kannada industry
-
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీరియల్ డైరెక్టర్ ఆత్మహత్య
ప్రముఖ దర్శకుడు చనిపోయాడు. సీరియల్, సినిమాకు దర్శకత్వం వహిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఇతడు.. ఇలా ఉన్నట్టుండి ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీలో విషాదం నింపింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఇలా ప్రాణాలు తీసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!)గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వినోద్ దొండాలే.. నన్నరాసి రాధే, గంగే గౌరి, కరిమణి తదితర సీరియల్స్‌తో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. కొన్నాళ్ల క్రితం 'అశోక్ బ్లేడ్' అనే సినిమా కూడా మొదలుపెట్టాడు. దీని షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. శుక్రవారం కూడా షూటింగ్ విషయమై హీరో సతీష్, నిర్మాతలతో కలిసి మాట్లాడాడు. శనివారం ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.సినిమా, సీరియల్ నిర్మాణంలోనూ వినోద్ ఎంటరయ్యాడని, దీని తర్వాత నష్టాలు ఎక్కువయ్యావని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అప్పుల బాధ తట్టుకోలేక ఇలా ఇప్పుడు ప్రాణాలు తీసుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా సీనియర్ దర్శకుడు ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసింది. (ఇదీ చదవండి: OTT: ‘ఫ్రీలాన్స్’ హాలీవుడ్ మూవీ రివ్యూ) -
అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ప్రముఖ నిర్మాత
ప్రముఖ కన్నడ నిర్మాత సౌందర్య జగదీష్ మరణించారు. అయితే ఈయన మృతిపై తలో రకంగా కామెంట్స్ వినిపించడం చర్చనీయాంశంగా మారింది. తొలుత గుండెపోటుతో చనిపోయారని అనగా.. కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?) జగదీష్.. మస్త్ మజా మాది, స్నేహితారు తదితర చిత్రాలని నిర్మించారు. అప్పు-పప్పు సినిమాతో తన కొడుకుని హీరోగా పరిచయం చేశాడు. సినిమాల నిర్మాణంతో పాటు ఈయన ఇండస్ట్రీలిస్ట్ కూడా. అలానే బెంగళూరులో ఓ పబ్ కూడా ఉంది. ఆదివారం ఉదయం జగదీష్ ఉరి వేసుకోగా, కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆరోగ్యం, వ్యాపారంలో ఎలాంటి సమస్యలు జగదీష్ కి లేవని ఇతడి ఫ్రెండ్ శ్రేయస్ చెప్పారు. కానీ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!) -
ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ దర్శకుడు మృతి
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ సీనియర్ దర్శకుడు ఎస్కే భగవాన్ (90) కన్నుమూశారు. గత కొంతకాంలంగా వృద్దాప్యం,అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కన్నడ దిగ్గజ నటుడు దివంగత కంఠీరవ రాజ్‌కుమార్‌తో ఎక్కువ సినిమాలు తెరకెక్కించిన ఆయన పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. 1933 జులై 5న జన్మించిన భగవాన్‌కు చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేదట. తొలుత సహాయ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత దర్శకత్వం వైపు మొగ్గుచూపారు. ఎస్కే భగవాన్ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Kannada film director SK Bhagavan passes away in Bengaluru. "I was very saddened to hear the news of renowned director of Kannada film industry SK Bhagavan's death. I pray that God gives strength to his family to bear this pain," tweets Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/tzU7vLBkS8 — ANI (@ANI) February 20, 2023 -
'కాంతార వివాదం'.. సొంతూరికి వెళ్లడానికి భయపడుతున్న రష్మిక?
తమిళ సినిమా: ప్రస్తుతం నెటిజన్లకు నటి రష్మిక మందన్నా టార్గెట్ అయ్యారు. శాండల్ వుడ్ నుంచి బాలీవుడ్ వరకు సూపర్ ఎక్స్‌ప్రెస్ లా పరుగులు తీస్తున్న ఈ అమ్మడు ఇటీవల విమర్శల వలలో చిక్కుకున్నారు. కన్నడలో ఘన విజయం సాధించిన కాంతార చిత్రం విషయంలో రష్మిక మాటలు తీవ్ర వివాదాస్పదం కావడమే ఇందుకు కారణం. ఒక దశలో కన్నడ చిత్ర పరిశ్రమ రష్మికను బ్యాన్ చేసిందనే ప్రచారం మీడియాలో హోరెత్తింది. అంతే కాకుండా సొంత ఊరు మంగుళూరు వెళ్లడానికి కూడా భయపడుతోందని, దీంతో హైదరాబాద్, ముంబయ్‌లోనే మకాం పెట్టిందనే ప్రచారం సాగింది. దీంతో రష్మిక దిగొచ్చింది. తాను షూటింగ్‌లతో బిజీగా ఉండడంతో కాంతార చిత్రాన్ని చూడలేక పోయానని, ఇటీవల చిత్రాన్ని చూసి చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలిపానని వివరణ ఇచ్చింది. అదే విధంగా తనను కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిందనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది. మంచి అవకాశం వేస్తే కన్నడ చిత్రంలో నటించడానికి తాను సిద్ధమని చెప్పింది. ఇకపోతే తనను అగౌరపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. విమర్శలను పట్టించుకోవడం మానేశానని పేర్కొంది. ప్రస్తుతం విజయ్ సరసన నటిస్తున్న వారీసు చిత్రం రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది. -
Rashmika Mandanna: నన్నెవ్వరూ బ్యాన్ చేయలేదు
‘‘కన్నడ పరిశ్రమ నుంచి కొందరు నిర్మాతలు నన్ను బ్యాన్ చేశారని ప్రచారమవుతున్న వార్తలు అవాస్తవం. ఇప్పటివరకు నా వద్దకు అలాంటి విషయాలేవీ రాలేదు’’ అని రష్మికా మందన్నా అన్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ – ‘‘కన్నడ సినిమాలపైన ఎప్పటికీ నాకు ప్రేమ ఉంటుంది. వాస్తవాలు తెలియకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. ‘కాంతారా’ రిలీజైన రెండు రోజులకే ఆ సినిమా గురించి అడగడంతో చూడలేదు కాబట్టి సరిగ్గా స్పందించలేదు (ఈ విషయంపై రష్మికను ట్రోల్స్ చేశారు). ఆ తర్వాత చూసి, ఆ చిత్రబృందానికి మెసేజ్ చేశాను. వారు థ్యాంక్యూ అని రిప్లై ఇచ్చారు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. అయినా నా వ్యక్తిగత విషయాలు ప్రపంచానికి అనవసరం. వృత్తిపరంగా నా సినిమాల గురించి చెప్పడం నా బాధ్యత. నా పై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. వారి విఙ్ఞతకే వదిలేస్తున్నాను’’ అన్నారు. -
రష్మిక బ్యాన్పై స్పందించిన డైరెక్టర్.. కామెంట్స్ వైరల్
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నాపై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించనున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్ మీడియాతో తన ఫస్ట్ మూవీ గురించి రష్మిక చేసిన కామెంట్స్ ఈ వివాదానికి కారణమయ్యాయి. తాజాగా ఇదే అంశంపై డైరెక్టర్ నాగశేఖర్ స్పందించారు. ‘గుర్తుందా శీతాకాలం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన రష్మిక బ్యాన్ గురించి ప్రశ్నించగా.. ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం మనదే తప్పు. నేను కూడా సంజు వెడ్స్ గీత సినిమా కోసం చాలామంది నటీనటులకు ఛాన్స్ ఇచ్చాను. వాళ్లు అది గుర్తుపెట్టుకుంటారా? లేదా అన్నది వాళ్ల వ్యక్తిగతొం. నేను అది పట్టించుకోను. ఎదుటివాళ్ల నుంచి కృతజ్ఞతాభావాన్ని కోరుకున్నప్పుడే మనం బాధపడతాం. రష్మికపై బ్యాన్ విషయానికి వస్తు.. దీని గుర్తించి నాకు పూర్తిగా క్లారిటీ లేదు. కానీ ఒకవేళ అలా చేస్తే అది ఆ పరిశ్రమకే నష్టం. ఇలాంటివి నేను సపోర్ట్ చేయను అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ నాగశేఖర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా?
