విజయ్ సేతుపతి
తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరో రేంజ్‌కి వెళ్ళిన విజయ్ సేతుపతి ఇప్పుడు కొత్త ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. చిరంజీవి ‘సైరా’తో తెలుగు ఆడియన్స్‌కు నమస్కారం చెప్పనున్న ఈ హీరో ఇప్పుడు కన్నడ అభిమానులకు నమస్కార చెప్పబోతున్నారు. వసంత్ విష్ణు హీరోగా రూపొందనున్న ఓ సినిమాలో విజయ్ సేతుపతి నెగటివ్ రోల్‌తో కన్నడకు ఎంట్రీ ఇవ్వనున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ.. ఇలా వేరే భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు విజయ్ సేతుపతి. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment