పునీత్‌ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్‌ అనే బిరుదు ఎలా వచ్చిందంటే.. | Puneeth Rajkumar: To Know Why Was Puneeth Called As PowerStar | Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్‌ అనే బిరుదు ఎలా వచ్చిందంటే..

Published Sat, Oct 30 2021 1:00 PM | Last Updated on Sat, Oct 30 2021 2:47 PM

Puneeth Rajkumar: To Know Why Was Puneeth Called As PowerStar - Sakshi

Puneeth Rajkumar Called As Power Star: కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన 46ఏళ్ల వయసులోనే కన్నుమూయడం అందరిని షాక్‌కి గురిచేస్తుంది. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో మరణించడం విస్మయానికి గురిచేస్తుంది. పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణంతో నటీనటులతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పునీత్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకొని తీవ్ర భావేద్వేగానికి లోనయ్యారు. 

ఇక ప్రతి హీరోకు తమ అభిమానులు ఓ బిరుదు ఇస్తుంటారు. అలా పునీత్‌ రాజ్‌కుమార్‌ను కన్నడ నాట పవర్‌ స్టార్‌ అంటారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన కన్నడిగుల మనసు గెలుచుకున్నాడు పునీత్‌  రాజ్‌కుమార్‌. ఇతర నటీనటుల పట్ల గౌరవం, అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉండటం ఆయన్ను పప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. తన ఇంటికి వచ్చిన ఏ అబిమానిని ఆయన నిరాశతో పంపరని కన్నడ నాట పేరుంది.

ఇక పునీత్‌ నటించిన సినిమాల్లో ఎక్కువగా వంద రోజులకు పైగా ఆడాయంటే ఆయన క్రేజ్‌ఎలాంటిదో ఊహించుకోవచ్చు. ఈ స్టామినానే ఆయనకు పవర్‌స్టార్‌ అనే బిరుదు వచ్చేలా చేసింది. ఓ సందర్భంలో తన పేరు ముందున్న పవర్‌స్టార్‌ బిరుదు గురించి మాట్లాడుతూ.. అభిమానులే తనకు ఈ బిరుదు ఇచ్చారని, వాళ్లే నా పవర్‌ అని చెప్పుకొచ్చారు. 

చదవండి: పునీత్‌ అంత్యక్రియలకు హాజరు కానున్న ఎన్టీఆర్‌
పునీత్‌ను అలా చూసి బాలయ్య కంటతడి..వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement