Veteran Kannada Filmmaker SK Bhagavan Dies At 89 - Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్‌ దర్శకుడు మృతి

Published Mon, Feb 20 2023 12:19 PM | Last Updated on Mon, Feb 20 2023 2:55 PM

Veteran Kannada Filmmaker Sk Bhagavan Dies At 89 - Sakshi

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ సీనియర్‌ దర్శకుడు ఎస్​కే భగవాన్ (90) కన్నుమూశారు. గత కొంతకాంలంగా వృద్దాప్యం,అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు.

ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కన్నడ దిగ్గజ నటుడు దివంగత కంఠీరవ రాజ్‌కుమార్‌తో ఎక్కువ సినిమాలు తెరకెక్కించిన ఆయన పలు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను అందించారు.

1933 జులై 5న జన్మించిన భగవాన్‌కు చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేదట. తొలుత సహాయ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత దర్శకత్వం వైపు మొగ్గుచూపారు. ఎస్​కే భగవాన్ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై సహా పలువురు రాజకీయ, సినీ  ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement