
సంతోష్‌శెట్టి (ఫైల్)
యశవంతపుర: కన్నడ చలనచిత్ర రంగం వర్ధమాన దర్శకుడిని కోల్పోయింది. దక్షిణ కన్నడ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చలనచిత్ర రంగానికి చెందిన వర్ధమాన దర్శకుడు సంతోశ్‌శెట్టి దుర్మరణం చెందారు. 2013లో విడుదలైన కన్నడ సినిమా ‘కనసు’ చిత్ర దర్శకుడైన సంతోశ్‌శెట్టి మరో ఐదుగురితో కలిసి బుధవారం ఉదయం బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్ ఫాల్స్‌లో షూటింగ్‌కు వెళ్లారు. షూటింగ్‌లో భాగంగా సంతోశ్‌శెట్టి తన కాలికి బరువైన వస్తువు కట్టుకున్నాడు.
ఒక్కసారిగా నీటి ఉధృతి పెరగడంతో అదుపు తప్పి నీటిలోపడి కొట్టుకుపోయాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాలించగా సంతోశ్‌శెట్టి విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని వెలికి తీసి బెళ్తంగడికి తరలించారు. తర్వాత కటిల్‌లోని కుటుంబ సభ్యులకు అప్పగించారు.