List Of Kannada Star Heroes Who Died At Young Age: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్ర పరిశ్రమను విషాదంలో నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న పునీత్ అకాల మరణాన్ని అభిమానులు సహా సినీ ప్రముఖులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కన్నడ ఇండస్ట్రీలో నెంబర్1 హీరోలుగా ఉన్నవారు ఇలా అకాల మరణం చెందడం ఇది మొదటి సారి కాదు. గతంలోనూ పలువురు కన్నడ స్టార్ హీరోలు హఠాన్మరణం చెందారు. ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ విషయంలోనే ఇదే జరిగింది. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్29న గుండెపోటుతో మరణించారు. జిమ్ చేస్తుండగా తీవ్రమైన అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. పునీత్ హఠాన్మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా 2020 జూన్7న గుండెపోటుతో కన్నుమూశారు. కెరీర్ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే 39ఏళ్ల వయసులో ఆయన మరణించారు. చనిపోయే సమయానికి చిరంజీవి సర్జా చేతిలో సుమారు మూడు సినిమాలు ఉన్నాయి. ఈయన యాక్షన్ కింగ్ అర్జున్‌కు స్వయానా మేనల్లుడు. 2018లో ప్రముఖ నటి మేఘనా రాజ్‌ను వివాహం చేసుకున్న చిరంజీవి సర్జా..పెళ్లైన రెండేళ్లకే మేఘనను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమె అక్టోబర్ 22న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2009లో కన్నడ మెగాస్టార్ విష్ణువర్ధన్ 58 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. చనిపోయే సమయానికి ఆయన అగ్ర హీరో. 200కు పైగా సినిమ్లాల్లో నటించాడు. పునీత్ తండ్రి రాజ్‌కుమార్ తర్వాత అంతటి స్టార్ స్టేటస్‌ను అందుకున్నాడు. అయితే ఆయన కూడా పునీత్ మాదిరిగానే గుండోపోటుతో మరణించాడు. ఇక 1990లో శంకర్ నాగ్ అనే స్టార్ హీరో కూడా కేవలం 35 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆయన చనిపోయే సమయానికి కన్నడలో స్టార్ హీరో. వరుస విజయాలతో చేతిలో దాదాపు 10 సినిమాలు ఉన్నాయి. శంకర్ నాగ్ చనిపోయిన 4 ఏళ్ల వరకు ఆయన నటించిన సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయంటే అతడి స్టార్ స్టేటస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో శంకర్ నాగ్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం. ఒక సినిమా షూటింగ్లో భాగంగా కార్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు ఆయన. స్టేజ్ నటుడి నుంచి సినిమా నటుడిగా ఎదిగిన విజయ్ సంచారి. కన్నడ సినిమా పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో సైతం నటించిన సంచారి విజయ్ 2021 జూన్ 15న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శాండల్‌వుడ్ చార్మింగ్ హీరో సునీల్ 1994 జులై 24న బాగల్కోట్ నుంచి బెంగళూరుకు తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో మృతి చెందారు. ఆ సమయంలో ఆయన వయస్సు 30 సంవత్సరాలు. చాక్లెట్ బాయ్‌గా గుర్తింపు పొందిన సునీల్ మరణం అభిమానులను షాక్‌కి గురిచేసింది. -
Karnataka: సీఎం కావాలని ఉంది: ఉపేంద్ర
