![Kannada actor Nithin Gopi passes away at 39 due to heart attack - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/3/nithin-gopi.jpg.webp?itok=79bK_6Iw)
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ నటుడు నితిన్ గోపి (39) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందూతూ తుది శ్వాస విడిచారు. నితిన్ గోపి అకాల మరణంతో శాండల్‌వుడ్ దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నితిన్ గోపీ తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు.
(ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన బెస్ట్ ఫ్రెండ్.. వైరలవుతున్న ఫోటోలు)
హలో డాడీ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నితిన్ గోపీ కెరీర్ ప్రారంభించారు. ముత్తినంత హెంతి, కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబండవ్య వంటి చిత్రాలలో కూడా ఆయన నటించారు. శృతి నాయుడు నిర్మించిన పునర్ వివాహ సీరియల్‌లో కూడా నితిన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నితిన్ భక్తి సీరియల్ హర హర మహాదేవ్‌లో కొన్ని ఎపిసోడ్స్‌లో కనిపించారు. అంతేకాకుండా కొన్ని తమిళ సీరియల్స్‌లో కూడా నటించాడు. ప్రస్తుతం నితిన్ కొత్త సీరియల్‌కి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.
(ఇది చదవండి: 'త్వరలోనే కీర్తి సురేశ్ పెళ్లి .. క్లారిటీ ఇచ్చిన నటి!)
Comments
Please login to add a commentAdd a comment