1 నుంచి సీఈవో క్లబ్స్‌ ఇండియా సదస్సు | CEO Clubs India conference from 1 March 2024 | Sakshi
Sakshi News home page

1 నుంచి సీఈవో క్లబ్స్‌ ఇండియా సదస్సు

Published Tue, Feb 27 2024 5:07 AM | Last Updated on Tue, Feb 27 2024 5:07 AM

CEO Clubs India conference from 1 March 2024 - Sakshi

న్యూఢిల్లీ: సీఈవో క్లబ్స్‌ ఇండియా తమ వార్షిక సదస్సును మార్చి 1 నుంచి 3 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనుంది. ఇందులో 150 పైచిలుకు కంపెనీల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గోనున్నారు. మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సరీ్వసెస్‌ వ్యవస్థాపకుడు మధుకర్‌ గంగాడి, స్టార్‌ హాస్పిటల్స్‌ ఎండీ గోపీచంద్‌ మన్నం, నాంగియా ఆండర్సన్‌ ఇండియా చైర్మన్‌ రాకేష్‌ నాంగియా తదితరులు వీరిలో ఉంటారని సీఈవో క్లబ్స్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు కిశోర్‌ కొత్తపల్లి తెలిపారు.

కొత్త సవాళ్లు, అవకాశాలు, కలిసి పనిచేసేందుకు ఆస్కారమున్న అంశాలు మొదలైన వాటి గురించి చర్చించేందుకు, వివిధ రంగాల సీఈవోలు, ఎంట్రప్రెన్యూర్లు, ఆవిష్కర్తలు, లీడర్లు మొదలైన వారితో కనెక్ట్‌ అయ్యేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. 1977లో అమెరికాలో నెలకొలి్పన సీఈవో క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ కింద 2008లో హైదరాబాద్‌లో సీఈవో క్లబ్స్‌ ఇండియా ఏర్పడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement