clubs
-
1 నుంచి సీఈవో క్లబ్స్ ఇండియా సదస్సు
న్యూఢిల్లీ: సీఈవో క్లబ్స్ ఇండియా తమ వార్షిక సదస్సును మార్చి 1 నుంచి 3 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనుంది. ఇందులో 150 పైచిలుకు కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గోనున్నారు. మెడ్‌ప్లస్ హెల్త్ సరీ్వసెస్ వ్యవస్థాపకుడు మధుకర్ గంగాడి, స్టార్ హాస్పిటల్స్ ఎండీ గోపీచంద్ మన్నం, నాంగియా ఆండర్సన్ ఇండియా చైర్మన్ రాకేష్ నాంగియా తదితరులు వీరిలో ఉంటారని సీఈవో క్లబ్స్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కిశోర్ కొత్తపల్లి తెలిపారు. కొత్త సవాళ్లు, అవకాశాలు, కలిసి పనిచేసేందుకు ఆస్కారమున్న అంశాలు మొదలైన వాటి గురించి చర్చించేందుకు, వివిధ రంగాల సీఈవోలు, ఎంట్రప్రెన్యూర్లు, ఆవిష్కర్తలు, లీడర్లు మొదలైన వారితో కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. 1977లో అమెరికాలో నెలకొలి్పన సీఈవో క్లబ్స్ ఇంటర్నేషనల్ కింద 2008లో హైదరాబాద్‌లో సీఈవో క్లబ్స్ ఇండియా ఏర్పడింది. -
రాహుల్‌కు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
ఎర్రుపాలెం: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, మధిరల్లో సోమవారం జరిగిన మోటారు సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రధాని పదవినే త్యాగం చేసిన రాహుల్‌పై సభ్యత, సంస్కారం మరిచి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎప్పుడూ పబ్‌లు, క్లబ్‌ల వెంట తిరిగే కేటీఆర్‌కు పొలాలు పబ్లలా, మెకానిక్ షాపులు క్లబ్లలా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అవినీతిలో కూరుకున్న కేటీఆర్ వెంట ఈడీ, సీబీఐ పడుతుండటంతో బీజేపీ నాయకులతో అంటకాగుతూ వారి డైలాగ్‌లను వల్లె వేస్తున్నా రని విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించారు. ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయా అన్న ప్రశ్నకు భట్టి సమాధానం ఇస్తూ ఆయన వ్యాఖ్య లను కట్ చేసి చూపించారని ఆరోపించారు. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పేటెంట్ అని, తాము అధికారంలోకి రాగానే నూటికి నూరు శాతం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని భట్టి స్పష్టం చేశారు. -
క్లబ్బులు , పబ్బులు మూసివేయాలి బట్టి విక్రమార్క
-
క్లబ్బులు, అన్ని రకాల బార్లు ఇక ఓపెన్..
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో గత ఆరు నెలలుగా (మార్చి 14 నుంచి) మూతబడిన బార్లు, క్లబ్బులు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఉన్న బార్లు, క్లబ్బులను తక్షణమే తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులను తక్షణమే తెర వచ్చు. అయితే ఆయా ప్రదేశాల్లో సమూహాల ఏర్పాటు, మ్యూజికల్ ఈవెంట్లు, డ్యాన్స్ ఫ్లోర్లపై నిషేధం కొనసాగుతుంది. దీంతో పబ్బులు మళ్లీ తెరుస్తారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెల కొంది. అయితే బార్లకు అనుమతిచ్చిన ప్రభు త్వం వైన్‌షాపుల వద్ద పర్మిట్ రూంలపై ఉన్న నిషేధాజ్ఞలను ఎత్తేయలేదు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పర్మిట్ రూంలపై నిషేధం కొనసాగు తుందని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వం విధించిన షరతులు... ►బార్లలో ప్రవేశద్వారం వద్దే థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. థర్మల్ స్క్రీనింగ్ స్పర్శరహితంగా ఉండాలి. ►బార్లు, క్లబ్బుల్లో పరిశుభ్రత పాటించాలి. నిబంధనలకు అనుగుణంగా క్యూ పద్ధతి పాటించాలి. ►పార్కింగ్ ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలి. ►హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. బార్ సిబ్బంది కచ్చితంగా మాస్క్‌లు ధరించి సర్వీసు చేయాలి. ►ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు బార్ ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో శుభ్రపరచాలి. కస్టమర్ మారే ప్రతిసారీ సీట్లను శానిటైజ్ చేయాలి. ►బార్లు, క్లబ్బుల ప్రాంగణాల్లో గాలి, వెలుతురు వచ్చేలా చర్యలు చేపట్టాలి. -
అచేతనంగా ‘యువచేతన’
సాక్షి, ఆదిలాబాద్: యువతలో సామాజిక మార్పు తీసుకువచ్చి వారిని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసేలా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, వారు సమాజసేవకు పాటుపడేలా యూత్‌క్లబ్‌ల ఏర్పాటు లక్ష్యంతో ప్రభుత్వం నాలుగేళ్ల కిందట యువచేతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చదువుతో పాటు యువత సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా యువజనులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిది. ఇందుకోసం జిల్లా యువజన సర్వీసుల శాఖ ద్వారా 15 నుంచి 35 ఏళ్లలోపు యువతీ, యువకులతో యూత్ క్లబ్‌లు ఏర్పాటు చేసేలా నిర్ణయించింది. సామా జిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చే యువతకు చేయూతనిచ్చి వారిని అన్ని విధాలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన యువచేతన కార్యక్రమం జిల్లాలో నీరుగారి పోతోంది. నాలుగేళ్లలో జిల్లా లో సుమారు 566 యూత్‌క్లబ్‌లు ఏర్పాటు కాగా వాటిలో దాదాపు 9వేలకుపైగా యువత సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు, ప్రోత్సాహకాలు అందకుండా పోతున్నాయి. దీంతో పథక ఉద్దేశం నీరుగారిపోతోంది. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు.. మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే ఒక్కో యూత్ క్లబ్లో 10 నుంచి 15 మంది యువజనులు ఉండేలా గ్రామస్థాయిలో యువజన క్లబ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఒకరు ఆర్గనైజర్ లేదా అధ్యక్షుడిగా, డిప్యూటీ ఆర్గనైజర్ లేదా సెక్రెటరీగా జిల్లాలో దాదాపు 566 యూ త్క్లబ్లను ఏర్పాటు చేశారు. యూ™Œత్క్లబ్లకు ప్రభుత్వం చేయూత ఇవ్వడంతోపాటు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలకు రుణ సదుపాయం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు వాటిని ఏర్పాటు చేశారు. కానీ లక్ష్యం నెరవేరకపోవడంతో అవి కేవలం యూత్క్లబ్లుగానే మిగిలిపోయాయి. యువజన సంఘాల కార్యకలాపాలివే... యూత్‌క్లబ్‌లో 10 నుంచి 15 మంది సభ్యులుగా ఏర్పాటైన యువత ప్రధానంగా వారి నివాస ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం, వార్డు ప్రజలను ప్రోత్సహించడం చేయాలి. అంతేకాకుండా పాఠశాలకు వెళ్లని చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులతో చర్చించి వెంటనే చిన్నారులను పాఠశాలలో చేర్పించాలి. పరిసరాలన్నీ శుభ్రంగా ఉండేలా శ్రమదాన కార్యక్రమాలు చేపట్టాలి. జాతీయ పండగ (ఆగస్టు15, జనవరి26)లను నిర్వహించి జాతీయ సమైక్యత చాటేలా పాలుపంచుకోవాలి. యువజనులంతా సేవాకార్యక్రమాలు చేపట్టాలి. క్రీడాపోటీల నిర్వహణ, అవయవదానం ప్రాధాన్యతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలు నిర్వహించాలి. మండల స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించాలి. జిల్లాలో 566 క్లబ్‌లు.. జిల్లాలో ఇదివరకే యువజన సర్వీసులశాఖ ద్వారా 13 మండలాల పరిధిలో మొత్తం 566 యూత్ క్లబ్‌లు ఏర్పాటయ్యాయి. కొత్తగా యూత్‌క్లబ్‌లు ఏర్పాటు చేయాలంటే మొదట గ్రామాల్లోని వార్డుల వారీగా ఆసక్తి గల యువత యూత్ క్లబ్‌లను ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులను మొదట పంచాయతీ సెక్రెటరీకి అందజేయాలి. అక్కడి నుంచి ఆయా దరఖాస్తులు ఈఓపీఆర్డీ ద్వారా సంబంధిత మండలాల ఎంపీడీఓ జిల్లా యువజన క్రీడాశాఖకు అందజేయాల్సి ఉంటుంది. కొత్తగా యూత్‌క్లబ్‌ల ఏర్పాటుకు ఎలాంటి గడువు లేదు. ఎప్పుడైనా యువత యూత్‌క్లబ్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. సమాజాసేవలో భాగస్వామ్యం చేసేందుకే.. యువతను సమాజసేవలో భాగస్వాములను చేసేందుకే ప్రభుత్వం యువచేతన కార్యక్రమం నిర్వహిస్తోంది. యువజన సంఘాలకు రుణాల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవు. భవిష్యత్‌లో వస్తే వీరికే ప్రాధాన్యత కల్పిస్తాం. – ఎన్.వెంకటేశ్వర్లు, డీవైఎస్ఓ, ఆదిలాబాద్ రుణాలు అందజేయాలి డెబ్బై మంది యువత తో నాలుగేళ్ల కింద యూత్ క్లబ్ ఏర్పాటు చే శాం. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాం. యువతకు స్వయం ఉపాధి కల్పిస్తే ఆదాయంలో నుంచి సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించే అవకాశం ఉంటుంది. – ఎం.ప్రవీణ్, ప్రధానకార్యదర్శి, స్వయంకృషి యూత్‌క్లబ్, పల్లిబి, తలమడుగు -
పెద్దల బండారం బట్టబయలు
సాక్షి, అనంతపురం సెంట్రల్: పెద్దల బండారం బట్టబయలైంది. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. క్లబ్బుల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన 14 స్థావరాలపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కొన్నేళ్లుగా బహిరంగంగానే పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా క్లబ్బులు మారినా ఆ దరిదాపుల్లోకి కూడా పోలీసులు వెళ్లిన సందర్బాలు లేవు. అలాంటి వాటిపై ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు నేతృత్వంలో దాడులు నిర్వహించడం సర్వత్రాచర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు గురువారం స్థానిక పోలీసుకాన్ఫరెన్స్ హాల్లో విలేకరులకు తెలియజేశారు. అసాంఘిక కార్యాకలాపాలపై ఉక్కుపాదం అసాంఘిక కార్యాకలాపాలపై ఉక్కు పాదం మోపుతున్నామని ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో క్లబ్బులపై ఏకకాలంలో దాడులు చేశామన్నారు. మిగిలిన చోట్ల నిందితులు పట్టుబడకపోయినా జిల్లా కేంద్రంలోని అనంతపురం క్లబ్లో పేకాట ఆడుతున్న 42 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,87,417 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలో ఎక్కడా అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి వీలులేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఇసుక, రేషన్ బియ్యం, అక్రమ రవాణా, బెల్టు దుకాణాలు, మట్కా, పేకాట, క్లబ్‌లపై దాడులను ప్రాధాన్యతగా భావించి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 154 ట్రాక్టర్లు, నాలుగు టిప్పర్లు, లారీలను పట్టుకుని 26 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన 150 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నామన్నారు. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న 12 మంది నిందితులను అరెస్ట్ చేసి 337.6 క్వింటాళ్ల(564 బస్తాలు) రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. మట్కాపై జిల్లా వ్యాప్తంగా దాడులు చేసి 27 కేసులు నమోదు చేయడంతోపాటు రూ.1,87,880 నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పేకాటకు సంబంధించి 553 కేసులు నమోదు చేసి రూ.9,97,240 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పేకాటరాయళ్లను తరలిస్తున్న పోలీసులు గుట్కా విక్రయాలపై 21 కేసులు నమోదు చేసి, 27 మందిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.3,96,571ల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బెల్టు దుకాణాలపై దాడులు చేసి 128 కేసులు 3,714 మద్యం సీసాలు, 149 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. జిల్లాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ చౌడేశ్వరి పాల్గొన్నారు. ముందస్తు సమాచారంతో తప్పించుకున్న పేకాటరాయుళ్లు క్లబ్ బయట నిల్చున్న డీఎస్పీ శ్రీనివాసులు సాక్షి, కదిరి: పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సీఆర్సీ క్లబ్‌పై గురువారం పోలీసులు మెరుపు దాడి చేసేందుకు వెళ్లారు. అయితే ముందస్తు సమాచారంతో పేకాటరాయుళ్లు అక్కడి నుంచి జారుకున్నారు. గత నెల 27న ‘ఇక్కడ పేకాట మామూలే’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు గురువారం జిల్లా వ్యాప్తంగా పేకాట క్లబ్‌లపై మెరుపు దాడులు చేయించారు. కదిరిలో సీఆర్సీ క్లబ్‌పై కూడా దాడి చేయడానికి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ బీవీ చలపతి, ఎస్ఐ ఖాజాహుస్సేన్ ఇంకా పలువురు పోలీసులు అక్కడికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే విషయం సీఆర్సీ క్లబ్ సభ్యులకు పోలీసులే కొందరు సమాచారం అందించడంతో పేకాటరాయుళ్లు తప్పించుకున్నారు. ముందస్తు సమచారం లేకుంటే మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అనుచరులు పట్టుబడేవారని కొందరు సీఆర్సీ క్లబ్ సభ్యులే అంటున్నారు. డీఎస్పీతో పాటు ఇతర కింది స్థాయి అధికారులు కాసేపు సీఆర్సీ క్లబ్ గేట్ ముందు గడిపి వెనుదిరిగారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా.. నగరంలోని అనంతపురం క్లబ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఈ క్లబ్‌కు అధ్యక్షులు జిల్లా కలెక్టర్, ఉపాధ్యక్షులు ఎస్పీలు వ్యవహరిస్తారు. రిక్రియేషన్ కోసం ఏర్పాటు చేసి క్లబ్ పేకాట, తాగుడుకు కేంద్రంగా మారింది. దీంతో పెద్దమనుషులుగా చలామణి అవుతున్న వారు, రిటైర్డ్ ఉద్యోగులు, చోటామోటా నాయకులు, ప్రజాప్రతినిధులు వారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఎంచుకున్నారు. ఇక్కడ తాగడం, పేకాట ఆడడం లైసెన్స్‌గా భావించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు కొరడా ఝలిపించారు. డీఎస్పీ పీఎన్ బాబు ఆధ్వర్యంలో నాలుగు పోలీసుస్టేషన్ల అధికారులు క్లబ్‌పై మెరుపుదాడులు నిర్వహించారు. 42మంది అరెస్ట్ చేసి నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవలు కొట్టారయ్యా?!
ఎవరూ కొట్టలేదు. ఊరికే ఏడుస్తున్నాడు కిట్టయ్య. కిట్టయ్యే కాదు, కిట్టమ్మా.. ఏడుస్తోంది చూడండి!ఏడుపు క్లబ్లో చేరి మరీ చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు.ఆరోగ్యానికి మంచిదట. లాఫింగ్ క్లబ్ పెట్టిన ఆయనేఇప్పుడు..క్రయింగ్ క్లబ్ కూడా పెట్టి మరీ ఏడిపిస్తున్నాడు. పెద్దవాళ్లకంటే చిన్నపిల్లలే ఆరోగ్యంగా ఉంటారు శారీరకంగా.. మానసికంగా. ఎందుకంటే పిల్లలు మనసారా నవ్వుతారు.. కడుపారా ఏడుస్తారు! ఏ ఉద్వేగాన్నీ దాచుకోరు. పెద్దవాళ్లకు ఉన్నట్లు పిల్లలకు భావోద్వేగాల దాపరికాలు ఉండవు! అంతెందుకు.. బిడ్డ పుట్టగానే ఏడిస్తేనే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టని నమ్ముతాం. అంటే ఆరోగ్యానికి ఏడుపే సంకేతమన్నట్టు కదా! చైల్డ్ సైకాలజీ లెసెన్కు ఇదేదో ఉపోద్ఘాతమనుకునేరు. కాదు.. పెద్దవాళ్లు ఆనందంగా ఉండడానికి ఏర్పాటు చేసిన ఓ క్లబ్‌కు ఇంట్రడక్షన్. లాఫింగ్ క్లబ్ కాదు. దేశంలో ఏర్పాటైన మొట్టమొదటి ‘క్రయింగ్ క్లబ్’ అది! సూరత్‌లో (గుజరాత్) స్టార్ట్ చేశారు. సంస్థాపకుడు కమలేష్ మసల్వాలా. బాగా పేరున్న సైకాలజిస్ట్. 62 ఏళ్లు. చాలా మందికి కౌన్సెలింగ్ ఇచ్చేవాడు. నవ్వు మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుందని, వృద్ధాప్యాన్ని దూరం చేస్తుందనీ తన పేషంట్స్‌కి చెప్పి.. లాఫింగ్ క్లబ్లో చేరమని సలహా కూడా ఇచ్చేవాడు. లాఫ్టర్ థెరపిస్ట్‌గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరూ పొందాడు. అయినా మందుల వాడకం, మనో వ్యాకులత తగ్గకపోవడం గమనించాడు. కారణం ఏంటని అన్వేషించాడు. చుట్టూ ఉన్న మనుషులను, పరిసరాలను పరిశీలించడం మొదలుపెట్టాడు. అప్పుడు తెలిసింది.. క్రయింగ్ క్లబ్ తెరుచుకుంది! ఆరోగ్యానికి ‘హాయి’కరం కమలేష్ మసల్వాలా చిన్న పిల్లలను చూశాడు. వాళ్ల కేరింతలను, ఏడుపునూ అబ్జర్వ్ చేశాడు. జవాబు దొరికింది. ఒత్తిడి ఎక్కువైన ఆధునిక జీవన శైలిలో బాధ, దిగులు గూడుకట్టుకుంటుందే తప్ప దానికి అవుట్లెట్ లేదు. సంతోషానికి ఇంకో తలుపు తెరవాలనే చెప్తూ వచ్చాడు తప్ప భావోద్వేగాలను బంధించి ఉంచాలనే పాతకాలపు భావాల ద్వారాన్ని బద్దలు కొట్టాలని చెప్పలేదు. మనలో ఉన్న బాధ కన్నీళ్లుగా బయటకు వస్తే తప్ప అసలైన సంతోషం హృదయంలోకి చేరదు, మొహంలో ప్రతిఫలించదు. కాబట్టి ముందు కన్నీళ్లకు తలుపులు తెరవాలని అని నిశ్చయించుకున్నాడు కమలేష్. ఆ విషయాన్ని సూరత్‌లో ఉన్న తనకు సన్నిహితులైన కొంతమంది సైకాలజిస్ట్‌లు, సైకియాట్రిస్ట్‌లకు చెప్పాడు. క్రయింగ్ క్లబ్ పెట్టాలన్న కమలేష్ నిర్ణయానికి ఊతమిచ్చారు వాళ్లంతా. అలా వాళ్లందరి సహకారంతో 2017లో ‘హెల్దీ క్రయింగ్ క్లబ్’ను ప్రారంభించాడు కమలేష్. టియర్స్ టు చీర్స్ ‘‘టియర్స్ టు చీర్స్’’లక్ష్యంతో హెల్దీ క్రయింగ్ క్లబ్ పనిచేస్తోంది. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ‘మ్యాజికల్ థెరపటిక్ ప్రొసీజర్ ఆఫ్ క్రయింగ్ అవుట్ లౌడ్’ తో క్లబ్‌కి వచ్చిన వాళ్లలో ఆనందాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కమలేష్. మారిన లైఫ్ స్టయిల్లోని వేగం.. మన గురించి మనం పట్టించుకోకపోవడం.. కన్నీళ్లు పెట్టుకోవడం మనిషి బలహీనతకు చిహ్నమనే అపోహ వంటి వాటివల్ల డిప్రెషన్ మనిషిని స్థిరనివాసంగా మార్చుకుంది. నవ్వడం మర్చిపోయినట్టే ఏడ్వడాన్ని తొక్కిపెట్టాడు. క్రయింగ్ థెరపీ కోసం ప్రపంచంలోని హ్యాపీ థెరపీలన్నిటినీ అభ్యసించాడు, పరిశోధించాడు కమలేష్. అన్నిటి ఫలితమే క్రయింగ్ అవుట్ లౌడ్. ఈ పద్ధతిలో తను ఇస్తున్న ట్రీట్మెంట్తో తన పేషంట్స్ ఇతర జబ్బులకు వాడే మందుల్లో దాదాపు యాభై శాతం మందుల వాడకం తగ్గిపోయిందట. తొలినాళ్లలో ఈ క్లబ్‌కి యాభై ఏళ్ల నుంచి అరవై ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు ఎక్కువగా వచ్చేవారట. ఇప్పుడు ఇరవై నుంచి ఎనభైఏళ్ల వాళ్లు వస్తున్నారట. ప్రతి నెల మరింత మంది చేరుతున్నారు. ఏడుపు.. సంతోషానికి తొలి మెట్టు అని శాస్త్రీయంగా కూడా రుజువైన సత్యం. ఏడిస్తే శరీరానికి హానిరకమైన టాక్సిక్ హార్మోన్, కార్టిసోల్ విడుదలై బయటకు వెళ్లిపోతాయి. దాంతో మనసు, శరీరం తేలికై పాజిటివ్ ఎనర్జీతో ఉత్తేజితమవుతాయట. ‘‘మనసులో ఉన్న బాధను బయటకు చెప్పుకుంటూ ఏడ్చాక చాలా మంది తేలికపడి.. సంతోషంగా ఫీలవుతున్నారు. ఏడ్వడం పిరికివాళ్ల లక్షణం, ఏడుపు బలహీనత వంటి అర్థంలేని మాటలను లైఫ్ డిక్షనరీలోంచి తొలగించండి. ఏడుపు వచ్చినప్పుడు ఏడ్వాలి. బాధ పంచుకుంటే తగ్గుతుంది.. సంతోషం పంచుకుంటే పెరుగుతుంది అన్న నానుడి ఉండనే ఉంది. దీన్ని ప్రాక్టీస్‌లో పెడితే.. సంతోషం మీ వెంట ఉన్నట్టే. ప్రతి రాత్రి తర్వాత ఉదయం అనివార్యం. బాధ బయటకు వెళితేనే సంతోషం వచ్చి చేరుతుంది. కడుపులో దుఃఖాన్ని కన్నీళ్ల రూపంలో పంపించేయండి... నవ్వుల రూపంలో సంతోషాన్ని మనసులో భద్రం చేసుకోండి’’ అంటాడు కమలేష్ మసల్వాలా. క్రయింగ్ క్లబ్లో నెలనెలా పెరుగుతున్న సంఖ్యను చూసి.. దీన్ని దేశంలోని మిగతా ప్రాంతాలకూ విస్తరింపచేసే ఆలోచనలో ఉన్నాడు కమలేష్. అంతేకాదు.. సూరత్‌లోనే లాఫ్టర్ అండ్ క్రయింగ్ థెరపీని కలుపుతూ ఓ ప్రయోగం చేయబోతున్నట్టు చెప్పాడు కమలేష్. ఏడుపు.. ఏడువిధాల మేలు అనే మాట ఖాయం కానుందన్నమాట. సోషల్ మీడియా భాషలో కూడా లాల్ (లాఫింగ్ అవుట్ లౌడ్) ఉన్నట్టే .. కాల్.. క్రయింగ్ అవుట్ లౌడ్ కూడా రానుందన్నమాట. డబ్బులు ఇచ్చి మరీ..! ఎన్నో కొత్త ఆవిష్కరణలకు జపాన్ దేశమే ప్రయోగశాల. క్రయింగ్ క్లబ్స్‌కి కూడా జపానే మూలం. టోక్యోలోని మిట్సుయి గార్డెన్ యోట్సుయా అనే హోటల్లోనైతే ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా ‘‘క్రయింగ్ రూమ్స్’’ను ఏర్పాటు చేశాయి. రోజుకి పదివేల జపనీస్ యెన్ అంటే 6,120 రూపాయలు చార్జ్ చేస్తారట ఈ క్రయింగ్ రూమ్స్‌కి. కళ్లు, ముక్కు తుడుచుకునే టిష్యూస్, దుఃఖాన్ని తెప్పించే విషాదభరితమైన సినిమాలు, విషాదభరితమైన సంగీతం వంటి వన్నీ ఆ గదిలో ఉంటాయి. ఈ క్రయింగ్ క్లబ్ కల్చర్‌ను జపాన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ కూడా దిగుమతి చేసుకుంది. లండన్‌లో క్రయింగ్ క్లబ్‌లు ఓ పరిశ్రమగా మారాయి. యూరప్‌లో ఇప్పుడిప్పుడే క్రయింగ్ క్లబ్‌లు తెరుచుకుంటున్నాయట. అమెరికాలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అక్కడ వెబ్‌సైట్స్ కూడా వెలిశాయట. ఏడుస్తూ ఫోటోలు తీసుకుని .. ఏడ్చిన కారణం, ఏడ్చిన తర్వాత కలిగిన అనుభూతి వంటి వాటిని ఆ ఫోటో కింద రాసి వెబ్సైట్లో పోస్ట్ చేయాలి. ఈ వెబ్సైట్లకు చాలా క్రేజ్ ఉందట. -
పస్చిమగోదావరి జిల్లాలో జోరుగా పేకాట
-
పక్క రాష్ట్రాల్లో పత్తాలాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేకాట క్లబ్బులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో నిర్వాహకులు రూట్ మార్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర సరిహద్దుల్లో పేకాట క్లబ్బులు నిర్వహించిన వారు ఇప్పుడు మరింత అప్రమత్తతతో బెంగళూరు, ముంబై, గుంటూరును అడ్డాగా చేసుకున్నారు. రాష్ట్రంలో క్లబ్బులు నిర్వహించడం తప్పు గానీ, రాష్ట్రం బయట ఏం చేసుకున్నా తమను ఏంచేయాలేరంటూ హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు నిర్వాహకులు కోట్ల రూపాయల్లో జూదరుల నుంచి దండుకుంటున్నారు. మూడు ప్రధాన కేంద్రాలు... గుంటూరు జిల్లాల్లోని దాచేపల్లిలో, కర్నాటక సరిహద్దు రాయ్‌చూర్‌లో... బోయినిపల్లికి చెందిన ఓ క్లబ్ నిర్వాహకుడు పేకాట కేంద్రాలను నిర్వహించేవాడు. అయితే రాయ్‌చూర్ స్థానిక వ్యాపారి ఆ క్లబ్‌ను కొనుగోలు చేయడం, ఈ నెల 16న గంజాయి స్మగ్లింగ్ పేరుతో దాచేపల్లి క్లబ్‌ను పోలీసులు మూసివేయించడంతో ఈసారి దందాకు బెంగళూరును ఎంచుకున్నాడు. బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి ఇప్పటికే బెంగళూరులో రెండు క్లబ్‌లను లీజ్‌కు తీసుకొని నడిపిస్తున్నాడు. ఇది తెలిసిన బోయినిపల్లికి చెందిన క్లబ్ నిర్వాహకుడు ఆ నగరాన్ని ఎంచుకున్నాడు. బేగంబజార్‌కు చెందిన ఓ అగర్వాల్ ఏకంగా ముంబైలోని థానే పరిధిలో మూడు క్లబ్‌లు, బీదర్‌లో మరో రెండు క్లబ్‌లు ఏర్పాటుచేసి దందా సాగిస్తున్నాడు. రాకపోకల ఖర్చు వాళ్లదే... పేకాట కోసం వెళ్లేవారి విమాన టికెట్లు, గెస్ట్‌హౌస్, ఏసీ వెహికల్ అన్ని నిమిషాల్లో క్లబ్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. దీని కోసం రూ.2 లక్షలు వసూలు చేస్తున్నట్లు బేగంబజార్‌కు చెందిన ఓ వ్యాపారి ‘సాక్షి’ తెలిపారు. ప్రతీ రోజూ ఈ ముగ్గురు వ్యక్తులు నడిపిస్తున్న క్లబ్‌లకు 350 మంది వివిధ మార్గాల ద్వారా వెళ్తున్నారని, శని, ఆదివారాలు వస్తే బెంగళూరు, బీదర్‌కు ఏసీ బస్సులు, ముంబైకి విమానాల్లో 500 మంది కస్టమర్లు వెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒక్క హైదరాబాద్ నుంచే ఇంత మంది వెళ్తున్నారని, ఇప్పుడు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల నుంచీ రద్దీ పెరిగిందని వివరించారు. ఇలా నిత్యం ఈ ముగ్గురు రూ.2.5 కోట్ల వరకు దందా సాగిస్తున్నారని తెలిపారు. లక్షల్లో గోవిందా... పేకాట కోసం వెళ్తున్న వారి సంఖ్య పెరగడంతో వ్యాపారులే ఏసీ బస్సులను కొనుగోలు చేస్తున్నారు. బోయినిపల్లికి చెందిన నిర్వాహకుడు ఏకంగా నాలుగు ఏసీ బస్సులు కొన్నాడు. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న కొందరు ఇక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, అయితే డబ్బు పోగొట్టుకుంది వేరే రాష్ట్రం కావడంతో తాము ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతున్నామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. -
పచ్చ అండ..పేకాట దందా..!
-
మూడుముక్కలాట
► పచ్చని కుటుంబాల్లో పేకాట చిచ్చు ► అనుమతి రమ్మీకి..ఆడుతోంది తీన్‌పత్తా ► తనిఖీలకు పూనుకోని పోలీస్‌శాఖ బలవుతున్న మధ్యతరగతి ► ఆట కోసం ఇతర జిల్లాల నుంచి రాక.. ► జిల్లాలో రిక్రియేషన్ క్లబ్‌ల పేరిట దందా పచ్చని కుటుంబాల్లో పేకాట చిచ్చు పెడుతోంది. మూడు ముక్కలాట మధ్యతరగతి కుటుంబాలను ముక్కలు చేస్తోంది. ప్రభుత్వ ఉక్కుపాదంతో పేకాట క్లబ్‌లు కొన్నాళ్లు మూతపడగా.. కొందరు కోర్టుకు వెళ్లి రిక్రియేషన్ క్లబ్‌ల పేరిట మళ్లీ పేకాట దందాకు తెరలేపుతున్నారు. దీంతో ఇతర జిల్లాలనుంచి ఇక్కడికి పేకాడేందుకు తరలివస్తున్నారు. ఇతర జిల్లాల్లో అనుమతివ్వని పోలీస్‌శాఖ మన జిల్లాలో మాత్రం పేకాట నిర్వహణకు తలుపులు బార్లా తెరవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. - కరీంనగర్ క్రైం పేకాటలో చిత్తవుతున్నవారి బాధలు చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్... తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పేకాట స్థావరాలు, క్లబ్‌లు మూసేయించాలని డీజీపీకి ఆదేశాలు జారీచేశారు. దీంతో క్లబ్‌లు, పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపాలని ఆయా జిల్లాల ఎస్పీలకు డీజీపీ అనురాగ్‌శర్మ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు పలు జిల్లాల్లో పోలీసులు వాటి ని మూసివేయించారు. దీనిపై పలువురు వీటిపై కోర్టుకు వెళ్లారు. ఈక్రమంలో జిల్లాలో కొన్ని పేకాట క్లబ్లకుఅనుమతి ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోటాపోటీజిల్లాలో పేకాట క్లబ్‌లకు అనుమతులు మంజూరయ్యాయని కొంతకాలంగా ప్రచారం చేసుకున్న జి ల్లాలోని ఓ రిక్రియేషన్ క్లబ్ అనేక మందిని సభ్యులు గా చేర్చుకున్నారు. సభ్యత్వం కోసం అక్షరాల రూ. లక్ష వసూలు చేశారని సమాచారం. సభ్యులుగా చేరి న వారికి మాత్రమే పేకాట ఆడడానికి అనుమతిస్తా రు. కొత్తగా ఏర్పాటుచేసిన క్లబ్లో పేకాట ఆడడానికి మాత్రమే వచ్చే వారికి కోసం ప్రత్యేకంగా రూ.20 వేల నుంచి రూ.40 వేలు వసూలు చేసి సభ్యులుగా తీసుకుంటున్నారని తెలిసింది. ఈ విషయం పేకాటరాయుళ్లకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపిస్తుండడంతో జిల్లాతోపాటు వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అనేకమంది పేకాడేందుకు జిల్లాకు తరలివస్తున్నారు. వీరి రాకతో సదరు క్లబ్ కళకళలాడుతోంది. వీరికే అనుమతులెందుకు? రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్‌లను ప్రభుత్వం మూసేయించడంతో కొందరు నిర్వాహకులు, ఇతరులు కోర్టులను ఆశ్రయించారు. ఈక్రమంలో కోర్టు పలు నిబంధనలు పెట్టింది. దీంతో పేకాట క్లబ్‌లను నిర్వహించడం తమతో కాదంటూ అనేకమంది మూసివేశారు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోనే మూతపడగా.. జిల్లాలో అనుమతి రావడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని పోలీస్‌శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ పేకాట క్లబ్‌లకు అనుమతులు రాకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మాత్రం కొందరు పోలీసు అధికారుల మద్దతుతోనే అనుమతులు మంజూరు చేశారని ప్రచారం జరుగుతోంది. పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టి పలువురి ఆత్మహత్యకు కారణమైన పేకాట క్లబ్‌లను మూసివేయాలనే డిమాండ్‌తో మహిళా సంఘాలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. నిబంధనలు తోసిరాజని... నిబంధనలను అమలు చేస్తున్నామంటూనే క్లబ్ నిర్వాహకులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. రిక్రియేషన్ క్లబ్లో సభ్యులను మాత్రమే పేకాట ఆడుకోవడానికి అనుమతిస్తారు. రమ్మీ మాత్రమే ఆడాలి. క్లబ్లో రెండుసెంటర్లు ఏర్పాటు చే స్తున్నట్లు సమాచారం. ఒకటి నిబంధనల ప్రకారం సీసీ కెమెరాల కింద కొన్ని టేబుల్స్ నిర్వహిస్తుంటారు. ఇక్కడ రమ్మీ మాత్రమే ఆడుతారు. మరోటి క్లబ్ చివరలో రహస్యంగా ఏర్పాటుచేసిన సెంటర్లో రూ.5 వేలు, రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ తీన్‌పత్తా(మూడు ముక్కలాట) ఆడిస్తున్నారని తెలుస్తోంది. సెంటర్లో కొంతకాలం సీసీ కెమెరాల వద్ద ఆడిన వారిని.. సమస్యలు లేవని నిర్ధారించుకున్నాకనే రహస్య కేంద్రంలోకి అనుమతిస్తున్నారని సమాచారం. ఈ క్లబ్ నిర్వహణపై అనుమానం వ్యక్తం చేస్తున్న కొందరు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం. బయట సైతం కొన్నిచోట్ల మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. పోలీసులు దాడులు చేస్తున్నా... కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఆట కొనసాగిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలే సమిధలు పేకాటలో ఎక్కువగా బలవుతోంది మధ్యతరగతి ప్రజలే. మొదట వారికి కొంచెం లాభం వచ్చేట్లు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. మరింతగా అప్పుచేసి ఆటలో పెడుతుండడంతో ఉన్నదంతా పోయి రోడ్డు మీద పడడంతోపాటు పలువురు తీరని అప్పులు చేస్తూ నష్టపోతున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చాలామంది బయటకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకోవడమో... ఊరు విడిచి వెళ్లిపోవడమో చేస్తున్నట్లు సమాచారం. -
లయన్ క్లబ్లో ఉచిత కంటిపరిక్షలు
-
రీమిక్స్ రీచార్జ్
‘వయ్యారి భామ’కు సిటీ డీజే స్వరాల జోడింపు తె లుగు డీజే పృధ్వి మిక్స్ ఆల్బమ్స్‌కు ఊపు ‘యూట్యూబ్’లో తొలి తెలుగు డబ్‌స్టెప్ మిక్స్ హల్చల్ పబ్స్.. క్లబ్స్ ఈవెంట్స్‌లో మ్యూజిక్‌ని కదం తొక్కించే డిస్క్ జాకీ (డీజే)లు సిటీకి కొత్తకాదు. అయితే, అంత మాత్రాన డీజేల క్రేజ్ ఎల్లలు దాటదు. సొంతంగా ఆడియో, వీడియో ఆల్బమ్స్ రూపొందించి విడుదల చేయడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. సిటీ డీజేలు ఈ విషయంలో కొంత వెనుకంజలో ఉన్నా.. డీజే పృథ్వి ‘మిక్స్ ట్రాక్’ను కదం తొక్కించాడు. అదీ ఇటీవలే ఊపందుకున్న ‘డబ్ స్టెప్’ శైలిలో కావడం విశేషం. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి బాలీవుడ్లో భళా.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం రీమిక్స్ ఆల్బమ్స్ బాగా పాపులర్. హిందీ పాటల మిక్సింగ్‌తో మొదలైన ట్రెండ్.. తెలుగుకూ విస్తరించింది. అప్పట్లో ఘంటసాల పాటలను రీమిక్స్ చేసి విడుదల చేసిన ఆడియో ఆల్బమ్స్ కొన్ని సూపర్‌హిట్ అయ్యాయి కూడా. అయితే, తర్వాత ఈ ధోరణిలో మార్పు వచ్చింది. పాప్ గాయని స్మిత ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల...’తో పాత పాటలకు కొత్త స్వరాలు సమకూర్చే ట్రెండ్ మళ్లీ పుంజుకుని వరుసగా కొన్ని ఆల్బమ్స్ వచ్చాయి. మళ్లీ కొంత గ్యాప్. తర్వాత హీరో చిరంజీవి హిట్ సాంగ్స్‌ని ‘మెగామిక్స్’ పేరుతో నగరానికే చెందిన డీజే ప్రభు రూపొందించారు. అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆయనే ఇళయరాజా పాటల మిక్స్ ఆడియోను ‘చలాకీ చిన్నది’ పేరుతో విడుదల చేశారు. రానురానాను పూర్తి పాటను నవీకరించే రీమిక్స్లూ తగ్గిపోయాయి. పాత పాటకు తమవైన సంగీత ప్రత్యేకతను జత చేసే డీజే మిక్స్‌లూ అరుదైపోయాయి. అదే సమయంలో హిందీ పాటల మిక్సింగ్ ఎప్పటికప్పడు వైవిధ్య రీతులను సంతరించుకుంటూ ఊపందుకుంటోంది. సినీతారలు కూడా మ్యూజిక్ ఆల్బమ్స్‌పై మోజు పెంచుకునేంతగా బాలీవుడ్లో మిక్సింగ్ విజృంభిస్తోంది. అక్కడి ఆల్బమ్స్ విజృంభణకు ముంబై డీజేల క్రియేటివిటీయే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ఎప్పటికప్పుడు హిట్ సాంగ్స్‌కు సొంత ట్రాక్‌లు, మరోవైపు పాత పాటలకు కొత్త సంగీతాన్ని జత చేస్తూ నార్త్‌లో దూసుకుపోతున్నారు డీజేలు. అయితే మన సిటీ డీజేలు కూడా హిందీ, ఇంగ్లిష్ ట్రాక్స్‌నే మిక్సింగ్‌కు ఎంచుకుంటుండటంతో నేటి యువ శ్రోతలకు నిన్నటి పాటలను కొత్త శైలిలో వినే అవకాశం దక్కడం లేదు. మరోపక్క తెలుగు పాటల మిక్స్ ఆల్బమ్స్‌కు సినిమాల్లో రీమిక్స్ పాటల వెల్లువ అడ్డుకట్ట వేసింది. సినీ సంగీత దర్శకులే రీమిక్స్ పాటలకు సై అంటుండడంతో ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించేవారు సెలైంటైపోయారు. ఈ నేపథ్యంలో తెలుగు పాటల మిక్సింగ్ ట్రెండ్‌కు కాసింత ఊపు నిచ్చేలా సిటీ డీజే పృథ్వీ తాజాగా ఒక పాత పాటకు డీజే మిక్స్ చేశారు. కిక్ ఇచ్చిన ‘డబ్ స్టెప్’.. ఈ డబ్ స్టెప్ మూలాలు ఇంగ్లాండ్‌లోని సౌత్ లండన్‌లో ఉన్నాయని చెబుతారు. డ్రమ్స్, పెర్క్యుషన్, బాస్ ఫ్రీక్వెన్సీస్ మేళ వింపుతో సాగే ఈ శైలి.. బాగా ప్రయోగాత్మకంగా సాగే రీమిక్స్‌లకు పేరొందింది. మూలాలు మూడు దశాబ్దాల క్రితమే ఉన్నాయని గుర్తించినా, 2010 నుంచి లండన్ నైట్ క్లబ్స్‌లో డబ్ స్టెప్ స్టైల్‌ను డీజేలు బాగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. పెద్ద పెద్ద మ్యూజిక్ కన్సర్ట్స్ ద్వారా అమెరికాలో దీని పాపులారిటీ పెరగడంతో ఇప్పుడిప్పుడే ఆసియా దేశాలకు సైతం విస్తరించింది. డిస్క్ జాకీల రీమిక్స్‌ల ఆధారంగా విజృంభిస్తున్న డబ్స్టెప్ను సిటీ డీజే పృథ్వీ తన తాజా మిక్సింగ్‌కు వినియోగించడం ఇప్పుడు నగరంలో మరికొందరు డీజేలను ఇన్స్పైర్ చేస్తోంది. ‘వయ్యారి భామ’కు వన్నె చిన్నెలు.. పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘తమ్ముడు’లోని ‘వయ్యారి భామా నీ హంస నడక..’ పాట అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. వైవిధ్యమైన సంగీతానికి పెట్టింది పేరైన రమణ గోగుల కూర్చిన ఈ పాట ఇప్పుడు విన్నా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలాంటి పాటనే ఎంచుకున్నాడు సిటీ యంగెస్ట్ అండ్ బెస్ట్ డీజేగా పేరొందిన పృథ్వి. ‘నేను పవన్ కల్యాణ్ అభిమానిని. వయ్యారి భామ పాట అంటే నాకు చాలా ఇష్టం. అలాగే తమ్ముడు సినిమాలో పవన్ చేసిన కొన్ని హాస్య సన్నివేశాలు, ఆడవారి గొంతును అనుకరిస్తూ మాట్లాడిన మాటలు.. వంటివి ఇప్పటికీ యూత్ సరదా చాట్స్‌లో చోటు చేసుకుంటూనే ఉంటాయి. అందుకే ఆ పాటను, కొన్ని మాటలను, నా మ్యూజిక్‌ని మిక్స్ చేసి కొత్తగా విడుదల చేశా’నన్నాడు పృథ్వి. రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఈ పాట.. వేల సంఖ్యలో హిట్స్‌తో వీక్షకుల ఆదరణ పొందిందంటున్నాడీ యంగ్ డీజే స్టార్. త్వరలోనే మరికొన్ని తెలుగు మ్యూజిక్ ఆల్బమ్స్ చేయాలని అనుకుంటున్నట్లు పృథ్వీ చెప్పాడు. -
క్లబ్బులు... డబ్బులు!
ఏపీలో పేకాట క్లబ్బుల పునఃప్రారంభానికి భారీగా పైరవీలు పీఎంవో నుంచి పోలీసు అధికారులకు ఒత్తిళ్లు అధికారులు-నేతల మధ్య సాగుతున్న కోల్డ్‌వార్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొన్నేళ్లుగా మూతపడి ఉన్న పేకాట క్లబ్బులపై తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఒకరు కన్నేశారు. వీటిని తెరిపించేందుకు భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారుస్తున్నారు. క్లబ్బులు మళ్లీ తెరిపించడాన్ని ఉన్నతాధికారులు వ్యతిరేకిస్తుండటంతో అధికారులు-నేతల మధ్య కోల్డ్‌వార్ సాగుతోంది. సదరు నేత ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రిక్రియేషన్ పేరుతో ఏర్పాటైన పలు క్లబ్బులు పేకాట కేంద్రాలుగా మారిపోవడంతో గతంలో చాలామంది రోడ్డున పడ్డారు. దీంతో వీటిని మూయించాలనే నిరసన ఉద్యమాలు నడిచాయి. ఆ నేపథ్యంలో నాలుగేళ్ల కిందట పేకాట క్లబ్బులపై పోలీసులు నిషేధం విధించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమకు చెందిన జిల్లా పరిషత్ స్థాయి నేత కన్ను వీటిపై పడింది. తనకు ప్రధాన అనుచరుడు, ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో నేతతో కలసి రంగంలోకి దిగారు. రాష్ట్రంలో మూతపడిన పేకాట క్లబ్బుల జాబితాను ఆ అనుచరుడు సేకరించి జిల్లా పరిషత్ స్థాయి నేతకు అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఓ ఉన్నతాధికారి అండతో క్లబ్బుల్ని తెరిపించేందుకు సదరు నేత పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. క్లబ్బుల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్న ఆ నేత, లోకల్ నుంచి హైదరాబాద్ వరకూ భారీ స్థాయిలో ముడుపులు ముట్టజెపుతున్నారని సమాచారం. యువనేత వద్ద పంచాయితీ.. ఇక సీఎంవో అధికారి.. పై స్థాయి పోలీసు అధికారుల నుంచి జిల్లాల ఎస్పీల వరకూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. రెండు నెలల క్రితం రాజధాని ప్రకటిత జిల్లాలో రెండు క్లబ్బులు పునఃప్రారంభమయ్యాయి. ఇది తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు వాటిని మూయించాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఒకదాన్ని మూయించిన అధికారులు మరోదానిపై నిఘా పెట్టారు. రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లోనూ క్లబ్బులు పునఃప్రారంభానికి ఒత్తిళ్లు వస్తున్నాయని జిల్లా అధికారులు.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పేకాట క్లబ్బులకు అనుమతి ఇవ్వద్దంటూ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది తెలిసిన ‘జిల్లా పరిషత్ నేత, క్లబ్బుల పంచాయితీని ప్రభుత్వంలో అనధికారిక నెంబర్ 2 యువనేత వద్ద పెట్టారు. ఆయన ప్రయత్నించినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు ససేమిరా అంటుండటంతో కోల్డ్‌వార్ మొదలైంది. తీవ్రస్థాయి రాజకీయ ఒత్తిడిల నేపథ్యంలో స్థానిక అధికారులు కొన్ని క్లబ్బుల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిసింది. -
200 కోట్లతో జల్సా
గ్రేటర్లో భారీగా నూతన సంవత్సర ఖర్చు రూ.100 కోట్ల విలువైన మద్యం గత ఏడాదితో పోలిస్తే 9 శాతం వృద్ధి డీజే, రాక్నైట్స్, విందు వినోదాలకు మరో రూ.100 కోట్లు మద్యం విక్రేతలు...‘పండగ’ చేసుకునేలా...క్లబ్‌లు...పబ్‌ల నిర్వాహకులు ఏడాదంతా గుర్తుంచుకునేలా... హోటళ్లు, రిసార్టుల వారు ఎప్పటికీ మరచిపోలేని విధంగా... సిటీజనులు నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. అక్షరాలా రూ.200 కోట్లు వెచ్చించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సంతోషాన్ని... వేడుకల నిర్వాహకులు పూర్తి స్థాయిలో సొమ్ము చేసుకున్నారు. కొందరైతే ఏడాది వ్యాపార లక్ష్యాన్ని రెండు రోజుల్లో సాధించారు. సిటీబ్యూరో: ఒకటీ... రెండూ కాదు... ఏకంగా రూ.200 కోట్లు ఉఫ్ అని ఊదేశారు. అదీ కేవలం రెండు రాత్రుల్లోనే. ఇదీ గ్రేటర్లో కొత్త సంవత్సర సంబరాల ఖర్చు. డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో మహా నగరంలోని హోటళ్లు, పబ్‌లు, రిసార్టులు, ఫంక్షన్ హాళ్లలో వెయ్యికి పైగా నిర్వహించిన గ్రాండ్ పార్టీలు, మ్యూజికల్ రాక్ నైట్స్, డీజే, లిక్కర్ కిక్కు పార్టీలకుసిటీజనులు మంచినీళ్ల ప్రాయంలా డబ్బు ఖర్చు చేశారు. రూ.100 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. ఇక విందు, వినోదాలు, డీజే పార్టీలు, బాలీవుడ్, టాలీవుడ్ తారలు, డీజేల ఆధ్వర్యంలో నిర్వహించిన జోష్ పార్టీలు, లావిష్ బఫేలు, లంచ్‌ల కోసం మరో రూ.100 కోట్లు ఖర్చు చేశారు. మద్యం ఏరులు మహా నగరంలో కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికేందుకు డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో వెయ్యికి పైగా జోష్ పార్టీలు నిర్వహించారు. వీటిలో మద్యం ఏరులై పారింది. గ్రేటర్ పరిధిలో ఈ రెండు రోజుల్లోసుమారు రూ.100 కోట్ల విలువైన లిక్కర్ సీసాలు ఖాళీ అయినట్టు అబ్కారీ శాఖ లెక్కలు వేసింది. డిసెంబరు 31న సుమారు రూ.60 కోట్లు, జనవరి 1న రూ.40 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అంచనా వేశారు. గత ఏడాదితో పోలిస్తే దీనిలో 9 శాతం వృద్ధి నమోదైనట్లు తేల్చారు. ఈ వేడుకల్లో ఐఎంఎల్ మద్యం ఐదు లక్షల లీటర్లు, బీరు నాలుగు లక్షల లీటర్లను మందుబాబులు తాగేసినట్లు తెలిసింది. కేసుల పరంగా చూస్తే 60 వేల కేసుల ఐఎంఎల్ మద్యం, 50 వేల కేసుల బీర్లు విక్రయించినట్టు అంచనా వేశారు. శీతాకాలం కావడంతో బీరు కంటే ఐఎంఎల్ మద్యం అమ్మకాల కిక్కు పెరిగిందని అబ్కారీ అధికారులు తెలిపారు. పార్టీలకు రూ.100 కోట్లు వినువీధిలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా రంగుల హరివిల్లు సృష్టించిన బాణ సంచా పేలుళ్లు, డిజేల హోరు...రాక్నైట్స్తో కొత్త ఏడాదికి నగర వాసులు ఘన స్వాగతం పలికారు. గ్రేటర్ వ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహణకు అనుమతులు తీసుకున్నట్లు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కమిషనరేట్ వర్గాలతో పాటు అబ్కారీ శాఖ అధికారులు లెక్క తేల్చారు. సగటున ఒక్కో పార్టీకి రూ.10 లక్షల చొప్పున ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇందులో రూ.కోటి వరకు ఖర్చు చేసిన పార్టీలు కూడా ఉండడం విశేషం. మొత్తంగా డిసెంబరు 31, జనవరి 1న నిర్వహించిన న్యూ ఇయర్ పార్టీల ఖర్చు రూ.100 కోట్లని మార్కెట్ వర్గాల అంచనా. ఈ పార్టీల్లో సన్నీలియోన్ స్టెప్పులు... పూనమ్ పాండేల వినోద కార్యక్రమాలతో తడి సి ముద్దయ్యారు. ప్రధాన నగరంతో పాటు, శివార్లలోని ఫంక్షన్ హాళ్లు, స్టార్ హోటళ్లు, రిసార్టులు, క్లబ్‌లు, పబ్‌లలో నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకలకు జనం పోటెత్తారు. హైటె క్ సిటీ, మాదాపూర్, హైటెక్స్, దుర్గం చెరువు, తాజ్ కృష్ణా, బంజారా, మారియట్, పార్క్, హయత్ తదితర హోటళ్లలో నిర్వహిం చిన డీజే, బాలీవుడ్ మ్యూజిక్ నైట్స్‌లో కుర్రకారు కేక పుట్టించారు. ఎలక్ట్రానిక్స్ డ్యాన్స్ మ్యూజిక్ (ఈడీఎం), రెట్రో, రీమిక్స్, బాలీ వుడ్, పాశ్చాత్య సంగీత బాణీలకు అనుగుణంగా స్టెప్పులేసి యువతరంపులకించడం విశేషం. -
భయపెట్టిన రాత్రి
నందికొండ వాగులు... నల్లతుమ్మా నీడలు... చంద్రవంక కోనలు...అన్నీ సిటీలో ప్రత్యక్షమయ్యాయి. రక్త పిశాచులు... కొమ్ముల కోలాలు... పబ్బులు, క్లబ్బుల్లో షికార్లు చేసి.. రచ్చ రంబోలా ఆడేశాయి. భయమేస్తుందా..! అయితే కాస్త రిలాక్స్ అవ్వండి. హాలోవీన్ ఫెస్టివల్లో భాగంగా నగరంలోని వివిధ క్లబ్స్, పబ్స్‌లో నిర్వహించిన నయా ట్రెండ్ పార్టీల్లోనివీ సన్నివేశాలు. సినిమా సెట్టింగులను తలపిస్తూ.. భయపెట్టి.. థ్రిల్ చేసే థీమ్స్‌తో కుర్రకారుకు కిక్కెక్కించాయి ఎంటర్టైన్మెంట్ సెంటర్లు. సోమాజిగూడ కిస్మత్, దుర్గం చెరువుల్లో జరిగిన హాలోవీన్ పార్టీల్లోనివీ ‘పిక్చర్స’. -
డ్యూస్