యశవంతపుర: కరోనా సమయంలో నటుడు ఉపేంద్రకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక పుట్టింది. ఈ సందర్భంగా ఆయన ఓ లేఖను ప్రజలకు రాశారు. ఆ లేఖ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘నాకు సీఎం కావాలని ఉంది, ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిపిస్తారా’ అంటూ లేఖ రాశారు. తాను రాజకీయాల్లోకి వస్తే నిరంతరం ప్రజా సేవలోనే ఉంటానని పేర్కొన్నారు. సీఎం (కామన్ మ్యాన్) అనే పదానికి సరైన నిర్వచనం ఇస్తానని చెప్పారు. ఖర్చు చేసే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటానన్నారు. ప్రజల నిర్ణయమే తన నిర్ణయమని ఆ లేఖలో ఉప్పి పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ చిత్రంలో ఉపేంద్ర అతిధి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. వరుణ్ తండ్రి పాత్రలో ఉపేంద్ర నటించబోతున్నట్లు టాక్ Upendra CM of Karnataka? pic.twitter.com/OkgPfgm9ab— Upendra (@nimmaupendra) May 22, 2021 -
కన్నడకు నమస్కార
తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరో రేంజ్‌కి వెళ్ళిన విజయ్ సేతుపతి ఇప్పుడు కొత్త ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. చిరంజీవి ‘సైరా’తో తెలుగు ఆడియన్స్‌కు నమస్కారం చెప్పనున్న ఈ హీరో ఇప్పుడు కన్నడ అభిమానులకు నమస్కార చెప్పబోతున్నారు. వసంత్ విష్ణు హీరోగా రూపొందనున్న ఓ సినిమాలో విజయ్ సేతుపతి నెగటివ్ రోల్‌తో కన్నడకు ఎంట్రీ ఇవ్వనున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ.. ఇలా వేరే భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు విజయ్ సేతుపతి. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. -
'డీకే రవి' టైటిల్ కోసం పోటాపోటీ
బెంగళూరు: నైతిక విలువలు పతనమవుతున్న సమాజంలో నీతి నిజాయితీలకు కట్టుబడి సమాజ సేవయే పరమార్థంగా, జీవన సాఫల్యంగా భావించే ప్రభుత్వాధికారులు చాలా అరుదు. ఆ కోవకు చెందిన ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద పరిస్థితుల్లో అర్ధాంతరంగా అశువులు బాసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ప్రజల కోసం పాటుపడిన ఆయన పోరాటాన్ని, సాధించిన విజయాలను, ఆయన ఎదుర్కొన్న సామాజిక పరిస్థితులను, మొత్తంగా ఆయన జీవిత నేపథ్యాన్నే ఇతి వృత్తంగా తీసుకొని చిలనచిత్రాన్ని నిర్మించేందుకు కన్నడ సినీ నిర్మాతలు పోటీ పడుతున్నారు. 'డీకే రవి' టైటిల్‌ను రిజిస్టర్ చేయించుకునేందుకు పలువురు కన్నడ సినీ నిర్మాతలు ఇప్పటికే కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి (కేఎఫ్సీసీ)ని ఆశ్రయించారు. వారిలో అనాజి నాగరాజ్, దినేష్ గాంధీ, శంకర్ గౌడ తదిదరులు ఉన్నారు. ఇప్పుడే ఆయన పేరిట సినిమా టైటిల్‌ను రిజిస్టర్ చేయడమంటే తొందరపాటు అవుతుందనే ఉద్దేశంతో ఆ నిర్మాతల దరఖాస్తులను తిరస్కరించినట్టు కేఎఫ్సీసీ కార్యదర్శి బామా హరీష్ తెలియజేశారు. పైగా ఇలాంటి దరఖాస్తులు చేసుకునేమందు రవి కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరని ఆయన చెప్పారు. వారు అనుమతించినప్పుడు ఈ అంశాన్ని మళ్లీ పరిశీలించవచ్చని తెలిపారు. సమాజంతో పేరున్న వ్యక్తుల పేరిట టైటిల్ రిజిస్టర్ చేయకూడదనేది కేఎఫ్సీసీ నిబంధనల్లో ఉంది. అయితే ఈ నిబంధనలను నిర్మాతలు, దర్శకులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. టైటిలే అభ్యంతరమైనప్పుడు మరో టైటిల్‌తో సినిమా తీసేందుకు తమకు అభ్యంతరం లేదని కొంతమంది నిర్మాతలు చెబుతున్నారు.