200 కోట్లతో జల్సా | hyderbad people spent heavily in the new year | Sakshi
Sakshi News home page

200 కోట్లతో జల్సా

Published Sat, Jan 3 2015 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

200 కోట్లతో జల్సా

200 కోట్లతో జల్సా

గ్రేటర్‌లో భారీగా నూతన సంవత్సర ఖర్చు
రూ.100 కోట్ల విలువైన మద్యం
గత ఏడాదితో పోలిస్తే 9 శాతం వృద్ధి
డీజే, రాక్‌నైట్స్, విందు వినోదాలకు
మరో రూ.100 కోట్లు

 
మద్యం విక్రేతలు...‘పండగ’ చేసుకునేలా...క్లబ్‌లు...పబ్‌ల నిర్వాహకులు ఏడాదంతా గుర్తుంచుకునేలా... హోటళ్లు, రిసార్టుల వారు ఎప్పటికీ మరచిపోలేని విధంగా... సిటీజనులు నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. అక్షరాలా రూ.200 కోట్లు వెచ్చించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సంతోషాన్ని... వేడుకల నిర్వాహకులు పూర్తి స్థాయిలో సొమ్ము చేసుకున్నారు. కొందరైతే ఏడాది వ్యాపార లక్ష్యాన్ని రెండు రోజుల్లో సాధించారు.
 
సిటీబ్యూరో: ఒకటీ... రెండూ కాదు... ఏకంగా రూ.200 కోట్లు ఉఫ్ అని ఊదేశారు. అదీ కేవలం రెండు రాత్రుల్లోనే. ఇదీ గ్రేటర్‌లో కొత్త సంవత్సర సంబరాల ఖర్చు. డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో మహా నగరంలోని హోటళ్లు, పబ్‌లు, రిసార్టులు, ఫంక్షన్ హాళ్లలో వెయ్యికి పైగా నిర్వహించిన గ్రాండ్ పార్టీలు, మ్యూజికల్ రాక్ నైట్స్, డీజే, లిక్కర్ కిక్కు పార్టీలకుసిటీజనులు మంచినీళ్ల ప్రాయంలా డబ్బు ఖర్చు చేశారు. రూ.100 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. ఇక విందు, వినోదాలు, డీజే పార్టీలు, బాలీవుడ్, టాలీవుడ్ తారలు, డీజేల ఆధ్వర్యంలో నిర్వహించిన జోష్ పార్టీలు, లావిష్ బఫేలు, లంచ్‌ల కోసం మరో రూ.100 కోట్లు ఖర్చు చేశారు.
 
మద్యం ఏరులు

మహా నగరంలో కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికేందుకు డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో వెయ్యికి పైగా జోష్ పార్టీలు నిర్వహించారు. వీటిలో మద్యం ఏరులై పారింది. గ్రేటర్ పరిధిలో ఈ రెండు రోజుల్లోసుమారు రూ.100 కోట్ల విలువైన లిక్కర్ సీసాలు ఖాళీ అయినట్టు అబ్కారీ శాఖ లెక్కలు వేసింది. డిసెంబరు 31న సుమారు రూ.60 కోట్లు, జనవరి 1న రూ.40 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అంచనా వేశారు. గత ఏడాదితో పోలిస్తే దీనిలో 9 శాతం వృద్ధి నమోదైనట్లు తేల్చారు. ఈ వేడుకల్లో ఐఎంఎల్ మద్యం ఐదు లక్షల లీటర్లు, బీరు నాలుగు లక్షల లీటర్లను మందుబాబులు తాగేసినట్లు తెలిసింది. కేసుల పరంగా చూస్తే 60 వేల కేసుల ఐఎంఎల్ మద్యం, 50 వేల కేసుల బీర్లు విక్రయించినట్టు అంచనా వేశారు. శీతాకాలం కావడంతో బీరు కంటే ఐఎంఎల్ మద్యం అమ్మకాల కిక్కు పెరిగిందని అబ్కారీ అధికారులు తెలిపారు.

పార్టీలకు రూ.100 కోట్లు

వినువీధిలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా రంగుల హరివిల్లు సృష్టించిన బాణ సంచా పేలుళ్లు, డిజేల హోరు...రాక్‌నైట్స్‌తో కొత్త ఏడాదికి నగర వాసులు ఘన స్వాగతం పలికారు. గ్రేటర్ వ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహణకు అనుమతులు తీసుకున్నట్లు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కమిషనరేట్ వర్గాలతో పాటు అబ్కారీ శాఖ అధికారులు లెక్క తేల్చారు. సగటున ఒక్కో పార్టీకి రూ.10 లక్షల చొప్పున ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇందులో రూ.కోటి వరకు ఖర్చు చేసిన పార్టీలు కూడా ఉండడం విశేషం. మొత్తంగా డిసెంబరు 31, జనవరి 1న  నిర్వహించిన న్యూ ఇయర్ పార్టీల ఖర్చు రూ.100 కోట్లని మార్కెట్ వర్గాల అంచనా. ఈ పార్టీల్లో సన్నీలియోన్ స్టెప్పులు... పూనమ్ పాండేల వినోద కార్యక్రమాలతో తడి సి ముద్దయ్యారు. ప్రధాన నగరంతో పాటు, శివార్లలోని ఫంక్షన్ హాళ్లు, స్టార్ హోటళ్లు, రిసార్టులు, క్లబ్‌లు, పబ్‌లలో నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకలకు జనం పోటెత్తారు. హైటె క్ సిటీ, మాదాపూర్, హైటెక్స్, దుర్గం చెరువు, తాజ్ కృష్ణా, బంజారా, మారియట్, పార్క్, హయత్ తదితర హోటళ్లలో నిర్వహిం చిన డీజే, బాలీవుడ్ మ్యూజిక్ నైట్స్‌లో కుర్రకారు కేక పుట్టించారు. ఎలక్ట్రానిక్స్ డ్యాన్స్ మ్యూజిక్ (ఈడీఎం), రెట్రో, రీమిక్స్, బాలీ వుడ్, పాశ్చాత్య సంగీత బాణీలకు అనుగుణంగా స్టెప్పులేసి యువతరంపులకించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement