
కమాన్‌పూర్‌లో ప్రచారం నిర్వహిస్తున్న బండి సంజయ్
కొత్తపల్లి: ఒక్కసారి ఆశీర్వదించి గెలిపిస్తే మీ కష్టసుఖాల్లో ఐదేళ్ల పాటు అండగా నిలుస్తానని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. కొత్తపల్లి మండలం కమాన్‌పూర్, రేకుర్తి గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఇంటింటా ప్రచారం చేపడుతూ ఓట్లు అభ్యర్థించారు. బంగారు తెలంగాణ నిర్మిద్దామని ప్రగల్భాలు పలికి బంగారు కుటుంబాన్ని తయారు చేసుకుంటున్నారని విమర్శించారు.
నాయకులు వేముల అనిల్‌కుమార్, కుంట తిరుపతి, రాధ శ్రీనివాస్, కృష్ణ, పర్శరాం, పొన్నల రాము, దొంతి చంద్రశేఖర్, ఎడమ సాయికృష్ణ, కొలిపాక రమేశ్, పర్వతం మల్లేశం, సాయికుమార్, కోలి చరణ్, రాంచంద్రారెడ్డి, కిరణ్, ప్రవీణ్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొనగా..టీఆర్‌ఎస్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రుద్ర రాజు, బూస సంతోష్, దేవకృష్ణ, మహిపాల్, సాయికృష్ణ తదితరులు బీజేపీలో చేరారు.
ప్రజా బలానిదే విజయం:
తమ ఆగడాలను కొనసాగించుకునేందుకు ధనబలంతో ప్రలోభాలకు గురి చేస్తున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థులు..ప్రజాబలం ముందు ఓడిపోవడం ఖాయమని బండి సంజయ్‌కుమార్ అన్నారు. కోట్ల రూపాయలతో ఎలాగైనా నెగ్గుతామని ప్రజల్లో విసృతంగా ప్రచారం చేసుకుంటున్న గంగుల, పొన్నంలను ధర్మపోరాటంలో నైతిక బలంతో ఓడిస్తామని వివరించారు. నగరంలోని వైష్ణవి గార్డెన్స్‌లో జరిగిన పలు ప్రజా సంఘాల, కులవృత్తి సంఘాల పెద్దలతో శుక్రవారం బీజేపీ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోట్టె మురళీకృష్ణ, తాళ్లపల్లి హరికుమార్‌గౌడ్, కొరిటాల శివరామయ్య, ఎంపీటీసీ గుంజేటి శివకుమార్, తాళ్లపల్లి శ్రీనివాస్, బోయినిపల్లి ప్రవీణ్‌రావు, దుబాల శ్రీనివాస్, జవ్వాజి రమేశ్, మూడపల్లి స్వామి, నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి, దాసరి రమణారెడ్డి, కడార్ల రతన్‌కుమార్, బండ రమణారెడ్డి, అంజన్‌కుమార్, పాశం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
నేడు మహా బైక్‌ర్యాలీ..
బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ నియోజకవర్గంలో మహాబైక్‌ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బోయినిపల్లి ప్రవీణ్‌రావు ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు బైపాస్‌రోడ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నుంచి ప్రారంభమై చింతకుంట గ్రామంలోని సాంప్రదాయ గార్డెన్ వరకు ర్యాలీ చేరుకుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment