తారు లొల్ల వెంకట్రావు. చేనేత చీరల తయారీలో విప్లవం తెచ్చిన ఘనత ఆయనది. తెల్లటి పంచె లాల్చీ, మందపాటి కళ్లద్దాలతో చాలా సాధారణంగా కనిపించే వెంకట్రావు చేనేత కళకు చేసిన కృషి అసాధారణమైనది. గుమస్తాగా ప్రారంభించి, ఎందరికో ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. పాఠశాలకు వెళ్లి చదివింది ఎనిమిదో తరగతి వరకే అయినా, జీవితాన్ని మాత్రం నిండుగా చదివారు. ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి వెనుక పెద్ద కథే ఉంది. గుమాస్తాగా... ఉప్పాడకు చెందిన చేనేత వ్యాపారి పుచ్చల రామలింగం వద్ద గుమస్తాగా చేనేత పని జీవితాన్ని ప్రారంభించిన వెంకట్రావు, ఈ పనిలో చేరడానికి ముందు, ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకున్నారు. స్థానికం పాఠశాలలో ఆరు నెలలపాటు ఉపాధ్యాయ శిక్షణ పొంది, ట్రెయినీగా విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పారు. ‘‘మా నాన్నగారు కులవృత్తిని విడిచిపెట్టవద్దని చెప్పడంతో ఆయన ఆవేదనను అర్థం చేసుకుని కులవృత్తి వైపు అడుగులు వేశాను’’ అని చెబుతారు వెంకట్రావు. గుమస్తాగా పని చేస్తున్న రోజుల్లోనే అంటే 1983 నుంచి జాందాని చీరల తయారీలో విప్లవం తీసుకువచ్చారు. దాంతో అక్కడక్కడ మాత్రమే కనిపించే జాందాని మగ్గాల సంఖ్య వందలకు చేరుకుంది. వేల మంది కార్మికులు ఈ వృత్తిని ఎంచుకున్నారు. ‘‘నేను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వేసేవాడిని. జాందాని చీరలలో కొత్త విప్లవం తీసుకురావడానికి ఆ కళ చాలా ఉపయోగపడింది. చీరలపై తీగలు, ఆకులు, జంతువులు, కాయల వంటి కళాకృతులను నేత ద్వారా సృష్టించాను. ఆకృతిని ముందుగానే గ్రాఫ్‌పై తయారుచేసి, దాని మీద నుంచి చీరలపై ఆ డిజైన్ వచ్చేవిధంగా తయారుచేయడం ప్రారంభించాను’’ అని వివరించారు వెంకట్రావు. భవిష్యత్తరాలకు అందించాలని... చేనేతపై ఇంతటి అభిమానం కలగడానికి బీజం స్వాతంత్య్రానికి ముందే వెంకట్రావులో నాటుకుంది. మహాత్మాగాంధీ ఇచ్చిన విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపుతో స్వదేశీ వస్తువుల మీద ఆయన పెంచుకున్న ప్రేమ ఆ తర్వాత జాందాని కళాభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో ఆ కళ గుర్తింపు పొందడానికి కారణమైంది. తాను మక్కువ పెంచుకున్న కళాభివృద్ధికోసం ఆయన చేసిన అచంచల కృషే ఆ కళపై ఆయన పేటెంట్ హక్కును పొందేలా చేసింది. ‘‘జాందాని కళను భవిష్యత్తరాలకు అందించాలని నా సంకల్పం. అందుకే ఈ కళకు సంబంధించి, ‘జాతీయ హస్తకళలలో జాందాని చేనేత హస్తకళ, దాని ప్రత్యేకత - నా అనుభవాలు’ పేరుతో ఒక పుస్తకం రాశాను’’ అంటారు వెంకట్రావు. చేనేత అభివృద్ధి ధ్యేయంగా... నేత కార్మికుడి కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవించారు వెంకట్రావు. ‘‘చేనేత రంగం అభివృద్ధి దిశలో పయనిస్తోంది కానీ, కార్మికులు మాత్రం ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారు. అందుకే ఈ రంగంలో నిష్ణాతులైన సుమారు వంద మంది నిరుపేద చే నేత కార్మికులకు నెలకు 200రూపాయల చొప్పున పింఛను అందిస్తున్నాను. ఊపిరి ఉన్నంతవరకు ఈ రంగం అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటాను’’ అంటారు వెంకట్రావు. ఈ వయసులో కూడా చీరలకు అవసరమైన డిజైన్లను తానే తయారుచేసుకోవడాన్ని బట్టే ఆయన దీక్ష, పట్టుదల ఎలాంటివో అర్థమవుతుంది. కళల అభివృద్ధికి ఇలాంటి కార్యశూరులే కదా కావాల్సింది! - ఎల్ శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ ఫొటోలు: ఎస్వివివిఎస్ ప్రసాద్, పిఠాపురం జాందాని అంటే... సాధారణంగా ఏదైనా చీరలకు డిజైన్ ఒక వైపు మాత్రమే కనిపిస్తుంది. జాందాని చీరలపై మాత్రం రెండు వైపులా డిజైన్ ఒకేలా కనిపిస్తుంది. జాందాని అనేది పర్షియన్ పదం. సంస్థానాధీశుల కాలంలో దీనిని వాడుకలోకి తీసుకువచ్చారు. రాణుల కోసం ప్రత్యేకంగా ఈ చీరలు తయారు చేయించేవారు. కాలక్రమంలో వీటిని మన రాష్ట్రంలో కొత్తపల్లిలో నేయడం ప్రారంభించాక వీటికి విస్తృత ప్రాచుర్యం లభించింది. వెండి బంగారు జరీలతో నేత నేయడం వలన ఈ చీరల ధర రూ. 10 వేల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ చీర చిరిగినా, పాడైనా సగం ధర తిరిగి రావడం వీటి విశిష్టత. -
నడికడలిలో ఏమయ్యారో!
కొత్తపల్లి :చేపల వేటకు ఆరుగురు మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన ఫైబర్ బోటు ఇంజన్ చెడిపోవడంతో ఆచూకీ లేకుండా పోయింది. తెరచాప సాయంతో ఒడ్డు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పిన అనంతరం వారి సెల్‌ఫోన్ పని చేయకపోవడంతో.. వారు ఏమైందీ, ఎలా ఉన్నదీ తెలియరాలేదు. దీంతో వారి కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటకు చెందిన గంపల దేవుళ్ళుకు చెందిన బోటుపై బుధవారం ఉదయం ఉప్పాడకు చెందిన మైళపల్లి సత్యనారాయణ, కోనపాపపేటకు చెందిన ఉప్పాడ బంగారయ్య, తిక్కాడ పైడియ్య, తిత్తి సుబ్బారావు, కురిపి సూరిబాబు, మరొక వ్యక్తి వేటకు వెళ్లారు. ఈ బోటుతో పాటే వెళ్లిన బోట్లన్నీ వేట ముగించుకుని శనివారమే తిరిగి తీరం చేరుకున్నాయి. దీంతో ఆందోళన చెందిన దేవుళ్లు సెల్ఫోన్లో సంప్రదించగా శుక్రవారం ఉదయం తమ బోటు ఇంజన్ చెడిపోయిందని, తెరచాప సాయంతో ఒడ్డుకు చేరుకోవడానికి యత్నిస్తున్నామని బోటులోని వారు చెప్పారు. అయితే.. బోటులోని వారి దగ్గరున్న సెల్‌ఫోన్ ఆదివారం ఉదయం 11 గంటల వరకే పని చేసిందని, తర్వాత వారి నుంచి సమాచారం లేదని దేవుళ్లు చెప్పారు. తనతో మాట్లాడినప్పుడు భైరవపాలానికి సుమారు 20 మైళ్ల దూరంలో ఉన్నట్టు చెప్పారన్నారు. గాలి వాలు బోటుకు అనుకూలంగా లేనందున తెరచాప సాయంతో ఒడ్డుకు చేరడం కష్టసాధ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బోటు ఆచూకీ కోసం ఆదివారం మధ్యాహ్నం భైరవపాలెం నుంచి మరో రెండు బోట్లు పంపామని, రాత్రి వరకూ ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. కాగా మత్స్యకారులు గల్లంతైన వార్త మీడియాలో రావడంతో కలెక్టర్ నీతూప్రసాద్ రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. భైరవపాలెం సమీపంలోని ఓ దీవి వద్ద మత్స్యకారుల బోటుందని తెలిసిన అధికారులు.. బోట్లపై అక్కడకు వెళ్లి అందులోని నలుగురిని ఒడ్డుకు చేర్చారు. వారు బలుసుతిప్పకు చెందిన వారని తెలియడంతో కోనపాపపేట మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగించనున్నారు. గాలివాటానికి కొట్టుకుపోయే అవకాశం..! ఆరుగురు మత్స్యకారులతో ఆచూకీ లేకుండా పోయిన బోటు ఇంజన్ శనివారం ఉదయం చెడిపోవడంతో.. గత మూడురోజు లుగా వారు తెరచాపే ఆయుధంగా కడలితో పోరాడుతూ ఒడ్డుకు చేరేందుకు శ్రమిస్తున్నట్టు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం చివరి సారి సెల్ఫోన్లో మాట్లాడినప్పుడు వారు బోటు యజమానికి చెప్పిందీ అదే. ప్రస్తుతం ఈదురు గాలులు అధికంగా ఉండడంతో బోటు గాలివాటానికి కొట్టుకుపోయే అవకాశం ఉందని ఇతర మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోటులోని సోలార్ వ్యవస్థ వల్ల సెల్‌ఫోన్ చార్జింగ్ అయిపోయే సమస్య ఉత్పన్నం కాదని, గాలి వాలుకు సిగ్నల్ అందనంత దూరానికి కొట్టుకు పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా గల్లంతైన మత్స్యకారుల కోసం మెరైన్, కోస్టుగార్డు, రిలయన్స్ సిబ్బంది గాలింపు చేపట్టారు. కలెక్టరు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు తీరప్రాంత సిబ్బందిని అప్రమత్తం చేశారు. చీకటి పడడం, ఈదురు గాలులు పెరగడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగిందని, సోమవారం ఉదయం కొనసాగిస్తామని అధికారులు చెప్పారు. కాగా బోటు యజమాని పురమాయింపుపై బయల్దేరిన రెండు బోట్లలోని మత్స్యకారులూ గాలింపు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. క్షేమంగా తిరిగి రావాలని పూజలు బోటు ఇంజన్ చెడిపోయి, సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులు వారి క్షేమసమాచారం తెలియక ఆందోళన చెందుతున్నారు. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. గ్రామపెద్దలు, పలువురు గ్రామస్తులు తీరంలో నిలబడి.. ఆరుగురు మత్స్యకారుల రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.