కణేకల్లు (రాయదుర్గం) : కణేకల్లు మండలం కె.కొత్తపల్లి రోడ్డు వద్ద నాగప్ప అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారం అగ్నిప్రమాదంలో కాలి బూడిదైంది. ఆదివారం సాయంత్రం బలమైన గాలులు వీచడంతో కోళ్లఫారం పక్కలో ఉన్న మెయిన్ విద్యుత్ తీగ ఒకటి తెగి మరోదానిపై పడింది. దీంతో విద్యుత్ తీగల రాపిడికి నిప్పురవ్వలు ఎగిసి కోళ్లఫారంపై పడ్డాయి. నిమిషాల వ్యవధిలో ఫారం మొత్తం అగ్నికి ఆహుతైంది. 2,500 పెద్ద కోళ్లు కాలి బూడిదయ్యాయని యజమాని నాగప్ప తెలిపాడు. కోళ్లు, షెడ్ కలిపి మొత్తం రూ.5 లక్షల దాకా నష్టం వాటిల్లిందని చెప్పాడు.