సృజనం సాయి బ్రహ్మానందం గొర్తి యూసెమెటీలో నాలుగు రోజుల కాంపింగ్ తరువాత మధ్యాహ్నమే తిరిగొచ్చాం. మా ఆవిడా పిల్లలూ మధ్యాహ్నం బయల్దేరుదామన్నా వినకుండా ఉదయాన్నే ప్రయాణం కట్టించాను. మా పెద్దాడయితే నిద్రకళ్లతోనే కారెక్కాడు. రెండోవాడు మాత్రం నా ప్లాను పసిగట్టాడు. ‘‘డాడ్‌కి టెన్నిస్ ఉండుంటుంది!’’ అని ముక్తాయించే సరికి, అనిత ఒంటికాలిపై లేచింది. టెన్నిస్ శాపనార్థ స్తోత్రం చదివి అక్షింతలు వేసేసింది. ఏం చెయ్యను? టెన్నిస్ ఆట నా బలహీనత. వారానికి కనీసం అయిదు రోజులైనా ఆడి తీరాలి. లేకపోతే ఒంట్లో తేళ్లు, జైలు పాకినట్లుంటుంది. ఇంటికి చేరుకున్న వెంటనే ఈమెయిల్ కోసం కంప్యూటర్ ఆన్ చేశాను. రోజూ క్లబ్బు నుండి కనీసం పాతికకు పైగా టెన్నిస్ మెయిళ్లే ఉంటాయి. నాలాంటి టెన్నిస్ పిచ్చోళ్లు మా క్లబ్బుల్లో చాలామందే ఉన్నారు. మా ఇంటి దగ్గర్లోనే కుపర్టినో టెన్నిస్ క్లబ్బుంది. కాంపింగులో నా ఐఫోను బ్యాటరీ చచ్చింది. అందువల్ల ఈమెయిల్ చూసుకోవడం కుదర్లేదు. తీరా మెయిల్ ఓపెన్ చేస్తే, ఒక్క టెన్నిస్ మెయిల్ కూడా లేదు. ఆశ్చర్యం వేసింది. పనికిరాని మెయిల్స్ చాలా వచ్చాయి. ఏమయ్యిందని క్లబ్బుకి కాల్ చేశాను. క్లబ్బు తెరిచే ఉందని, ఆడుతున్నారని తెలిసింది. వెంటనే జాన్‌కి కాల్ చేశాను. అతను ఎత్తలేదు. ఇంకో చైనీస్ మిత్రుడు మింగ్కి కాల్ చేశాను. వెంటనే మరో ఫ్రెండ్ గౌతమ్‌కి కాల్ చేశాను. ఫలితం శూన్యం. వెంటనే కాల్ చెయ్యమని మెసేజ్ పెట్టాను. స్నానం చేసి క్లబ్బుకి బయల్దేరుతూండగా గౌతమ్ కాల్ చేశాడు. ‘‘ఏమయ్యిందిరా? మన టెన్నిస్ లీగ్ నుండి ఒక్క మెయిలూ లేదు?’’ నా ట్రిప్ విశేషాలు గౌతమ్ అడిగినా, దాని దాటేస్తూ అడిగాను. అవతలివైపు నుండి సమాధానం లేదు. మరోసారి గట్టిగా రెట్టించేసరికి మెల్లగా చెప్పాడు. ‘‘క్లబ్బులో ఇటుపైన నీతో ఎవరూ టెన్నిస్ ఆడరు. మన లీగ్‌లో అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. నువ్వు కెప్టెన్సీ చేస్తున్న టీమ్‌లో కూడా ఎవరూ ఆడరు!’’ఒక్కసారి అవాక్కయ్యాను. నాకేమీ అర్థం కాలేదు. గౌతమ్ మీద చికాకూ కోపం వచ్చాయి. ఒకటికి పదిసార్లు అవే మాటలు చెబుతున్నాడు కానీ, ఎందుకు నన్ను బహిష్కరించారో చెప్పడానికి జంకుతున్నాడు. గట్టిగా గదమాయిస్తే, అసలు విషయం చెప్పాడు. ‘‘నీ వల్ల జాన్ ఆసుపత్రిపాలయ్యాడు. అతని పక్కటెముకలు విరిగాయి. కనీసం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా నువ్వు చెయ్యలేదు,’’ ఈసారి గౌతమ్ గొంతు మారింది. ‘‘యూసెమెటీ వెళ్లగానే నా ఐఫోన్ పాడయ్యింది. ట్రెక్కింగులో ఉండగా మా బ్యాగొకటి పోయింది. అందులో మా ఆవిడ ఫోన్, మా అబ్బాయి ఫోన్ ఉన్నాయి. వచ్చీరాగానే ఫోన్ చేశాను. నిజంగా నాకు జాన్ గురించి తెలీదు,’’ మెల్లగా చెప్పాను. నేను యూసెమెటీ వెళ్లడానికి ఒకరోజు ముందు జాన్, నేను టెన్నిస్ ఆడుతుండగా జాన్ నేను కొట్టిన ఒక షాట్ తీయబోయి కిందపడిపోయాడు. కాస్త భారీ కాయం కావడం వల్ల, పక్కకు ఒరిగిపోయాడు. మోచేయి కొట్టుకుపోయి రక్తం వచ్చింది. నాతో ఆడే ఇంకో ఇద్దరూ వాపు తగ్గుతుందని ఐస్ చేతిమీద పెట్టారు. చెయ్యి కొద్దిగా వాచింది. నేను వెంటనే సారీ చెప్పాను. మా వాళ్లందరూ నామీద విరుచుకుపడ్డారు. ‘‘ఆడుతూంటే నీకు ఒళ్లు తెలీదు. నువ్వేమైనా రోజర్ ఫెడరెర్వా? మనం ఆడే ఆట కాలక్షేపానికి. ఎవరూ ఒక్క పైసా కూడా ఇవ్వరు,’’ అంటూ నామీద కోప్పడ్డారు. నేను ఆట ఆడుతూంటే అందులో పూర్తిగా నిమగ్నమైపోతాను. అది నా బలహీనత. ఆటయ్యాకే నేను మామూలు ప్రపంచంలోకి వస్తాను. మొదట్లో అందరూ నాకు ఆటలో ఆవేశం ఎక్కువా అంటే గత మూడేళ్లుగా అంతా తగ్గించుకున్నాను. నిజానికి ఆ రోజు నేను అంత గట్టిగా కొట్టలేదు. యాంగిల్ ఎక్కువగా ఉండటం వల్ల, జాన్ ఆ బంతి అందుకోబోయి కిందపడ్డాడు. నేను వెంటనే క్షమాపణలు చెప్పాను. అతను బాగానే ఉన్నాడు అప్పుడు. పక్కటెముకలు విరగడం అన్నది ఆశ్చర్యం కలిగించింది నాకు. ఇంటికెళ్లాక రాత్రికి రాత్రి ఎమర్జెన్సీకి తీసుకెళ్లారనీ, హాస్పిటల్లో పరీక్షలు చేశాక పక్కటెముకలు రెండు చిన్నగా విరిగాయనీ గౌతమ్ చెప్పాడు. దీనిక్కారణం నేనేనని మా క్లబ్బు మెంబర్లందరూ నామీద కోప్పడ్డారనీ చెప్పాడు. ఫోన్ పెట్టేసే ముందు- ‘‘అయినా, నీకు జాన్ గురించి తెలిసీ నువ్వు అంత తీవ్రంగా ఆడటం ఏమిట్రా? యూ ఆర్ యాన్ ఈడియట్!’’ అంటూ గట్టిగా తిట్టాడు. నేనేమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. నిజమే. నా పొరపాటే! కాస్త మెల్లగా ఆడుండాల్సింది. టెన్నిస్కి వెళ్లబోయిన నేను వెనక్కి రావడంతో అనిత ఆశ్చర్యపోతూ వెటకారంగా అంది, ‘‘ఏం టెన్నిస్వాళ్లు రావద్దన్నారా?’’ నేనేమీ సమాధానం ఇవ్వకుండా లోపలికి వెళ్లడంతో, అనితకి అనుమానం వచ్చి మళ్లీ అడిగింది. అయిదు రోజుల క్రితం టెన్నిస్ ఆటలో జాన్ గాయం గురించి చెప్పాను. గౌతమ్ చెప్పిన వివరాలూ చెప్పాను. ఎప్పుడూ టెన్నిస్ గురించి నన్ను తిట్టే అనిత, ఈసారి వాళ్లమీద మండిపడింది. ‘‘అతను పడిపోతే మీరేం చేస్తారు? ఆటన్నాక జాగ్రత్తగా ఉండాలి!’’ అంటూ కోపంగా అంది. ‘‘జాన్ అందరిలాంటివాడు కాదు,’’ మెల్లగా అన్నాను. ఆశ్చర్యంగా నాకేసి చూసింది. ‘‘అతనికి ఒక కాలు లేదు. మోకాలి కింద భాగం ఆర్టిఫీషియల్ మెటాలిక్ లెగ్!’’ గౌతమ్ చెప్పిన తరువాత హాస్పిటల్‌కి వెళ్లి జాన్ని పరామర్శిద్దామనుకున్నాను. కానీ ఎందుకో మనసొప్పలేదు. ఆ సాయంత్రం క్లబ్బుకి వెళ్లాను, కనీసం ఎక్సర్సైజయినా చేద్దామని. ఒకళ్లిద్దరు పరిచయస్తులు కనిపించి విష్ చేశారు కానీ ఎవరూ మాట్లాడలేదు. నాకూ మనసు బాగోలేదు. తిరిగి వచ్చేస్తూండగా, మింగ్ కనిపించాడు. విష్ చేసి, జాన్ గురించి అడిగాను. జాన్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడనీ, ఇంకో నాలుగు రోజుల్లో ఇంటికి పంపిస్తారనీ చెప్పాడు. వెళ్లబోతూ - రేపు మా క్లబ్బు మెంబర్లందరూ చూడ్డానికి వెళుతున్నారనీ, నన్ను మాత్రం పిలవద్దన్నారనీ చెప్పాడు. ‘‘యూ ఆర్ ఏ వియర్డ్ ప్లేయర్! జాన్‌కి ఒక కాలు లేదని తెలిసీ నువ్వు అంత దుర్మార్గంగా ఆడటం అన్యాయం. అందుకే నీతో ఎవరూ ఆడ్డానికి ఇష్టపడటం లేదు,’’ అంటూ తీవ్ర పదజాలంతో తిట్టాడు. ఏం చెప్పాలో తెలియలేదు. వాళ్ల దృష్టిలో ప్రస్తుతం నేనొక విలన్ని. ఏం చెప్పినా వినే పరిస్థితిలో వాళ్లు లేరు. ‘‘మింగ్! నేను కావాలని కొట్టలేదు. ఆడుతుంటే అతనికి కాలుందా లేదన్నది నాకు స్ఫురించదు. అయినా మీ అందరి దృష్టిలో అతనికి కాలు లేదు. నాకైతే అలా అనిపించదు,’’ నా మనసుకనిపించింది చెప్పాను. ‘‘యూర్ ఆర్ యే జెర్క్!’’ అనేసి విసురుగా వెళ్లిపోయాడు. జాన్‌కి ఒక కాలు ఆర్టిఫీషియల్ లెగ్ అన్నది మా క్లబ్బంతటికీ తెలుసు. మొదట్లో ఫుల్ టెన్నిస్ ప్యాంట్ వేసుకుని ఆడినప్పుడు నాకు తెలియలేదు. తరువాత అతన్ని చిన్న నిక్కరులో చూసినప్పుడు తెలిసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అతను మా అందరిలాగే పరిగెడతాడు. జాన్ని ఇంటికొచ్చాక కలుద్దాములే అనుకున్నాను. కానీ వీళ్లే ఇలా ఉంటే, అసలు గాయపడ్డ జాన్ నా గురించి ఏమనుకుంటాడో ఊహించగలను. నేను జాన్ని చూడ్డానికి వెళ్లాలనిపించినా, వెళ్లలేదు. ఆ తరువాత మా టెన్నిస్ ఫ్రెండ్స్ నన్ను ఆటకి పిలవటం మానేశారు. కొంతమంది కలిసినప్పుడు విష్ చేసి పక్కకి వెళ్లిపోయేవారు. నా టెన్నిస్ ఆటకి గండి పడింది. జాన్ గాయపడి ఆడలేకపోయాడు. నేను ఆడగలిగీ గాయపడ్డాను. ఆ తరువాత నేను టెన్నిస్ ఆడటం మానేశాను. నాకు తెలీకుండానే, నాకు లేని గిల్టీని అందరూ నాపై రుద్దేశారనిపించింది. ఓ నెల రోజుల తరువాత, ఊహించని ఒక సంఘటన ఎదురయ్యింది. జాన్ నుండి ఫోన్ కాల్ వచ్చింది! ‘‘హాయ్- రావీ! ఎలా ఉన్నావు?’’ అంటూ పలకరించాడు. నేను నా తరఫున మరోసారి క్షమాపణలు కోరుతూ- ‘‘జాన్! యిట్ ఈజ్ మై ఫాల్ట్! అపాలజీస్!’’ అని చెప్పాను. ‘‘నో! నో! నీ తప్పేమీ లేదు. అదలా జరగాల్సింది. జరిగింది. అంతే!’’ అంటూ నా గురించి అడిగాడు. ‘‘రావీ! మన ఫ్రెండ్స్ అందరూ చూడ్డానికి వచ్చారు. నువ్వూ వస్తావనుకున్నాను. ఎందుకు రాలేదోననుకున్నాను. తరువాత మింగ్ భార్యతో వచ్చినప్పుడు తెల్సింది,’’ అని ఆగిపోయాడు. ‘‘ఏం తెల్సింది?’’ అని అడిగితే, ‘‘వాళ్లందరూ నిన్ను పిలవకూడదనుకున్నారని చెప్పాడు. నాకెందుకో అది స్టుపిడ్‌గా అనిపించింది,’’ అన్నాడు. జాన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడనీ, టెన్నిస్ ఆటకి రెడీ అని చెప్పాడు. నేను ఆడటం మానేశానని చెప్పాను. ‘‘ఆ రోజు మింగ్ నాతో ఒక మాట చెప్పాడు. అది విన్నాక నువ్వంటే నా అభిప్రాయం మారిపోయింది. నాకు ఆర్మీలో కాలు పోయాక, బయట నన్నెవరైనా ఆర్టిఫీషియల్ లెగ్‌తో కనిపించినప్పుడు నాకేసి జాలిగా చూసేవారు. కాలు లేదన్న బాధ కన్నా ఆ జాలి చూపులు నన్ను దహించేవి. అందుకే కసిగా ఆర్టిఫీషియల్ లెగ్‌తో పరిగెత్తడం అలవాటు చేసుకున్నాను. అదే నా టెన్నిస్ ఆటకి ఆలంబన అయ్యింది. నాతో ఆడినప్పుడు నన్ను కాలు లేనివాడిగా అనుకునే అందరూ ఆడుతారన్నది నాకు తెలుసు. నువ్వు మాత్రం అలా అనుకోవనీ, అందుకే అంత తీవ్రంగా ఆడావనీ చెప్పినప్పుడు నాకెంతో సంతోషం కలిగింది. నన్ను, అందరిలాగే చూశావు, థాంక్యూ!’’ అన్నాడు. చివరి మాటలు పలికేటప్పుడు అతని గద్గద స్వరాన్ని గమనించాను. జాన్ మాటలు విన్నాక మనసు తేలికపడింది. నా ఆటా, ఆలోచనా గాడి తప్పలేదన్న నమ్మకం కలిగింది. టెన్నిస్కి వెళ్లబోయిన నేను వెనక్కి రావడంతో అనిత ఆశ్చర్యపోతూ వెటకారంగా అంది, ‘‘ఏం టెన్నిస్వాళ్లు రావద్దన్నారా?’’ -
తెరుచుకున్న క్లబ్‌లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: అర్బన్ ఎస్పీ హెచ్చరికలతో అయిదు నెలల కిందట మూతపడిన క్లబ్‌లు మళ్లీ తెరుచుకున్నయ్. రెండు రోజుల నుంచి క్లబ్‌లలో ఆట మొదలు కావడం వెనుక అసలు మర్మమేమిటీ...? మొన్నటి వరకు బంద్ అంటే బంద్... అని క్లబ్ నిర్వాహకులను హడలెత్తించిన పోలీసు అధికారులు ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారు...? అనే సందేహాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రధానంగా ఈ వ్యవహారం పోలీసు విభాగాన్ని కుదిపేస్తోంది. జిల్లా అధికారులు కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ... ఇదే రేంజ్‌కు చెందిన పోలీస్ బాస్ వీటికి అనుమతిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లతోనే ఆయన తలూపినట్టు తెలుస్తోంది. దీంతో మొన్నటి వరకు క్లబ్బులంటేనే కన్నెర్ర జేసిన జిల్లా పోలీసు యంత్రాంగం బిత్తరపోయింది. తాము చేసేదేమీ లేదన్నట్లుగా చేతులు ముడుచుకుంది. ఈ క్లబ్బుల రీ ఓపెన్ వెనుక స్వయానా ఓ మంత్రి పేరు వినిపిస్తోంది. నగరంలో పేకాట నిర్వహిస్తున్న క్లబ్‌లన్నింటికీ తెరచాటు నిర్వాహకులు అధికార పార్టీకి చెందిన నేతలే కావడం గమనార్హం. అందుకే వారి వ్యాపారాలకు అండదండగా నిలవడంతో పాటు క్లబ్‌లు తెరిపించేందుకు మంత్రి తనవంతుగా పైరవీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాబోయే మునిసిపల్ ఎన్నికల దృష్ట్యా రాజకీయ ఎత్తుగడగా ఈ క్లబ్‌లను తెరిపించినట్లు ప్రచారం జరుగుతోంది. నిర్వాహకుల ఒత్తిళ్లతో పాటు వ్యాపార లావాదేవీల్లో వాటాలుండడం అందుకు దారితీసినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో నాలుగు బడా క్లబ్లున్నాయి. వీటిలో మూడు క్లబ్బులు తెరుచుకున్నాయి. వరంగల్ రైల్వే స్టేషన్‌తో పాటు హంటర్ రోడ్డులో ఉన్న క్లబ్‌లు స్వయానా అధికార పార్టీ నేతలే నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ దగ్గరలో మరో క్లబ్ నడుస్తోంది. రిక్రియేషన్ పేరుతో వీటన్నింటిలోనూ పేకాట జోరుగా సాగుతోంది. ప్రతి రోజూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ వ్యసనానికి అలవాటు పడిన జూదగాళ్లు ఇల్లు గుల్ల చేసుకున్న సంఘటనలు నగరంలో కోకొల్లలు. ఏకంగా క్లబ్‌లు మూసేయించాలని, తమ సంసారాలు కాపాడాలని పోలీసులకు మహిళలు లేఖలు రాస్తున్నారు. పదవీ విరమణ చేసిన వారు తీరిక వేళల్లో ఆడుకునే బ్రిడ్జి ఆటకు గతంలో రెండు క్లబ్బులకు అనుమతులున్నాయి. అదే సాకుతో ఈ క్లబ్బులు చాటు మాటుగా రెమ్మీతో(పదమూడు ముక్కలాట) పాటు మూడు ముక్కలాట నిర్వహిస్తున్నారుు. వాస్తవంగా రిక్రియేషన్ క్లబ్‌ల్లో మద్యం నిషేధం. పేకాటకు అనుమతి ఉన్న వాటిలో మరింత కఠిన నిబంధనలుంటాయి. ఓ ప్రత్యేకాధికారి పర్యవేక్షణ... సీసీ కెమెరాల నిఘాలో రెమ్మీ ఆడాలి. కానీ జూదం.. నేరంగా భావించే మూడు ముక్కలాట ఆడుతున్నారు. క్లబ్లో మద్యం నిషేధం ఉన్నప్పటికీ యథేచ్ఛగా టేబుళ్లపైనే మద్యం సేవిస్తున్నారు. పక్కనే ఉన్న బార్ల నుంచి మద్యం సరఫరా చేస్తున్నారు. నగరంలోని ఒక్కో క్లబ్లో పేకాటపైనే ప్రతీ రోజూ *10 లక్షల నుంచి *18 లక్షల వ్యాపారం సాగుతోందని తెలుస్తోంది. మద్యం, భోజన ఖర్చులు... ఇవన్నీ అదనమే. క్యాష్‌ను కౌంటర్లో చెల్లించి టోకెన్లు తీసుకున్న వారినే క్లబ్బులో ఆడేందుకు అనుమతిస్తారు. టేబుళ్లను బట్టీ *500, * 1000 నుంచి *4000 వరకు టోకెన్లు చెల్లించి ఆడేందుకు పోటీ పడుతుండటం కనిపిస్తోంది. రోజుకు కనీసం రెండు వేల టోకెన్లు అమ్ముడుపోతున్నాయి. ఒక్కో టోకెన్‌పై 10 శాతం కమీషన్, వాటర్ బాటిళ్లు, మద్యం, భోజనాల బిల్లులు క్లబ్బు నిర్వాహకులకు ఆదాయం తెచ్చిపెడుతాయి. అడ్డగోలుగా సంపాదించేందుకు ఇదో ఆదాయ మార్గం కావటంతో రాజకీయ నాయకుల అండదండలకు, పోలీసు పైరవీలకు నిర్వాహకులు లక్షల్లో ముడుపులు ముట్టజెప్పుతున్నారు